Tuesday, 24 July 2012

స్వార్థం ,అహంకారం రెండు వేర్వేరా!లేదా ఒకటేనా!(2)


గత వ్యాసం తరువాయి భాగం.
గత వ్యాసం పై కొన్ని సందేహాలకు సమాధానాలు .స్వార్థం ,అహంకారం అంటే ఏమిటి ?రెండు ఒకటా?వేర్వేరా ?ఒక సారి మనం నిఘంటువు అర్థాలు పరిశీలిస్తే వీటి గురించి మనకు ఒక అవగాహన వస్తుంది.
అహంకారం=గర్వం,ఆత్మాభిమానం,క్రోధం
అహం=గర్వం
అహంభావం= గర్వం
స్వార్థం =స్వప్రయోజనం
స్వార్థపరుడు =తన ప్రయోజనాన్ని చూసుకునే వాడు.ఇవి తెలుగు అకాడెమి వారి నిఘంటువు లోని  అర్థాలు
ఇక oxford dictionary లో
ego=the part of the mind that reacts to reality and has a sense of idividuality.మానవుని మనసులో ఏర్పడే నేను అనే వ్యక్తిత్వ భావన
egoism=an ethical theory that treats self interest as the foundation of morality
అనగా నేను లేదా తన ప్రయోజనం మే  ప్రధానమైన నైతిక సిద్దాంతం
  egoism is a term used in philosophy and psychology to mean self interest

selfish=concerned chiefly with one"s own profit or pleasure.
ఆధ్యాత్మికంగా
అహంకారం =అహం+ఆకారం =నేనే శరీరాన్ని.
అహంబ్రహ్మస్మి =నేనే బ్రహ్మాన్ని అన్నట్లుగా
              ఒకవ్యక్తి యొక్క మానసిక మట్టం చుట్టూ ఏర్పడే పరిమితమైన స్థితిని అహంకారం అంటారు.సహజత్వా నికి   విరుద్ధంగా సమత్వాన్ని  కోల్పోయిన స్థితినే అహంకారం అంటారు.నేను ఫలానా ,ఇదినాది,నాకు కావాలి అనే భావనలతో జీవించే స్థితినే అహంకారం అంటారు.
                                         i,my,mine are the three states of egoism.
       ఈ రెండింటికి అర్థాలు ఒకే లాగా కనిపిస్తున్నప్పటికీ సూక్ష్మంగా ఆలోచిస్తే కొన్ని భేదాలను గమనించ వచ్చు.అవి1)స్వార్థం అంటే కేవలం తన ప్రయోజనం చూసుకునే వాడు.
2)అహంకారం  అనగా తన ప్రయోజనమే ప్రధానమైన నైతిక  సిద్దాంతం. ఇంకా గర్వం అనికూడా అర్థం.ఇది కూడా philosophy, psychology లలో స్వప్రయోజనం అనే వాడారు అని  .oxford dictionary చెబుతుంది.కాని నిఘంటువుల అర్థాలతో పాటు మన indian philosophy ని పరిశీలిస్తే ఇది ఒక మానసిక భావనగా పరిగనిస్తారు.
          మొదట మానవుడికి ఏర్పడిన భావనను పై అర్థాల ప్రకారం స్వార్థం అన్న అహంకారం అన్న ఒకటేగా కనబడుతుంది.కాని ఆదిమ కాలంలో ఇది కేవలం ఆహార సేకరణ లో ఏర్పడిన భావం గా పరిగణిస్తే  మొదట స్వార్థం గా ప్రవర్తించేవాడు అని పరిగనించ వచ్చు.తరువాత పరిణామ క్రమం లో ఇది ఒక మానసిక స్థితిగా మారి దీనిని కోపం లాగా తన  మాటల ద్వారా ముఖం లో భావాన్ని చూపించే ఒక మానసిక సమస్య మారింది.ఇక ప్రస్తుతం దీన్ని వాడే క్రమం లో గర్వం గా కూడా తీసుకుంటున్నారు.
         ఏది ఏమైనప్పటికి,మనిషి కి ఎప్పుడో ఒకప్పుడు ఉదయించిన ఈ అహంకారాన్ని అర్థం చేసుకొని
దీని లక్షణాలను వివరంగా వచ్చే వ్యాసం లో చర్చిద్దాము.      

8 comments:

 1. స్వార్థం, అహంకారం....రెండూ వేరైనా వేరై ఒకటైనా ఎవ్వరు కూడా దరిచేరనీయకూడని పదాలుకదండి!:-)
  Waiting for next post.

  ReplyDelete
  Replies
  1. నిజమే కదండీ .మీ కోసం త్వరలో!

   Delete
 2. మరికొంత సమగ్రత అవసరమేమో, శేఖర్, ....భాషాశాస్త్రం ఒక్కటే సరిపోదనుకుంటా, తత్వశాస్త్రాన్నిమరింత గా పరిశీలించాల్సిన అవసరం వుంటుంది. మానవ వికాసానికి ఈ రెండిటి యెక్క కాంట్రిబ్యూషన్ కూడా చాలా వుంది.
  అహంకారం కలిగి స్వార్థం లేకుండా వుండచ్చు,
  స్వార్థంవుండి, అహంకారం లేకుండా వుండచ్చు.
  అహంకారం, ఆత్మవిశ్వాసం ఈ రెండిటి మధ్య గీత కూడా చాలా పల్చగా కనిపిస్తుంది, చాలాసార్లు,.
  విసిగిస్తే, ఏమనుకోకు శేఖర్
  good topic, keep writing.

  ReplyDelete
 3. బాగుందండి. అహంభావులందరు స్వార్ధ పరులవ్వనవసరం లేదు. అహంభావం కన్నా స్వార్ధ పరులే నా దృష్టిలో కొద్దో గొప్పో నయం.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండి మీ పరిశీలనా వ్యాఖ్యకు.

   Delete
 4. స్వార్ధం - అహంకారం మధ్య తేడాని మంచిగా వివరించారు.

  పరిమిత స్వార్ధం అవసరమేమో వ్యవస్థను బట్టి , కానీ అహంకారం అనేది ఏమాత్రం ఉండకూడనిది.

  స్వార్ధం అభద్రతలోనుండి వస్తే, అహంకారం ఆధిపత్య పైత్యం లోనుండి వస్తుంది. ఇవి రెండూ వ్యవస్థ లక్షణాలతో ముడిపడి ఉంటాయి రవిగారు.

  మీ బ్లాగు చాలా ఉపయోగకరం గా ఉంటోంది. మీ పోస్టులు రోజుకొకటి వీలుని బట్టి చదువుతున్నానండీ. మీ బ్లాగును మా బ్లాగర్స్వరల్డ్ లో సెలెక్టెడ్ బ్లాగులలో ఉంచాను. గమనించగలరు. ఆలస్యం గా గుర్తించినందుకు సారీ.

  ReplyDelete
 5. మీ విశ్లేషణలు చాలా బాగున్నాయి.మీ బ్లాగు చాలా సార్లు చూస్తూ ఉంటాను కానీ వ్యాఖ్యలు వ్రాయ లేదు.ఇప్పటినుండి ఫాలో అవుతాను.నా బ్లాగు మీ selected list లో చేర్చినందుకు మీకు ధన్యవాదాలు.

  ReplyDelete