Saturday, 28 April 2012

మానవ జీవన లక్ష్యమేమిటి?3


             మానవ జీవన లక్ష్యమేమిటి? ఈ  ప్రశ్నతో ఇంతకు ముందు వ్యాసం ముగించాను కదా! వ్యాసంలో  మనకు నష్టం చేసే సంస్కారాలను పేర్కొన్నాను.వాటిలో కొన్ని జన్యుపరంగా వచ్చే అవకాశం కూడా వుంది .ఉదాకోపము అలాగే మంచి సంస్కారాలు కూడా ఏర్పడతాయి. పరిసరాలద్వారా, ఎదురయ్యే సంఘటనల ద్వారా ఎదు ర్కొన్న సమస్యల ద్వారా, తల్లిదండ్రులు నేర్పిన విలు వల ద్వారా ఇవి ఏర్పడుతుంటాయి.
             అవి ప్రేమ,కరుణ,దయ,సహనం ,శాంతి,అహింస,సేవాగుణం ,సర్దుకుపోయే తత్వం,అర్థంచేసుకోవటంఅణకువ ,విచక్షణ కలిగివుండటం,వినయం,వివేకం,త్రుప్తి,ప్రశాంతత నిరహంకారం ,ఆశావాదదృక్పథం, గెలుపు, ఓటములను సమంగా తీసుకోవటం, కుతూహలం ,ఆసక్తి ,పెద్దలను గౌరవించటం ,నిజా యితి,స్వచ్చత,పవిత్రత, స్నేహతత్వం,ఆనందం,మానవత్వం,నైతికత,సత్యమునే పలకటం,క్రమశిక్షణ, జిజ్ఞా,బాధ్యత,అన్వేషణా దృక్పథం   విధేయత,నమ్మకం,సమయపాలన,నిస్వార్థం,మర్యాద ,ప్రశంసించటం,అంకితభావం,పట్టుదల,కృషి,ప్రశాంతచిత్తం మార్పును ఆహ్వానించటం ,ఓపిక,జాగ్రత్త,సున్నితత్వం సోదరభావం,క్షమాగుణం సానుభూతి,జాలి,ప్రోత్సాహంకృత జ్ఞత,అవగాహన,దేశ,వర్ణ,కుల,మత,ప్రాంతాలకతీతమైన మనస్తత్వం (విశ్వమానవ సౌబ్రాత్రుత్వం) వంటివి.వీటిలో కూడా కొన్నిజన్యుపరంగా,జీవితంతో పాటు నేర్చుకునేవి కొన్నివుంటాయి.కానీ ప్రస్తుతం సంస్కారాలు మనుష్యు లలోతగ్గి పోతున్నాయి.
           మనం చేసే చర్యలను బుద్ది ఇది తప్పు,ఇది ఒప్పుఅని చెబుతూవుంటుంది.కానీ దాని మాటను మనసు లెక్కచెయ్యదు.మనిషి వ్యతిరేక సంస్కారాలు ప్రదర్శించటం,అనుభవించటం అలవాటు చేసుకున్నాడు.పై చెప్పిన అనుకూల సంస్కారాలపై నిలబడాలంటే ఎంతో నిబద్ధత కావాలి.బ్రతుకు పోరాటంలో పడి ఇవన్నీ వదిలేసి నష్ట పరచే సంస్కారాలను పెంచుకుంటూ పోతున్నాడు.కాని మనకు తెలియకుండా ఇవన్నీ మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపి రకరకాలైన మానసిక వ్యాధుల రూపంలో దీర్ఘకాలికంగా వస్తున్నాయి.మంచి సంస్కారాలు మనిషికి అద్భుత మైన  ఆరోగ్యాన్నిస్తాయి.చూడండి! పల్లెటూరి వారికి రక్తపోటు,షుగర్,గుండె జబ్బులు,అధిక బరువులాంటి సమస్య  లు చాలా తక్కువగా వుంటాయి .కోరికలు తక్కువ .ఉన్నదానితో సంతృప్తి చెందుతారు.
                         ఇక మనిషి జీవిత లక్ష్యమేమిటి? పాటికే మీకు అర్థమయ్యే వుంటుంది.
            క్షణక్షణం ఆనందంతో జీవించటం.సుఖ,సంతోషాలు బాహ్యమైనవి.ఆనందం అంతర్గత మైనది .అది లోపలి నుండి పెల్లుబుకుతుంది.హృదయము నుండి మనసులోకి వస్తుంది.మంచి సంస్కారాలతో ఆనందం వస్తుంది మనస్సంతా ప్రేమను నింపుకొని వుంటే మనమంతా అన్వేషించే అద్భుతం ప్రత్యక్షమవుతుంది అదే సత్యం.  

15 comments:

  1. చక్కగా చెప్పారండి.

    ReplyDelete
  2. చాలా చక్కని టపా.మనిషి ఎలా ఉండాలో అర్థవంతంగా చెప్పారు.ధన్యవాదాలు రవి గారు!

    ReplyDelete
    Replies
    1. మీకు స్వాగతం.ధన్య వాదాలండి.పాత పోస్టులు కూడా గమనించండి.

      Delete
  3. Replies
    1. ధన్య వాదాలు పద్మార్పిత గారు

      Delete
  4. "పరిసరాలద్వారా, ఎదురయ్యే సంఘటనల ద్వారా ఎదు ర్కొన్న సమస్యల ద్వారా, తల్లిదండ్రులు నేర్పిన విలు వల ద్వారా"...బాగా చెప్పారు.

    ReplyDelete
  5. ధన్యవాదాలండి.ఈ విభాగంలో రెండవ పోస్ట్ చూడండి

    ReplyDelete
  6. రవిశేఖర్ గారు, చాలా బాగా వివరించారు. ఇలా summarize చేసి ఇంత చక్కగా చెప్పటం మీకే చెల్లు.
    "ఇక మనిషి జీవిత లక్ష్యమేమిటి?ఈ పాటికే మీకు అర్థమయ్యే వుంటుంది.క్షణక్షణం ఆనందంతో జీవించటం.సుఖ,సంతోషాలు బాహ్యమైనవి.ఆనందం అంతర్గత మైనది " నిజమే! చక్కగా conclude చేసారు. Thank you!

    ReplyDelete
  7. ఆనందం అనుభవిస్తేనే తెలుస్తుందండి.ఇంకా ఆనందం గురించి,సత్యం గురించి చాలా చెప్పాల్సింది వుంది.మీ పరిశీలనాశక్తికి అభినందనలు.అలాగే ధన్యవాదాలు. వెన్నెల గారు!

    ReplyDelete
  8. machi vishleshana chesaru... thank you

    ReplyDelete
    Replies
    1. స్వాగతం మరియు ధన్యవాదాలు .

      Delete