Sunday, 26 January 2014

విలువైన వైద్య సలహా కోసం ఈ వెబ్ సైట్ ను చూడండి

            మనం ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటాం .ఆరోగ్యం బాగా లేనప్పుడు మనం ఇతరుల సలహా మేరకు డాక్టర్స్ దగ్గరకు వెడుతుంటాము.అక్కడ జబ్బుతగ్గక పోయేసరికి ఇంకొకరి సలహా మేరకు మరో డాక్టర్ దగ్గరికి వెడతాము.జబ్బు తగ్గితే సరే లేకపోతే కథ మొదటికే!మనకెవరయినా మొదటే మంచి సలహా ఇచ్చి వుంటే బాగుండు అనిపిస్తుంది.నేను ఇలా ఆలోచించేవాడిని,మనకెవరు నమ్మకంగా మంచి సలహా ఇస్తారా అని!ఈ మధ్య వార్తా పత్రికలలో వచ్చిం ది ఇటువంటి వెబ్ సైట్ గురించి,అదే www.medicounsel.com
           ప్రపంచంలోని 500 మంది 40 రకాల వివిధ superspeciality లలో ప్రసిద్ది చెందిన డాక్టర్స్ ఇందులో భాగస్వా మ్యం వహిస్తున్నారు.మన రాష్ట్రానికి చెందిన appollo ప్రతాప్ రెడ్డి గారు కూడా ఈ network లో ఉన్నారు.ఇందులో register అయిన తర్వాత మనకున్న సమస్యను వీరికి report లతో సహా కంప్యూటర్ ద్వారా పంపిస్తే మనతో వారు ఫోన్ లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి మన సమస్యకు సంబందించిన డాక్టర్ దగ్గరికి పంపించి వారు ఇచ్చిన సలహాను మనకు పంపిస్తారు.ఆ తర్వాత nominal charge అడుగుతారట.
          ఒకసారి ఈ website ను గమనించండి .ఉపయోగ పడుతుంది అనుకుంటే ఇతరులకు తెలియజేయండి .
www.medicounsel.com

6 comments: