అక్షరాలను అస్త్రశస్త్రాలుగా మలచినవాడు
నిశ్శబ్దం లోని శబ్దాన్ని వినేవాడు
అభావం లోని భావాన్నిచూసేవాడు
ప్రకృతి లోని కృతిని పాడేవాడు
అంతరంగ లోతుల్నిస్ప్రుశించేవాడు
ఆనందపు అంచుల్ని తాకేవాడు
పూలపరిమళాన్నిపుటలఫై చల్లేవాడు
పండు వెన్నెలను పగలే చూపించేవాడు
ఇంద్రధనుస్సు లోని రంగుల మర్మం తెలిసినవాడు
చెరకు విల్లును వంచి చెక్కర రసాన్ని గ్రోలేవాడు
చెలి చెక్కిలి ఫై చక్కిలిగింతలు పెట్టేవాడు
ప్రణయం లో ప్రణవరాగం వినిపించేవాడు
కవితా కాంతులతో వెన్నెల కావ్యాలు రచించినవాడు
సౌందర్యం లోని సౌరభాన్ని వెదజల్లే వాడు
శృంగారం లోని రహస్యాలను శోధించేవాడు
ఒక్క పిలుపుతో లక్ష అక్షౌహినులయ్యేవాడు
ఒక్కపలుకుతో సహస్ర శతఘ్నలు పేల్చేవాడు
మనిషి వేదనను ఉచ్చ్వాశించేవాడు
కవితాక్షరాలతో నిశ్వాశించేవాడు
సమస్యల ఫై పర్జన్య శంఖం పూరించేవాడు
అన్నార్తుల పాలిట ఆపన్నహస్తం అయ్యేవాడు
కష్ట జీవుల స్వేదం లో నిర్వేదం తెలిసిన వాడు
కర్షకుల కష్టాన్ని కన్నీటితో పలికించినవాడు
కార్మికుని కడుపాకలిని పసిగట్టేవాడు
కాలం చెక్కే చరిత్రను క్రమబద్ధం చేసే వాడు
ప్రతి ఎద లోని వ్యధలను వినేవాడు
అవినీతిని కవిత్వం తో ఖడ్గ ప్రహారం చేశేవాడు
అంధకారాన్ని చీల్చుతూ వెలుగురేకలు నింపేవాడు
నిజాల నిప్పులు చిమ్ముకుంటూ నింగి కెగరేవాడు
ఇజాల తుప్పు వదిలిస్తూ డప్పు మ్రోగించేవాడు
నిత్యం సత్యాలను ఆవిష్కరించేవాడు
తిమిరం ఫై జ్ఞానఖడ్గం తో సమరం చేశేవాడు