దేశంలో అత్యున్నత సర్వీస్ అయిన సివిల్స్ లో 219 రాంక్ సాధించారు మార్కాపురానికి చెందిన రాకేశ్ రెడ్డి .IPS వస్తుందని ఆశిస్తున్నారు . అలాగే మార్కాపురానికి చెందిన సాయి శ్రీనివాస్ ఎంసెట్ లో medicine లో state first సాధించారు. వీరిద్దరికీ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు పాటశాలలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసారు.ఇందులో రాకేశ్ రెడ్డి ఇచ్చిన సందేశం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ వ్రాస్తు న్నాను.ఆయన మాటల్లోనే
Wednesday 25 June 2014
Sunday 11 May 2014
ప్రేమంటే --------జిడ్డు కృష్ణమూర్తి
ప్రేమంటే ఏమిటో మాటల్లో వ్యక్తీకరింపలేము.దీనిని ఏ విధమైన వర్ణనతో గానీ సిద్ధాంతం తోగానీ తెలియ జేయలేము.అందుకే కృష్ణమూర్తి ఏది ప్రేమకాదో తెలుసుకోమంటారు.ప్రేమ శబ్దం కాదు.అన్ని శబ్దాలు ఆగిపోయిన ప్పుడు ప్రేమపుడుతుంది.అసహ్యత,పేరాశ,వ్యతిరేకత,దోపిడీ,స్వార్థం లేనప్పుడు పూర్తి స్వేచ్చలో ప్రేమ పుడుతుంది. స్వార్థం లేనప్పుడే ప్రేమ ఉంటుంది.ప్రేమ కోసం పోటీ పడుతున్నప్పుడు ప్రేమించాలన్న ఆశయం ,ఆశా ఉన్నప్పుడు ప్రేమ ఉండదు.
ప్రేమ ఒక పని కాదు.ఒక త్యాగమూ కాదు ప్రేమలో ఒక బాద్యత ఉన్నది.మానవ దేహం చురుగ్గా సహజమైన సున్నితత్వంతో ఉన్నప్పుడు,మనసు ఏ రకమైన ఆలోచనలతో కలుషితం కానపుడు ప్రేమ జనిస్తుంది. ప్రేమ ఒక్కటే ఇతరులను అర్థం చేసుకోగలదు.ప్రేమ ఉంటే తప్పులుండవు. ఉన్నా ఆ తప్పులను ఏ నటనా లేకుండా దిద్దుకో వచ్చు.స్థాయీ భేదం లేకుండా అందరినీ సమాన దృష్టితో చూచే శ్రద్ధ ప్రేమలోనే ఉంటుంది.మనిషి తనకు తటస్థపడిన ప్రతి ఒక్కరి పట్లా బాధ్యత వహించి వాత్సల్యాన్ని దయను సహాయాన్ని అందించటమే ప్రేమగా జీవించటం.
( ఈ రోజు(మే 11) కృష్ణ మూర్తి జయంతి .ఈ చిన్న వ్యాసం కృష్ణ మూర్తి పై అరుణామోహన్ రచించిన చేతన అనే సిద్ధాంత వ్యాసం నుండి సేకరించినది .వారికి ధన్యవాదాలు )
కృష్ణమూర్తి గురించి మరింతగా తెలుసు కోవాలనుకుంటే ఈ క్రింది website ను సందర్శించండి .
www.jkrishnamurti.org

Wednesday 2 April 2014
మన మనసు ఎప్పుడు స్వేచ్చగా ఉన్నట్లు ?
గత అనుభవాల తాలూకు అభిప్రాయాలు,మనం చదివిన పుస్తకాలు,చూసిన వ్యక్తులు, సంఘటనల వలన మన మనసు వాటికి అనుగుణంగా ఆలోచిస్తూ మన ప్రవర్తనను నిర్దేశిస్తూ ఉంటుంది.ఒక రకంగా ఈ ధోరణి పాక్షిక మైనది.మనసును స్వే చ్చగా అప్పటికప్పుడు స్పందించకుండా గతానుభవాలు స్పందించేలా చేస్తాయి. దీనితో తక్షణ సమస్యను అర్థం చేసుకోవటంలో విఫలమవుతుంటాము.
ఉదాహరణకు మనం ఒక వ్యక్తిని గురించి విని ఉంటాము . ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకునిఉంటాము.ఇక ఆ వ్యక్తి తో మాట్లాడుతున్నప్పుడు అతనిని అదే విధంగా చూస్తాము.ఆ వ్యక్తి ఆ క్షణంలో ఎలా మాట్లాదుతున్నాడు అన్న విషయం కంటే గతంలో అతని ప్రవర్తన ఆధారంగా అతనిని అర్థం చేసి కొంటాము.ఇంతెందుకు మనం కూడా ఎన్నో సార్లు పొరపాట్లు చేసి మరల సరి చేసుకుని మన అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటాము.మరి మనలని కూడా అవతలి వ్యక్తులు అలాగే భావిస్తారు కదా!దీనిని బట్టి ఆ క్షణంలో అవతలివారు ఎలా స్పందిస్తున్నారు? అందు లో భావం గ్రహించటానికి ప్రయత్నించాలి .మాటల్లో నిజాయితీ ఉందా ! చెప్పే విషయంలో స్పష్టత ఉందా ! వారు మాట్లాడుతున్నప్పుడు అందులో వారి హ్రుదయం ఆవిష్క్రుత మౌతుందా అన్న విషయాన్ని గమనించగలగాలి అప్పుడే మన మనసు స్వేచ్చగా ఉన్నట్లు.

Monday 31 March 2014
కొత్త మనసుతో నూతన సంవత్సరం
ఆలోచనల భారంతో అలసిన మనసుకు శక్తి ఎలా వస్తుంది? వాటిని వదిలించుకోవటం లోనే కొత్త శక్తి వస్తుంది.అప్పుడు స్వేచ్చతో మనసు విహరిస్తుంది.ఈ స్వేచ్చలోనే ప్రేమ జ్వలిస్తుంది.ప్రకృతిలో ప్రతి క్షణం గతం నశిస్తూ కొత్తదనం జన్మిస్తుంది.ప్రకృతిలోని ఈ మార్పులకు అనుగుణంగా జీవకోటి మారుతుంది.కానిమనిషి మనసు గతాన్ని పట్టుకుని వ్రేలాడుతుంది.ఎప్పటికప్పుడు నూతనంగా ఉండటం మనసుకు కష్టమౌతుంది.మనిషిలో మాన సిక సమస్యలు,సంఘర్షణలు,ఈర్ష్యా ద్వేషాలు,పగ, కసి,వైరం,హింసయుద్ధం తదితర ముసలి ఆలోచనలు యుగాలు గా వెంటాడుతున్నాయి .
కులం,మతం,వర్గం లాంటి ఆలోచనలు మనసును దుఃఖమయం చేశాయి.నిత్య నూతనంగా మనసు తొణికిస లాడకుండా కొత్త జీవితాన్ని ప్రారంభించలేము.గతాన్ని అంతం చేయకుండా కొత్త సంవత్సరంలో నిరాశగా జీవించ కూడదు.ప్రపంచంలో మార్పులు అర్థం చేసుకోవాలి.తాజాగా స్పందించాలి.పాత ఆలోచనలను దహిస్తూ కొత్త వెలుగును నింపాలి.అటువంటి మనసులోని తాజాదనంతో పాత సమస్యలన్నీ కొత్త మనసులోని మంచి భావాలతో పరిష్కార మౌతాయి.
(అందరికి ఉగాది శుభాకాంక్షలు . ఈ చిన్న వ్యాసం జిడ్డు కృష్ణ మూర్తి బోధనల వెలుగులో "కొత్త మనసు "అనే పుస్తకం నుండి సేకరించ బడింది. ఈ పుస్తకానికి సంధాన కర్త M. శివరాం,సంపాదకుడు నందుల ప్రభాకర శాస్త్రి )

Sunday 9 March 2014
గిజుభాయి రచించిన "మాస్టారూ" పుస్తక సమీక్ష
పాఠకుల సమాఖ్య మార్చ్ నెల సమావేశం
ఈ సమావేశం లో పి.మల్లిఖార్జున గారు గిజుభాయి పుస్తకం మాస్టారూ లోని అంశాలను వివరించారు. అందులోని అంశాలు "బానిస మనస్తత్వాన్నిపిల్లల్లో నుండి పారద్రోలాలని లేకుంటే వారిలో సృజనాత్మక శక్తి లోపిస్తుందని చెప్పారు.పిల్లల్లో వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే ఎన్నో అంశాలను ఈ పుస్తకం లో వివరించారు. .అవసరం లేని వస్తువులను పారవేస్తుంటే అనవసరమైన విషయాలను వదిలివేస్తారు.పరీక్షలు అంటే కలిగే భయం పెద్ద అయ్యేంతవరకు వెంటాడుతుంది .గణితం కుతూహలాన్ని కలిగించాలి.పిల్లల ప్రతిభను మాస్టారు తనదిగా వారి అపజయాలకు వారే కారణం అని నిర్దారిస్తారు.పిల్లల్ని బలవంతాన చదివించకూడదు.పరీక్షలు పిల్లల్ని విజేతలు, పరాజితులుగా విభజిస్తాయి.పిల్లలకు జీవితం గురించి నేర్పాలి.పిల్లల్ని తప్పు పట్టకూడదు .లార్వానుండి సీతాకోక చిలుక బయట పడే క్రమం లాగా పిల్లలు సహజ సిద్దంగా నేర్చుకోవాలి. పిల్లలో సౌందర్య దృష్టి కళాత్మకత ఉంటుంది. స్వేచ్చగా పనిచేసే వాతావరణం వారికి కల్పించాలి".
తరువాత కరపత్రం తయారీలొ ఉండాల్సిన అంశాలపై చర్చ జరిగింది.సభ్యులు దీనికి చాలా విలువైన సూచనలు చేశారు. వచ్చే సమావేశం లోపు తయారు చేయాలని నిర్ణయించారు. పాఠకుల సమాఖ్య తరపున రేడియో కార్యక్రమం కూడా ఇవ్వాలని నిర్ణయించారు.వచ్చే నెల సమావేశం 6/4/2014 న జరగాలని తీర్మానిం చారు.విద్యార్థులను జీవితం గురించి తెలుసుకునేలా సంసిధ్ధుల్ని చేయాలని గ్రంధ పాలకులు మధుసుధన రావు గారు సూచించారు.పాఠశాలల్లో తరగతి పుస్తకాలే కాకుండా మహనీయుల జీవిత చరిత్రలు,వార్తాపత్రికలు చదివించాలని రవిశేఖర్ సూచించారు.ఈ కార్యక్రమంలో చాంద్ భాషా,ముసలా రెడ్డి ,బసిరెడ్డి, సుబ్బారావు రంగన్న,చంద్రశేఖర్,అరుణ్ కిషోర్ ఆదినారాయణ రెడ్డి , ఫారూఖ్ పాల్గొన్నారు . ఈ సారి నెల నుండి ఈ సమావేశం వివరాలు నా మరో బ్లాగ్ అయిన friendsfoundation(snehithfoundation.blogspot.in )లో వివరిస్తాను .
పుస్తకాన్ని సమీక్షిస్తున్న మల్లిఖార్జున

Thursday 6 March 2014
మార్కాపూర్ లో Readersclub( పాఠకుల సమాఖ్య) ప్రారంభం
దీని ప్రారంభానికి నేపధ్యం గత సంవత్సరం ఇదే బ్లాగ్ లో "పుస్తకాలే మన నేస్తాలయితే "అన్న వ్యాసం వ్రాయటం జరిగింది.ఈ వ్యాసానికి ప్రతిస్పందనగా "శర్కరి "బ్లాగ్ ను నిర్వహిస్తున్న జ్యోతిర్మయిగారు ఒక వ్యాఖ్య వ్రాశారు .ఆమె మాటల్లోనే
ఈ వ్యాఖ్య చూసిన తరువాత ఈ విషయాన్ని మార్కాపూర్ గ్రంధ పాలకుడు సజ్జా మధుసూదనరావు గారికి చెప్పగా అయన వెంటనే స్పందించి గత వేసవిలో ఈ పోటీలు ఏర్పాటు చేసారు.కొద్ది మంది పిల్లలే హాజరయినా నెల రోజులు ఉత్సాహంగా వచ్చిపుస్తకాలు చదివారు. తరువాత వారికి బహుమతులు పంపిణీ చేసారు.ఆ సమయంలో మాట వరసకు మధుసూదన్ గారు ఇక్కడకూడా readersclub ఉంటుంది అని చెప్పటంతో దానిని బలోపేతం చేద్దామని నిర్ణయించటం జరిగింది.ఇప్పటికి అది కార్యరూపం లోకి వచ్చింది .
ఈ సమావేశానికి వచ్చిన వారికి readersclub గురించి మధుసూదన్ రావు గారు వివరించారు .దాని ఉద్దేశ్యాలను,లక్ష్యాలను నేను (రవిశేఖర్ ) వివరించాను.ముఖ్యంగా పుస్తకాలు చదివే వారిని ప్రోత్సాహించటం ఇందుకు సమాజానికి గ్రంధాలయానికి అనుసంధానం గా పనిచెయ్యాలి అని నిర్ణయించటం జరిగింది.తరువాత హాజరయిన వారు తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు .అందరి అభిప్రాయాలతో వచ్చే నెల సమావేశానికి అజెండా నిర్ణయించటం జరిగింది.ప్రతినెల మొదటి ఆదివారం ఉదయం 11. 00 గంటలనుండి 12. 00 గంటల వరకు సమావేశం జరపాలని నిర్ణయించటం జరిగింది.2/3/14 న సమావేశం ఉంటుందని అందులో పుస్తక సమీక్ష,కరపత్రం తయారీ,పిల్లల పుస్తకాలను సర్దటం అన్న అంశాలను నిర్వహించాలని నిర్ణయించారు.పుస్తక సమీక్షకు మల్లిఖార్జున గారు అంగీకరించారు.readersclub అనే పేరు కాకుండా పాఠకుల సమాఖ్యగా దీనికి పేరు పెట్టాలని అందరు ఏకగ్రీవంగా తీర్మానించారు.ఈ కార్యక్రమంలో ఆనంద్,మల్లిఖార్జున,చాంద్ భాషా ,ముసలారెడ్డి ,వీరారెడ్డి ,నాగశ్రీ ,తోట
Thursday 27 February 2014
Billgates చెప్పిన జీవిత సూత్రాలు
1) ప్రపంచం అందమైనదేమీ కాదు.దానికి అలవాటు పడండి.
2) మీ ఆత్మ గౌరవాన్ని ప్రపంచం పట్టించుకోదు.మీరు సాధించబోయే దాని మీదే దాని దృష్టంతా !
3) చిన్న ఉద్యోగాలను అవమానం భావించ వద్దు.మీ తాతల కాలంలో వాళ్ళు అలాంటి ఉద్యోగాలనే ఎదగటానికి అవకాశాలుగా మలచుకున్నారు .
4)మీ తప్పుల గురించి చింతించే బదులు వాటినుంచి నేర్చుకోండి.
5)మీరు సరయిన సమాధానాలు వ్రాసి pass అయ్యే వరకు స్కూల్స్ మీకు బోలెడన్ని అవకాశాలిస్తుంటాయి . కాని నిజ జీవితం ఇందుకు విరుద్ధంగా ఉంటుంది .
6) బడికి వేసవి సెలవులుంటాయి. కానీ ఉద్యోగాల్లో ఇలాంటి సరదాల కోసం సెలవులను మీరే సృష్టించుకోవాలి.
7) T.V నిజ జీవితం కాదు.నిజ జీవితం లో ప్రజలు ఎవరి ఉద్యోగాలకు వారు వెళ్ళాల్సి ఉంటుంది .
8) గొప్పలు చెప్పుకునే మేధావులతో మర్యాదగా వ్యవహరించండి. అలాంటి వారి కిందే మీరు పని చేయాల్సి రావచ్చు .
Monday 17 February 2014
జిడ్డు కృష్ణమూర్తి అంతిమ సందేశం
ఈ రోజు జిడ్డు కృష్ణ మూర్తి వర్ధంతి.ఆయన 1895 మే 11 న ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లి లో జన్మించారు. 1986 february 17 న అమెరికాలో మరణించారు.మరణించే ముందు ఆయన తన సన్నిహితులతో ఈ విధంగా చెప్పారు. ఆయన మాటల్లో
"70 సంవత్సరాలుగా ఒక దివ్య శక్తి ,ఒక మహా ప్రజ్ఞ ఈ శరీరం లో పనిచేస్తున్నది.ఆ శక్తిని జనం గుర్తించలేదు,
గ్రహించనూ లేదు అది 12 సిలిండర్ల శక్తి గల ఇంజన్.70 సంవత్సరాలు తక్కువేమీ కాదు.ఇప్పుడు ఈ శరీరం అంత శక్తిని భరించ లేకుండా ఉంది.నన్ను ఎవరూ అర్థం చేసుకోలేదు.ఎవరూ నటించ వద్దు.మనలో పబ్లిక్ లో ఎవరూ నాలో ఏమి జరిగింది తెలుసుకోలేరు .
70 సంవత్సరాల తర్వాత ఆ శక్తి చివరి అంచుకు చేరింది.ఆ మహా శక్తి,ఆ మహా ప్రజ్ఞ,ఆ మహా చైతన్యం రాత్రి సమయాలలో బయటకు వస్తుంది.భారతీయులకు ఇలాంటి విషయాలలో చాలా నమ్మకం.ఆత్మశాశ్వత మని శరీరం అశాశ్వతమని అంటారు.నాన్సెన్స్ నా శరీరం వంటి శరీరం పరమాత్మకు మరొకటి దొరకదు.వందల సంవత్సరాలు నిరీక్షించాలి,నా శరీరం లాంటి శరీరం కోసం.ఆత్మ పోగానే అంతా నశిం చినట్లే.చైతన్యం మిగలదు.ప్రజ్ఞ మిగలదు ఆత్మల్ని అనుభూతిస్తామంటారు అది ఊహ.నా రచనల్లో నేను చెప్పిన విషయాలు అర్థం చేసుకుంటే మంచిది ఎవరూ అర్థం చేసుకున్న వారు లేరు ఇంతవరకు ."
( ఈ వ్యాసం శ్రీ శార్వరి రచించిన "కొత్తకోణంలో కృష్ణమూర్తి" నుండి గ్రహించ బడింది . వారికి ధన్యవాదాలు )
ఈ దిగువ website లో ఆయన గురించి తెలుసుకోగలరు .

Sunday 9 February 2014
నీకు తెలుసు... ఒక్క రాత్రిలో ప్రేమ పుట్టదని.... ఒక్కరాత్రిలో నక్షత్రం పుట్టదని ......
ప్రేమ గురించి ఇంత బాగా ఎవరు చెప్పి ఉంటారు. ఊహించగలరా!"నా దేశం .. నా ప్రజలు " రచనకు నోబెల్ సాహిత్య బహుమతికి నామినేట్ కాబడిన శేషేంద్ర శర్మ.ఆయన భార్య రాజకుమారి ఇందిరా దేవికి రాసిన ప్రేమలేఖ లలోని కవిత్వం ఆయన మాటల్లోనే .......
నా సృజనాత్మక లోకాలని నా ప్రేయసి మేల్కొలిపింది
ఆ మేలుకున్న అంతర్లోకాలు పూస్తున్న పరిమళాలే
ఈ నాటి గాలుల్లో కలిసి వ్యాపిస్తున్నాయి
నా ప్రేమ రాజకుమారి ... !నీ ఉత్తరాలు విప్పాను ... పేజీల్లోంచి
వెన్నెల రాలింది ...
నీవు స్త్రీవి కావు అందాల తుఫానువి.
అందరి భాషా కంఠం నుంచి వస్తే నీ భాషకన్నుల్లోంచి వస్తుంది
నీవు హృదయాన్ని అక్షరాల్లో పెట్టిన పక్షివి .
ఒక్క ముద్దు ఇస్తే అది నీ గుండెలో
తుఫానుగా మారుతుందనుకోలేదు
నా హృదయం లోకి ఉషస్సులు
మోసుకొస్తున్న ని న్నెవ్వడాపగలడు
నీ కనులు ఇంద్ర నీలాల గనులు
ఏ అవ్యక్త భౌతిక ద్రవ్యాలతో కాచిన పీయూషమో నీ ప్రేమ !
అందులో తమ స్వప్నాలు కరిగించుకుని తాగి
ఎందరో మానవ మాత్రులు దేవతలై రెక్కల మీద ఎగిరిపోయారు
ఒక్క బొట్టు చప్పరిస్తే చాలు దేహంలో కండరాలు
మొహంలో మునిగిపోతాయి
ఒక్కటే చాలు నాకు ఎక్కడ నా కలలన్నీ నిజమో
ఆ మధుర నిశ్శబ్దం లాంటి ప్రవాసం నీ దరహాసం
నీ కన్నుల్లో సముద్రాలే కదుల్తాయి పసిపిల్లల్లా
నీ ఒక్క మాటలోనే ఒదిగి పడుంటాయి
మనిషి నిర్మించిన ప్రేమ గాధల లైబ్రరీలన్నీ ...
నీ ఊహల్లో కిరీటాలు ధరించిన రాజులు కూడా
తల వంచి నడిచి పోతారు తమ పరిపాలన సాగని వీధుల్లో నడుస్తున్నట్లు ....
నిన్ను ఒక్క దాన్నే ప్రేమిస్తా. చిన్నప్పుడు కాశీ మజిలీ కథల్లో నుంచీ అరేబియన్ నైట్స్ కథల్లో నుంచీ నా చైతన్య సీమల్లొకి దిగిన రాజకుమార్తె లందరూ నీ వొక్కతెవె అయినట్లు ప్రేమిస్తా ...
నీ శేషేంద్ర
తేనెలో కలాన్ని ముంచి వ్రాసినట్లు ఎంత కమ్మని కవిత్వం. ఆస్వాదించండి మరొక్క సారి
Sunday 26 January 2014
విలువైన వైద్య సలహా కోసం ఈ వెబ్ సైట్ ను చూడండి
మనం ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటాం .ఆరోగ్యం బాగా లేనప్పుడు మనం ఇతరుల సలహా మేరకు డాక్టర్స్ దగ్గరకు వెడుతుంటాము.అక్కడ జబ్బుతగ్గక పోయేసరికి ఇంకొకరి సలహా మేరకు మరో డాక్టర్ దగ్గరికి వెడతాము.జబ్బు తగ్గితే సరే లేకపోతే కథ మొదటికే!మనకెవరయినా మొదటే మంచి సలహా ఇచ్చి వుంటే బాగుండు అనిపిస్తుంది.నేను ఇలా ఆలోచించేవాడిని,మనకెవరు నమ్మకంగా మంచి సలహా ఇస్తారా అని!ఈ మధ్య వార్తా పత్రికలలో వచ్చిం ది ఇటువంటి వెబ్ సైట్ గురించి,అదే www.medicounsel.com
ప్రపంచంలోని 500 మంది 40 రకాల వివిధ superspeciality లలో ప్రసిద్ది చెందిన డాక్టర్స్ ఇందులో భాగస్వా మ్యం వహిస్తున్నారు.మన రాష్ట్రానికి చెందిన appollo ప్రతాప్ రెడ్డి గారు కూడా ఈ network లో ఉన్నారు.ఇందులో register అయిన తర్వాత మనకున్న సమస్యను వీరికి report లతో సహా కంప్యూటర్ ద్వారా పంపిస్తే మనతో వారు ఫోన్ లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి మన సమస్యకు సంబందించిన డాక్టర్ దగ్గరికి పంపించి వారు ఇచ్చిన సలహాను మనకు పంపిస్తారు.ఆ తర్వాత nominal charge అడుగుతారట.
ఒకసారి ఈ website ను గమనించండి .ఉపయోగ పడుతుంది అనుకుంటే ఇతరులకు తెలియజేయండి .
www.medicounsel.com

Saturday 18 January 2014
ఫ్రెండ్స్ ఫౌండేషన్ అనే సంస్థ మరియు బ్లాగ్ ప్రారంభం .
నాకు వీలయినంత ,చేతనైనంత సేవ చేయాలనే సంకల్పంతో ఈ సంస్థను ప్రారంభిస్తున్నాము .ముఖ్యంగా 1)విద్య 2)ఆరోగ్యం 3)పర్యావరణం వంటి అంశాలపై కొన్ని కార్యక్రమాలు చేయాలని ప్రయత్నం.సంస్థ ఉద్దేశ్యాలను కార్యక్రమాల వివరాలను బ్లాగ్ లో పొందుపరచటం జరుగుతుంది . అలాగే ఆ బ్లాగ్ ద్వారా సేవాసంస్థల వివరాలు కూడా ఇవ్వటం జరుగుతుంది.అలాగే దీనికి సంబందించి facebook లో friendsfoundation అనే group ను create
Monday 13 January 2014
వారానికొక రోజు సైకిల్ సవారీ చేయండి !
నేను స్కూల్,కాలేజీ చదివే రోజుల్లో సైకిల్ పై వెళ్ళే వారం.నేను నా మిత్రుడు ఒకే సైకిల్ పై వెల్లేవారం. అప్పుడు మాకాలేజీ lecturers కూడా సైకిల్ పైనే వచ్చేవారు.మాmaths lecturer,principal మాత్రంbajaj chethak పై వచ్చేవారు అప్పుడు అందరం వాటిని గొప్పగా చూసేవాళ్ళం.ఓ సారి college కి నడిచి వెడుతుంటే మా maths లెక్చరర్ Nageswararao (SNR ) నన్ను తన స్కూటర్ ఎక్కించుకుని వెళ్ళారు.ఆ రోజు ఎంత ఆనందమో !అందరికి ఆ విషయం చెప్పాను.ఆయన అప్పుడప్పుడు అలా నడిచి వచ్చే పిల్లలను స్కూటర్ ఎక్కించుకునే వారు.
తరువాత డిగ్రీ నెల్లూరులో చదివే రోజుల్లో కూడా అదే సైకిల్ పై ప్రయాణం అప్పటికి lecturers అందరు స్కూటర్ పై వస్తున్నారు.ఎందుకీ ఉపోద్ఘాతమంటే ఈ మధ్య కాలంలో సైకిల్ తొక్కటం కేవలం చిన్న పిల్లలకు సంబంధించిన విషయంగా మిగిలిపోయింది పిల్లలు కూడా స్కూల్ కి కాలేజీ లకు ఆటో లలో,బస్సు లలో వెడుతున్నారు ఇంటి దగ్గర మాత్రమే సైకిల్ త్రొక్కుతున్నారు.
పెద్దలు దాదాపుగా సైకిల్ త్రొక్కటం మానేసి హీరో హోండా లు కొనేస్తున్నారు.ఇది పట్టణాల్లో మామూలు విషయం.పల్లెల్లో సైతం విపరీతంగా కొంటున్నారు.పట్టణాల్లో రోడ్ల పై ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది బండ్ల వేగం వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. పెట్రోల్ వాడకం పెరిగింది.దీంతో కాలుష్యం,భూతాపంపెరిగిపోతు న్నాయి.ప్రపంచ వ్యాప్తంగా bikes,cars ఎక్కువవటం వలన పట్టణాల్లో గంటలతరబడి ట్రాఫిక్ జామ్ అవటం మనం హైదరాబాద్ ,బెంగళూరులో చూస్తుంటాం.మరి దీనికి పరిష్కారం ఏమిటి ?
చైనాలో వారానికొక రోజు ప్రతి ఒక్కరు సైకిల్ పైనే ప్రయాణించాలి,లేదా ఫైన్ వేస్తారు.మన రాష్ట్రంలో వైజాగ్ లో ఈ ప్రయోగం జరుగుతుంది .హైదరాబాద్ లో కిరణ్ రెడ్డి అనే ఒక కంపెనీ అధికారి అత్తాపూర్ నుండి ameerpeta వరకు రోజు సైకిల్ పై వస్తారట.car ప్రయాణం గంటన్నర సైకిల్ పై 45 నిముషాలకే వెడతారట. వారాని కొకరోజు తన ఆఫీసు ఉద్యోగులు సైకిల్ పై వస్తే 1000 రూపాయలు బోనస్ గా ఇస్తానని ప్రకటించారు .
అలాగే దీన్ని అందరు ఆదర్శంగా తీసుకుంటే ఎంత బాగుంటుంది ఇంధనం,కాలం డబ్బు అన్నీ ఆదానే ! భూమాతకు ఎంతో మేలు చేసినట్లు! ఒక గంట సైకిల్ త్రొక్కితే 414 కేలరీల శక్తి ఖర్చు అవుతుంది ఆరోగ్యానికి ఎంతో మంచిది . గంటకు 6 కి. మీ నడిస్తే 228 కేలరీలే ఖర్చు అవుతాయి మార్నింగ్ వాకింగ్ కు బదులు మార్నింగ్ సైక్లింగ్ చేస్తే మరీ మంచిది . ప్రయత్నిస్తారు కదూ!

Sunday 5 January 2014
నూతన సంవత్సర వేడుకలు ఇలా జరిపితే ఎలా ఉంటుంది ?
నూతన సంవత్సరాన్ని ప్రపంచమంతా చాలా ఘనంగా జరుపుకొంది.మనం కూడా మిత్రులతో,బంధువులతో ఆనందంగా గడుపుతుంటాం.మనకెవరయినా,మనమెవరికయినా శుభాకాంక్షలు చెబితే ఇద్దరికీ ఎంతో ఆనందంగా ఉంటుంది కదా!ఇంకా చాలా మంది చాలా ఖర్చుతో వేడుకగా జరుపుకుంటారు.ఇక అధికారులు,రాజకీయ నాయ కుల దగ్గరికి పండ్లు ,స్వీట్స్ ,శాలువాలు తీసుకెళ్ళి పలకరిస్తారు.వారికి వాటి నన్నింటిని ఏమి చేసుకోవాలో తెలీదు.
ఓ సారి మార్కాపూర్ లోని vasavi club మిత్రుల సేవా కార్యక్రమాల్లో నేను పాల్గొనటం జరిగింది. వారికి ఆ సందర్భంగా హాస్టల్ పిల్లలకోసం ఏదైనా కార్యక్రమాన్ని చేయమని అడగటం జరిగింది.ఈ నూతన సంవత్సరం సందర్భాన్ని పురస్కరించుకుని hostel పిల్లలతో వేడుక చేసుకుంటే ఎలా ఉంటుందని ఆ సంస్థ కార్యదర్శి నా మిత్రుడు ఆనంద్ అడిగారు.బాగుంటుందని నేను చెప్పాను.ఈ విషయాన్ని ఆ వార్డెన్ తో సంప్రదించమని అడిగాడు.ఆ హాస్టల్ వార్డెన్ ఏడుకొండలు గారిని కలిశాను.ఆయన ఆనందంతో ఒప్పుకొన్నారు.ఈ విషయాన్ని ఆనంద్ కు తెలియ జేయగా ఆయన వాసవి క్లబ్ వారితో తెలపగా వారు ఉత్సాహంతో ఆమోదించారు . నేను వార్డెన్ కు చెప్పగా వారు అన్ని ఏర్పాట్లు చేసారు.రాత్రి 10. 30 నిముషాల నుండి 12. 00 గంటల వరకు వారు అక్కడ ఉండి పిల్లలకు వివిధ పోటీలు నిర్వహించి నోట్సులు పెన్స్ అందించారు అలాగె 12 . 00 గంటలు కాగానే పిల్లల తో ఆడి పాడి నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ కేరింతలు కొట్టారు.ఆ క్షణంలో పిల్లలెంత ఉత్సాహంగా ఆనందంగా పాల్గొన్నారో! తరువాత కేకు,లడ్డు ,బిస్కట్స్ పంచారు .
ఈ కార్యక్రమంలో మోదాల నాగరాజు ,పి.వి. ఆనందబాబు ,టి .వి శ్రీనివాస్ ,పువ్వాడ రవిశంకర్, దోగిపర్తి బాబు గొంట్లా శేషగిరి,R.K.G నరసింహం,రంగనాయకులు, ప్రదీప్ పాల్గొన్నారు .
పుట్టిన రోజు,వివాహ వార్షికోత్సవం వంటి వివిధ కార్యక్రమాలను HOSTELS,అనాధ ఆశ్రమాలు వృద్ధాశ్రమాలు వంటి వాటిలో నిర్వహిస్తే వారికి మనకు ఆనందం కలుగుతుంది.మీరేమంటారు ?

Tuesday 24 December 2013
ఈ సహస్రాబ్ది వ్యక్తి (Man off the millennium)
ఎలా ఈయన అంత గుర్తింపు తెచ్చుకున్నాడు అని తెలుసుకుంటే ఆశ్చర్యమేస్తుంది. ఆయన పేరు కళ్యాణ సుందరం. ఆయనది తమిళనాడు రాష్ట్రం.చేసే ఉద్యోగము librarian.భారతదేశంలో అత్యుత్తమ librarian గా కేంద్ర ప్రభుత్వ సత్కారం పొందాడు. ప్రపంచంలోని 10 మంది అత్యుత్తమ librarians లో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఇవన్నీ ఒక ఎత్తు .
45 సం రాల నుండి సంఘసేవకు తన జీవితాన్ని అంకితం చేసాడు.వివాహము చేసుకోలేదు. 30 సం లుగా తన జీతం మొత్తాన్ని సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నాడు.మరి తన ఖర్చులకు డబ్బు ఎలా అని ఆశ్చర్య పోతు న్నారా! ఒక హోటల్ లో సాయంత్రం పనిచేస్తూ వారిచ్చేజీతంతో తన పరిమిత అవసరాలు తీర్చుకుంటాడు.రిటైర్ అయిన తరువాత వచ్చిన 10 లక్షలను సంఘసేవకే కేటాయించాడు.ఈ విషయాలన్నీ తెలుసుకున్న ఓ అమెరికన్ సంస్థ ఈయనను Man of the millennium గా ప్రకటించి 30 కోట్ల రూపాయలను బహుమతిగా అందించింది ఇక చెప్పేదేముంది ఈ మొత్తం కూడా దానధర్మాలకే వినియోగించాడు .
ఈ విషయాలన్నీ గమనించిన రజనీకాంత్ ఎంతో ఆలోచించాడట ఆయన గురించి !అన్నీ ఇచ్చే చెట్టు గొప్పదా! చెట్టుని రక్షించేవాడు గొప్పవాడా! ఈ ఆలోచన తర్వాత రజనీకాంత్ మనసులో ఆయన ఓ జైన విగ్రహంలా ఎదిగారట కల్యాణ సుందరం గారిని తన తండ్రిగా రజనీకాంత్ స్వీకరించారు.
డబ్బు ఎంతున్నా తల్లిదండ్రులను ఆదుకోవడానికి అవేవీ పనికిరావు వారిని మనమే చూసుకోవాలి అన్న సందేశం ఈ దత్తత లో మనకు అర్దమవుతుంది.
(ఈ కథనం ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలోనిది .వారికి ధన్యవాదాలు )
Sunday 15 December 2013
దేవుడి భాషను చెప్పిన కుర్రాడు
చిన్న జ్వరానికి,జలుబుకే కంగారు పడిపోతాం. కానీ అమెరికాకు చెందిన Myatee stepaneck నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. అతని 13 ఏళ్ళ జీవితంలో సాధించిన విజయాలు 1)అతడు వ్రాసిన కవితల పుస్తకాలు అమెరికాలో అత్యధికంగా అమ్ముడు పోయిన పుస్తకాల జాబితాలో స్థానం సంపాదించాయి.2)ప్రతిష్టాత్మక మైన మెలిండా ఎ లారెన్స్ పేరిట ఉన్నఅంతర్జాతీయ బుక్ అవార్డు గెలుచుకున్నాడు.3) తన లాంటి రోగుల కోసం దేశ మంతా తిరిగి విరాళాలు సేకరించి ఇచ్చాడు.3)ఎన్నోబహిరంగ సభల్లోపాల్గొన్నాడు,ఎన్నోటి .వి కార్యక్రమాల్లో పాల్గొ న్నాడు 4)అమెరికాలోని ప్రముఖులు అతని మిత్రులు .
పుట్టినప్పటి నుంచి అతనికి ఓ అరుదైన వ్యాధి ఉంది.అది mascular dystrophy . ఈ వ్యాధితోనే అతని అన్నలు చనిపోయారు .చక్రాల కుర్చీ లేనిదే కదలలేడు.వారానికి ఒకసారి రక్త మార్పిడి చేయించుకోవాలి ఊపిరి పీల్చుకోవాలంటే ఒక యంత్రం పనిచేయాల్సిందే!ఆహారం గొంతులోకి గొట్టాల ద్వారా ఇవ్వాలి.ప్రతి రాత్రి నరాల ద్వారా సూదులు తప్పని సరి.ఎన్ని బాధలు !ఎంత కష్టం !
ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది అతడు ఎప్పుడూ ఆనందంగా ఉండడం గురించి !నిరాశకు గురవకుండా అతను వ్రాసిన వేలాది కవితల గురించి.కవితలు కథలు వ్రాసేవాడు. శాంతి,ఆశ ప్రేమ జీవితం ప్రకృతి విచారం వైకల్యం లాంటి అంశాలపై ఎన్నో వ్యాసాలూ వ్రాసాడు. మ్యాటీ ని కలుసుకోవడం నా ఆశయాల్లో ఒకటి అన్నాడు జిమ్మీ కార్టర్.
ఒఫ్రా విన్ఫ్రే ,ల్యారీ కింగ్ లాంటి ప్రముఖులు అతని కార్యక్రమాల్లో పాల్గొన్నారు .
అతని భావాలలో కొన్ని
*దేవుడికి నచ్చిన భాష పిల్లల భాష
*నేను పెద్ద అవుతాననే నమ్మకం నాకు లేదు కానీ పెద్దవ్వాలనే కోరిక ఉంది . నాకు కథలు కవితలు ఇష్టం అందుకే రచయితను అవుతాను
* అందరి జీవితాల్లోను తుపానులు ఉంటాయి దీన్ని అందరు తెలుసుకోవాలి ప్రతి తుపాను తర్వాత మనం ఆడు కోవాలి. జీవితమనే బహుమతి లభించినందుకు మనం ఆనందించాలి.
*మనందరం ఒకే భూమి మీద ఉన్నాం. మన అందరికీ ఒకటే హృదయం ఉంది ఒకే జీవితం ఉంది అందుకే మన అందరం ఒకే కుటుంబం లా ఉండాలి
* నాకు ప్రతి రోజు ఒక బహుమతే! ఎందుకంటే ఎప్పుడు చనిపోతానో తెలియదు.కాబట్టి నాకు బలం దేవుడి నుంచి,అమ్మ నుంచి నాకు ఎదురయిన మనుషుల నుంచి లభిస్తోంది .
చూడండి ఎంత ఆశావాదం! చిన్న విషయాలకే ఆత్మ హత్య చేసుకునే వారు,జబ్బుల బారిన పడి జీవితం పట్ల విరక్తి చెందిన వారు అతని నుండి ఎంతో స్పూర్తి పొందవచ్చు.మ్యాటినీ తన 13 వ ఏట చనిపోయాడు గొప్ప స్పూర్తిని ప్రపంచానికి అందించి.
( ఈ కథనం ఈనాడు పత్రిక లో వచ్చింది.వారికి ధన్యవాదాలు )
Thursday 28 November 2013
అభివృద్ది పల్లవించిన గంగదేవిపల్లె
ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటవుతున్నాయి . ఆ సమావేశాల్లో గంగదేవిపల్లెను గురించి చెబితే బాగుంటుంది.
పల్లెలన్నీ నిరక్షరాస్యత ,జీవన ప్రమాణాల తరుగుదల ,పేదరికం ఆకలి చావులు వంటి సమస్యలతో కునా రిల్లి పోతున్నాయి.వాటికి అతీతమైనదేమీ కాదు ఒకప్పటి గంగదేవిపల్లె.అప్పుడు ఆ ఊరు మద్యం మత్తులో ముని గి తేలుతుంది.రోడ్లు లేవు కరంటు లేదు.ఊరంతా ఫ్లోరైడ్ నీళ్ళు .అధికారులు,రాజకీయ నాయకులు పట్టించు కున్న పాపాన పోలేదు.ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ లోని వరంగల్ జిల్లా,గీసుకొండ మండలంలో ఉంది.
కూసం రాజమౌళి ఆయన మిత్రులు గొనె చేరాలు,చల్ల మల్లయ్య,కూసం నారాయణ పెండ్లి రాజయ్య ఓ జట్టుగా కలిసి ఆ ఊరిని ఆదర్శంగా తయారు చేయాలని సంకల్పించారు.గ్రామ ప్రజల్లో చైతన్యం కల్పించారు.ఆ ఊరిలో బడి లేదు డాక్టర్ లేడు. శివారు గ్రామం,పంచాయతీ కూడా కాదు. మద్యం తో అందరు ఇంట బయటా గొడవ పడుతుండే వారు.నాటు సారా త్రాగి చని పోతుండేవారు.రాజ మౌళి ఆయన మిత్రులు కలిసి ఊర్లో సారాపై నిషేధం విధించారు. ప్రతి ఇంటికి వెళ్లి త్రాగుబోతులకు నచ్చజెప్పారు.సారా contractors వ్యతిరేకించారు.అయినా లెక్కచేయకుండా అభి వృద్ది వైపు తోలి అడుగు వేసారు.1994 లో ఈ గ్రామానికి పంచాయతీగా గుర్తింపు వచ్చింది.
తరువాత నీటి కమిటీని ఏర్పాటు చేసి గ్రామస్తుల చందాలతో రూ 53000 వసూలు చేసి లోడి ,బాల వికాస్
సంస్థల సహకారంతో కుళాయిల ద్వారా నీటి సరఫరా ఏర్పాటు చేసుకున్నారు. టాటా కంపెనీ సహాయంతో ఫ్లోరైడ్ రహిత త్రాగునీరు ఏర్పాటుచేసుకున్నారు.2000 సంవత్సరం సిమెంట్ రోడ్లు ,వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు అయ్యాయి.కానీ ఊరంతా ఆరుబయట మలమూత్ర విసర్జనాలు చేస్తుండేవారు.పారిశుధ్యం పై వారిలో చైతన్యం కల్పిం చారు రాజమౌళి.జరిమానాలు హెచ్చరికలతో ఊరంతా దారికి వచ్చారు.తరువాతి కాలంలో అక్షరాస్యతపై నాటి కలు వేయించి రాత్రి బడులు తెరిపించారు.పది మంది నిరక్ష్యరాస్యుల బాధ్యత ఒక అక్ష్యరాస్యుడికి అప్పగించారు. 2002 నాటికి 100% అక్ష్యరాస్యత సాధించారు.పిల్లలందరినీ బడిలో చేర్చారు .
తరువాత పచ్చదనానికి ప్రాధాన్యత నిచ్చి ప్రతి ఇంటి ముందు ఒక మొక్క నాటేలా తప్పనిసరి చేసారు. మొక్క పెంచకపోతే మంచి నీళ్ళు కట్ చేసారు.ఆ వూరిలో కరంట్ చౌర్యం చేయరు.సకాలంలో బిల్లులు చెల్లిస్తారు. తగాదాలు పంచాయతీలోనే పరిష్కరించుకుంటారు. గ్రామ పెద్దలే తీర్పు ఇస్తారు ఎన్నికల్లో మందు,నోట్ల పంపిణీ నిషేదించారు.1995 నుంచి ఇప్పటివరకు ఏకగ్రీవ ఎన్నికలే ఊర్లో మహిళలే మహారాణులు.1995 నుంచి అందరు మహిళలే వార్డ్ members 14 పొదుపు సంఘాలున్నాయి .కెనడా,బంగ్లాదేశ్ ల నుంచి వచ్చిన సంస్థలు గ్రామ అభివృద్ధిని మెచ్చుకున్నాయి . శిక్షణ కొచ్చిన ప్రతి ఐఏఎస్ కు ఈ ఊరు ఓ పాట్యాంశం. 2005 లో పంచాయతీరాజ్ కమీషనర్ చెల్లప్ప "దేశం లో ప్రతి జిల్లాలో ఇలాంటి గ్రామం ఒకటుండాలి" అన్నాడు .
గ్రామం లో 13 అభివృద్ది కమిటీలు వేసారు. రూపాయికి 20 లీటర్ల మినరల్ వాటర్ సదుపాయం కల్పించారు
2007 లో ఈ గ్రామం దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికయింది . కూసం రాజమౌళి గారు అప్పటి నుంచి సర్పంచ్చ్ గా కొనసాగుతున్నారు.ఈ గ్రామం అగ్రశ్రీ అవార్డ్ సాధించింది.నిర్మల్ గ్రామ పురస్కారం అబ్దుల్ కలాం ద్వారా స్వీకరించారు . వివిధ పార్టీలున్నా ఊరి మంచికోసం అందరూ స్పందిస్తారు .
ఇలాంటి గ్రామాలు దేశమంతా ఏర్పడితే దేశం అభివృద్ది చెందిన దేశంగా మారుతుంది.
(ఈ సమాచారం ఈనాడు ఆదివారం నుండి సేకరించ బడింది .వారికి ధన్యవాదాలు )
Sunday 24 November 2013
స్టీవ్ జాబ్స్ చెప్పిన జీవిత సత్యాలు
సాంకేతిక ప్రపంచానికి రారాజు లా వెలుగొందినా తాను జీవితం లో చూసిన ఎత్తు పల్లాలను తనదైన మాటల్లో ఓ తాత్వికవేత్తలా స్టీవ్ జాబ్స్ చెప్పిన తీరు ఆయన మాటల్లోనే
- "మనిషి జీవితం లోని అన్ని సంఘటనలకు లింక్ లు ఉంటాయి . వాటన్నిటిని కలుపుతూ పోతే అదే భవిష్యత్తు అవుతుంది . అదే జీవిత మవుతుంది . ప్రతి మార్పును ఆహ్వానించాలి.ఆస్వాదించాలి . "
- "జీవితంలో ఎదురుదెబ్బలు అవసరం.ఆత్మ విశ్వాసాన్నికోల్పోకూడదు.చేస్తున్న పనిని ప్రేమిస్తూ ఉండాలి.ఎప్పుడూ ఒకే పనిలో సెటిల్ అయిపోకూడదు . అలా అయిపోతే మనలోని కొత్త ఆలోచనలు బయటికి రావు.జీవితంలో ఎలాంటి మెరుపులు ఉండవు ".
- "ప్రతి రోజు ఇదే నీ ఆఖరి రోజు అనుకోని బ్రతికితే ఏదో ఒకరోజు నువ్వు ఉన్నత స్థానంలో ఉంటావు . "
- "ఈ భూమ్మీద మనుషులందరూ సమానంగా పంచుకునేది ఏదయినా ఉందంటే అది మరణమే .కాబట్టి ఈ ప్రయాణం లో ఎదురయ్యే అవమానాలు,రాగ ద్వేషాలు ,అపజయాలు అన్నీసమానమే".
- "మనం ఏం వదిలేసి వెళ్ళిపోతున్నాం అన్నదే ముఖ్యం.సాటి వారికి ఎంత సాయ పడ్డాం,ఈ ప్రపంచానికి ఏం అందించ గలిగాం,ఎంత ప్రేమను పొందాం అన్నదే శాశ్వతం".
- "connecting the dots,నేను దీన్ని నమ్ముతాను. మన లక్ష్యం బలంగా ఉండాలి.ఎన్నిఅనూహ్య పరిణామాలు ఎదురయినా మనసు కోకూడదు.అప్పుడే ఆ పరిణామాలన్నీ అనుసంధానమై లక్ష్యం వైపు నడిపిస్తాయి ".
Sunday 10 November 2013
ప్రజల ప్రాణాలు గాల్లో!
చార్ ధామ్ యాత్రలోఆకస్మిక వరదల్లో వేలల్లోభక్తులు మరణించారు.భక్తీ పారవశ్యంతో వెళ్లి కుంభమేలాల్లో ఆలయాల్లోతోక్కిసలాటల్లో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.ఆలయాలు,మత సంబంద ప్రాంతాల్లో గత పదేళ్ళలో 1000 మంది ప్రాణాలు కోల్పొయారు.వీటిల్లో నిస్సహాయులైన మహిళలు ,వృద్దులు,చిన్నారులు బలి అవుతున్నారు. వరదలు,తుపానులు వలన మరిన్ని వందల మంది మరణిస్తున్నారు. ఆలయాలకు ఆదాయం పుష్కలంగా వస్తున్నా సురక్షిత ఏర్పాట్ల పై ఏమాత్రం దృష్టి పెట్టక పోవటం ,గత అనుభవాల నుండి పాటాలు నేర్వక పోవటంతో ఈ సంభవిస్తున్నాయి.
ఇవన్నీఒక ఎత్తు అయితే ఇక యముడి నరకలోకానికి దారులా అన్న విధంగా ఉండే మన రోడ్లపై జరిగే ప్రమాదాల్లో ఏడాదికి కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.ఈ మధ్య వోల్వో బస్సులో45 మంది సజీవదహన సంఘటన మనసును కలచి వేసింది.ఈ ఘటన కలిగించిన భయంతో ట్రైన్ లో పొగలు రావటంతో దూకి ప్రాణాలు పోగొ ట్టుకున్న వారెంత దురదృష్టవంతులు.ఇక గౌతమీ ఎక్ష్ ప్రెస్ లో మంటల్లో ప్రాణాలు కోల్పోయిన వారిదెంత విషా దం.ఇక లారీలు,ఆటోలు ,బైక్స్ ప్రమాదాలు లెక్క లేనన్ని ఆగి ఉన్న లారీని డీ కొని ఎన్నో ప్రమాదాలు జరుగుతు న్నాయి.బైక్స్ పై వేగంగా వెడుతూ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు.విజయవాడలో బస్ స్టాప్ లో ఆగి ఉన్న వారిపై కారు వెళ్ళడం వారు చనిపోవడం చూస్తుంటే ప్రజల ప్రాణాల కెంత భద్రత ఉందో అర్థమవుతుంది .
వీటి వెనుక ప్రజలు సరి అయిన జాగ్రత్తలు తీసుకోక పోవటం,డ్రైవర్స్ నిర్లక్ష్యం ట్రాఫిక్ నియంత్రణ సరిగా లేకపో వటం రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించే యంత్రాంగం వైఫల్యం ,త్వరగా గమ్యం చేరుకోవాలనే ప్రయాణీకుల తొందర ఇలా ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయి.
పటిష్ట మైన భద్రతా ఏర్పాట్లు ,ముందస్తు హెచ్చరికలు ,చట్టాలను కటినంగా అమలు చేయటం,ట్రాఫిక్ నిబం ధనల ప్రచారం , లైసెన్స్ ల తనిఖీ, వాహనాలు సరి అయిన స్థితిలో ఉన్నాయో లేదో చూడటం వంటి చర్యల వలన వీలయినంత మేర ప్రమాదాలు తగ్గించవచ్చు.ప్రజలు తమ విలువైన ప్రాణాలు కాపాడు కోవటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవటం ,పకడ్బందీ ఏర్పాట్లతో ప్రయాణం చేయటం ఎంతో అవసరం .

Monday 4 November 2013
పుట్టిన రోజు ఇలా చేస్తే ఎలా ఉంటుంది!
మా చిన్నప్పుడు పుట్టిన రోజు చేసుకున్న జ్ఞాపకాలే లేవు.గుర్తు ఉంచుకుందామనుకుంటూ ఉంటాము. తీరా ఆ రోజుకి మర్చి పోవటం ,18 వ ఏట అనుకుంటా ఓ ఫ్రెండ్ గుర్తుచేసేదాకా ఇలా మరిచిపోవటమే జరిగింది మరి ప్పుడో పిల్లల పుట్టిన రోజులు ఎంతో వైభవంగా జరపటం చూస్తున్నాము.ఘనంగా ఆడంబరంగా జరుపుతున్నారు. ఎంతోడబ్బు ఖర్చు చేస్తున్నారు.చిన్నప్పుడు ఓ 5 లేదా 6 ఏండ్ల వరకు పర్లేదు కానీ తరువాత నిరాడంబరంగా జరు పుకుంటే బాగుంటుందేమో!
ఇక పోతే పుట్టిన రోజు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు.వాటి అమలులో విఫలం అవుతుంటారు .ఇది అంతా మామూలే! ఇక చెప్పేదేమిటంటే ఈ మధ్య మా అమ్మాయి పుట్టిన రోజు ఏదైనా విభిన్నంగాచేద్దామనుకున్నాను. గుర్తు ఉండిపోయేలా!అప్పుడు ఓ ఆలోచన వచ్చింది.ఆ రోజు మొక్కలు నాటితే ఎలా ఉంటుంది అని. కానీ ఎక్కడ నాటాలి ? నాటగానే సరిపోదు వాటిని సంరక్షించాలి. వాటిని పెంచాలి. అప్పుడే కదా ఫలితం.నేను పనిచేసే పాటశాల సరయిన చోటు అని నిర్ణయించుకున్నాక దగ్గరిలో ఉన్న నర్సరీ నుండి 8 కానుగ మొక్కలు తెప్పించి బడి పిల్లలు మరియు మావ్యాయామ ఉపాధ్యాయుడు రామానాయక్ సహకారంతో నాటించాను.ఆయన అప్పటికే చాలా మొక్కలను పెంచాడు.8,9 తరగతుల పిల్లలకు వాటి బాధ్యత అప్పగించాము.ఒక్కొక్కరికి ఒక మొక్క కేటాయించి వాటి సంరక్షణ చూడమని ప్రోత్సాహించాము.అలాగే పిల్లలందరికీ వారి పుట్టిన రోజు నాడు మొక్కలు నాటమని చెప్పాము .
ఇలా మనం ప్రతి పుట్టిన రోజు ఒక మొక్క నాటినా ఈ ప్రపంచానికి ఎంతో మేలు చేసిన వారిమవుతాము.ఓ కల కంటే తప్పు లేదనుకుంటా! ప్రపంచంలో ప్రతి ఏటా 7 వ వంతు జనాభా ప్రతి ఒక్కరు ఇలా ఒక మొక్క నాటినా ఏటా 100 కోట్ల మొక్కలు నాటవచ్చు.అప్పుడు ఈ భూమి మీద నీటి కరువు ,గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉండవేమో!
మీరు కూడా మీ గుర్తుగా ఈ భూమికి బహుమతిగా ఒక మొక్క నాటుతారు కదూ !
Wednesday 30 October 2013
అన్ని గ్రామాలు హివ్రే బజార్ లా ఉంటే ఎంత బాగుంటుందో కదా!
ఆంధ్రప్రదేశ్ లో 3 నెలల క్రితం పంచాయతీ ఎన్నికలు జరిగాయి .నిన్ననే సర్పంచ్ లకు చెక్ పవర్ వచ్చింది .మరి గ్రామాలు ఎలా ఉండాలి?మహాత్ముడు కలలు గన్న గ్రామ స్వరాజ్యం ఎక్కడుంది? సర్పంచ్ ల నాయ కత్వంలో ప్రజలు సమిష్టి కృషితో ఏ విధంగా అభివృద్ది సాగించాలి? అనే విషయాలను మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ జిల్లా నగర్ తాలుకాలోని హివ్రేబజార్ గ్రామాన్నిపరిశీలిస్తే అర్థమవుతుంది.
ప్రపంచంలోని వంద దేశాల ప్రతినిధులు సందర్శించిన పల్లె అది.సర్పంచ్ ఎలా ఉండాలో ప్రజలెలా ఉండాలో ఆదర్శ గ్రామాలు ఎలా ఉండాలో నిరూపించిన గ్రామం ఇది.ఆ వూరి సర్పంచ్ పేరు పోపట్రావు పవార్.ప్రజలు,నీళ్ళు అడవి,జంతువులు ఆయన అజెండా!అంతర్గత శతృవులయిన కరవు ,పేదరికం నిరుద్యోగం,అనారోగ్యం ఇవే కదా ! పల్లెలకు శత్రువులు .వీటిపై మరో స్వాతంత్ర్య పోరాటం చేయాలని పిలుపు నిచ్చాడు జల సంరక్షనే ప్రధాన లక్ష్యం వాన చినుకుల్ని ఒడిసి పట్టుకున్నారు.ప్రభు త్వ నిధులు ఒక్క పైసా దుర్వినియోగం కాకుండా 600 ఇంకుడు గుంతలు త్రవ్వుకున్నారు. checkdam లు కట్టుకున్నారు.పల్లె అంతా బిందు సేద్యమే!నీటి ఆడిట్ పద్ధతిని ఏర్పాటు చేసుకుని గొట్టపు బావులు నిర్మించారు.గ్రామసభలోచర్చించి ఎవరు ఏ ఏ పంటలు వేయాలో నిర్ణయిస్తారు. అన్ని వసతుల గల పాటశాల నిర్మించుకున్నారు.ఒక్క దోమ కూడా అక్కడ కనపడదు .ప్రతి ఇంటికి మంచి నీటి కుళా యిలు,మరుగు దొడ్డి ఉన్నాయి.భూగర్భ డ్రైనేజి వ్యవస్థ ఉంది.ఊరంతా బయో గ్యాస్ తో వంట చేస్తారు.దొంగ తనాలు దోపిడీలు లేవు. మద్యపానం అక్కడ నిషిద్ధం. వ్యాయమశాల,గ్రంధాలయం,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పశు వుల ఆసు పత్రి ఆడిటోరియం ఉన్నాయి.నిధులు ప్రభుత్వానియే అయినా ఇవన్నీ ప్రజలు శ్రమదానం ద్వారా కట్టుకున్నవే! పల్లె బాగుపడాలంటే ప్రజల్లో సమైక్యత ఉండాలి .సహకార స్పూర్తి కావాలి..ఇదే గ్రామీణ భారత ధార్మిక నీతి... ---హివ్రేబజార్ విజయ రహస్యము ..
1989 నుండి ఏకగ్రీవంగా ఎన్నికవుతున్న పోపట్ రావు M.COM. చదివారు.అన్నాహజారెను ఆదర్శంగా తీసుకుని ప్రజల్లో నైతిక విలువలు పెంపొందించారు .సార్క్ సదస్సులో తన అనుభవాన్ని పంచుకున్నారు.వివిధ విశ్వవిద్యాలయాలు,మేనెజ్ మేంట్ స్కూల్స్ లో గ్రామీణాభివృద్ది గురించి మాటలాడారు.మహారాష్ట్ర ప్రభుత్వం golden jubilee india programme క్రింద 300 గ్రామాల్ని హివ్రేబజార్ లా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఆయనకు అప్పగిం చింది జాతీయఅవార్డ్ అందుకున్నారు.రాజకీయ party లు ఆయనకు M.L.A పదవి ఇస్తామన్నా వద్దన్నారు .
మన రాష్ట్ర సర్పంచ్ లంతా హివ్రే బజార్ చూసి వచ్చి ఇక్కడ కూడా అలా చేస్తే బాగుంటుంది కదా!
(ఈ వ్యాసం ఆదివారం ఈనాడు అనుబంధం లోనిది .వారికి ధన్యవాదాలు.)
మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ ను గమనించండి
http://www.rainwaterharvesting.org/Rural/Hirve.htm
Subscribe to:
Posts (Atom)