Tuesday 24 April 2012

మన మనసులో సంస్కారాలు ఎలా ఏర్పడతాయి ?2


                వ్యాసం లోని మొదటి భాగం లో చెప్పిన దశ లోపే చిన్నప్పటి స్వచ్చత,సున్నితత్వం ,స్వేచ్చ,ఆనందం సగం కోల్పోతాము.ఇక వివాహ జీవితం,తల్లిదండ్రుల పోషణ ,పిల్లలు, ఆర్థిక పరిస్థితులు ఎన్నో వస్తాయి.ఇద్దరు ఉద్యో గం చేస్తే వచ్చేవి ,చేయకపోతే వచ్చేవి,ఆఫీసులలో,పొరుగువారితో స్నేహితులతో ,బంధువులతో  వచ్చే సమస్య లు ఇలా మొత్తం జీవితంలో బాధ్యతలు,బంధాలు.సమస్యల సుడిగుండంలోమనిషి పూర్తిగా కూరుకుపోతాడు .పెళ్ళయి న కొత్తలో సరదాగా వున్నా పిల్లలు,వారి ఆరోగ్యాలు ,వారి పెంపకం పెద్ద సమస్య.వారు బడికి పొయ్యే  దశ కు వచ్చే సరికి ఫీజులు,వారి చదువు సమస్య . లోపు సంసార జీవితంలోని మధురిమలు తగ్గి సమస్యల బరువు పెరిగి రకరకాలైన మానసిక లక్షణాలు మనిషిలో స్థిరపడి పోతాయి
         అవి భయం ,ఆందోళన,ఒత్తిడి,అనుమానం అసహనం,విసుగు,బద్ధకం,అలసట, ఆరోగ్యం గురించి చింత అరిష డ్వర్గాలయిన  కామ,క్రోధ,లోభ,మోహ,మద మాత్సర్యాలు,ఈర్ష్య,అసూయ కోపం,ద్వేషం పోటీతత్వం, అసంతృప్తి అశాంతి ,ఘర్షణ,పెనుగులాట,ఒంటరితనం,నైరాశ్యం,ప్రేమరాహిత్యం ,బ్రతుకు పోరాటం,గందరగోళం,వైషమ్యాలు ఆగ్రహం, నేను అనే అహంకారం,ఆధిక్యతా భావన ,న్యూనతా భావన, కపటం,మోసం చేయటం,కోర్కెలు, సుఖాసక్తి భీతి,అభద్రతా ,వేదన, నటన,అబద్దాలాడటం,చాడీలు చెప్పటం,ఇతరులను విమర్శించటం(ప్రత్యక్షంగా పరోక్షంగా) ఇతరుల వినాశనాన్ని కోరటం,ఇతరులకు హాని చేయటం,అవినీతి,ఆశ్రిత పక్షపాతం,లంచం తీసుకోటం,ఇవ్వటం హింస ,క్రౌర్యం ,రాగ భావోద్వేగాలు, వంటి అనేక రకాలైన మానసిక లక్షణాలు మనలో స్థిర పడి పోతాయి.మరి    చిన్నప్పటి కల్మషం లేని స్వచ్చమైన ,స్వేచ్చ కలిగిన పై చెప్పిన లక్షణాలు ఏవీ లేని మనసును పొందటం ఎలా?మనసు వాటన్నింటిని వదిలి ఉండ లేదా?
          అటువంటి మార్పు మనసు కోరుకుంటుందా!జీవితపు పరుగు పందాన్ని ప్రతి మనిషి ఎన్నోకోరికలు ఆశ లు ,ఆకాంక్షలతో మొదలు పెడతాడు.కొంత మంది తమ లక్ష్యాలను చేరుకుంటారు.కాని లక్ష్యం చేరుకున్న వారైనా ,చేరని  వారయినా ఎక్కువ శాతం జీవితాన్ని మాత్రం మధ్యలో కోల్పోతారు.ఎందుకిలా జరుగు తోంది తన జీవి తం తనకు కాకుండా పోయినతర్వాత మనిషి ఎందు కోసం ఇన్ని సమస్యలతో ఇంత బాధతో దిగులుతో జీవితా న్ని గడుపుతున్నాడు?మరణం వరకు ఇదే స్థితిని అనుభవించాలా ?మరి మనకి ఏ  స్థితి కావాలి?
            మానవ జీవిత లక్ష్య మేమిటి?దాని కంటే పెద్ద ప్రశ్న?మన(నీ,నా)జీవిత లక్ష్యమేమిటి ?తరువాతి  వ్యాసం లో ఈ  విషయాలు చర్చిద్దాము.

2 comments:

  1. రవిశేఖర్ గారు మీరు మొత్తం 47 మానసిక లక్షణాలు లిస్ట్ చేసారు తెలుసా మీ ఈ ఫోస్ట్ లో...
    బాగుందండి!

    ReplyDelete
  2. ఓహ్ !అలాగా!ఇంకా వుండే వుంటాయి.మీ పరిశీలన చాలా నిశితంగా ఉన్నట్లే .అలాగే నా మరో బ్లాగు విజ్ఞానశాస్త్రము కూడా గమనించండి .అక్కడ మన విశ్వానికి ,మానవజీవితానికి సంబంధించిన విషయాలు వుంటాయి http://cvramanscience.blogspot.in ధన్యవాదాలు.

    ReplyDelete