Thursday, 22 March 2012

ఉగాది

తెలుగు వారందరికీ నందననామ సంవత్సర శుభాకాంక్షలు .మనమింత స్వేచ్చగా ,స్వచ్చంగా భావ వ్యక్తీకరణ చేస్తున్నామంటే మన మాతృభాష తెలుగు కారణం.మనకెన్ని భాషలయినా  వచ్చి  ఉండవచ్చు,కాని మన అంతరంగ లోతుల్ని ఆవిష్కరించేది మన మాతృ భాషే!ఆనంద విషాదాలు ,ఆప్యాయతానురాగాలు,ప్రేమాభిమానాలు మన సమస్త భావోద్వేగాలు మన భాష లో ప్రకటించినంత స్వచ్చం గా  వేరే భాష లో ప్రకటించలేమేమో !                                                  
                                       అందుకే ఐక్యరాజ్యసమితి కూడా   ఎవరి మాతృభాష  ను  వారు  పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చింది .ప్రపంచం లోని ఇంత అభివృద్ధికి ,ఇంత నాగరికతకు భాషలే కారణం .మన భాషను మనం కాపాడుకుంటూ ఇతర భాషలను నేర్చుకుంటూ ఆ భాషల్లోకి మన సాహిత్యాన్ని తర్జుమా చేస్తూ వారి సాహిత్యాన్ని మన వారికందిస్తూ ,విభిన్న సంస్కృతుల సంగమానికి మార్గాలు  వెయ్యాలి .అప్పుడు మన భాష లోని సౌందర్యం ఇతర భాషలలోనికి వారి భాష ల లోని మాధుర్యం మనం గ్రోలటానికి అవకాశం వుంటుంది.చాలా మంది పెద్దలు ఈ ప్రయత్నం లో వున్నారు.ప్రపంచ చరిత్ర అంతా  భాషలలోనే ఇమిడి  వుంది.మనం ప్రస్తుతం ఉపయోగించే బ్లాగులు  కూడా భాషా  వికాసానికి బాగా   ఉపయోగ పడుతున్నాయి .THANKS TO GOOGLE.
 

5 comments:

  1. మీకు ఉగాది శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. మీకూ మా "చిన్ని ఆశ" ఉగాది శుభాకాంక్షలు!

    ReplyDelete
  3. రవిశేఖర్ గారూ మీకూ మీ కుటుంబసభ్యులకూ ఉగాది శుభాకాంక్షల౦డీ..

    ReplyDelete
  4. వెన్నెల,చిన్ని ఆశ ,జ్యోతిర్మయి గార్లకు మీ హితులకు,సన్నిహితులకు అందరికి నందననామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలండి.

    ReplyDelete