Tuesday, 20 March 2012

పోలికలోనుండి పుట్టిన ఈర్ష్యను ఎలా జయించాలి?

                   యువకులుగా వున్నప్పుడు  జీవితం గురించి  ఎన్నో కలలు  కంటాం.జీవితంలో విభిన్న వృత్తుల్లో స్థిర  పడ్డ తరువాత వెనుదిరిగి చూసుకుంటే కొన్ని నెరవేరుతాయి.మరికొన్నినెరవేరవు.మరికొంతమందికిఅసలేమి  నెరవేరవు.ఈ లోపు మీతో చదువుకున్న వాళ్ళు ,మీ బంధువులు,మీ స్నేహితులు ,మీ పక్కింటి వారు  మీకన్నా బాగా స్థిరపడి వుంటారు.అప్పుడు మొదలౌతుంది  మీలో.వారిలా మనం లేమే .వారికున్న  ఆస్తులు,హోదా,అందం  ,పలుకుబడి మనకులేవే అన్న పోలిక మొదలౌతుంది.అందులోనుండి  ఈర్ష్య పుడుతుంది.ఈ పోలిక తో ప్రారంభమయిన ఈర్ష్య మనిషిని  ఒక పట్టాన వదలదు.కొంతమంది దీన్నిఆరోగ్యకరమయిన రీతిలో తీసుకొని తాము ఎదగటానికి ప్రయత్నిస్తారు.మరికొంతమంది ఈర్ష్య స్థితిలోనే జీవితాన్ని  కొనసాగిస్తారు.ఈ మొత్తం ప్రక్రియను పరిశీలిస్తే ఎవరు ఇదంతా చేస్తుంది,అని ఆలోచిస్తే మీకు మన మనసే అని సమాధానం దొరుకుతుంది.
                       మరి ఈ ధోరణి సరి అయినదేనా !సరి అయినది కాదు అనుకుంటే దాని వాళ్ళ నష్టం ఏమిటి అని ఆలోచిస్తే ,ఈర్ష్య ఒక నకారాత్మక  మానసిక స్థితి.అది నిరంతరం మనసును మెలిపెడుతుంది.మనకు తెలిసిన ప్రతి ఒక్కరి ఉన్నత స్థితిని పోల్చుకుంటుంది.తనకు లేదని దిగులు చెందుతుంది.దాంతో వారిపట్ల వ్యతిరేక భావాన్ని
పెంచుకుంటుంది .దీని లోంచి ఎదుటివారికి ఏదయినా నష్టం జరిగితే  మనసు ఆనందిస్తుంది.ఎదుటివారు దెబ్బ  తినాలని కోరుకుంటుంది .వారికి విజయాలు లభిస్తే తట్టుకోలేనంత అసూయ కలుగుతుంది.ఇదంతా మనసు లో పేరుకునిపోయి విభిన్నమయిన వ్యాధులుగా బయటపడతాయి.ముఖ్యం గా వ్యాపారం లో వున్నవారు,క్రీడాకారులు ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారికి   ,ప్రభుత్వ స్థాయి లోని అధికార యంత్రాగం లోని వారికి ,వారు వీరని కాదు అన్ని వర్గాలలో ఇది ఎంతోకొంత వుంటుంది.,ఇంత నష్టం కలుగుతుంటే మనం దాన్ని అనుభవించాల్సిందేనా!మరి పోలిక నుండి పుట్టిన ఈర్ష్యను తొలగించు కోవాలంటే   ఎలా?
                    ఒక్క సారి మనసు చేసే ఈ ప్రక్రియను దాని ద్వారానే విశ్లేషిద్దాము.మనం మనకి పరిచయం లేని వారితో ఎందుకు పోల్చుకోము.ఇది అర్థమయితే ఈ ప్రక్రియ అంతా ఆగిపోతుంది.ఎందుకంటే మీకు వారు తెలుసుకాని వారికి మీరు తెలీదు కాబట్టి.వారెప్పుడు మీకు పరిచయం లేదుకాబట్టి.ఒక సారి ఆలోచించండి.మీరు పోల్చుకునే వారికంటే కొన్ని కోట్లమంది ఎక్కువ సంపద కలిగినవారు ఉన్నారు.ఉదాహరణకు మనకు billgates(microsoft) ను ,ముకేష్ అంబాని ని చూసినా  ఎటువంటి ఈర్ష్య కలగదు ,కాని    మన స్నేహితుడు కాస్త ఉన్నత స్థితిలో  వుంటే  అసూయ కలుగుతుంది.అలాగే మన సహోద్యోగి మన కన్నా కాస్త సంపదకలిగి వుంటే మనసు విలవిలలాడి  పోతుంది.ఈ తేడా ను జాగ్రత్తగా అంచనా వేయండి.తెలిసిన వాళ్ళయినా ,తెలియని వాళ్ళనయినా ఒకే  రకం  గా పరిగణిస్తే మనసుకు ఈ సంఘర్షణ ఉండదుకదా !అసలు ఎవరి అవకాశాలు వారివి.ఒకరివి  ఒకరికి  రావు  కదా .మనం ఆలోచించాల్సింది  మనం ఎంత సంతృప్తిగా జీవితాన్ని కొనసాగిస్తున్నాము.ఎంత ఆనందంగా  వుండగ లుగుతున్నాము అన్నది  ప్రధానం.జీవితమంటే  ఆనందం, ఒక సంతృప్తి,ప్రతిక్షణం  పరిపూర్ణం గా జీవించాల్సిన  ఒక ప్రయాణం .ఈ విధంగా ఆలోచించండి.మనసు  పోలికలు లేకుండా పరిపూర్ణంగా వుండటం మీరే  చూస్తారు.

6 comments:

 1. బాగా చెప్పారండి..ఇవాళ ఈ సమస్య గురించే నేనూ మా వారు మాట్లాడుకున్నాము.

  ReplyDelete
  Replies
  1. మన మనసులో జరిగే విభిన్న ప్రక్రియలగురించి వ్రాస్తున్నాను.పాత టపాలు కూడా చూడగలరు.ధన్యవాదాలు మీస్పందనకి .

   Delete
 2. ఇక్కడ ఒక విషయం ప్రస్తావనలోకి తేవాలి.
  అమెరికా స్కూల్స్ లో ఒక విధ్యార్ది మార్కులు కాని గ్రేడ్లు కాని తోటి విధ్యార్ది కి తెలీదు. అసలు ఇక్కడ మన ప్రోగ్రెస్స్ గురించి పక్క వారు ఈర్ష్య పడే ఒక సంధర్భమే రాదు.అలాగే ఉద్యోగాలలో కూదా చాలా మటుకు
  పక్కవారి జీతం కూడా తెలుసుకునే చాన్స్ ఉండదు. (భారతీయులైతే తప్పకుండా ఇవి చర్చించుకుంటారనుకోండి). నాకు తెలిసి ఎంతో మంది 12-19 సంవత్సరాల విద్యార్దులు నాకు పరిచయం ఉన్నవారిలో "ఐ డోంట్ కేర్ ఎబౌట్ అతర్స్.ఐ జుస్ట్ కేర్ ఎబౌట్ మైసెల్ఫ్" అన్న ఎట్టిట్యుడ్ ఎక్కువగా చూసాను. నా ద్రుష్టిలో అందుకే వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. ఉద్యోగాలు చెసే అమెరికన్స్లో కొద్దిమంది ఈ ఈర్ష్యా ద్వేషాలకు (office politics are there everywhere) అతీతం కాదనుకోండి. కాని మొత్తానికి పక్కవారి జీవితం లో ఆసక్తి తక్కువ కావడం వలన ఈర్ష్యా ద్వెషాలు చలా వరకు తక్కువే ఇక్కడ మనుషులలో అనిపిస్తుంది.

  ReplyDelete
 3. మీరు అమెరికాలో ఉంటారా!అలావుంటే కొంతవరకు మంచిదే !మన(ఇండియా) విద్యా వ్యవస్థ లో చాలా లోపాలున్నయండి.చిన్నప్పటి నుండి విద్య లో ఇవన్నీ నేర్పాలండి .games ద్వారా దాన్ని పోగొట్టవచ్చు.తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి.వారు ఎలా ప్రవర్తిస్తుంటే పిల్లలు కూడా అలానే వుంటారు.

  ReplyDelete
 4. జెలసీకి విరుగుడుగా - ఇతరులతో పోల్చుకోకుండా మనతో మనమే పోటీపడితే బావుంటుందని ఒక వ్యక్తిత్వ వికాసం పుస్తకంలో చదివాను. ఇవాళ ఇంత ప్రతిభ చూపితే మరునాడు మనం అంతకంటే ప్రతిభ చూపుతూ మనని మనం అధిగమిస్తూ వెళుతుంటే గొప్ప విజయాలు సాధించొచ్చని ఉదాహరణపూర్వకంగా అందులో చెప్పారు. ఆ పుస్తకం, రచయితా గుర్తుకులేదు.

  ReplyDelete
  Replies
  1. మీరు చెప్పింది కొంతవరకు నిజం.చిన్న సవరణ మనతో మనం పోటీ పడటం కంటే మనల్ని మనం మరింత మెరుగు పరచుకుంటూ మన పనిలో నాణ్యత పెంచుకుంటూ ఇతరుల విజయసూత్రాలను మన కు అన్వయించుకుంటూ ఒక సకారాత్మక ధోరణి లో వెళ్ళటాన్ని పోటీ అనుకోవాల్సిన పనిలేదు.మనల్ని మనం నిరంతరం గమనించు కుంటుంటే అందులోనే అన్ని మనకు అర్థమవుతాయి constant observation నిరంతర పరిశీలన .మీ స్పందనకు ధన్యవాదాలు.గతం లో మీ స్పందనకు ప్రతిస్పందిం చ లేకపోయాను.

   Delete