పాఠకుల సమాఖ్య మార్చ్ నెల సమావేశం
ఈ సమావేశం లో పి.మల్లిఖార్జున గారు గిజుభాయి పుస్తకం మాస్టారూ లోని అంశాలను వివరించారు. అందులోని అంశాలు "బానిస మనస్తత్వాన్నిపిల్లల్లో నుండి పారద్రోలాలని లేకుంటే వారిలో సృజనాత్మక శక్తి లోపిస్తుందని చెప్పారు.పిల్లల్లో వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే ఎన్నో అంశాలను ఈ పుస్తకం లో వివరించారు. .అవసరం లేని వస్తువులను పారవేస్తుంటే అనవసరమైన విషయాలను వదిలివేస్తారు.పరీక్షలు అంటే కలిగే భయం పెద్ద అయ్యేంతవరకు వెంటాడుతుంది .గణితం కుతూహలాన్ని కలిగించాలి.పిల్లల ప్రతిభను మాస్టారు తనదిగా వారి అపజయాలకు వారే కారణం అని నిర్దారిస్తారు.పిల్లల్ని బలవంతాన చదివించకూడదు.పరీక్షలు పిల్లల్ని విజేతలు, పరాజితులుగా విభజిస్తాయి.పిల్లలకు జీవితం గురించి నేర్పాలి.పిల్లల్ని తప్పు పట్టకూడదు .లార్వానుండి సీతాకోక చిలుక బయట పడే క్రమం లాగా పిల్లలు సహజ సిద్దంగా నేర్చుకోవాలి. పిల్లలో సౌందర్య దృష్టి కళాత్మకత ఉంటుంది. స్వేచ్చగా పనిచేసే వాతావరణం వారికి కల్పించాలి".
తరువాత కరపత్రం తయారీలొ ఉండాల్సిన అంశాలపై చర్చ జరిగింది.సభ్యులు దీనికి చాలా విలువైన సూచనలు చేశారు. వచ్చే సమావేశం లోపు తయారు చేయాలని నిర్ణయించారు. పాఠకుల సమాఖ్య తరపున రేడియో కార్యక్రమం కూడా ఇవ్వాలని నిర్ణయించారు.వచ్చే నెల సమావేశం 6/4/2014 న జరగాలని తీర్మానిం చారు.విద్యార్థులను జీవితం గురించి తెలుసుకునేలా సంసిధ్ధుల్ని చేయాలని గ్రంధ పాలకులు మధుసుధన రావు గారు సూచించారు.పాఠశాలల్లో తరగతి పుస్తకాలే కాకుండా మహనీయుల జీవిత చరిత్రలు,వార్తాపత్రికలు చదివించాలని రవిశేఖర్ సూచించారు.ఈ కార్యక్రమంలో చాంద్ భాషా,ముసలా రెడ్డి ,బసిరెడ్డి, సుబ్బారావు రంగన్న,చంద్రశేఖర్,అరుణ్ కిషోర్ ఆదినారాయణ రెడ్డి , ఫారూఖ్ పాల్గొన్నారు . ఈ సారి నెల నుండి ఈ సమావేశం వివరాలు నా మరో బ్లాగ్ అయిన friendsfoundation(snehithfoundation.blogspot.in )లో వివరిస్తాను .
పుస్తకాన్ని సమీక్షిస్తున్న మల్లిఖార్జున