ఏకాంతంలో మనలో ఏం జరుగుతుంది?మనకు మనం దగ్గరగా ఉంటాము.మన మనసు మన గురించే ఆలోచిస్తుంది.మన లోపలి ప్రతి ఆలోచన,భావం మనకు స్పష్టంగా అర్థమవుతుంటాయి.ఇంకా ఏం చేస్తే బాగుంటుం ది.ఏకాంతంలోమనం మన అంతరంగాన్నిశోధిస్తూ వెళ్ళాలి ఆ సాధనలోమనకు మనం పూర్తిగా అర్థమవుతుంటాము ఈ ప్రక్రియలో ఎప్పటినుంచో మన మనసులోని సంస్కారాలు,వికారాలు,మన ప్రవర్తన,మన అలవాట్లు,మనం చేసిన పనుల్లోని మంచి చెడ్డలు,మన గుణగణాలు,మన బలాలు,మన బలహీనతలు,మన లోటుపాట్లు వంటి వన్నీ అలా వరుసగా అలలు అలలుగా ఆ యాత్రలో మనకు దర్శన మిస్తాయి.ఎటువంటి విశ్లేషణలు చేయకుండా,ఎటువంటి తీర్పులు ఇవ్వకుండా వాటిని గమనిస్తూ ఉంటె మనకు మనం మరింత అర్థమవుతుంటాము.
జీవన ప్రవాహంలో మనం ఎటు వైపు వెడుతున్నామో కూడా మనకు తెలుస్తుంటుంది.ఆ ప్రక్రియలోమనం ఇంతకు ముందు ఎవరిన యినా అనాలోచితంగా అన్న మాటలు,ఎవరినయినా ఇబ్బందులకు గురిచేసే పనులు చేసి ఉన్నాఅన్నీగుర్తొస్తాయి.మన మనసులో పేరుకుపోయిన ఎన్నోసంఘటనలు,అవి కలిగించిన ప్రభావాలు,వాటికి మన ప్రతిస్పందనలు అన్నీ తెరపై ప్రత్యక్షమయినట్లుగా మనకు కనిపిస్తాయి.వాటిని అలాగే గమనిస్తే అందులోని సంక్లిష్టత లు మెల్లగా తొలగి పోతుంటాయి.మన జీవితంలోని ఎన్నో సమస్యలు,కష్టాలు,కన్నీళ్లు బాధలు,సుఖ సంతోషాలు ఒక టేమిటి?మన ప్రతిస్పందనలన్నీ మనకు పునర్దర్శన మిచ్చి మన అంతరంగం మనకు దృశ్య రూపం లో కన్పిస్తుంది.
ఈ అంతరంగ యాత్రను ఎవరికి వారు చేయాల్సిందే.ఆ యాత్రను ధైర్యంగా మొదలు పెట్టిన వారికే అందు లో వచ్చే మార్పేమిటో అర్థమవుతుంది.ఈ యాత్రకు ఎటువంటి సాధనాసంపత్తి అక్కరలేదు.తమ మనసు లోపలి పొరల్లోకి తామే ప్రయాణించటం.ఈ యాత్ర ప్రతిరోజు జరిపితే మన మనసంతా తేలిక పడుతుంది.ఇది చాలా సాధార ణంగా ఏ స్థితిలో కూర్చున్నా ,పడుకున్నాఅటు ఇటు డాబా పైనో, గార్డెన్ లోనో నడుస్తున్నాచేయవచ్చు.ఇది ఎలాగైనా మన ఏకాంతంలోజరగాల్సిన ప్రక్రియ.దీనికి ఏ విధమైన నియమ నిబంధనలు లేవు.ఎటువంటి ఏర్పాట్లు లేవు ఎప్పు డు కుదిరితే అప్పుడు చేయవచ్చు.దీనికి ఎవరి సహాయము అక్కర లేదు.దీనిని మనకు ఎవరు నేర్పవలసిన పని లేదు.
మానసిక విశ్లేషణ కూడా మన జీవితంలో మార్పుకు ఉపయోగ పడుతుంది.కానీ దాని కంటే ఇది మరింత గా మనకు తోడ్పడుతుంది.ఈ యాత్ర నిత్యం చేస్తుంటే మనం మనకు కొత్తగా,నూతనంగా ఆవిష్కరింపబడతాం.ఆ నూతనమైన,సజీవమయిన మనసుతో కొత్త పరిస్థితులను ఎదుర్కోవటం,కొత్త సంఘటనలకు మన మనసు ప్రతి స్పందనలు విభిన్నంగా ఉంటాయి.ఎదుటి వారికి మనం కొత్తగా కనిపిస్తాము.ఇంటిలో,బయటా మనతోఉండే వారిపై ఈ ప్రభావం పడుతుంది.అందులోనుండే అవగాహనతో కూడిన,స్నేహ పూరిత మైన,ప్రేమతో కూడిన మానవ సంబం ధాలు ఏర్పడతాయి.మనిషి జీవిత మంతా ఇతర వ్యక్తులతో అతని ప్రవర్తన మీదనే అతని వ్యక్తిత్వం అంచనా వేయ బడుతుంది.మనం సంఘ జీవులం కనుక ఈ సంఘంలో అందరితో కలిసి మెలసి మెలగ వలసిందే. ఈ మారిన మన సుతో మన చుట్టూ ఉన్నవాతావరణం మనకు మరింత ఆహ్లాదంగా కనిపిస్తుంది.మన లోని మార్పు ప్రభావం పరిస రాలపై కుడా పడుతుంది.మన మనసులో కలిగే ఆనందం ఇంకొకరికి ప్రసారం అవుతుంది.