Tuesday 21 November 2023

కోటప్పకొండ సందర్శన

 కొండలపై ఉన్న గుడుల పరిసరాలన్నీ ప్రకృతి రమణీయతతో శోభిళ్లుతుంటాయి. అందులో కోటప్పకొండ ఒకటి. ఇది శివాలయం. నరసరావుపేట కు దగ్గరలో 20 కి.మీ దూరం లో ఉంటుంది. బస్టాండ్ నుండి కార్తీక మాసం ఆదివారం,శనివారం లలో ₹50 ticket తో కొండపైకి RTC బస్సులు నడుస్తుంటాయి. కొండ క్రింద అన్ని వర్గాల వారికి సత్రాలున్నాయి. కొండ ఎక్కటానికి, దిగటానికి రెండు మార్గాలున్నాయి. ఎక్కే మార్గానికి ఇరువైపులా పూలు పూసి స్వాగతిస్తున్నాయి. మధ్యలో ఒక park ఏర్పాటు చేశారు. కొండ పైన గుడి ముందర భాగం విశాలంగా ఉంటుంది.దక్షిణామూర్తి గుడి, విగ్రహం,నంది విగ్రహం మనోహరంగా ఉంటాయి. శివుడి విగ్రహం 4 దిక్కులు కనపడే విధంగా గుడికి ఎదురుగా అమర్చారు.నిత్య అన్నదానం ఉంటుంది.చాలా రుచిగా ఉంది. మనకు తోచిన విరాళం ఇవ్వవచ్చు. ఇహ గుడి చాలా ఎత్తులో ఉంటుంది. గుడి లోపలికి మెట్లు చాలా ఎక్కాలి. గుడి బయటకు వచ్చాక ఎడం వైపు కొండ పైన నాగుల పుట్ట చాలా ఎత్తులో ఉంటుంది.అక్కడే ఒక శివుడి విగ్రహం చాలా ఆకర్షణీయం గా ఉంటుంది. అక్కడ నుండి దిగువకు, ప్రక్కలకు చూస్తే view point చా లా అద్భుతం గా ఉంటుంది. ప్రక్క కొండ మీద పాత కోటేశ్వర స్వామి ఉంటారు. అక్కడ mike లో పాటలు కొండ అంతా ప్రతి ధ్వనిస్తున్నాయి. శివరాత్రి కి కట్టే ప్రభలు ఆ ఉత్సవాలు, జనాల్ని చూడటానికి రెండు కళ్ళు చాలవట. చిన్నపురెడ్డిని బ్రిటిష్ వారు ఉరి తీసింది ఈ కొండపైనే.దేవుళ్ళందరూ కొండలపై ఎందుకు కొలువుంటారో తెలుసా, తమతో పాటు ప్రకృతిని ఆరాధించమని.కొండల నిండా ఇంకా చెట్లు బాగా పెంచితే గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం అవుతుంది. ... ఒద్దుల రవిశేఖర్

Monday 20 November 2023

ఉద్యానవనాల్లో మొక్కలు నాటడం

 ఉద్యానవనాల్లో మొక్కలు నాటుదాం

రోజూ "నడక " సాగించే muncipal park లో 5km నడక పూర్తయి ఇంటికి వెళ్లే క్రమంలో అక్కడ పనిచేసే తోటమాలి సురేష్ మొక్కలు నాటడం గమనించాను.ఇంతకు ముందు మొక్కలు ఇస్తానని చెప్పాను. ఇప్పుడు మొక్క తెస్తే నాటుతావా అని అడగ్గానే తప్పకుండా అన్నాడు. పండ్ల మొక్కలు తీసుకురానా అంటే ok అన్నాడు. నర్సరీ దగ్గర దిగి లోపలికి వెడుతుంటే మిత్రులు సజీవరాజు, ప్రదీప్ కనిపించి పలకరించి అడిగారు ఏం చేస్తున్నారుఅని.విషయం చెప్పగానే మేము మొక్కలు ఇస్తామన్నారు. సపోటా, నేరేడు, సీతాఫలం మొక్కలు తీసుకెళ్లగానే కొంత మంది పిల్లలతో కలిసి సురేష్,మేము park లో పాదులుతీసి మొక్కలు నాటాము. మేము ముగ్గురం APNGC లో సభ్యులం.ఇలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలలోని NGC సభ్యులు, మొక్కల ప్రేమికులు వారి దగ్గర లో ఉన్న స్థానిక park లలో పండ్ల మొక్కలు,నీడ నిచ్చే మొక్కలు, పూల మొక్కలు నాటితే park లలో మంచి వాతావరణం ఏర్పడుతుంది.

Sunday 12 November 2023

40.పాటల పూదోట

 వర్మ "రంగీలా " చూసారా. ఇండియాను ఊపేసింది. ఇందులో రెహమాన్ music వింటుంటే పాట మధ్యలో instruments ఇంత అత్య ద్భుతంగా ఉపయోగించవచ్చా అనిపిస్తుంది.హరిహరన్, స్వర్ణలతల స్వరాల్లో పాట ఇంత మధురంగా ఉంటుందా అని ఆశ్చర్యపోతాం. Ear phones పెట్టుకుని కళ్ళుమూసుకుని విని తరించండి.(https://youtu.be/KQUS-phhM0Y?si=3aJ0uYULkLJTO9pR)

39. పాటల పూదోట

 శ్రీమణి చక్కని సాహిత్యం అందించగా, సుదర్శన్ రూపంలో కొత్త స్వరాన్ని పరిచయం చేస్తూ DSP(దేవిశ్రీ ప్రసాద్) అందించిన హాయిగా వినాలనిపించే మంచి మెలోడీ ఇది.వినండి మరి.(https://youtu.be/tpvNtKjlf5E?si=PkF8-2JZrvvyaBi4)

38.పాటల పూదోట

 రెహమాన్ సృష్టించిన శాస్త్రీయ సంగీతపు అలలపై నరేష్ అయ్యర్ పలికిన సరిగమపదనిసల గమకాల పై మహతి సైంధవి స్వరం మీ మనసును మలయసమీరంలా తాకుతూ మీ హృదయాన్ని పరవశింపజేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ear phone పెట్టుకుని కళ్ళు మూసుకుని ఆస్వాదించండి. (https://youtu.be/WjdAM6aLO5I?si=lLd6fZrE0Rw0l05e)

37. పాటల పూదోట

 రెహమాన్ సృష్టించిన శాస్త్రీయ సంగీతపు అలలపై నరేష్ అయ్యర్ పలికిన సరిగమపదనిసల గమకాల పై మహతి సైంధవి స్వరం మీ మనసును మలయసమీరంలా తాకుతూ మీ హృదయాన్ని పరవశింపజేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ear phone పెట్టుకుని కళ్ళు మూసుకుని ఆస్వాదించండి. (https://youtu.be/WjdAM6aLO5I?si=lLd6fZrE0Rw0l05e)

Monday 6 November 2023

బుద్ధ వనం

 బుద్ధవనం

నాగార్జున సాగర్ మీదుగా హైదరాబాద్ వె డుతునప్పుడల్లా సాగర్ దాటాక ఎడమ వైపు బుద్ధవనం board చూస్తుంటాం. కాని 2014 నుండి నిర్మాణం లో ఉండి 2023 వేసవిలో ప్రారంభించబడిందట.దీనికోసం 274 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతం 70 ఎకరాల్లోనే కొన్ని విభాగాలు పూర్తయ్యాయి.మాచర్ల నుండి నల్లగొండ, హైదరాబాద్ వెళ్లే బస్సులన్నీ అక్కడ ఆపుతాయి. Ordinary bus, auto ల్లో ₹50 తీసుకున్నారు. అక్కడే cottages ఉన్నాయి. భోజనం మాత్రం బయట ఉన్న hotels లో చేయాలి. ఒక రోజు ఉదయం వెళ్లి మధ్యాహ్నం వరకు గడపవచ్చు. సొంత వాహనాలు ఉంటే సాయంత్రం వెళ్లి ఆ వాతావరణాన్ని enjoy చేయవచ్చు.ఉదయం 10 గంటల కల్లా వెళ్ళాం. అప్పుడప్పుడే యాత్రికుల రాక మొదలయింది. Ticket ₹50. రాజప్రసాదం లోపలికి వె డుతున్నామా అన్న అనుభూతి కలిగింది.

1) అర్థ చంద్రాకారంలా ఉన్న మహా స్థూపం,అందులోని నాలుగు వైపులా 4 బుద్ధ విగ్రహాలు బంగారు రంగులో మెరిసిపోతుంటే,పై భాగంలో ఆకాశం ప్రతిబింబిస్తుంటే ధ్యాన మందిరంలో యాత్రికులు ధ్యానం చేసుకునే విధంగా ఓ ప్రశాంత వాతావరణం అక్కడ విలసిల్లుతుంది.అక్కడ ధ్యానం చేయడం చక్కని అనుభూతి కలిగిస్తుంది. మహా స్థూపం క్రింద museum ఏర్పాటు చేశారు.క్రీ. శ 1 వ శతాబ్దం నాటి బుద్ధ విగ్రహాలను చూడవచ్చు.

2)మహా స్థూపానికి ముందు బుద్ధచరితవనంలో ఆయన జీవిత విశేషాలను పొందుపరిచారు.

3) జాతక వనంలో జాతక కథల్లోని చిత్రాలను శిల్పాలుగా మలిచారు.

4)ధ్యాన వనంలో శ్రీలంక ప్రభుత్వం donate చేసిన 27 అడుగుల బుద్ధ విగ్రహాన్ని చరిత వనం లో ధర్మ ఘంటను చూడవచ్చు.

5)స్థూప వనం లో విభిన్న దేశాలు ప్రాంతాల్లో ఉన్న బౌద్ధ స్థూపాల models చూడవచ్చు.

బుద్ధవనం లో ఇంకా చాలా విభాగాలు అభివృద్ధి చేయవలసి ఉంది. పూర్తి రూపం సంతరించుకుంటే ఇది అంతర్జాతీయ పర్యాటక కేంద్రం అవుతుంది.బుద్దవనం ప్రతి ఒక్కరు తప్పని సరిగా చూడదగ్గ సందర్శనీయ ప్రాంతం.... ఒద్దుల రవిశేఖర్