Friday, 22 June 2012

ఆధిక్యతా భావన (2)


               ఈ బంధాలు నిలబెట్టుకోవాలంటే ఏమి చెయ్యాలి?మొదట అన్న తమ్ముళ్ళకి ,అక్కాచెల్లెళ్లకి తాము ఎలా పెరిగారు?చిన్నప్పుడు తల్లిదండ్రులు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ?తాము ఎలా కలిసి పెరిగారు?అప్పటి ప్రేమ ఆప్యాయ తలు మనసులో ఉంచుకోవాలి.ఎవరు ఏ స్థాయిలో వున్నా పరస్పరం సహకరించుకోవాలి. ఒకరి బాధ మరొకరు పంచుకోవాలి.ముఖ్యంగా ఒకరు చెప్పేది మరొకరువినాలి.అప్పుడు బంధువులయి నా స్నేహం ఉంటుంది.ఆ స్నేహం లో అర్థం చేసుకునే గుణం ఉంటుంది.ఆ గుణమే బంధాలను నిలబెడుతుంది.ఆర్ధిక హోదా నుండి,చదువుల వలన వచ్చిన కీర్తి నుండి,హోదా నుండి వచ్చిన పేరు నుండి కలిగిన ఆధిక్యతను మిగతా వారిపై చూపటం వలన బంధాలు విచ్చిన్నమవుతాయి.సమాజంలో చాలా మంది ఈ బంధాలను నిలబెట్టుకుంటున్నారు.అంతే స్థాయిలో ఇవి బలహీనమవుతున్నాయి.
         సరే ఇవి కలవలేనంతగా తెగిపోయాయి అనుకుందాము.అప్పుడెలా?ఏముంది ఎవరి జీవితాలు వారు మిగ తా వారితో పోల్చుకోకుండా ,ఈర్ష్య పడకుండా తమకున్న అవకాశాల మేరకు సంతృప్తిగా ఆనందంగా జీవించ టమే కోపం,ద్వేషాలు పెంచుకోకుండా పరస్పరం నష్ట పరిచే చర్యలకు పాల్పడకుండా ఎవరి పరిధులలోవారు ఉండటమే!ఇది ఎంతో ఉత్తమమైన విధానం.
      అలాకాకుండా ఆస్తులు పంచుకోవటంలో వచ్చిన తగాదాలు,మాట జారటంలో వచ్చిన కక్షలు కొనసాగుతూ
తాము నాశన మవుతు కుటుంబాలను నాశనం చేసుకుంటూ ఉంటారు.ఇది అనాగరికమైన చర్య. వారి కక్ష్యల కు,ద్వేషాలకు పిల్లల జీవితాలు బలి అయి పోతాయి.ఇంకో తరం అభివృద్ది ఆగిపోతుంది.ఎన్నో జీవితాలు ఇలా ధ్వంసం  అయినవి మనకు కన్పిస్తాయి.
    పై అన్ని అంశాలను విశ్లేషిస్తే కుటుంబ సంబంధాలు అద్భుతంగా మారాలన్నా ,సంబంధాలు కలకాలం నిలవా లన్నా ఆ భావన ఇరువైపులా వుండాలి.అలా లేక పోయినా అవి నిలబడకపోయినా  ఘర్షణలు లేని వాతావరణంలో జరగాలి.

8 comments:

 1. chaalaa kastamaina panulanu, chaalaa simple ga chpthunnatlunnav sekhar.
  vislashana bhagundi.

  ReplyDelete
  Replies
  1. బంధాలు బలపడాలన్నా,నిలవాలన్నాతప్పదు మరి.ధన్యవాదాలు .

   Delete
 2. part 2 koodaa baagundi baagaa visleshinchaaru
  @sri

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు మీ స్పందనకు.

   Delete
 3. మనిషిలో ఆధిక్య భావన వల్ల కలిగే అనర్ధాలు చాలా ఉంటాయి." తాడి తన్నే వాడి తల తన్నేవాడు ఉంటాడు అన్నట్టు" లా అన్నమాట.
  ఎదిగిన కొద్ది ఒదిగి ఉండటమే.. గొప్ప లక్షణం. రెండు భాగాలలోనూ మీరు చక్కని విషయాలు వ్రాశారు.
  చదివిన వారు తప్పక ఆత్మ సమీక్ష చేసుకుంటే వారిలో లోపాలు తెలుసుకుని విజ్ఞత తో.. నడుచుకుంటారని ఆశిద్దాం.

  ReplyDelete
 4. మీ స్పందన మరింత బాగుంది.అలాగే ఆశిద్దాము.ధన్యవాదాలు మీకు

  ReplyDelete
 5. ఒక పెద్ద కుట్టుంబంలో బాగ తెలిసిన ఆవిడ తను పెళ్ళి చేసుకుని వచ్చేసాక, తను అందరికంటే పెద్ద కుట్టుంబం నుంచి వచ్చానని, తన అత్తింటివారు ఒకప్పుడు పేదవారని, తరువాత ఆస్తులు సంపాదించారని అనుక్షణం విమర్శిస్తూ ఉండడం నేను చూసాను. పెద్ద కుట్టుంబం నుంచి వచ్చినప్పుడు మంచి సంస్కారవంతురాలై కూడా ఉండాలి కదా!!! ఇలాంటి అత్యధిక భావాలు కూడా ఉంటాయండి! బాగుంది మీ పోస్ట్!!

  ReplyDelete
  Replies
  1. చాలా కుటుంబాల్లో ఎవరో ఒకరి మధ్య ఈ భావాలు ఉంటాయి.కుటుంబ సంబంధాల్లో ఈ భావన చాలా దుష్ప్రభావాన్ని కలిగిస్తుంది.మీ ఉదాహరణ లో ఆవిడ ప్రవర్తన సరిగాలేదు.ఎవరు ఏ స్థాయినుండి ఏ స్థాయికైనా వెళ్ళవచ్చు.ధన్యవాదాలు మీ స్పందనకి.

   Delete