Friday, 23 March 2012

ఇవన్నీ మీ అనుభవం లోకి వచ్చాయా


పూల పరిమళాన్ని కళ్ళు మూసుకుని మనస్సంతా సువాసన ఫై నే  కేంద్రీకరించి ఎప్పుడయినా ఆఘ్రానిం చారా !
ఉషోదయాన కన్నులు నిలువెల్లా తెరిచి ఆకసపు అరుణ కాంతిని  ఆస్వాదించారా
సంధ్యా సమయాన పడమర కొండల సోయగాన్ని చూశారా
పున్నమివెన్నెల తనువెల్లా స్పృశిస్తుంటే అందులోని చల్లదనాన్ని అనుభవించారా
సుప్రభాతం వీనులకు విందు చేస్తుంటే గోవులమెడలోని మువ్వల శబ్దాన్ని విన్నారా
మావి చిగురుతిని కుహుకుహు రాగాలు పలికే కోయిల  స్వరాలను ఆలకించారా
సెలయేటిలో పాదాలు వుంచి కాళ్ళ క్రింద నీళ్ళు జారిపోతుంటే వంటిపయికి ప్రాకే తిమ్మిరి తెలిసిందా
సముద్రపు ఒడ్డున అలలు కాళ్ళను తగులుతూ ఇసుకను లాగేస్తుంటే వెన్నుపూసలోకి ప్రాకే జలదరింపు ను గుర్తించారా
పూల పుప్పొడి రేణువులు చేతివేళ్ళకు తగిలే స్పర్శ నెప్పుడన్నా   అనుభవించారా 
భూమి విచ్చుకొని పొడుచుకువచ్చే మొక్కను తడిమి తన్మయత్వం చెందారా 
పిల్లి పిల్లల్ని లేగదూడలని ,కుక్కపిల్లల్ని పెంచిన అనుభవమున్నదా  
చెరువుల్లో,బావుల్లో,కాలువల్లో చేపపిల్లల్లా  ఈదిన జ్ఞాపకాలేమయినా ఉన్నాయా
మంచుతెరలు కమ్ముకున్న శీతాకాలం ఉదయాల్లోని చలిమంటల్లోని వెచ్చదనం గుర్తుందా
ప్రక్రుతి పరవశించి పోయాలా  ఆకుపచ్చ చీరకట్టుకొని నర్తించే అడవుల సౌందర్యాన్ని ఎప్పుడన్నా గ్రోలారా
వర్షం వెలిసిన తరువాత గగనాంగన కప్పుకున్న ఇంద్రధనుస్సుపయిటను మయిమరచి చూశారా 
పొద్దుతిరుగుడు పూల తోటలో తిరుగుతూ వాటి అందాల్ని  చూశారా 
చిరుజల్లుల వానలో తడుస్తూ ఎప్పుడన్నా నాట్యం చేశారా 
ఆరుబయట పక్కేసుకొని ఆకాశం లోని నక్షత్రాలను లెక్క పెట్టారా    
హరిప్రసాద్ చౌరాసియా వేణుగానాన్ని వింటూ అడవుల్లో రైలు   మార్గం గుండా ప్రయానించారా  
వేణువును ఊదుతూ,కీ బోర్డ్   లోని మీటలను నొక్కుతూ సరిగమ లెప్పుడన్నా పలికించారా 
వెండి మేఘాలు కొండల మీద ప్రయాణిస్తుంటే వాటినెప్పుడన్నా   పట్టుకున్నారా 
ఒంటరిగా నీలో నీవు గడుపుతూ నీ హృదయాంతరంగం లోని మౌనభాష నెప్పుడన్నా తెలుసుకున్నారా    
ఇవన్నీ మీ అనుభవం లోకి వచ్చాయా                    

10 comments:

 1. అన్నీ కాదుకాని చాలవరకు వచ్చాయండీ..

  ReplyDelete
  Replies
  1. మీరు పల్లెటూరిలో వుండి వుంటారు .అందుకే మీకు పకృతి లోని అన్ని అనుభవాలు కలిగివున్నారు .పల్లె గురించి మరోసారి వ్రాస్తాను.

   Delete
 2. వీటిల్లో చాలా వరకు నాకు అనుభవం లోకి రాలేదు. To do list లోకి చేర్చేస్తున్నా.

  ReplyDelete
  Replies
  1. మీకు పల్లె పరిచయం లేదా !పల్లెలో లేకున్నా మీకనువయిన విధం గా ఉదాహరణకు హరి ప్రసాద్ చౌరాసియా గారి సిరివెన్నెల లోని లేదా ఆయనే ప్రత్యేకంగా విడుదలచేసిన sound of deserts ను విదేశాల్లో కూడా రైళ్ళు వుంటాయి కదా!ఎప్పుడు విమానాల్లో కాకుండా అప్పుడప్పుడు అడవుల మధ్యలో రైల్లో వెడితే ఎలా వుంటుంది .గుంటూరు ,నంద్యాల మధ్యన నల్లమల అడవిగుండా నేను తరచుగా వేడుతుంటాను.చాలా సినిమాలు కూడా చిత్రీకరణ జరుపుకున్నాయి .ఉదా :క్షణక్షణం

   Delete
 3. నాకు ఈతరాదు కనుక అదీ, నాకు జంతువులని పెంచుకోవటం ఇష్టం ఉండదు కనుక అదీ తప్ప మిగతావన్నీ అనుభవంలోకి వచ్చాయి!

  ReplyDelete
  Replies
  1. ఈత పుట్టగానే ఎవరికిమాత్రం వస్తుందండీ .చేపలకు తప్ప !best exercise తెలుసా?మహానంది ఎప్పుడయినా చూసారా!సంవత్సరమంతా స్వచ్చమయిన జలం దేవుడి గర్భ గుడినుండి నిరంతరంగా ప్రవహిస్తుంది హెచ్చుతగ్గులు లేకుండా !ఆ గుండం లో అడుగున నాణాలు వేస్తే స్పష్టంగా కనిపిస్తాయి.ఎక్కువ లోతు వుండదు.ప్రకృతి సిద్దమయిన ఈతకొలను.అలా ఇక జంతువులంటారా!కొంతమందికి ఇష్టం వుండదు.పెంచక పోయినా వాటిని దగ్గరనుండి గమనించగలిగితే వాటి ప్రవర్తన లోని ఆప్యాయత మనుషుల కుంటుందా అనిపిస్తుంది చిన్నప్పుడు కొంతకాలం పెంచాము.మీకొక ఆశ్చర్యకరమయిన విషయం చెప్పనా అమెరికా లో జంతువులు పెంచడం ,వాటి పోషణ వాటికి వైద్యం అందించటం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారు.

   Delete
  2. హహహ! నిజమే మహానంది చూశాను! వాటిల్లోని ఆప్యాయత గుర్తించటం వరకూ బానే ఉంది కాని పెంచాలంటేనే ఎందుకో నాకు నచ్చదు! లక్షల రూపాయలు ఖర్చు చేయటమే కాదండీ! వాటికి స్పెషలుగా జిమ్లు, pedicure , వగైరా పైగా కన్న పిల్లలని గొలుసేసి కట్టి తీసుకెళ్తే, కుక్కలని, పిల్లులని మాత్రం చాలా భద్రంగా చంకనేత్తుకుంటారు చూస్తుంటే లాగి పెట్టి కొట్టి పిల్లలని తిన్నగా చూసుకోండి అని చెప్పాలనిపిస్తుంది నాకు!

   Delete
  3. నాకు అలానే అనిపించింది అమెరికా వారి జంతుసంరక్షణ గురించి.

   Delete
 4. మీ ప్రశంసకు ధన్యవాదాలు.

  ReplyDelete