Sunday, 22 April 2012

మన మనసులో విభిన్న సంస్కారాలు(ముద్రలు)ఎలా ఏర్పడతాయి?1ఒక సారి అందరం బాల్యం లోకి వెళ్లి వద్దామా!ఒక సారి ఆలోచించండి .అప్పుడు మన మనస్సులు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా వున్నాయి? కదా!ఎంత తేడా ! అసలు ఎటువంటి కల్మషాలు లేకుండా స్వచ్చంగా ,స్వేచ్చగా , బాధలు,భయాలు కష్టాలు లేకుండా రోజు పనులు ఆరోజు చేసుకుంటూ వర్తమానాన్ని ఆనందంగా అనుభవిస్తూ ఆడుకుంటూ, స్నేహితులతో నవ్వుతు ,త్రుళ్ళుతూ ,కబుర్లు చెబుతూ ,సాయంత్రం చదివినంత చదివి ప్రశాంతం గా గాఢ నిద్ర పోయి ఉదయాన్నేఆనందంగా నిద్ర లేస్తాము.ఎక్కడా ఇప్పుడు మనకున్న రకరకాలయిన లక్షణాలు అప్పుడు ఏమీ లేవు.మన జీవితం లో చదువు ఒక భాగం మాత్రమే! అన్ని విషయాలు మన బాల్యం లో ప్రధాన పాత్ర పోషించేవి.ఉమ్మడి కుటుంబాలు,పంటచేలు,పిల్లకాలువలు, ఊరి రచ్చబండ, హరి కథలు,బుర్రకథలు,తెర సినిమాలు,తోలుబొమ్మలాటలు,పండుగలు ఇలా ఊరంతా సందడిగా వుండేది.పట్టణాల్లో కూడా పదిహేను ఇరవై సంవత్సరాల క్రిందట  క్రిందట ఇంత వేగవంతమైన జీవితం లేదు.
          విషయమేమంటే మన బాల్యం లో మన మనసు పరిస్థితి ఏమిటి !ప్రస్తుతం మనం ఎలా వున్నాం.మధ్యలో మన మనసుకే మయింది.పదవ తరగతి వరకు పల్లెల్లో వున్నాం ఇంటర్ కు పట్టణాల్లోకి వచ్చాం.ఇంటర్లో కూడా చదువు,సినిమాలు,ఆటలు అన్ని కలిసి ఉండేవి రోజుల్లో కాలేజీ లలో ప్రేమలు అంతగా లేవు.అమ్మాయిలతో మాట్లాడాలంటే నే సిగ్గు.ఇక ప్రేమలు కూడానా!అసలు ఇంటర్ పూర్తి అయ్యేలోపు ఒకటి రెండు మాటలు మాట్లాడితే గొప్ప.అలాగే డిగ్రీ లో అప్పుడప్పుడే చిరు ప్రేమలు అక్కడా ఇక్కడా కనిపిస్తుండేవి .ఎక్కువ స్నేహితులతో గడపటం సరదాగా సినిమాలు అలా అలా గడిచిపోయింది.కాని ఇక్కడే ఎవరికయినా కొన్ని అనుభవాలు నమోదవుతాయి. .స్నేహితులతో మన ప్రవర్తన,ఒకోసారి స్నేహితుల దూరం ,అమ్మాయిలతో సరదాగా మాట్లాడటం స్నేహం అనుకోవ టం,తరువాత ప్రేమ అనుకోవటం, ఒకవైపునుండే ఆరాధించడం ,చెప్పలేకపోవటం ,డిగ్రీ అయిపోవటం చివరికి ఏమి కాకుండా పోవటం . ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని అనుభవాలు.ఇక డిగ్రీ తరువా ఉద్యోగ ప్రయత్నాల్లో కష్టా లు మొదలవుతాయి.అప్పటి దాకా వున్న ప్రపంచం వేరు ఇక పోటీ వాతావరణం లోని ప్రపంచం వేరు.ఇక్కడి నుండి ఉద్యోగం సంపాదించుకోవటం  వరకు ఒక దశ ! .  దశలో  మనకెన్నో  సమస్యలు ,ఆర్ధిక  పరమైనవి మానసిక పర మైనవి స్నేహం ,ప్రేమలు మనల్ని వెంటాడుతుంటాయి.సరే అందరు ఏవో ఒక తిప్పలు పడి ఉద్యోగంసాధించు కుంటారు  .
          ఆకష్టాలు,ఇబ్బందులు,ఎదురయ్యే చెడు పరిస్థితులు ఇవన్నీ కలిపి మనలో రకరకాలైన అనుభవాల ముద్ర లు, మనకు విభిన్న వైఖరులు ఏర్పడే విధంగా చేస్తాయి ఉద్యోగం వస్తుందో రాదో అని భయం, ఆందోళన, భవిష్యత్తు తలచుకొని దిగులు,మానసిక ఒత్తిడి అందులో డబ్బు కోల్పోయేవారు,లంచం ఇచ్చి మోస పోయే వాళ్ళు కోచింగ్ లకి ఎంతో డబ్బు ఖర్చు కావటం ఇలా ఎన్నో సమస్యలు వేధించి వుంటాయి.ఇక విదేశాలకు పోయేవారి కష్టాలు,వీసాల కోసం తిప్పలు ఇవన్నీ ఒక జీవితానికి సరిపడా అనుభవం వచ్చేస్తుందిఉద్యోగం దొరికితే ఓకే .దొరక్కపోతే మరింత ఇబ్బంది.ఏదో ఒక వ్యాపారం,వ్యవసాయం లాంటి స్వయం ఉపాధి పనుల వైపు మళ్లుతారు.
         ఇక అసలు సమస్య మొదలు.వివాహం. ముందుగా ప్రేమించుకున్న వారు ఉద్యోగం రాకుండానే పెళ్లి చేసు కుంటారు,కొందరు ఉద్యోగం వచ్చాక చేసుకుంటారు.ఇక పెద్దలు ఒప్పుకోకపోతే ఇంటినుండి వెళ్లి పోయే వారు మరో రకం!పెద్దలు కుదిర్చిన సంభంధాలు చేసుకునేవారు, ప్రేమించుకొని పెద్దల అంగీకారం తో చేసుకునేవారు , ప్రేమ విఫలమై వేరేవారిని వివాహం చేసుకునేవారు ,జీవితాలను అంతం చేసుకునే వారు .జీవితంలో వివాహం  అసలు చేసు కోని వారు ఇలా రకరకాలుగా వుంటారు . ఎక్కువభాగం  వివాహం చేసుకొనే వారే !ఇంత  వరకు   ఏర్పడే అనుభవాల ముద్రలు ఒకరకం ,ఇక జీవితం లో ఏర్పడే అనుభవాల ఆధారం గా ఏర్పడే సంస్కారాలు ఒకరకం .
  అవి వచ్చే వ్యాసం లో వివరిస్తాను. 

2 comments:

  1. రవిశేఖర్ గారు, చాలాబాగుంది.
    బాల్యం, తర్వాత టీనేజ్,తర్వాత బాధ్యతల బరువు, ప్రేమ, స్నేహం, వివాహం... అన్ని అలా flow lo....Nice!

    ReplyDelete
  2. వాస్తవానికి ఇది "మనం మానసిక ప్రయోగాలు చేద్దామా?"అన్న వ్యాసానికి ముందు రావలసింది .దీని తరువాతే మిగతా వ్యాసాలూ మొదలు కావాలి .ఇక దీని తరువాత చాలా అంశాలు ప్రస్తావనకు వస్తు వుంటాయి.వెన్నెల గారు మీ స్పందనకు,అభినందనకు అభివందనం.

    ReplyDelete