Thursday, 12 April 2012

చిన్నారి పాపలు


చిన్నారి పాపల   చిలిపి నవ్వులు 
మురిపించే చిలిపి చేష్టలు 
స్వచ్చమయిన  వారి మోము 
వారిని వీడి మేముండ లేము 
     బోసి మాటల మా బుజ్జి రూపాలు 
     మా పాలిట  మరువ లేని కల్ప వృక్షాలు 
     సొట్టలు పడే మా పాప బుగ్గలు 
     చూడాలనిపించే చిన్ని నడకలు 
అలరారే ఆనందాల వలయాలు 
కురిపిస్తారు చిరునవ్వుల జల్లులు 
పాల వెన్నల లాంటి పాప పళ్ళు 
గంతులేసే లేడి కూనల్లాంటి పాదాలు 
     చక్రాల్లాంటి అందమయిన కళ్ళు 
     మాకు కలకాలం వారి తీపి గుర్తులు 
     కమ్మని లాలి  పాటలకు వారి సంతోషాలు 
     కల్మషం లేని బంగారు హృదయాలు 
     మా భవిష్యత్ ప్రతి రూపాలు

4 comments:

 1. save Girl child.. ki andamgaa..anubandam gaa mee ee post baagundi.

  ReplyDelete
  Replies
  1. ప్రతి ఇంట్లో ఓ ఆడపిల్ల ఉండాలండి .అప్పుడే మగవాడికి తన అమ్మ గుర్తొస్తుంది .అలాగే అమ్మాయిలు చూపించే ప్రేమ అబ్బాయిలు తమ తల్లి దండ్రుల మీద చూపించరేమో అనిపిస్తుంటుంది .మీకు thanks .

   Delete
 2. మీరిచ్చిన మెయిల్ ద్వారా మాలికలో చేరాను. స్పందనకు, సహాయానికి ధన్యవాదాలు వెన్నెల గారు!

  ReplyDelete