ఎటువంటి చుట్టరికం లేకున్నా సన్నిహితంగావుంటూ కష్ట సుఖాలు ,ఆనంద విషాదాలు,సమస్యలు పంచుకోవటం ,ఓదార్పును పొందటం,ఇవ్వటం అవసరమయిన మేర సహకరించుకోవటం ఇవీ స్నేహ ధర్మాలు.బాల్య స్నేహితులు గా వుండి,విడిపోయి ఎప్పుడో మరల కలుసుకున్నా ఆ అభిమానాలు అలానే ఉంటాయి.యువకులుగా ఉన్నప్పటి స్నేహాలలో కొంచం సాంద్రత తక్కువగా వుంటుంది ఇక జీవితాలలో స్థిరపడ్డ తరువాత ఏర్పడ్డ స్నేహాలు ఎక్కువ కాలం కొనసాగుతాయి.
మరి ప్రస్తుత స్నేహాలు సమీక్షిస్తే ఒకప్పుడు ఉన్నంత మంచి స్నేహాలు, మిత్రులు ప్రస్తుతం ఉంటున్నారా!ఆర్థిక వ్యత్యాసాలు స్నేహానికి కొలమానం అవుతున్నాయా?అభిప్రాయ భేధాలతో స్నేహాలను వదులుకొంటున్నారా !పోటీ ప్రపంచం లోని ఈర్ష్య ,అసూయ ,పోలికలు స్నేహాలను దెబ్బ తీస్తున్నాయా?ఇవన్నీ ఆలోచిస్తే స్వచ్చమయిన స్నేహంలోని సాంద్రత బాగా తగ్గినట్లు కనిపిస్తుంది.ఎదుటి మనిషి మనకు ఎలా ఉపయోగపడతాడా!అని ఆలోచించేవారు ఎక్కువయ్యారు.అవసరాలకోసం స్నేహాలు ఎక్కువయ్యాయి.వ్యాపార లావాదేవీల్లో స్నేహితులను మోసం చేసే వ్యక్తులు పెరిగి పోయారు.నమ్మకంగా వుంటూ మిత్ర ద్రోహం చేసే వాళ్లకు కొదువ లేదు.హోదా అంతస్తులు స్నేహాన్ని నిర్దేశిస్తున్నాయి.తమ తాహతుకు తగ్గ వారితోనే స్నేహాలు చేస్తున్నారు.ఇవన్ని గమనిస్తుంటే స్నేహం ఎలా ఉండాలో వ్రాయాలని పిస్తుంది.
ప్రతి మనిషికి,తన భావాలు స్వేచ్చగా వ్యక్తపరచుకోవటానికి ఒక స్నేహితుడు/రాలు అవసరం.అలాంటి స్నేహం లో ఎలాంటి స్వార్థం ఉండకూడదు.ఒకరినొకరు మోసం చేసుకోకూడదు.హితము కోరేవాడే కదా స్నేహితుడు.ఆర్థిక వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకోకూడదు.స్నేహితుని చూస్తే ఆనందం కలగాలి.ఈర్ష్య,అసూయ కలుగుతున్నాయంటే ఆ స్నేహం కలుషితమవుతున్నట్లు.ఒక స్నేహంలో పరస్పరం ఎన్నో నేర్చు కోవాలి.విభిన్న అభిప్రాయాలు కలిగి వున్నా పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలి.
స్నేహం అంటే చంద్రుని వెన్నెలలా చల్లదనం ఇవ్వాలి.జీవితం లో అది ఒక సాంత్వన నివ్వాలి.స్నేహం అంటే ఓ నమ్మకం .స్నేహం అంటే ఓ ఆహ్లాదం.ఎటువంటి ఒడిదుడుకులు లేని ఓ ప్రయాణం.ఏమీ ఆశించని ఓ ఆనందాల హరివిల్లు.

మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.అన్నీ వ్యాపారమయం అయినట్లే సమాజంలో ప్రస్తుత స్నేహాలు కూడా వ్యాపారమయమైపోయాయ్.చక్కగా వ్రాసారు.
ReplyDeleteచక్కగా చెప్పారు.ఈ యాంత్రిక యుగంలో సేద తీర్చే మలయపవనం కావాలి.అది స్నేహం అని నా నమ్మకం .దాన్ని కాపాడుకోవాలి .లేకపోతే ప్రతి విషయాన్ని లాభ నష్టాలతో బేరీజువేసే సంస్కృతి మన సమాజానికి ఎంతో కీడు కలిగిస్తుంది.
DeleteVery well said.
ReplyDeleteకృతజ్ఞతలు .మానవ సంబంధాలలో స్నేహం అత్యంత కీలకమయినది.అటువంటి స్నేహాన్ని గురించి ,దాని ప్రాముఖ్యతను గురించి మరింతగా వివరించాలని వుంది.
ReplyDeleteఅవును చాలా బాగా చెప్పారు....
ReplyDeleteకాని ఈ రొజుల్లో స్నెహాన్ని ఒక తామరాకు పై నీటిబొట్టు లా చుస్తున్నారు...!
అవసరానికి మట్లాడడం,అవసరం తీరాక వదిలెయ్యడం.అసలు ఈ అవసరం ,స్వార్ధం ఉండబట్టే స్నెహాలు ఇలా తయారయ్యాయి...
కాని మంచి స్నేహితులూ ఉన్నారండీ,అలాంటి వారు ఉండబట్టే ఇంకా స్నేహితుడని చెప్పుకోవడానికి ఒక మాట పలుకుతుంది.
అని నా ఉద్దేశ్యం.
ఉన్నారండి.అలాంటి వారు మరింతగా వుండాలని ఈ సృష్టి ధర్మాన్ని కాపాడుకోవాలని తాపత్రయం.మీ స్పందనకు ధన్యవాదాలు.
ReplyDelete