విద్యార్ధి దశలో స్నేహం ,ప్రేమ ఈ రెండింటి విషయంలో చాలా మంది ఎన్నోసమస్యల బారిన పడుతుంటారు. చదువు కంటే ఈ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత నివ్వటం వలన ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి.మంచి స్నేహి తులు ఒకరిద్దరు ఉండటంలో తప్పు లేదు కానీ స్నేహం ప్రేమలతో కాలమంతా దుర్వినియోగం చేయటం తగదు. స్నేహితుల మధ్య మనస్పర్ధలతో ఎడం కావటం,అందులో బాధలు ఎక్కు వగా ఇష్ట పడ్డవాళ్ళు దూరం కావటంవంటి సంఘటనల్లోనుంచి విద్యార్థులు ఈ సమస్య బారిన పడతారు అలాగే ప్రేమలు కూడా!స్నేహమో,ఇష్టమోప్రేమో అర్థం కాక అర్థం చేసుకునే సరికి కాలం కరిగిపోయి దూరమై పోయే సరికి బాధతో కూడిన ఒంటరితనానికి లోనవటం జరు గుతూ ఉంటుంది.విద్యార్ధి దశలో ఈ సమ స్యలనుండి బయటపడాలంటే చదువును ఇష్ట పడుతూ,ఉన్నత మైన లక్ష్యం ఏర్పరుచుకొని ముందుకు వెడుతూ ఉంటె ఈ ఇబ్బంది నుండి బయట పడవచ్చు.ఒక వేళ ఈభావనలోఉన్నా తల్లి దండ్రులను ఒక్క సారి గుర్తు చేసుకొని వారికంటే మిమ్మల్ని ప్రేమించే వారు ఎవరు ఉండరని తెలుసుకొని మాన సిక ధైర్యం తెచ్చుకొని కొత్త ఉత్సాహంతో చదువు మీద ఏకాగ్రత పెంచుకోవాలి.ఇలా చదివితే మంచి ఉద్యోగాలు లభిం చటం జీవితంలో ఏదో ఒక రంగంలో స్థిరపడటం వలన నిరుద్యోగ సమస్య దాని లోని బాధలు అనుభవించే పరిస్థితి తప్పిపోతుంది.
ఇక సంసారంలోకి ప్రవేశిస్తున్నప్పుడే జీవిత భాగస్వామిని,సరిగా అర్థం చేసుకుంటూ ఇద్దరు పంతాలకు పట్టిం పులకు పోకుండా పిల్లలను చక్కగా పెంచుకుంటూ ఆనందకరమైన జీవితాన్నిగడపగలిగితే ఈ సమస్యలు రావు అలాగే ఆరోగ్యం పట్ల ముందు నుండి జాగ్రత్త వహిస్తూ ఎవరికి సరిపోయిన వ్యాయామం వారు చేస్తూ ఫలితాలిచ్చేఆరో గ్య విధానాలు పాటిస్తూ వృద్ధాప్యంలో ఏ జబ్బులు రాకుండా మంచానపడ కుండా తమ సంతానం మీద ఆధార పడ కుండా తిరుగుతూనే జీవనయాత్రను చాలించగలిగితే ఆ జీవితం ఎంత అద్భుతం.
ఒంటరితనం నుండి పారిపోవాలని రకరకాలయిన అలవాట్లకు లోనయి జీవితాన్ని నరక ప్రాయం చేసుకునే వాళ్ళెంత మందో! చక్కటి సంగీతం వినటం,నేర్చుకోవడం ,మంచి పుస్తకాలుచదవటం అద్బుతమైన ప్రదేశాలు చూడ టం,ప్రకృతిని ఆరాధించటం ,మొక్కల పెంపకం,తోటపని,సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం,ఏకాంతంలో అంతరంగాన్ని విశ్లేషించుకోవటం ద్వారా ఈ ఒంటరితనాన్ని నుండి బయట పడ వచ్చు.మన అంతరంగాన్నిసానుకూల విషయాల వైపు మల్లిస్తూ వాటిల్లో పాల్గొంటూ ఉంటె ఈ భావనను దూరం చేసుకోవచ్చు.
అదేంటండి రవిగారూ.....మన బ్లాగ్స్ గురించి చెప్పడం మరిచారు:-)
ReplyDeleteనిజమేనండోయి.ఒంటరితనం గా భావించే వాళ్ళు మన బ్లాగులను చూస్తూ ఉంటె మంచి స్నేహితులు,మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి.మీకు నెనర్లు .
Deleteఏ జబ్బులు రాకుండా, మంచానపడకుండా, తమ సంతానం మీద ఆధార పడ కుండా తిరుగుతూనే జీవనయాత్రను చాలించగలిగితే ఆ జీవితం ఎంత అద్భుతం.నిజం . అలా వూహించుకుంటేనే అద్భుతం గా వుంది .
ReplyDeleteమీ స్పందనకు ధన్యవాదాలండి.ప్రస్తుతం వృద్ధాప్యం లో పెద్ద వారు పడే బాధలు చూస్తే అలాగే అనిపిస్తూ ఉంది.
Deleteరవి శేఖర్ గారూ!
ReplyDeleteమీరు ఒంటరితనం నుంచి బైట పడే మార్గాలు బాగా చెప్పారు...
కానీ పద్మ గారి మాటల్లో పడి మన బ్లాగ్స్ చేర్చేస్తున్నారా ఏమిటి????...హహహః
(just kidding...)
@శ్రీ
ఆమె మాటలతోనే కాదు గానీ ఎలా అయినా బ్లాగుల ద్వారా చాలా సానుకూల ధోరణిగల వ్యక్తులతో పరిచయంకలిగింది.ఇంత positive గా బయట సమాజంలో ఉండరండి.అసలు మన బ్లాగులు చూడమన్నా చూడని వారెంతమందో!ఇక్కడ మనస్పూర్తిగా అభినందిస్తారు.ఏదేమైనా ఇదో లోకం .మీకు నెనర్లు.
Delete