Tuesday 21 November 2023

కోటప్పకొండ సందర్శన

 కొండలపై ఉన్న గుడుల పరిసరాలన్నీ ప్రకృతి రమణీయతతో శోభిళ్లుతుంటాయి. అందులో కోటప్పకొండ ఒకటి. ఇది శివాలయం. నరసరావుపేట కు దగ్గరలో 20 కి.మీ దూరం లో ఉంటుంది. బస్టాండ్ నుండి కార్తీక మాసం ఆదివారం,శనివారం లలో ₹50 ticket తో కొండపైకి RTC బస్సులు నడుస్తుంటాయి. కొండ క్రింద అన్ని వర్గాల వారికి సత్రాలున్నాయి. కొండ ఎక్కటానికి, దిగటానికి రెండు మార్గాలున్నాయి. ఎక్కే మార్గానికి ఇరువైపులా పూలు పూసి స్వాగతిస్తున్నాయి. మధ్యలో ఒక park ఏర్పాటు చేశారు. కొండ పైన గుడి ముందర భాగం విశాలంగా ఉంటుంది.దక్షిణామూర్తి గుడి, విగ్రహం,నంది విగ్రహం మనోహరంగా ఉంటాయి. శివుడి విగ్రహం 4 దిక్కులు కనపడే విధంగా గుడికి ఎదురుగా అమర్చారు.నిత్య అన్నదానం ఉంటుంది.చాలా రుచిగా ఉంది. మనకు తోచిన విరాళం ఇవ్వవచ్చు. ఇహ గుడి చాలా ఎత్తులో ఉంటుంది. గుడి లోపలికి మెట్లు చాలా ఎక్కాలి. గుడి బయటకు వచ్చాక ఎడం వైపు కొండ పైన నాగుల పుట్ట చాలా ఎత్తులో ఉంటుంది.అక్కడే ఒక శివుడి విగ్రహం చాలా ఆకర్షణీయం గా ఉంటుంది. అక్కడ నుండి దిగువకు, ప్రక్కలకు చూస్తే view point చా లా అద్భుతం గా ఉంటుంది. ప్రక్క కొండ మీద పాత కోటేశ్వర స్వామి ఉంటారు. అక్కడ mike లో పాటలు కొండ అంతా ప్రతి ధ్వనిస్తున్నాయి. శివరాత్రి కి కట్టే ప్రభలు ఆ ఉత్సవాలు, జనాల్ని చూడటానికి రెండు కళ్ళు చాలవట. చిన్నపురెడ్డిని బ్రిటిష్ వారు ఉరి తీసింది ఈ కొండపైనే.దేవుళ్ళందరూ కొండలపై ఎందుకు కొలువుంటారో తెలుసా, తమతో పాటు ప్రకృతిని ఆరాధించమని.కొండల నిండా ఇంకా చెట్లు బాగా పెంచితే గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం అవుతుంది. ... ఒద్దుల రవిశేఖర్

No comments:

Post a Comment