Friday, 1 June 2012

కోపాన్ని జయించటం ఎలా?3


             ఆరోగ్య పరంగా కలిగే నష్టం గురించి చెప్పాలంటే అడ్రినలిన్ అనే హార్మోన్   కోపం వచ్చిన సమయం లో రక్తం లోకి ఎక్కువ గా విడుదల అవుతుంది.ఇది చాలా సేపటి వరకు రక్తం లోనే ఉండిపోతుంది.దీని వలన గుండెకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశం వుంది.కోపంలోమన భాష అదుపు తప్పుతుంది.అలాగే కొంత మంది ఈ కోపాన్ని గుర్తుపెట్టుకొని ద్వేషంగా మార్చుకొని అవతలి వారికి నష్ట పరిచే చర్యలు కూడా చేపడతారు.అప్పుడు ఇంకా మరిన్ని సమస్యలు వస్తాయి.మానవ సంబంధాలను దారుణం గా దెబ్బ తీసే ఈ కోపాన్ని జయించటం ఎలా?
      ఇది ఒక్క సారిగా కోపం రాకుండా వుండాలని నిర్ణయించుకొని రేపటినుండి ఆపాలి అంటే ఆగిపోయేది కాదు.మరి ఎలా?కోపాన్ని అణచి వేయకుండా మీ ప్రతి స్పందనని కొద్దిసేపు వాయిదా వేయండి.కొంత మంది ఒకటి నుండి పది వరకు లెక్క పెట్ట మంటారు.అంటే మాటల ద్వారా మీ స్పందన తెలియజేయ కుండా కొంత విరామం తీసుకుంటే ఈ లోపు కోపం కొంత తగ్గుతుంది. అప్పుడు మన బాష కొంత మృదువుగా వస్తుంది.కాని మీకు జరిగిన అన్యాయాన్ని ,అవమానాన్ని భరించమని చెప్పటం లేదు.మీరు స్పందించదలచుకున్న అంశానికి కోపాన్ని జత జేయకుండా అవే ప్రశ్నలను సహనం తో అవతలి వ్యక్తిని ప్రశ్నించండి.ఆ లోపు అతను కూడా తేరుకుని మారవచ్చు.లేదా మీకు తన వివరణ ఇవ్వవచ్చు.ఇక్కడ స్పందన ప్రతి స్పందన లకు మధ్య విరామాన్ని ఇస్తే సమస్య చాలా వరకు తేలికౌతుంది. నిర్మాణాత్మకమైన ప్రశ్నలు వేయటం ద్వారా అవతలి మనిషి ప్రవర్తన మారే అవకాశం ఎక్కువ.మనం గొంతు పెంచి అరిస్తే అవతలి వారు బలహీనులైతే కొంత సేపు సహిస్తారు.సమానులు,లేదా బలవంతులైతే అంతకంటే ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తారు.
          మీ కోపానికి కారణం అవతలి వారి ప్రవర్తన అయితే వారి ప్రవర్తన ఎందుకు నచ్చలేదో మృదువైన మాటలతో చెప్పటానికి ప్రయత్నించండి.ఫలితముంటుంది.ఇలా మీకు అనువైన మార్గాలను అన్వేషించండి.దీనికి పెద్ద జ్ఞానం అక్క ర్లేదు.పెద్ద చదువులు అక్కర్లేదు.పల్లెటూర్లలో చదువు రాని  నిరక్షరాస్యులు సైతం సహనంతో,నింపాదిగా సమస్యలను పరిష్కరిస్తూ వుంటారు.ఇదంతా అనుభవాల ఆధారంగా మనిషి నేర్చుకుంటాడు.ఒక సారి కోపగించుకుంటే కలిగిన నష్టాన్ని అంచనా  వేసుకొని  ఇంకో సారి అలా కోపాన్ని ప్రదర్శించకుండా ఉంటె చాలు.రెండు,మూడు అనుభవాలతో మనకు పూర్తిగా  అర్థమయిపోతుంది,కోపం ద్వారా సాధించేదేమీ లేదని.
         కోపగించుకున్నారు.పొరపాటును గుర్తించి మీ కంటే పెద్ద వారయితే విచారాన్ని వ్యక్తం చేయండి.చిన్న వారయితే అభిమానాన్ని,ప్రేమను మృదువైన మాటలతో ప్రదర్శించండి.సమస్య సర్దుకుంటుంది.    

3 comments:

 1. "ఇక్కడ స్పందన ప్రతి స్పందన లకు మధ్య విరామాన్ని ఇస్తే సమస్య చాలా వరకు తేలికౌతుంది." చాలా మంచి చిట్కా ఇది కోపం లో ఉన్న వారికి. బాగుందండి మీ వ్యాసం.

  ReplyDelete
  Replies
  1. చాలా కుటుంబాలలో కోపం కారణం గా సంబంధాలు దెబ్బతింటున్నాయి.ఒక్క క్షణం ఆగితే ,మనసుకు ఆ అవకాశం ఇస్తే కోపం బదులు మనసు శాంతం తో నిండి పోతుంది.మీకు ధన్యవాదాలు.

   Delete
 2. చక్కటి పోస్టును అందించినందుకు కృతజ్ఞతలండి..

  ReplyDelete