ఎలా ఈయన అంత గుర్తింపు తెచ్చుకున్నాడు అని తెలుసుకుంటే ఆశ్చర్యమేస్తుంది. ఆయన పేరు కళ్యాణ సుందరం. ఆయనది తమిళనాడు రాష్ట్రం.చేసే ఉద్యోగము librarian.భారతదేశంలో అత్యుత్తమ librarian గా కేంద్ర ప్రభుత్వ సత్కారం పొందాడు. ప్రపంచంలోని 10 మంది అత్యుత్తమ librarians లో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఇవన్నీ ఒక ఎత్తు .
45 సం రాల నుండి సంఘసేవకు తన జీవితాన్ని అంకితం చేసాడు.వివాహము చేసుకోలేదు. 30 సం లుగా తన జీతం మొత్తాన్ని సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నాడు.మరి తన ఖర్చులకు డబ్బు ఎలా అని ఆశ్చర్య పోతు న్నారా! ఒక హోటల్ లో సాయంత్రం పనిచేస్తూ వారిచ్చేజీతంతో తన పరిమిత అవసరాలు తీర్చుకుంటాడు.రిటైర్ అయిన తరువాత వచ్చిన 10 లక్షలను సంఘసేవకే కేటాయించాడు.ఈ విషయాలన్నీ తెలుసుకున్న ఓ అమెరికన్ సంస్థ ఈయనను Man of the millennium గా ప్రకటించి 30 కోట్ల రూపాయలను బహుమతిగా అందించింది ఇక చెప్పేదేముంది ఈ మొత్తం కూడా దానధర్మాలకే వినియోగించాడు .
ఈ విషయాలన్నీ గమనించిన రజనీకాంత్ ఎంతో ఆలోచించాడట ఆయన గురించి !అన్నీ ఇచ్చే చెట్టు గొప్పదా! చెట్టుని రక్షించేవాడు గొప్పవాడా! ఈ ఆలోచన తర్వాత రజనీకాంత్ మనసులో ఆయన ఓ జైన విగ్రహంలా ఎదిగారట కల్యాణ సుందరం గారిని తన తండ్రిగా రజనీకాంత్ స్వీకరించారు.
డబ్బు ఎంతున్నా తల్లిదండ్రులను ఆదుకోవడానికి అవేవీ పనికిరావు వారిని మనమే చూసుకోవాలి అన్న సందేశం ఈ దత్తత లో మనకు అర్దమవుతుంది.
(ఈ కథనం ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలోనిది .వారికి ధన్యవాదాలు )
No comments:
Post a Comment