ఆకాశంలో చందమామ ను చూపిస్తూ
బిడ్డకు
గోరుముద్దలు తినిపించే ఆమెను చూస్తే
అమ్మను
చూడాలనిపిస్తుంది!
పరుగెత్తుకెళ్ళి
అమ్మ కాళ్ళఫై వాలాలనిపిస్తుంది
తడబడు
అడుగులతో నడుస్తున్న బాబును
ఎంతో
ప్రేమ తో పట్టుకొని నడిపిస్తున్న
ఆమెను చూస్తే
మరొక్క
సారి అమ్మ చిటికెన వ్రేలు
పట్టుకొని నడవాలని పిస్తుంది
అమ్మ
ఒడిలో ఆనందంగా ఆడాలనిపిస్తుంది.
చలికి
మునగ తీసుకొని పడుకొని వున్నబాబుకి
సవ్వడి
లేకుండా దుప్పటి కప్పుతున్న ఆమెను చూస్తే
అమ్మ
కడుపులో వెచ్చగా నిదుర పోవాలనిపిస్తుంది
పరుగెత్తుతూ గెంతులేస్తున్న పిల్లాన్ని బెదిరిస్తూ
దారిలోకి తెచ్చుకొంటున్న ఆమెను చూస్తే
అమ్మ
చేత మెత్తని దెబ్బలు తినాలనిపిస్తుంది
అమ్మ
అంటే కమ్మనైన పాట
అమ్మ
అంటే అమృతపు ఊట
నా సందేశం తన కందిందేమో ఆకాశం లో
అమ్మ రూపం చేతులు
చాచి ఆహ్వానిస్తున్నట్లుంది
ఇంత ప్రేమ నామీద చూపించి
అక్కడున్నావమ్మా !
నా మది నదిలో నీ
ప్రేమ రాగం పలుకుతోంది
నీ ప్రేమ నన్నెంత వాణ్ని
చేసిందో తెలుసామ్మా
నీ కొడుకు కుబేరుడయ్యాడమ్మా!
నీ ప్రేమను నా జన్మభూమి ఫై
చూపిస్తూ
ఆకలి
కేకలు లేకుండా చేస్తున్నాను.
వ్యాధులు లేని సమాజానికి
అంకురార్పణ చేస్తున్నాను
మహోన్నతమైన నైతిక విద్య నందిస్తున్నాను.
జన్మ భూమి సేవతో నీ ఋణం తీర్చుకుంటున్నాను
నా జన్మభూమిలో నా
పేరెంత మార్మోగినా
నా జన్మభూమంతా
నా వెంటే ఉన్నదన్నా
అది నువ్వు చూపించిన ప్రేమ వల్లనే నమ్మా
PMKM Fine arts ,Ongole వారు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన "అమ్మ ప్రేమ గుర్తు వుంటే జన్మభూమి మీవెంటే !"అనే కవితా పోటిలో రెండవ బహుమతి పొందిన కవిత .
very nice. Congrats sir.
ReplyDeleteమీ అభినందనకి ధన్యవాదాలు.
ReplyDeleteచాలా బాగుంది రవిశేఖర్ గారు!
ReplyDeleteథాంక్స్ అండి.ఈ మధ్య మీరు ఏమీ వ్రాయలేదు.మీకు చిన్న సలహా!అమెరికా జీవన విధానం అక్కడి మీ అనుభవాలు ,అక్కడి ప్రదేశాల గురించి మీరు ఎందుకు వ్రాయ కూడదు.
ReplyDeleteపది రొజుల క్రితం రాసాను, మళ్ళి రాయలేదు అని ఈ వీకెండే అనుకున్నాను. తప్పకుండా వీలు చూసుకుని రాస్తాను రవిశేఖర్ గారు. మీ అభిమానానికి ధన్యవాదాలు.
DeleteCongrats Ravisekhargaru....
ReplyDeleteGood one.
అభినందనలండీ రవిశేఖర్ గారూ..కవిత బావుంది.
ReplyDeleteపద్మార్పిత , జ్యోతిర్మయి గార్లకు ధన్యవాదాలు.ఈ పోటీని హైదరాబాద్ రవీంద్ర భారతి లో నిర్వహించి స్టేజి ఫై షూటింగ్ చేసారు.చాలా కాలం క్రితం లెండి.
Deleteపద్మార్పిత్,జ్యోతిర్మయి గార్లకి మీరు పది మంచి అలవాట్లు చదివారా!ఒకసారి చదవండి.
Delete"అమ్మకు".. ఓ అద్భుత అక్షర నివాళి మీ యీ కవిత. . మీ యీ కవిత పొందిన గుర్తింపునకు అభినందనలు....sreyobhilaashi ..Nutakki Raghavendra Rao.(Kanakambaram.)
ReplyDeleteస్వాగతం!ధన్యవాదాలు మీ ప్రశంస కి.మనం dec10 2012 bloggers మీటింగ్ లో కలిసాము .తరువాత మీ సైట్ చూసాను .వ్యాఖ్య వ్రాస్తే సిస్టం లో ఏదో సమస్య .అలా ఇప్పటికి కుదిరింది .
ReplyDelete