ఇక చివరగా మనసంటే ఏమిటి?మనమేగా !రెండు ఒకటేగా !అంటే తనకు తాను ఓదార్చుకొని తనకు కలిగిన జ్ఞాపకాన్ని తనే మరచిపోవాలి.దానికి మన మనసు తో కొన్ని ప్రక్రియలు నిర్వహించాలి .జ్ఞాపకాన్ని వదలటానికి దాన్ని పట్టుకునేదేది?బాధ! అదిఎక్కడ కలిగింది మన మనుకుకుంటాము. హృదయానికి గాయం అయింది !మన స్పందనలు,మన సున్నితత్వం హృదయానికి సంబంధించిన వే, కాని విచక్షణ బుద్ధికి సంబందించినది హృదయపు బాధకూడా మనసు బాధకూడా మనసు సరిచేయాల్సిందే! అంతవరకు o.k కదా!ఇది అంతా ఆలోచించండి బాగా.నాకు లానే మీరు ఆలోచించాలని లేదు.నేను ఒక కోణాన్ని మీకు పరిచయం చేస్తున్నాను.మీకు మరిన్ని కొత్త ఆలోచనలు రావచ్చు.
పరిష్కారం దిశగా అడుగులు వేద్దాం.ప్రతి మనిషి తనకు తాను పూర్తిగా విభిన్నం మన ఆలోచనలు, అభిప్రాయాలు అభిరుచులు ప్రవర్తన మనకే సొంతం.తల్లి,తండ్రి ,భార్య ,భర్త పిల్లలు ,స్నేహితులు బంధువులు ఎవ్వరు నీవు కాదు..ఇంకా కఠినంగా చెప్పాలంటే నీవు ప్రేమించినవి, ఇష్టపడ్డవి, పెంచుకున్నవి, పంచుకున్నవి ప్రతిది కూడా నీలాగే వేరేవారికి వుండాలని లేదు కాలం వాటినన్నిటిని తుంచి వేస్తూ ముందుకు పోతుంటుంది .నీవు పెంచుకున్నంత మమకారం వారికి నీ ఫై వుండదు . ప్రేమికులు వైవాహిక జీవితం లో పెళ్లికి ముందు సాంద్రతను అనుభవించ గలుగు తున్నారా !మనం పొందిన అనుబంధాల్లోని గాఢతలు ప్రస్థుతం ఏ సంబంధాల్లో లేవు .కాని గతం మన ఊహల్లో వుంటుంది .గతం మన జీవితం లో నిజం గా వర్తమానం అయ్యుంటె ఖచ్చితంగా ఈ వర్తమానానికి మరో గతం తోడవుతుంది ..కఠినంగా చెప్పినా వాస్తవ మిదే !ఇకపోతే మన హ్రుదయ సమ్మతి లేకుండా ఏ ఒక్కరు,ఏ ఒక్క విషయం మనల్ని బాధించలేవు గాయం కలిగించిన వ్యక్తులు పశ్చాత్తాపపడి వుండవచ్చు .కొంతమంది మీకు విచారం వ్యక్తం చేసి వుండవచ్చు . మరి కొంత మంది మీకు తెలియకుండానే మిమ్మల్ని తమ మనసులోనే క్షమాపణలు కోరివుండ వచ్చు.అంటే వారు మారి ఉండవచ్చు .సన్నిహితులు ఎలాంటి మార్పుకు లోనైతే మనం ఆ గాయాలను మరచి పోవటానికి కొద్దిగా క్షమ వుంటె చాలు.స్నేహితులు అలా దూరమైతే మరల కలవక పోయినా మనసులోనే వారిని క్షమించేసుకొని బాధనుండి విముక్తి చెందవచ్చు.ప్రతి జ్ఞాపకాన్ని మన మనసు పొరల పై నుండి శుభ్రం చేసుకునేందుకు క్షమ ఒక ఆయుధం.
ఇంకొకటి కలవ లేనంతగా దెబ్బతిన్న సంబంధాలు పునరుధ్ధరించ లేక పోయినా ఆ దెబ్బ మనసు నుండి తుడిచి వేయటానికి మరో ఆయుధం వుంది గమనించండి .మన జీవన ప్రయాణం లో అందరు మనకు పరిచయం అయిన వారే !(బంధువులతో సహా).కాని చివరివరకు మనకు మనమే తోడుగా వుంటాము .ఇది రైలు ప్రయాణం ఎక్కుతుంటారు ,.దిగుతుంటారు .మరణం వరకు మనకు తోడు మన మనసు మాత్రమే వుంటుంది .ఇతరులకోసం ,వేరెవరికోసమో ,ఏవో సంఘటనల నుంచో దాన్ని మనం వారి ఆలోచనలతో ,బాధలతో నింపి మన మనసును వారికి, బాధలకు అప్పజెప్పేబదులు మన మనసును మన స్వాధీనం లో వుంచుకుందాము .దాన్ని శుభ్రం చేసుకుంటే ఆ అద్దం పై మనకు మనం మరింత కొత్తగా కని పిస్తాము .మన ముఖం లో మరింత వెలుగు వస్తుంది .ఇది ఎవరికోసమో కాదు,పూర్తిగా మన కోసమే .అప్పుడు ఆ మనస్సు చిత్రం పై వర్తమానం లో ని ప్రతిక్షణం ఓ ఆనంద గీతాన్ని లిఖించుకుందాము.మన విషాదాలకు మరొకరు కారణం కాకూడదు .అలాగే మనం మరొకరి విషాదాలకు మూలం కాకూడదు .మన ఆనందం మన చేతుల్లోనే వుంది.అప్పుడు మాత్రమే మనం ఇతరులకి ఆనందాన్ని ఇవ్వగలం.అప్పుడు చూడండి !మన జీవితాల్లో ప్రతిక్షనం ఓ సజీవ నిత్య చైతన్యం తాండవిస్తుంది .అది అవతలి వారికి కూదా ఓ అధ్భుతం లా తోస్తుంది .వారిలో మార్పు వస్తుంది .వెంటనే రాకున్న క్రమేపి వస్తుంది .కాని మనం మాత్రం వర్తమానాన్ని క్షణక్షణం మనకోసం ఆనందంగా గడపవచ్చు .ఆలోచించండి .
బ్రతుకు బాటను నిర్దేశించేది పిడికెడు మనసే అని చెపుతున్నారు. నిజమే!!
ReplyDeleteపిడికెడు మనసులో మన జీవితమంతా ఇమిడి వుంది .శోధించండి.అద్భుతమయిన జీవితం ఆవిష్క్రుతమవుతుంది.
Deleteప్రయత్నిస్తే సాధ్యం కాదంటారా!!!:-)
ReplyDeleteమీ ఇంగ్లీష్ బ్లాగు చూసాను మీరు చాలా లోతయిన ఫీలింగ్స్ తో వ్రాస్తున్నారు.ఈ వ్యాసం మీకు స్పష్టత నిచ్చింది అనుకుంటా!
Deleteబాగా వ్రాస్తున్నారు! ఒకసారి నేను కూడా మనసు గురించి వ్రాయటం జరిగింది నా అభిప్రాయాలను ఇక్కడ చదవండి!
ReplyDeletehttp://navarasabharitham.blogspot.mx/2011/07/blog-post_31.html
వెన్నెల,పద్మార్పిత,రసజ్ఞ గార్లకు ధన్యవాదాలు.ఎవరికి అయినా సాధ్యమే.రసజ్ఞ గారు మీ వ్యాసం చూస్తాను .
ReplyDeleteపరిష్కారం వైపుగా అడుగులు వద్దాం..చాలా సమస్యలకు ఈ దారిలో సమాధానం దొరుకుతుంది. చక్కగా వివరించారు.
ReplyDeleteపరిష్కారమంతా మన మనసులోనే వుంది.ఆ తాళం చెవిని కనుగొనడం లోనే వుంది జీవిత రహస్యం.మీ స్పందనకు ధన్యవాదాలు.
Deleteచాలా బాగా రాసారు .
Deleteధన్యవాదాలు.స్వాగతం మాలా కుమార్ గారు !
Delete