Monday, 6 February 2012

ఎదుగుతున్న లేత శరీరాలఫై

ఎదుగుతున్న లేత శరీరాలఫై
కర్కశంగా బరువు మోపుతున్న సమాజం
వికసిస్తున్న మనసుఫై 
విరుచుకుపడుతున్న పని వత్తిడి ఫలితం
                 నవ్వులపువ్వులు పెదవులఫై విరబూయాల్సిన క్షణం
                 బాధల కేదారంలో ముడుచుకుపోతున్న బాల్యం 
స్వేచ్చ లేదు 
ఆనందం లేదు ఆత్మీయత లేదు 
అమ్మ నాన్నల ప్రేమ  తెలీదు 
                వెట్టిలో,నిర్భందాలలో 
                గనుల్లో,ఫ్యాక్టరీలలో 
                పొలాల్లో,ఇళ్ళల్లో,
                నలుగుతున్న పసిడి బాల్యం 
కాయలు కట్టిన చేతులు 
బరువులతో వంగిన భుజాలు 
పని అలసటలో దైన్యం నిండిన కళ్ళు 
ఎంత కష్టం -ఎంత కష్టం 
               ఎవరున్నారు వారికి?
               వారివైపు పోరాడేదేవ్వరు   
               పిల్లలు పనిచేసి పెద్దలను బ్రతికించాలా?
               రక్షణ ఇవ్వాల్సినవారే   భక్షించాలా? 
ఎలా ఒప్పుకోవాలి ఈసంస్కృతిని   
పిల్లలకు జ్ఞానం అందించనిధీ ఇదేమి సమాజం  
మార్చాలి ఈసంస్క్రుతిని చట్టాలను 
పిల్లలను ఒడుల్లాంటి బడులలో సేదతీరనివ్వాలి 
వారి కనురెప్పల వెనుక విద్య కమ్మని కల కావాలి 
              స్వేచ్చ లోని మాధుర్యాన్ని 
              ఆత్మీయత లోని అనుభూతిని 
              అక్షరాల్లోని ఆకర్షణను  
చదువు లోని ఆనందాన్ని 
వారిని అనుభవి౦చ నీయండి
ఆపొద్దు ...ఆపలేరెవ్వరు  వారిని 
అరుగో వస్తున్నారు పిల్లలు బడులకు .. 


No comments:

Post a Comment