చార్ ధామ్ యాత్రలోఆకస్మిక వరదల్లో వేలల్లోభక్తులు మరణించారు.భక్తీ పారవశ్యంతో వెళ్లి కుంభమేలాల్లో ఆలయాల్లోతోక్కిసలాటల్లో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.ఆలయాలు,మత సంబంద ప్రాంతాల్లో గత పదేళ్ళలో 1000 మంది ప్రాణాలు కోల్పొయారు.వీటిల్లో నిస్సహాయులైన మహిళలు ,వృద్దులు,చిన్నారులు బలి అవుతున్నారు. వరదలు,తుపానులు వలన మరిన్ని వందల మంది మరణిస్తున్నారు. ఆలయాలకు ఆదాయం పుష్కలంగా వస్తున్నా సురక్షిత ఏర్పాట్ల పై ఏమాత్రం దృష్టి పెట్టక పోవటం ,గత అనుభవాల నుండి పాటాలు నేర్వక పోవటంతో ఈ సంభవిస్తున్నాయి.
ఇవన్నీఒక ఎత్తు అయితే ఇక యముడి నరకలోకానికి దారులా అన్న విధంగా ఉండే మన రోడ్లపై జరిగే ప్రమాదాల్లో ఏడాదికి కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.ఈ మధ్య వోల్వో బస్సులో45 మంది సజీవదహన సంఘటన మనసును కలచి వేసింది.ఈ ఘటన కలిగించిన భయంతో ట్రైన్ లో పొగలు రావటంతో దూకి ప్రాణాలు పోగొ ట్టుకున్న వారెంత దురదృష్టవంతులు.ఇక గౌతమీ ఎక్ష్ ప్రెస్ లో మంటల్లో ప్రాణాలు కోల్పోయిన వారిదెంత విషా దం.ఇక లారీలు,ఆటోలు ,బైక్స్ ప్రమాదాలు లెక్క లేనన్ని ఆగి ఉన్న లారీని డీ కొని ఎన్నో ప్రమాదాలు జరుగుతు న్నాయి.బైక్స్ పై వేగంగా వెడుతూ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు.విజయవాడలో బస్ స్టాప్ లో ఆగి ఉన్న వారిపై కారు వెళ్ళడం వారు చనిపోవడం చూస్తుంటే ప్రజల ప్రాణాల కెంత భద్రత ఉందో అర్థమవుతుంది .
వీటి వెనుక ప్రజలు సరి అయిన జాగ్రత్తలు తీసుకోక పోవటం,డ్రైవర్స్ నిర్లక్ష్యం ట్రాఫిక్ నియంత్రణ సరిగా లేకపో వటం రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించే యంత్రాంగం వైఫల్యం ,త్వరగా గమ్యం చేరుకోవాలనే ప్రయాణీకుల తొందర ఇలా ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయి.
పటిష్ట మైన భద్రతా ఏర్పాట్లు ,ముందస్తు హెచ్చరికలు ,చట్టాలను కటినంగా అమలు చేయటం,ట్రాఫిక్ నిబం ధనల ప్రచారం , లైసెన్స్ ల తనిఖీ, వాహనాలు సరి అయిన స్థితిలో ఉన్నాయో లేదో చూడటం వంటి చర్యల వలన వీలయినంత మేర ప్రమాదాలు తగ్గించవచ్చు.ప్రజలు తమ విలువైన ప్రాణాలు కాపాడు కోవటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవటం ,పకడ్బందీ ఏర్పాట్లతో ప్రయాణం చేయటం ఎంతో అవసరం .

మంచి సలహాలతో సున్నితంగా హెచ్చరించారు, ఇలాంటి పోస్ట్ లు అవసరం.
ReplyDeleteఅభినందనలు రవి గారూ.
Thank you madam
ReplyDeleteI agree with u meraj..tese kind of posts are really needed...I
ReplyDeletehttp://www.APGlitz.com is providing latest updates
thank you jayaprakashgaru
Delete