నేను స్కూల్,కాలేజీ చదివే రోజుల్లో సైకిల్ పై వెళ్ళే వారం.నేను నా మిత్రుడు ఒకే సైకిల్ పై వెల్లేవారం. అప్పుడు మాకాలేజీ lecturers కూడా సైకిల్ పైనే వచ్చేవారు.మాmaths lecturer,principal మాత్రంbajaj chethak పై వచ్చేవారు అప్పుడు అందరం వాటిని గొప్పగా చూసేవాళ్ళం.ఓ సారి college కి నడిచి వెడుతుంటే మా maths లెక్చరర్ Nageswararao (SNR ) నన్ను తన స్కూటర్ ఎక్కించుకుని వెళ్ళారు.ఆ రోజు ఎంత ఆనందమో !అందరికి ఆ విషయం చెప్పాను.ఆయన అప్పుడప్పుడు అలా నడిచి వచ్చే పిల్లలను స్కూటర్ ఎక్కించుకునే వారు.
తరువాత డిగ్రీ నెల్లూరులో చదివే రోజుల్లో కూడా అదే సైకిల్ పై ప్రయాణం అప్పటికి lecturers అందరు స్కూటర్ పై వస్తున్నారు.ఎందుకీ ఉపోద్ఘాతమంటే ఈ మధ్య కాలంలో సైకిల్ తొక్కటం కేవలం చిన్న పిల్లలకు సంబంధించిన విషయంగా మిగిలిపోయింది పిల్లలు కూడా స్కూల్ కి కాలేజీ లకు ఆటో లలో,బస్సు లలో వెడుతున్నారు ఇంటి దగ్గర మాత్రమే సైకిల్ త్రొక్కుతున్నారు.
పెద్దలు దాదాపుగా సైకిల్ త్రొక్కటం మానేసి హీరో హోండా లు కొనేస్తున్నారు.ఇది పట్టణాల్లో మామూలు విషయం.పల్లెల్లో సైతం విపరీతంగా కొంటున్నారు.పట్టణాల్లో రోడ్ల పై ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది బండ్ల వేగం వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. పెట్రోల్ వాడకం పెరిగింది.దీంతో కాలుష్యం,భూతాపంపెరిగిపోతు న్నాయి.ప్రపంచ వ్యాప్తంగా bikes,cars ఎక్కువవటం వలన పట్టణాల్లో గంటలతరబడి ట్రాఫిక్ జామ్ అవటం మనం హైదరాబాద్ ,బెంగళూరులో చూస్తుంటాం.మరి దీనికి పరిష్కారం ఏమిటి ?
చైనాలో వారానికొక రోజు ప్రతి ఒక్కరు సైకిల్ పైనే ప్రయాణించాలి,లేదా ఫైన్ వేస్తారు.మన రాష్ట్రంలో వైజాగ్ లో ఈ ప్రయోగం జరుగుతుంది .హైదరాబాద్ లో కిరణ్ రెడ్డి అనే ఒక కంపెనీ అధికారి అత్తాపూర్ నుండి ameerpeta వరకు రోజు సైకిల్ పై వస్తారట.car ప్రయాణం గంటన్నర సైకిల్ పై 45 నిముషాలకే వెడతారట. వారాని కొకరోజు తన ఆఫీసు ఉద్యోగులు సైకిల్ పై వస్తే 1000 రూపాయలు బోనస్ గా ఇస్తానని ప్రకటించారు .
అలాగే దీన్ని అందరు ఆదర్శంగా తీసుకుంటే ఎంత బాగుంటుంది ఇంధనం,కాలం డబ్బు అన్నీ ఆదానే ! భూమాతకు ఎంతో మేలు చేసినట్లు! ఒక గంట సైకిల్ త్రొక్కితే 414 కేలరీల శక్తి ఖర్చు అవుతుంది ఆరోగ్యానికి ఎంతో మంచిది . గంటకు 6 కి. మీ నడిస్తే 228 కేలరీలే ఖర్చు అవుతాయి మార్నింగ్ వాకింగ్ కు బదులు మార్నింగ్ సైక్లింగ్ చేస్తే మరీ మంచిది . ప్రయత్నిస్తారు కదూ!

No comments:
Post a Comment