Monday, 22 November 2021

The secrets of INDUS VALLEY

 The secrets of INDUS VALLEY by R.Rajagopalan illustrated by R.Ashish Bagchi                                                          చరిత్ర మీద ఆసక్తి ఉన్నవారికి,పరిశోధకులకు ఇండస్ వాలీ నాగరికత(హారప్పా మొహంజదారో) ఇప్పటికీ రహస్యమే.ఈ ప్రాంత ప్రజలు ఎక్కడనుండి వచ్చారు?వారి వ్రాత అక్షరాలు దొరికాయి కానీ వాటి అర్ధం ఇప్పటికి సరిగ్గా తెలీదు.వారి భాష పేరేమిటి?పరిపాలకులు ఎవరు?ఈ నాగరికత ఎలా నశించింది? ఈ ప్రశ్నలు వెంటాడే ప్రశ్నలు? వీటికి పూర్తి సమాధానం ఇవ్వకపోయినా కనుగొన్న ఆధారాలను ప్రస్తావిస్తూ రచన సాగింది.త్రవ్వకాల్లో దొరికిన నగరాల ఆనవాళ్లను బట్టి ఉన్నతమైన నాగరికత అని అలాగే పరిపాలన కూడా ఆధునికమైన ప్రజాస్వామ్యానికి తీసిపోనిదని అర్ధమవుతుంది.చక్కటి ప్రణాళికతో కట్టిన నగరాలు, ఆధునిక వసతులతో కూడిన గృహాలు అప్పటి అభివృద్ధిని చెబుతాయి.దొరికిన అద్భుతమైన చిత్రాలతో మనల్ని ఆకాలానికి లాక్కెడుతుంది రచన.Rosetta stone గురించి దాని decode గురించి జరిగిన ప్రయత్నాలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి.archaeologist,epigraphist లాంటి వృత్తుల గురించి కూడా పరిచయం చేసి విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సాహించారు.ఐరావతం మహదేవన్ ఇండస్ లిపి పై చేసిన పరిశోధన ఆసక్తి గొల్పుతుంది.అంతా చదివాక 5000 సం. రాల క్రితం జరిగిన చరిత్ర కోసం ఇప్పుడు మనం తలలు ఎందుకు బ్రద్దలు కొట్టుకోవాలి? అన్న ప్రశ్న ఉదయిస్తుంది.మన చరిత్ర గురించి మనం తెలుసుకుంటేనే ప్రస్తుత మనదేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం అర్ధమవుతుంది.ఇండస్ నాగరికత కాలం లోనే శాస్త్రీయ వైఖరి ఉంది.ప్రస్తుతం అది లోపిస్తున్న తీరును అర్ధం చేసుకోవాలి.కానీ ఆ కాలం లో చెట్లు విపరీతంగా నరికి నగరీకరణ జరగడం వారి పతనానికి కారణం అయింది.మరి ప్రస్తుతం మనమదేగా చేస్తుంది. చెట్లు నరకడం,నదుల కాలుష్యం,పర్యావరణ నాశనం ,భూతాపం ఇవన్నీ మనకు ప్రమాద సంకేతాలు.ప్రస్తుత మన నాగరికత కూడా ఆ దిశలో పయనిస్తుంది ,అన్న ఆలోచనాత్మక సందేశంతో పుస్తకం ముగించిన రచయిత రాజగోపాలన్ అభినందనీయులు....ఒద్దుల రవిశేఖర్.

No comments:

Post a Comment