నేను ఎక్కువ
అన్న భావం ప్రదర్శించే వారిని
సమాజం లో చాలా మందిని
చూస్తుంటాము.అందం ద్వారా ఈ
భావం ఏర్పడిన వాళ్ళు తాము ఇతరుల కంటే
చాలా అందంగా ఉన్నామని దానిని ప్రద ర్శించుకోవటం కోసం అలంకరణకు ఎక్కువ
ప్రాధాన్యతనిస్తూ ,విభిన్న సందర్భాలలో దానిని మాటల రూపం లో
,హావభావాల రూపం లో వ్యక్తం
చేస్తుంటారు.అందంగా లేని వ్యక్తుల పై
కామెంట్ చేస్తుంటారు.మేము B.ED చదివే
రోజుల్లో మా మిత్రుడు ఒకతను
నల్లగా ఉంటాడు.కాని మంచి తెలివితేటలు
,ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడే సామర్థ్యము ఉన్నాయి.ఇంకొక మిత్రుడు చాలా
అందంగా ఉండేవాడు.అతను కూడా ఇంగ్లీష్
బాగా మాట్లాడగలడు.ఒకరోజు ఒక అంశం పై
సెమినార్ జరిగితే ఇద్దరు మాట్లాడారు.సెమినార్ అయిన తర్వాత ఆ
అందంగా ఉండే మిత్రుడు మా
దగ్గరికి వచ్చి నా మిత్రుని (నల్లగా వుండే)తో నీవు
అచ్చు శివరాసన్లా (రాజీవ్ గాంధీ హంతకుడు) ఉన్నావు,అన్నాడు. ఇంకొకరయితే ఎలా సమాధానమిచ్చేవారో కాని
నా మిత్రుడు చాలా కూల్ గా
నీవు మాత్రం రాజేష్ ఖన్నా లాగా చాలా
అందంగాఉన్నావు అన్నాడు.అంతే ఆ వ్యాఖ్య
చేసిన మిత్రుడు బాధపడి విచారం వ్యక్తం చేసాడు.
ఈ విధం గా
ఎంతో మంది అందంగా
లేని వారిపట్ల అవమానకరమైన రీతిలో మనసు బాధ పడే
లాగే వ్యాఖ్యానిస్తుంటారు.ముఖ్యంగా నలుపు,ఎత్తు,లావు
గురించి కామెంట్స్ చేస్తుంటారు.ఈ అహంకారం ప్రదర్శించే
వ్యక్తులు అవతలి మనుషుల మంచి
తనానికి విలువ ఇవ్వరు.ఎప్పుడయినా
తమకి అవసరమయినప్పుడు బాధలో వున్నప్పుడు వీరికి
అందం లేని వారు సహాయం
చేస్తే అప్పుడు వారిలో మానసిక మార్పు రావచ్చు.లేదా తాము ఆరోగ్యాన్ని
కోల్పోయి అందాన్ని కోల్పోయినప్పుడు వారిలో ఈ అహంకారం సమసి
పోవచ్చు.లేదా వయసు మీరిన
తర్వాత వచ్చే వృద్ధ్యాప్యంవలన ముడతలు
పడిన పడిన శరీరాన్ని అద్దంలో
చూసుకుంటూ అప్పుడు తీరిగ్గా ఈ అహంకారాన్ని తొలగించుకోవచ్చు.ఈ లోపల జీవితం
ముగిసి పోతుంది.అందం మనిషికి ఆత్మ
విశ్వాసాన్ని ఇవ్వాలే గాని అహంకారాన్ని ఇవ్వ
కూడదు.
అందాల పోటీల్లో మీ
జీవిత లక్ష్య మేమిటని అందగత్తెలను ప్రశ్నిస్తే
సమాజానికి సేవచేయాలనో,అనాధలను వ్యాధిగ్రస్తులను చేరదీసి సేవ చేయాలనో సమాధానమిస్తారు.అంటే వారిలో ఎంత
వరకు అంతఃసౌందర్యం ఉందో పరీక్షిస్తారు.అక్కడ సరి అయిన
సమాధానము చెప్పేవారికే ప్రపంచ సుందరి కిరీటం దక్కుతుంది.వారికన్నా అందం గా వుండి సరి అయిన సమాధానం చెప్పని
వారికి ఆ కిరీటం తప్పి
పోయిన సందర్భాలున్నాయి ..
బాహ్య సౌందర్యం తాత్కాలిక
మైనది.అంతఃసౌందర్యం శాశ్వతమయినది .ఈ రోజుకు మహనీయుల
గురించి తలచుకుంటూ వుంటామంటే
వారి ప్రవర్తన ,వారి ఆలోచనలు,వారి
ఆచరణలను బట్టే .ప్రపంచంలో ఎంతో మంది అంద మైన వాళ్ళు పుట్టారు,మరణించారు.అందం పేరుతో గొప్పవారుగా
పరిగణింప బడే వారు ఎంత
మంది?ఎంతో అందమైన సినిమా నటులయినా వారి నటనకు గుర్తింపు పొందుతారు, కాని అందంగా ఉన్నంత
కాలం ఆరాధిస్తారు ఆ తర్వాత ఎవరైనా
పట్టించుకుంటారా!అందంగా
లేని ఎంతో మంది ఎన్నో
రంగాల్లో అద్భుత మైన తెలివితేటలతో గొప్ప
సేవా భావం తో ప్రపంచ
ప్రఖ్యాతి పొందారు.
ఒక్క క్షణం అందంగా
ఉండే వారంతా ఆలోచిస్తే వారిలో ఇటువంటి అహంకార మేమైనా ఉంటే దాన్ని తమంతట
తాము గుర్తిస్తే అంటే తమకి ఈ
లక్షణాలు ఉన్నట్లు వారు గుర్తిస్తే ఆ
క్షణమే ఈ అహంకారం నుండి
బయట పడగలరు.అప్పుడు వారికి ప్రపంచ మంతా అందంగా కనబడుతుంది.ముఖ్యం గా వారి మనస్సులో ఈ అహంకారం ఎప్పుడయితే తొలగి పోతుందో వారి
ముఖము దేదీప్య మానంగా వెలిగిపోతూ
వారు ద్విగుణీకృత మయిన తేజస్సు తో ప్రకాశిస్తారు.