ఈ రోజు జిడ్డు కృష్ణ మూర్తి వర్ధంతి.ఆయన 1895 మే 11 న ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లి లో జన్మించారు. 1986 february 17 న అమెరికాలో మరణించారు.మరణించే ముందు ఆయన తన సన్నిహితులతో ఈ విధంగా చెప్పారు. ఆయన మాటల్లో
"70 సంవత్సరాలుగా ఒక దివ్య శక్తి ,ఒక మహా ప్రజ్ఞ ఈ శరీరం లో పనిచేస్తున్నది.ఆ శక్తిని జనం గుర్తించలేదు,
గ్రహించనూ లేదు అది 12 సిలిండర్ల శక్తి గల ఇంజన్.70 సంవత్సరాలు తక్కువేమీ కాదు.ఇప్పుడు ఈ శరీరం అంత శక్తిని భరించ లేకుండా ఉంది.నన్ను ఎవరూ అర్థం చేసుకోలేదు.ఎవరూ నటించ వద్దు.మనలో పబ్లిక్ లో ఎవరూ నాలో ఏమి జరిగింది తెలుసుకోలేరు .
70 సంవత్సరాల తర్వాత ఆ శక్తి చివరి అంచుకు చేరింది.ఆ మహా శక్తి,ఆ మహా ప్రజ్ఞ,ఆ మహా చైతన్యం రాత్రి సమయాలలో బయటకు వస్తుంది.భారతీయులకు ఇలాంటి విషయాలలో చాలా నమ్మకం.ఆత్మశాశ్వత మని శరీరం అశాశ్వతమని అంటారు.నాన్సెన్స్ నా శరీరం వంటి శరీరం పరమాత్మకు మరొకటి దొరకదు.వందల సంవత్సరాలు నిరీక్షించాలి,నా శరీరం లాంటి శరీరం కోసం.ఆత్మ పోగానే అంతా నశిం చినట్లే.చైతన్యం మిగలదు.ప్రజ్ఞ మిగలదు ఆత్మల్ని అనుభూతిస్తామంటారు అది ఊహ.నా రచనల్లో నేను చెప్పిన విషయాలు అర్థం చేసుకుంటే మంచిది ఎవరూ అర్థం చేసుకున్న వారు లేరు ఇంతవరకు ."
( ఈ వ్యాసం శ్రీ శార్వరి రచించిన "కొత్తకోణంలో కృష్ణమూర్తి" నుండి గ్రహించ బడింది . వారికి ధన్యవాదాలు )
ఈ దిగువ website లో ఆయన గురించి తెలుసుకోగలరు .
www.jkrishnamurti.org

No comments:
Post a Comment