బుద్ధవనం
నాగార్జున సాగర్ మీదుగా హైదరాబాద్ వె డుతునప్పుడల్లా సాగర్ దాటాక ఎడమ వైపు బుద్ధవనం board చూస్తుంటాం. కాని 2014 నుండి నిర్మాణం లో ఉండి 2023 వేసవిలో ప్రారంభించబడిందట.దీనికోసం 274 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతం 70 ఎకరాల్లోనే కొన్ని విభాగాలు పూర్తయ్యాయి.మాచర్ల నుండి నల్లగొండ, హైదరాబాద్ వెళ్లే బస్సులన్నీ అక్కడ ఆపుతాయి. Ordinary bus, auto ల్లో ₹50 తీసుకున్నారు. అక్కడే cottages ఉన్నాయి. భోజనం మాత్రం బయట ఉన్న hotels లో చేయాలి. ఒక రోజు ఉదయం వెళ్లి మధ్యాహ్నం వరకు గడపవచ్చు. సొంత వాహనాలు ఉంటే సాయంత్రం వెళ్లి ఆ వాతావరణాన్ని enjoy చేయవచ్చు.ఉదయం 10 గంటల కల్లా వెళ్ళాం. అప్పుడప్పుడే యాత్రికుల రాక మొదలయింది. Ticket ₹50. రాజప్రసాదం లోపలికి వె డుతున్నామా అన్న అనుభూతి కలిగింది.
1) అర్థ చంద్రాకారంలా ఉన్న మహా స్థూపం,అందులోని నాలుగు వైపులా 4 బుద్ధ విగ్రహాలు బంగారు రంగులో మెరిసిపోతుంటే,పై భాగంలో ఆకాశం ప్రతిబింబిస్తుంటే ధ్యాన మందిరంలో యాత్రికులు ధ్యానం చేసుకునే విధంగా ఓ ప్రశాంత వాతావరణం అక్కడ విలసిల్లుతుంది.అక్కడ ధ్యానం చేయడం చక్కని అనుభూతి కలిగిస్తుంది. మహా స్థూపం క్రింద museum ఏర్పాటు చేశారు.క్రీ. శ 1 వ శతాబ్దం నాటి బుద్ధ విగ్రహాలను చూడవచ్చు.
2)మహా స్థూపానికి ముందు బుద్ధచరితవనంలో ఆయన జీవిత విశేషాలను పొందుపరిచారు.
3) జాతక వనంలో జాతక కథల్లోని చిత్రాలను శిల్పాలుగా మలిచారు.
4)ధ్యాన వనంలో శ్రీలంక ప్రభుత్వం donate చేసిన 27 అడుగుల బుద్ధ విగ్రహాన్ని చరిత వనం లో ధర్మ ఘంటను చూడవచ్చు.
5)స్థూప వనం లో విభిన్న దేశాలు ప్రాంతాల్లో ఉన్న బౌద్ధ స్థూపాల models చూడవచ్చు.
బుద్ధవనం లో ఇంకా చాలా విభాగాలు అభివృద్ధి చేయవలసి ఉంది. పూర్తి రూపం సంతరించుకుంటే ఇది అంతర్జాతీయ పర్యాటక కేంద్రం అవుతుంది.బుద్దవనం ప్రతి ఒక్కరు తప్పని సరిగా చూడదగ్గ సందర్శనీయ ప్రాంతం.... ఒద్దుల రవిశేఖర్
No comments:
Post a Comment