Sunday, 1 July 2012

యాంత్రిక మైన జీవితం


కష్ట పడితే ప్రభవించేది స్వేదం 
ఉద్విగ్నపు సంతోషానికి ఫలితం ఆనంద భాష్పం
గుండె గాయమైతే కన్నీటి ప్రవాహం
అనుభూతుల స్మరణలో కళ్ళల్లో చెమర్చే తడి
కష్టాలకు,ఆనందాలకు
అనుభూతులకు ,అనుబంధాలకు
స్పందించే మన శరీర ధర్మం
జీవితంలో ఇదేకదా నిత్యం జరిగేది
మనసుపై బాధల ఒత్తిడి పడనీకుండా
శోకం జ్ఞాపకాలుగా మిగలకుండా
 రక్షించే శరీర  యంత్రాంగం తీరు అర్థమైతే
మనిషికి మానసిక సమస్య లుండ వేమో!
శ్రమ లేని జీవితం
ఆనందం లేని జీవనం
నిస్సారమైన సంసారం
మదినిండా త్రుప్తి లేని గమనం
కాలంతో పరుగులు
బంధాలలో అంతులేని అంతరం
యాంత్రిక మైన యుగం లో
మనిషెంత కూరుకుపోతున్నాడో
ఇక స్పందనలకు సమయ మెక్కడ !

16 comments:

  1. "కాలంతో పరుగులు
    బంధాలలో అంతులేని అంతరం"
    నిజమే కదా!! యాంత్రికమైపోతున్న జీవితాల గురించి చాలా బాగా చెప్పారండీ..

    ReplyDelete
    Replies
    1. ఉమ్మడి కుటుంబాల నుండి,చిన్న కుటుంబాల దశ దాటుకుని ,విడాకుల దశ దాటి ,ఒంటరి జీవితాల వైపు మనిషి పయనం .ధన్యవాదాలండి.

      Delete
  2. శ్రమ లేని జీవితం
    ఆనందం లేని జీవనం
    నిస్సారమైన సంసారం
    good and touching one, keep writing.

    ReplyDelete
  3. nijame manishi yaantrika jeevanamlo spandanaku thaavu ledu chakkagaa raasaaru.

    ReplyDelete
    Replies
    1. స్పందనా రాహిత్య స్థితిని దాటి ఒంటరితనపు జీవనానికి మనిషి వెళ్ళిపోతున్నాడు.మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  4. చాలా చాలా బాగా చెప్పారు....
    యాంత్రిక మైన జీవితం గురించి...

    ReplyDelete
    Replies
    1. మీకు మరిన్ని ధన్యవాదాలు .

      Delete
  5. అద్యాత్మికంగా మాత్రమే ఇది సాధ్యం ఎమో!
    శరీర యంత్రాంగం తీరు అర్ధం అవ్వడం అంత తేలిక కాదేమోనండి.
    స్పందన లేని జీవితం చాలా నిస్సారం గా ఉంటుంది.
    కవిత చక్కగ ఉంది. ఇలాంటివి ఇంకా ఎన్నీ మాకోసం రాస్తారని ఆశిస్తూ!!

    ReplyDelete
    Replies
    1. మీరన్నది కొంత వరకు నిజమే !కాని మన మనసును మనవైపుకు మళ్లిస్తే సాధ్యమేనండి.వ్రాస్తూనే వుంటాను.ధన్యవాదాలు వెన్నెల గారూ మీ అభిమానానికి.

      Delete
  6. మనం యంత్రాలను శాసిస్తామని అనుకున్నాం...
    కానీ చాలా వరకు యంత్రాలే మనల్ని శాసిస్తున్నాయి...
    ఈ జీవనం నుంచి స్పందనలతో జీవితం వైపు అడుగులు వేయాలి...
    మీ కవిత బాగుంది రవి శేఖర్ గారూ!..చక్కగా చెప్పారు...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. సెల్ ఫోన్,టి.వి,కంప్యూటర్ మనిషిని తన నుండి తనను దూరం చేస్తున్నాయి.మనం కొంతవరకు (బ్లాగర్స్ ) పర్లేదు.కాసిన్ని కవితలు చదివి స్పందిస్తూ ఉంటాము.మిగతా వారు కంప్యూటర్ తోడిదే లోకంగా బ్రతుకుతున్నారు.మీ స్పందన బాగుంది.

      Delete
  7. చెవి నిల్లు గట్టుక ’ సెల్ ఫోను ‘ విడువదు
    నిద్దుర చెఱుపక ‘ నెట్టు ‘ విడదు
    శ్రీవారు దిట్టక ’ టీవీలు ‘ విడువవు
    పది యడుగుల కైన ‘ బండి ‘ విడదు
    పన్నెండు దాటినా ‘ పడకలు ‘ పిలువవు
    పొద్దున్న లేవంగ బుధ్ధి గాదు
    ఉరుకులు పరుగులు – ఓరుముల్ తక్కువ
    సంతృప్తి యన్నది సుంత లేదు

    పనికి రాని ‘ ఇగో ’ లతో బతుకు నిండి
    మనసు , దేహము కృతకమై మారి మనిషి
    సహజ శారీర ధర్మము చచ్చి పోయి ,
    స్పందనల చురుకు కోల్పోయె బతుకు బండి .
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. కవిత అంతరంగాన్ని మధురమైన పద్య రూపం లో బహు చక్కగా చెప్పారు.మీకు స్వాగతం మరియు మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete