Sunday, 15 December 2013

దేవుడి భాషను చెప్పిన కుర్రాడు


             చిన్న జ్వరానికి,జలుబుకే కంగారు పడిపోతాం. కానీ అమెరికాకు చెందిన Myatee stepaneck నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. అతని 13 ఏళ్ళ జీవితంలో సాధించిన విజయాలు 1)అతడు వ్రాసిన కవితల పుస్తకాలు అమెరికాలో అత్యధికంగా అమ్ముడు పోయిన పుస్తకాల జాబితాలో స్థానం సంపాదించాయి.2)ప్రతిష్టాత్మక మైన మెలిండా ఎ లారెన్స్  పేరిట ఉన్నఅంతర్జాతీయ బుక్ అవార్డు గెలుచుకున్నాడు.3) తన లాంటి రోగుల కోసం దేశ మంతా తిరిగి విరాళాలు సేకరించి ఇచ్చాడు.3)ఎన్నోబహిరంగ సభల్లోపాల్గొన్నాడు,ఎన్నోటి .వి కార్యక్రమాల్లో పాల్గొ న్నాడు 4)అమెరికాలోని ప్రముఖులు అతని మిత్రులు .
            పుట్టినప్పటి నుంచి అతనికి ఓ అరుదైన వ్యాధి ఉంది.అది mascular dystrophy . ఈ వ్యాధితోనే అతని అన్నలు చనిపోయారు .చక్రాల కుర్చీ లేనిదే కదలలేడు.వారానికి ఒకసారి రక్త మార్పిడి చేయించుకోవాలి ఊపిరి పీల్చుకోవాలంటే ఒక యంత్రం పనిచేయాల్సిందే!ఆహారం గొంతులోకి గొట్టాల ద్వారా ఇవ్వాలి.ప్రతి రాత్రి నరాల ద్వారా సూదులు తప్పని సరి.ఎన్ని బాధలు !ఎంత కష్టం !
          ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది అతడు ఎప్పుడూ ఆనందంగా ఉండడం గురించి !నిరాశకు గురవకుండా అతను వ్రాసిన వేలాది కవితల గురించి.కవితలు కథలు వ్రాసేవాడు. శాంతి,ఆశ ప్రేమ జీవితం ప్రకృతి విచారం వైకల్యం లాంటి అంశాలపై ఎన్నో వ్యాసాలూ వ్రాసాడు. మ్యాటీ ని కలుసుకోవడం నా ఆశయాల్లో ఒకటి అన్నాడు జిమ్మీ కార్టర్. 
ఒఫ్రా విన్ఫ్రే ,ల్యారీ కింగ్ లాంటి ప్రముఖులు అతని కార్యక్రమాల్లో పాల్గొన్నారు .
     అతని భావాలలో కొన్ని
       *దేవుడికి నచ్చిన భాష పిల్లల భాష
     *నేను పెద్ద అవుతాననే నమ్మకం నాకు లేదు కానీ పెద్దవ్వాలనే కోరిక ఉంది . నాకు కథలు కవితలు ఇష్టం అందుకే రచయితను అవుతాను
* అందరి జీవితాల్లోను తుపానులు ఉంటాయి దీన్ని అందరు తెలుసుకోవాలి ప్రతి తుపాను తర్వాత మనం ఆడు కోవాలి.  జీవితమనే బహుమతి లభించినందుకు మనం ఆనందించాలి. 
*మనందరం ఒకే భూమి మీద ఉన్నాం. మన అందరికీ ఒకటే హృదయం ఉంది ఒకే జీవితం ఉంది అందుకే మన అందరం ఒకే కుటుంబం లా ఉండాలి
* నాకు ప్రతి రోజు ఒక బహుమతే! ఎందుకంటే ఎప్పుడు చనిపోతానో తెలియదు.కాబట్టి నాకు బలం దేవుడి నుంచి,అమ్మ నుంచి నాకు ఎదురయిన మనుషుల నుంచి లభిస్తోంది .
    చూడండి ఎంత ఆశావాదం! చిన్న విషయాలకే ఆత్మ హత్య చేసుకునే వారు,జబ్బుల బారిన పడి జీవితం పట్ల విరక్తి చెందిన  వారు అతని నుండి ఎంతో స్పూర్తి పొందవచ్చు.మ్యాటినీ తన 13 వ ఏట చనిపోయాడు గొప్ప స్పూర్తిని  ప్రపంచానికి అందించి.
  ( ఈ కథనం ఈనాడు పత్రిక లో వచ్చింది.వారికి ధన్యవాదాలు )


 

6 comments:

  1. baavundi . Thanks for sharing Sir.

    ReplyDelete
  2. ఆశావాద దృక్పద పోస్ట్

    ReplyDelete
  3. మీ టపాలెప్పుడూ ఆలోచిపజేస్తాయి , అభినందనలు సర్.

    ReplyDelete