Friday 27 July 2012

అందంగా వుండే వారిలో అహంకారం ఉంటే!(4)


           నేను  ఎక్కువ అన్న భావం ప్రదర్శించే వారిని సమాజం లో చాలా మందిని చూస్తుంటాము.అందం ద్వారా భావం ఏర్పడిన వాళ్ళు తాము ఇతరుల కంటే చాలా అందంగా ఉన్నామని దానిని ప్రద ర్శించుకోవటం   కోసం అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ,విభిన్న సందర్భాలలో దానిని మాటల రూపం లో ,హావభావాల రూపం లో వ్యక్తం చేస్తుంటారు.అందంగా లేని వ్యక్తుల పై కామెంట్ చేస్తుంటారు.మేము B.ED  చదివే రోజుల్లో మా మిత్రుడు ఒకతను నల్లగా ఉంటాడు.కాని మంచి తెలివితేటలు ,ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడే సామర్థ్యము ఉన్నాయి.ఇంకొక మిత్రుడు చాలా అందంగా ఉండేవాడు.అతను కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడగలడు.ఒకరోజు ఒక అంశం పై సెమినార్ జరిగితే ఇద్దరు మాట్లాడారు.సెమినార్ అయిన తర్వాత అందంగా ఉండే మిత్రుడు మా దగ్గరికి వచ్చి నా మిత్రుని (నల్లగా వుండే)తో నీవు అచ్చు శివరాసన్లా (రాజీవ్ గాంధీ హంతకుడు) ఉన్నావు,అన్నాడుఇంకొకరయితే ఎలా సమాధానమిచ్చేవారో కాని నా మిత్రుడు చాలా కూల్ గా నీవు మాత్రం రాజేష్ ఖన్నా లాగా చాలా అందంగాఉన్నావు అన్నాడు.అంతే వ్యాఖ్య చేసిన మిత్రుడు బాధపడి విచారం వ్యక్తం చేసాడు.
           ఈ విధం గా ఎంతో మంది అందంగా లేని వారిపట్ల అవమానకరమైన రీతిలో మనసు బాధ పడే లాగే వ్యాఖ్యానిస్తుంటారు.ముఖ్యంగా నలుపు,ఎత్తు,లావు గురించి కామెంట్స్ చేస్తుంటారు. అహంకారం ప్రదర్శించే వ్యక్తులు అవతలి మనుషుల మంచి తనానికి విలువ ఇవ్వరు.ఎప్పుడయినా తమకి అవసరమయినప్పుడు బాధలో వున్నప్పుడు వీరికి అందం లేని వారు సహాయం చేస్తే అప్పుడు వారిలో మానసిక మార్పు రావచ్చు.లేదా తాము ఆరోగ్యాన్ని కోల్పోయి అందాన్ని కోల్పోయినప్పుడు వారిలో అహంకారం సమసి పోవచ్చు.లేదా వయసు మీరిన తర్వాత వచ్చే వృద్ధ్యాప్యంవలన ముడతలు పడిన పడిన శరీరాన్ని అద్దంలో చూసుకుంటూ అప్పుడు తీరిగ్గా అహంకారాన్ని తొలగించుకోవచ్చు. లోపల జీవితం ముగిసి పోతుంది.అందం మనిషికి ఆత్మ విశ్వాసాన్ని ఇవ్వాలే గాని అహంకారాన్ని ఇవ్వ కూడదు.
     అందాల పోటీల్లో మీ జీవిత లక్ష్య మేమిటని అందగత్తెలను ప్రశ్నిస్తే సమాజానికి సేవచేయాలనో,అనాధలను వ్యాధిగ్రస్తులను చేరదీసి సేవ చేయాలనో సమాధానమిస్తారు.అంటే వారిలో ఎంత వరకు  అంతఃసౌందర్యం ఉందో పరీక్షిస్తారు.అక్కడ సరి అయిన సమాధానము చెప్పేవారికే ప్రపంచ సుందరి కిరీటం దక్కుతుంది.వారికన్నా అందం గా వుండి  సరి అయిన సమాధానం చెప్పని వారికి కిరీటం తప్పి పోయిన సందర్భాలున్నాయి ..
        బాహ్య సౌందర్యం తాత్కాలిక మైనది.అంతఃసౌందర్యం శాశ్వతమయినది . రోజుకు మహనీయుల గురించి తలచుకుంటూ వుంటామంటే వారి ప్రవర్తన ,వారి ఆలోచనలు,వారి ఆచరణలను బట్టే  .ప్రపంచంలో ఎంతో మంది అంద మైన వాళ్ళు పుట్టారు,మరణించారు.అందం పేరుతో గొప్పవారుగా పరిగణింప బడే వారు ఎంత మంది?ఎంతో అందమైన సినిమా నటులయినా వారి నటనకు గుర్తింపు పొందుతారు, కాని అందంగా ఉన్నంత కాలం ఆరాధిస్తారు  తర్వాత ఎవరైనా పట్టించుకుంటారా!అందంగా లేని ఎంతో మంది ఎన్నో రంగాల్లో అద్భుత మైన తెలివితేటలతో గొప్ప సేవా భావం తో ప్రపంచ ప్రఖ్యాతి పొందారు.
      ఒక్క క్షణం అందంగా ఉండే వారంతా ఆలోచిస్తే వారిలో ఇటువంటి అహంకార మేమైనా ఉంటే  దాన్ని తమంతట తాము గుర్తిస్తే అంటే తమకి లక్షణాలు ఉన్నట్లు వారు గుర్తిస్తే క్షణమే అహంకారం నుండి బయట పడగలరు.అప్పుడు వారికి ప్రపంచ మంతా అందంగా కనబడుతుంది.ముఖ్యం గా వారి మనస్సులో  అహంకారం  ఎప్పుడయితే తొలగి పోతుందో వారి ముఖము దేదీప్య మానంగా వెలిగిపోతూ వారు ద్విగుణీకృత మయిన తేజస్సు తో ప్రకాశిస్తారు.

12 comments:

  1. చక్కని పోస్టు రవిశేఖర్ గారు..
    బాహ్య సౌందర్యం తాత్కాలిక మైనది.అంతఃసౌందర్యం శాశ్వతమయినది నిజం...

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు,అంతే కదండీ మరి!

      Delete
  2. అందంగా లేని వారిలో అహంకారం ఉంటే,.....
    ఆస్థి , బలం, తెలివి తేటలు, పక్కన వారు బలహీనులవ్వడం,
    మాట, రాత, విద్య, గుర్తంపు, అదృష్టం, కాంప్లెక్స్ లు ఇలాంటివి ఇంకా చాలా వున్నయేమో, శేఖర్,
    వీటితో పోలిస్తే అందం వలన భాదితులు చాలా తక్కువేమో అనుకుంటాను,అందాన్ని మొదట ఎందుకు ఎంచుకున్నావో మరి,,

    ReplyDelete
  3. రవిశేఖర్ గారూ!
    ఎపుడూ మానసిక సౌందర్యమే ముఖ్యం...
    బాహ్య సౌందర్యం కొంతకాలమే ఉంటె..
    అంతః సౌందర్యం మనిషి ఆఖరి క్షణం దాకా ఉంటుంది...
    బాగుంది మీ ఆర్టికల్..
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారూ! ధన్యవాదాలు,ఈ నిజాన్ని గుర్తించాలనే!ఈ వ్యాసం.

      Delete
  4. అహంకారం గురించి మంచి విషయాలు చెప్తున్నారు..
    అహంకారం అనేది ఏమి ఉన్నా లేకపోయినా మనిషికి వుండే ఒక చెడ్డ గుణం అనుకుంటానండీ..

    ReplyDelete
    Replies
    1. నిజమేనండి .మీకు ధన్యవాదాలు.

      Delete
  5. You will get daily all GK topics&science topics if you are student or teacher or educated people join this group and improve your knowledge. Type JOIN giriseva to 567678(free)

    Do you want GK Bits daily(free) ? just sms JOIN giriseva to 567678 (useful for group2,group4,dsc,police,si)

    ReplyDelete
  6. రవిగారూ పోస్టు బాగుంది. అందమనేది సహజాతం . దానికి అహంకారం తోడయితే మనిషి పతనమవుతాడు. శారీరక సౌందర్యం కంటే అంతహ్సౌందర్యం ఎంతో గొప్పదని స్వామీ వివేకానంద చెప్పేవాడు. అందగాళ్లు అహంకారంతో దిగజారుతుంటే అందవిహీనులు ఆకర్షణతో అందరినీ తమవైపు తిప్పుకోగలుగుతారు. లెనిన్ , గాంధీ , అభ్రహం లింకన్ లాంటి మహానేతలు ఎంత అందగాళ్లు. అంతెందుకు కే.సీ.ఆర్ , చంద్రబాబు లు అందగాళ్లనా నాయకులుగా ఎదిగారు? అందం అనేది మొదటిచూపులో ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. దానిని ఉపయోగించుకుని అంతహ్సౌందర్యం కూడా పెంచుకుంటే అందం అదనపు ఆకర్షన అవుతుంది. అహంకారం పెంచుకుంటే అదహ్ పాతాళానికి పోవడం ఖాయం. << నీవు మాత్రం రాజేష్ ఖన్నా లాగా చాలా అందంగాఉన్నావు అన్నాడు >> ఇది ఎక్ష్లెంట్ రిటార్ట్.

    ReplyDelete
  7. సర్ మీ విశ్లేషణలు చాలా బాగుంటున్నాయి.మీకు మరీ మరీ ధన్యవాదాలు.ఈ పోస్ట్ సారాంశాన్ని చక్కగా
    విశ్లేషించారు.

    ReplyDelete