Monday 29 November 2021

సంగీత మేరు శిఖరాలు

 

రచయిత:Dr. జానమద్ది హనుమత్ శాస్త్రి.          హృదయం లోని వివేకమే సంగీతం....కన్ఫ్యూషియస్.                             పుస్తక పరిచయం:ఒద్దుల రవిశేఖర్      సామవేదం యొక్క ఉపవేదమనబడు గాంధర్వ వేదం సంగీతమయం.భరతుని నాట్య శాస్త్రం,మతంగుని బృహద్దేశి సంగీతానికి సంబంధించిన ప్రాచీన గ్రంధాలు.నాదం నుండి శృతులు,శృతుల నుండి స్వరాలు,స్వరాల నుండి రాగాలు పుడతాయి.సంగీతం విశ్వజనీనమైన భాష.    Music: If  you know and understand it is the best and easiest way for concentration. .Swami Vivekananda                  45 మంది శిఖరప్రాయులైన గాయనీ గాయకుల జీవిత చరిత్ర ఇది. సంగీత సాగరాన్ని మధించిన గాన గంధర్వులు వారు.1) శ్యామ శాస్త్రి(1762౼1827):  2)త్యాగరాజ స్వామి(1767౼1847) 3)ముత్తుస్వామి దీక్షితులు(1775౼1835) వీరు ముగ్గురు సంగీత త్రిమూర్తులు.                  4)సంగీత  సార్వభౌమ స్వాతి తిరుణాల్ దీక్షితులు (1813౼1846)                                           5)వైణిక శిరోమణి వీణ శేషన్న(1852౼1926)      6) ఆధునిక హిందూస్థానీ సంగీత పితామహుడు పండిట్ విష్ణు నారాయణ భాట్కండే(1860౼1936) 7) వైణిక ప్రవీణ వీణ సుబ్బన్న(1861౼1939) 8)సరోద్ వాద్య విద్యా నిధి ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్(1862౼1972)                                           9) సంగీత కళానిధి మైసూరు వాసుదేవాచార్యులు (1865-1961) 10)తాళ బ్రహ్మ,గాన విశారద బిడారం కృష్ణప్ప (1886-1939) 11) గాయక శిఖామణి ముత్తయ్య భాగవతార్ ( 1877-1945) 12) టైగర్ వరదా చార్యులు (1876-1976) 13)త్యాగరాజభక్త శిరో మణి బెంగళూరు నాగరత్నమ్మ (1878-1952) 14) సంగీత కళానిధి శ్రీమాన్ రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ (1893-1979) 15) సంగీత కళానిధి ద్వారం వెంకటస్వామి నాయుడు( 1893-1964) 16) సంగీత రత్న టి.చౌడయ్య (1895-1967) 17) గాన గాంధర్వ ఓంకార్ నాధ్ ఠాగూర్( 1897-1967) 18) సంగీత కళానిధి ముసిరి సుబ్రమణ్య అయ్యర్ (1899-1975) 19) స్వర భూషణ ఉస్తాద్ బడేగులామ్ అలీఖాన్(1901-1969) 20)సంగీత కళానిధి సెమ్మంగుడి  శ్రీనివాస అయ్యర్ (1908-2003) 21)గాయనగంగ గంగుభాయ్ హానగల్ (1913-2009) 22)షెహనాయ్ నవ్వాజ్ ఉస్తాద్ బిస్మిల్లాఖాన్( 1916-2006) 23) సంగీత రత్న సంధ్యావందనం శ్రీనివాస రావు (1918-1994) 24) భారతరత్న గా వెలిగిన భక్తి సంగీత సుధా తరంగం యం. యస్.సుబ్బులక్ష్మి (1916-2004) 25) తబలా వాద్య విశారదుడు ఉస్తాద్ అల్లారఖా (1919- 2000) 26) డి.కె.పట్టమ్మాళ్ (1919-2009) 27)జయచామరాజేంద్ర ఒడయర్ (1919-1974) 28) వైణిక శిరోమణి వి.దొరై స్వామి అయ్యంగార్ (1920-1997) 29) సితార్ వాద్య విశారద పండిట్ రవిశంకర్ (1920) 30) గానలోల ఘంటసాల వెంకటేశ్వరరావు (1922-1974) 31) విఖ్యాత వైణికుడు ఈమని శంకర శాస్త్రి (1922-1987) 32)20 వ శతాబ్ది తాన్ సేన్ పండిట్ భీమ్ సేన్ జోషి (1922) 33) మహామహో పాధ్యాయ నూకల చిన సత్యనారాయణ ( 1923) 34) మహోత్తమ గాయకుడు యం. డి.రామనాధన్(1923-1984) 35) మంగళ వాద్య విశారద షేక్ చిన మౌలానా (1924-1999) 36) వేణు నాద మాంత్రికుడు టి.ఆర్ .మహాలింగం (మాలి) (1926-1986) 37) వైణిక శిరో భూషణ ఎస్.బాల చందర్ ( 1927-1990) 38)అమృత గాన వర్శిని యం. ఎల్.వసంతకుమారి ( 1928-1990) 39) మహా గాయని,భారతరత్న లతా మంగేష్కర్(1929) 40) గానంతో శిలలనే కరిగించగల  పండిట్ జస్ రాజ్ (1930) 41) సంగీత శిఖరం మంగళం పల్లి బాల మురళీ కృష్ణ (1930) 42) సంగీత కళానిధి పద్మభూషణ్ డా:శ్రీపాద పినాక పాణి గారి జీవితానుభవాలు (1913) 43)వేణు వాదన మాంత్రికుడు హరిప్రసాద్ చౌరాసియా (1938) 44) సుమధుర గాయకుడు కె.జె.ఏసుదాసు(1940) 45) ఘటం వాద్య విశారద టి.హెచ్.వినాయక్ రామ్ (1942)  తమ జీవితాలనే తపస్సుగా మలిచి సంగీత సాగరాలను మధించి మనకు అమృతరాగాలను పంచిన మహనీయుల గురించి పేర్లు మాత్రమే ప్రస్తావించాను,ఈ పుస్తకాన్ని చదివి మరిన్ని వివరాలు తెలుసుకుంటారని.ప్రతి దినం కొంత సమయాన్ని సంగీతం పాడటం ,లేదా వినడం అలవాటు చేసుకుంటే మనసు నిర్మలంగా ఉంటుందని,విద్యాలయాల్లో సంగీత సాధన ఏర్పాటు చేయటం అత్యావశ్యకం అణా రచయిత సందేశం తో ఈ పుస్తకం ముగుస్తుంది.చివర్లో రాగాలు -రోగాలు శీర్షికన ఏ రాగం ఎప్పుడు వింటే ఏ రోగం తగ్గుతుందో వివరించడం మరింత ప్రయోజనకరంగా ఉంది.సంగీత త్రిమూర్తుల్లో ఒకరైన త్యాగరాజు పూర్వీకులు ప్రకాశం జిల్లా మార్కాపురం దగ్గరలోని కాకర్ల గ్రామం కావడం విశేషం.వారి పూర్వీకులు క్రీ.శ 1600 ప్రాంతం లో తంజావూరు సమీపంలోని తిరువారూరు కుతరలివెళ్లారు.సంగీత ప్రియులకు ఈ పుస్తకం చదవడం మరింత ఆనందం కలిగిస్తుంది.హనుమత్ శాస్త్రి గారు సరళంగా చదువగలిగేలా వారి జీవిత చరిత్రలు అందించారు.ఆ రకంగా ఆ గాన గంధర్వులను ఇప్పటి తరానికి పరిచయం చేసారు...ఒద్దుల రవిశేఖర్

Monday 22 November 2021

The secrets of INDUS VALLEY

 The secrets of INDUS VALLEY by R.Rajagopalan illustrated by R.Ashish Bagchi                                                          చరిత్ర మీద ఆసక్తి ఉన్నవారికి,పరిశోధకులకు ఇండస్ వాలీ నాగరికత(హారప్పా మొహంజదారో) ఇప్పటికీ రహస్యమే.ఈ ప్రాంత ప్రజలు ఎక్కడనుండి వచ్చారు?వారి వ్రాత అక్షరాలు దొరికాయి కానీ వాటి అర్ధం ఇప్పటికి సరిగ్గా తెలీదు.వారి భాష పేరేమిటి?పరిపాలకులు ఎవరు?ఈ నాగరికత ఎలా నశించింది? ఈ ప్రశ్నలు వెంటాడే ప్రశ్నలు? వీటికి పూర్తి సమాధానం ఇవ్వకపోయినా కనుగొన్న ఆధారాలను ప్రస్తావిస్తూ రచన సాగింది.త్రవ్వకాల్లో దొరికిన నగరాల ఆనవాళ్లను బట్టి ఉన్నతమైన నాగరికత అని అలాగే పరిపాలన కూడా ఆధునికమైన ప్రజాస్వామ్యానికి తీసిపోనిదని అర్ధమవుతుంది.చక్కటి ప్రణాళికతో కట్టిన నగరాలు, ఆధునిక వసతులతో కూడిన గృహాలు అప్పటి అభివృద్ధిని చెబుతాయి.దొరికిన అద్భుతమైన చిత్రాలతో మనల్ని ఆకాలానికి లాక్కెడుతుంది రచన.Rosetta stone గురించి దాని decode గురించి జరిగిన ప్రయత్నాలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి.archaeologist,epigraphist లాంటి వృత్తుల గురించి కూడా పరిచయం చేసి విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సాహించారు.ఐరావతం మహదేవన్ ఇండస్ లిపి పై చేసిన పరిశోధన ఆసక్తి గొల్పుతుంది.అంతా చదివాక 5000 సం. రాల క్రితం జరిగిన చరిత్ర కోసం ఇప్పుడు మనం తలలు ఎందుకు బ్రద్దలు కొట్టుకోవాలి? అన్న ప్రశ్న ఉదయిస్తుంది.మన చరిత్ర గురించి మనం తెలుసుకుంటేనే ప్రస్తుత మనదేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం అర్ధమవుతుంది.ఇండస్ నాగరికత కాలం లోనే శాస్త్రీయ వైఖరి ఉంది.ప్రస్తుతం అది లోపిస్తున్న తీరును అర్ధం చేసుకోవాలి.కానీ ఆ కాలం లో చెట్లు విపరీతంగా నరికి నగరీకరణ జరగడం వారి పతనానికి కారణం అయింది.మరి ప్రస్తుతం మనమదేగా చేస్తుంది. చెట్లు నరకడం,నదుల కాలుష్యం,పర్యావరణ నాశనం ,భూతాపం ఇవన్నీ మనకు ప్రమాద సంకేతాలు.ప్రస్తుత మన నాగరికత కూడా ఆ దిశలో పయనిస్తుంది ,అన్న ఆలోచనాత్మక సందేశంతో పుస్తకం ముగించిన రచయిత రాజగోపాలన్ అభినందనీయులు....ఒద్దుల రవిశేఖర్.

Sunday 21 November 2021

చిన్న చిన్న ఆనందాలు మూటగట్టుకోవడం.

 జీవిత పయనంలో లక్ష్యాల సాధనలో పడి మనకిష్టమైన పనులు చేయడం మరిచిపోయివుంటాం.ఉద్యోగం, వివాహం,పిల్లలు,వారి చదువులు,ఆరోగ్యం,ఇల్లు కట్టుకోవడం ,పిల్లల వివాహాలు మళ్లీ వారికి పిల్లలు ఇలా విభిన్న దశల్లో జీవితం కొనసాగుతుంది.మనం మనకోసం కాక ఇతరుల కోసం బ్రతుకుతుంటాం.పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తాం.కాలం గడిచిపోతుంది.చివర్లో వారేదో మనకు చేస్తారనుకుంటాం.వారి కుటుంబాల తో వారు బిజీ. ఆయా దశల్లో మన అభిరుచులు,మన కిష్టమైన కళలు, ఆటలు,కొత్త ప్రదేశాలు చూడటం,మొక్కలు నాటడం,పెంచడం,ప్రకృతిని పరిశీలించడం ఇవన్నీ చేయడం సాధ్యం కాకపోవచ్చు.కానీ అన్ని బాధ్యతలు తీరాక ఇవన్నీ చేయాలంటే మన మానసిక,శారీరక ఆరోగ్యం బాగుండకపోవడంతో మనం చేయాలనుకున్నవి చేయలేకపోవడంతో జీవితం అసంతృప్తిగా ముగుస్తుంది.మొన్నటి కరోనా కాలంలో ఎంతమంది చిన్న వయసులో చనిపోయారో కదా!ఎన్ని అనుకుని ఉంటారు వాళ్ళు జీవితంలో ఏదో చేయాలని.అలాగే ఆకస్మిక ప్రమాదాలు,గుండెపోటులతో మరింతమంది మరణిస్తున్నారు.పునీత్ రాజ్ కుమార్(48) మరణం ఎంత విషాదం. అందుకే సమయం లేదు మిత్రమా! జీవితం లో మీరు ఏ దశలో ఉన్నా మీ కిష్టమైన వ్యాపకాలకోసం కొంత సమయం కేటాయించండి.సంగీతం వినడం,నేర్చుకోవడం,పాటలు పాడడం చిత్రలేఖనం,పుస్తకాలు చదవడం,స్నేహితులతో మాట్లాడటం,వ్యాయామం ....ఇలా ఎన్నో పనులు చేస్తూ ఎప్పటికప్పుడు చిన్న చిన్న ఆనందాలు మూటగట్టుకుంటూ జీవితం కొనసాగిద్దాం.ఇక జీవిత చరమాంకంలో ఆ జ్ఞాపకాల దొంతరాలను నెమరువేసుకుని తృప్తిగా జీవితయాత్ర చాలించవచ్చు.....ఒద్దుల రవిశేఖర్.