Friday, 29 June 2012

స్నేహం మొదలయ్యే క్రమం(3)


   ( మార్చ్ నెలలో స్నేహం(1),స్నేహం ఓ ఆహ్లాదం (2)తరువాత స్నేహం పై వ్యాసాలలో ఇది మూడవది.)
                స్నేహం  చేసుకుందామని  ఎవరూ  ప్రయాణం  మొదలెట్టరనుకుంటా ! ఎందుకో  రెండు  హృదయాలు  ట్యూన్ అవుతాయి.ఇద్దరు మగ అయినా ఇద్దరు ఆడ అయినా ,ఒక మగ ఒక ఆడ అయినా స్నేహితులు కావచ్చు చిన్నపిల్లలు కూడా ఒకరిద్దరితో స్నేహం చేస్తారు.వారితోనే ఎక్కువ మాట్లాడటం,వారి ఇళ్ళకు వెళ్ళటం వారితో       ఎక్కువగా ఆడటం పరస్పర అభిప్రాయాల్ని పంచుకోవటం ఇలా స్కూల్ స్థాయి నుండి కాలేజీ వరకు తరువాత జీవి తంలోను స్నేహం ఓ భాగమయి పోతుంది.
        అసలు స్నేహం చేయటం ఎందుకు?స్నేహానికి జీవితం లో ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి.జీవితం చివరి వరకు అవ సరమా!అవసరాలతో స్నేహాన్ని కోలుస్తామా!ఆస్తులు,అంతస్తులను స్నేహం చూస్తుందా!అలా చూస్తే అది స్నేహం అవుతుందా!అంతస్తులను చూసి స్నేహితులుగా వుంటే దాన్లో ప్రయోజనాలను ఆశిస్తారు కదా!ప్రయోజనాన్ని ఆశిం చేది స్నేహం ఎలా అవుతుంది?
      ప్రాథమిక స్థాయి నుండి 10 వ తరగతి వరకు కనుక కలిసి చదువుకుంటే ఆ స్నేహం జీవితంలోగట్టి పడి చివరి దాకా ఉంటుందేమో!స్నేహంలో సాంద్రత ఎక్కువగా ఉంటుంది కనుక.చిన్ననాటి స్నేహితులు ఆ ముచ్చట్లు ఇచ్చిన త్రిల్ మరేదీ ఇవ్వదేమో!చిన్నప్పుడు ఆడిన ఆటలు,చేసిన అల్లరి పెద్దయిన తర్వాత గుర్తు చేసుకుంటే ఆ తన్మయ త్వం ఆ ఆనందం వర్ణించనలవికాదు.
        కాలేజీ నుండి ఉద్యోగం వచ్చే వరకు  మిత్రులు ఓ రకం.పరిపక్వత కలిగిన స్నేహం.ఒకరి భావాలు ఒకరు పంచుకోవటం,సాంత్వన పొందటం,పరస్పరం సహాయం చేసుకోవటం జరుగుతుంది.ఒక రకంగా కుటుంబం లోని వారికంటే ఎక్కువ స్నేహంగా ఉంటారు.ఇదంతా చూస్తుంటే చిత్రంగా ఉంటుంది.అన్నదమ్ములకి అక్కా చెల్లెళ్లకి అమ్మనాన్నలకి చెప్పుకోలేని సంగతులన్నీమిత్రులతోనే కదా పంచుకునేది.జీవితంలో 25 సం :వరకు అంటే పెళ్ళ య్యే వరకు స్నేహమొక ఆపాత మధురం.ఓ సజీవ స్రవంతి.ఓ భావ ప్రకంపనా ప్రపంచం.తరువాత జీవితంలో మన ఉద్యోగం లో మంచి స్నేహితులు తారస పడతారు .పరస్పర అవగాహ నతో కుటుంబ స్నేహితులు గా మారతారు ఇలా జీవన పయనం లో స్నేహం ప్రాధాన్యత ఎంత ఉందో!    

14 comments:

 1. స్నేహం గురించి చక్కగా చెప్పారు. పెళ్ళి అయ్యాక అంటే 25 తరువాత స్నేహం అది స్త్రీ పురుషుల మధ్య అయితే అనార్థాలకి దారితీస్తుందని నాకు తెలిసిన సత్యం. బహుశా ఇది మీరు తరువాతి పోస్ట్ లో చెప్పబోతున్నారేమో చదవాలి.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండి.తరువాతి పోస్ట్ లలో వివరిస్తాను.

   Delete
 2. good one about friendship, i think , feeling of friendship is eternal.
  keep writing.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండి.

   Delete
 3. చాలా బాగుంది రవి శేఖర్ గారు..

  ReplyDelete
 4. చాలా బాగా వివరించారు..

  ReplyDelete
 5. రవిశేఖర్ గారూ స్నేహం గూర్చి అర్ధవంతమైన పోస్ట్ పెట్టారు, బాగుంది.

  ReplyDelete
  Replies
  1. స్నేహం పై గతం లో వ్రాసిన పోస్ట్ లు కూడా చదవగలరు.మీకు ధన్యవాదాలండి.

   Delete
 6. రవి శేఖర్ గారూ!
  స్నేహం గురించి వివరణ బాగుంది...
  ముందు వ్రాసే విషయాలకోసం కూడా ఎదురు చూస్తుంటాం...@శ్రీ

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు శ్రీ గారు.త్వరలో వ్రాస్తాను.

   Delete
 7. సాధారణం గా కాలేజ్ లైఫ్ లో స్నేహాలు నిలిచిపోతాయి.
  ఒక్కోసారి ఆ స్నేహం opposite sex మధ్య అయితే , చాలా మటుకు పెళ్ళికి దారి తీస్తాయి
  నా ద్రుష్టిలో మంచి స్నేహితుడు లేని వారు ఈ లోకంలో చాలా పేదవారు!
  మంచి పోస్ట్స్ , మంచి టాపిక్స్ మీకు ధన్యవాదాలండి.

  ReplyDelete
  Replies
  1. స్నేహం విషయం లో చాలా చాలా చర్చించాల్సిన అంశాలు ఉన్నాయండి.మీరన్నది నిజమే కాని పెళ్లి దాక రాని స్నేహాలు కొన్నిఉంటాయి .ఇంకా విభిన్నమైన కోణాల్లో విశ్లేషిస్తాను చదువుతూ ఉంటారని ఆశిస్తూ మీకు ధన్య వాదాలు.మంచి స్నేహాలను,వాటి ప్రాముఖ్యతను తెలియ చెప్పటమే ఈ వ్యాసాల ఉద్దేశ్యం .ఒక్క స్నేహితుడైనా మనసుకు దగ్గరివారు లేకపోతే మీరన్నట్లు పేదవారే!

   Delete