సాంకేతిక ప్రపంచానికి రారాజు లా వెలుగొందినా తాను జీవితం లో చూసిన ఎత్తు పల్లాలను తనదైన మాటల్లో ఓ తాత్వికవేత్తలా స్టీవ్ జాబ్స్ చెప్పిన తీరు ఆయన మాటల్లోనే
- "మనిషి జీవితం లోని అన్ని సంఘటనలకు లింక్ లు ఉంటాయి . వాటన్నిటిని కలుపుతూ పోతే అదే భవిష్యత్తు అవుతుంది . అదే జీవిత మవుతుంది . ప్రతి మార్పును ఆహ్వానించాలి.ఆస్వాదించాలి . "
- "జీవితంలో ఎదురుదెబ్బలు అవసరం.ఆత్మ విశ్వాసాన్నికోల్పోకూడదు.చేస్తున్న పనిని ప్రేమిస్తూ ఉండాలి.ఎప్పుడూ ఒకే పనిలో సెటిల్ అయిపోకూడదు . అలా అయిపోతే మనలోని కొత్త ఆలోచనలు బయటికి రావు.జీవితంలో ఎలాంటి మెరుపులు ఉండవు ".
- "ప్రతి రోజు ఇదే నీ ఆఖరి రోజు అనుకోని బ్రతికితే ఏదో ఒకరోజు నువ్వు ఉన్నత స్థానంలో ఉంటావు . "
- "ఈ భూమ్మీద మనుషులందరూ సమానంగా పంచుకునేది ఏదయినా ఉందంటే అది మరణమే .కాబట్టి ఈ ప్రయాణం లో ఎదురయ్యే అవమానాలు,రాగ ద్వేషాలు ,అపజయాలు అన్నీసమానమే".
- "మనం ఏం వదిలేసి వెళ్ళిపోతున్నాం అన్నదే ముఖ్యం.సాటి వారికి ఎంత సాయ పడ్డాం,ఈ ప్రపంచానికి ఏం అందించ గలిగాం,ఎంత ప్రేమను పొందాం అన్నదే శాశ్వతం".
- "connecting the dots,నేను దీన్ని నమ్ముతాను. మన లక్ష్యం బలంగా ఉండాలి.ఎన్నిఅనూహ్య పరిణామాలు ఎదురయినా మనసు కోకూడదు.అప్పుడే ఆ పరిణామాలన్నీ అనుసంధానమై లక్ష్యం వైపు నడిపిస్తాయి ".
No comments:
Post a Comment