Sunday, 14 October 2012

సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ ప్రయత్నం ఎలా ఉంటుంది?


              ప్రస్తుతం మానవుడు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ,జబ్బుల బారిన పడకుండా ఉండటం ఎలా? అన్నవి అత్యంత ప్రధానమైనవని భావించవచ్చు.మనుష్యులకు ఆరోగ్యం ఎలా దెబ్బ తింటుంది? జబ్బులు ఎందుకు వస్తాయి?వంశ పారంపర్యంగా వచ్చే జబ్బులు,అంటు వ్యాధులు,విభిన్న రకాల కాలుష్యాల వలన వచ్చేవి,పొగాకు,మద్యం  తీసుకోవటం వలన వచ్చే జబ్బులు ఇంకా ఎన్నో రకాలు గా మనిషిని జబ్బులు పట్టి పీడిస్తు న్నాయి.వంశ పారంపర్యంగా వచ్చే జబ్బులు తప్ప మిగతా వాటినన్ని టిని ముందు జాగ్రత్తలు తీసుకుంటే నివారణ చాలా వరకు సాధ్య మవుతుందని డాక్టర్స్ అంటుంటారు. అలాగే జబ్బులు వచ్చిన తర్వాత విభిన్న వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి.
                ఆరోగ్య పరిరక్షణకు,జబ్బుల నివారణ కొరకు మనకు అందుబాటులో ఉన్న వాటిలో1) ప్రకృతి వైద్యం, యోగ(BNYS) 2)ఆయుర్వేద(BAMS) 3)హోమియోపతి(BHMS),4)అల్లోపతి(MBBS,MD,MS) 5) యునాని ఇలా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇంకా ఎన్నో విధానాలు అవలంబిస్తుంటారు.కానీ ప్రతి ఒక్క దానికి దేని పరిధులు దానికున్నాయి.కొన్ని జబ్బులు కొన్ని విధానాల్లో బాగా నయ మవుతాయి.కొన్ని విధానాల్లో side effects వస్తాయి ఒక రంగంలో పనిచేసే వారు మరొక రంగం లో పనిచేసే వైద్యులతో ఏకీభవించరు.ఎవరి విధాన్నాన్ని వారు బలంగా నమ్ముతారు.
         అలా కాకుండా మనిషి సంపూర్ణ ఆరోగ్య వంతుడు కావటానికి జబ్బులు రాకుండా రక్షింప బడటానికి ,వచ్చిన తర్వాత వాటిని తగ్గించుకోవటానికి ,ఏ విధానంలో ఏ జబ్బులు బాగా తగ్గుతాయి,.ఏ విదాన్నాన్ని అవలంబిస్తే జబ్బు లు రాకుండా చూసుకోవచ్చు అన్న అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి అన్ని వైద్య విధానాలలోని పరిమితు లను వివరిస్తూ ప్రామాణిక మైన పుస్తకాలు వ్రాస్తే ఎలా ఉంటుంది.పై విధానాలు ప్రాక్టీసుచేసే వైద్యులుకొంత మంది కలిసి మానవుడి సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ఎటువంటి స్వార్ధం లేకుండా ఏ వైద్య విధానం పట్ల పక్షపాత  వైఖరి లేకుండా ఆరోగ్యము అనే సత్యాన్ని దర్శించే విధంగా ఒక ప్రయత్నం చేస్తే ఎలా వుంటుంది?ఈ దిశలో ఈ వ్యాసాన్ని చదివిన వారందరూ ఇంకా ఇంతకంటే మంచి సలహాలు,సూచనలు ఏవైనా ఉంటె తెలియ జేయగలరు అన్ని వైద్య విధానాలు ఒకే గొడుగు క్రిందకు తీసుకు వచ్చి,వచ్చిన రోగికి దేనిలో పరిపూర్ణంగా నివారణ సాధ్య మవుతుందో దాని లో వైద్యం ఇచ్చే విధంగా ఒక హాస్పిటల్ ఉంటె ఎలా ఉంటుంది ?ఆలోచించండి.

16 comments:

 1. అవసరమైన ఐడియా రవి గారు. మంతెన సత్యానారాయణ రాజు లాంటి వాళ్లలా అవసరమైన వివరణలు ఇచ్చేవారి సంఖ్య పెరగాలి. అన్ని వైద్య విధానాలు మేలైనవే . కొన్ని రోగాలకు కొన్ని వైద్య విధానాలు బాగా పని చేస్తున్నాయి. వైద్యం సరుకుగా మారిన ఈ రోజుల్లో ప్రజలు గందరగోళం లో ఎవరినినమ్మాలో అర్ధం కాని స్థితిలో సైంస్‌ అపహాస్యమవుతున్నది.

  ReplyDelete
  Replies
  1. మీరన్నట్లు మంతెన గారు ఆరోగ్యం విషయం లో ఎవరికీ వ్యతిరేకంగా కాకుండా సత్యం చెబుతుంటారు .అలాగే అన్ని విధానాల్లో చెప్పే వారు రావాలి.ప్రపంచం లో పేదరికానికి ఒక కారణం ఆరోగ్యం దెబ్బతినటం వల్లనే అని సర్వేలు చెబుతున్నాయి.ధన్యవాదాలు సర్

   Delete
 2. manchi soochana ravisekhar gaaroo!
  anusarinchavalasina soochana...@sri

  ReplyDelete
  Replies
  1. జబ్బులకు జనం వేల కోట్లు పోసినా నయం కాక చనిపోతున్నారు.అయుష్ విభాగాన్ని పటిష్టం చెయ్యాలని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈ మధ్య చెబుతున్నారు.ధన్యవాదాలు శ్రీ గారు

   Delete
 3. చాలా మంచి ఆలోచన. ఈ వ్యాసానికి వైద్యులు స్పందించాలని కోరుకుంటున్నాను.

  ReplyDelete
  Replies
  1. మీరన్నట్లుగా వైద్యులు స్పందిస్తే ఎంతో మంది రోగులకు మేలు చేసిన వారవుతారు.ధన్యవాదాలు నాగేంద్ర గారు!

   Delete
 4. మీరన్నాక బాగోకపోవడం ఉంటుందాండి:-)

  ReplyDelete
  Replies
  1. వ్యక్తులకు ,సమాజానికి మేలు చేసే వాటి గురించి అందరితో పంచుకోవాలని తపన.అందులోనుండి వచ్చిన ఆలోచన ఇది.మెచ్చినందుకు మీకు ధన్యవాదాలు.

   Delete
 5. బలే వారే , లక్షలుపోసి చదివి, కోట్లు పోసి హాస్పిటల్ కట్టి , జబ్బులే రాకుంటే డబ్బులెలా వస్తాయి చెప్పండి.:-):-)
  చాలా బాగా రాసారు శేఖర్ గారు

  ReplyDelete
  Replies
  1. విద్య,వైద్యం నేడు వేల కోట్ల వ్యాపారం అయి పోయింది.ఈ రెండు సేవారంగాలు.ప్రభుత్వాలు వీటిని ప్రైవేటు పరం చేస్తున్నాయి.అందుకే పేదరికం మరింత పెరిగిపోతుంది.ఈ విధం గా ఎన్నో సర్వే లు చెబుతున్నాయి.మీకు ధన్యవాదాలు మేరాజ్ గారు!

   Delete
 6. మంచి ఆలోచనండీ...
  కానీ ఇలాంటి మేలు చేసే ఆలోచనలు ఆమోదం పొంది,
  ఆచరణలోకి వస్తే అంతకంటే కావాల్సింది ఏముంది??

  ReplyDelete
  Replies
  1. నిన్ననే కేంద్ర ఆరోగ్య మంత్రి ఆయుష్ విభాగాన్ని అభివృద్ది చేసి భారతీయ వైద్యాన్ని కాపాడుకోవాలని చెప్పారు.చూడాలి ఆ రోజుల కోసం.ధన్యవాదాలండి.

   Delete
 7. మంచి ఆరోగ్యపరమైన సూచనలను ఇచ్చారు. ఉపయుక్తకరమైన పోస్ట్.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండి మీ స్పందనకు

   Delete