Wednesday 11 July 2012

ఓ స్వరం


ఓ స్వరం
నిశీధి నిద్రను చెరిపేస్తూ
ఓ గాత్రం
భావనా వీచికలను శ్రుతిచేస్తూ
స్వాప్నిక జగత్తులో
 ప్రేమైక లోకంలో
విహరిస్తూ
తపిస్తూ వున్న
నన్ను స్పర్శించింది
అలలా
సెలయేటి గలగలలా
కరిగిన మంచులా
చల్లగా
మెల్లగా
వీణను మీటిన నాదంలా
కోయిల గొంతున రాగంలా
నన్నే స్మరిస్తూ
నన్నే జపిస్తూ
నా హృదయ కోశం లో
ప్రతి  పొరను కదిలిస్తూ
గగనంలో ఎగురుతున్న
మేఘాలను పలకరిస్తూ
సున్నితంగా
సునిశితంగా
చిరుగాలి సవ్వడిలో
వెన్నెల చల్లదనంలో
మిళితమై చేరింది
వీనుల విందుగా    

20 comments:

  1. Enjoyed it sir,
    Liked it very much.

    ReplyDelete
    Replies
    1. మీరు ఆనందించినందుకు మాకానందం .ధన్యవాదాలు.

      Delete
  2. very very nice ravi sekhar garu

    ReplyDelete
    Replies
    1. స్వాగతం రమేష్ గారు!మీరు మెచ్చినందుకు మీకు ధన్యవాదాలు.

      Delete
  3. Replies
    1. మీకు అంత అందంగా కవిత నచ్చినందుకు మీకు ధన్యవాదాలు.

      Delete
  4. వీనుల విందుగా చేరిన "ఓ స్వరం" చాలా బాగుంది..

    ReplyDelete
    Replies
    1. వీనుల కింపైన ఓ స్వరం అలా ప్రతి ఒక్కరికి ఉంటుందేమో!ధన్యవాదాలండి.

      Delete
  5. చాలా చాలా వీనుల విందుగా ఉంది....
    నా హృదయ కోశం లో ప్రతి పొరను కదిలిస్తూ.. ఎందుకో ఆ లైన్ బాగా నచ్చింది అండీ...

    ReplyDelete
    Replies
    1. మీ స్పందించే హృదయానికి ధన్యవాదాలండి.

      Delete
  6. గుండెకు హత్తుకుంది రవి శేఖర్ గారూ!
    చాలా బాగుంది
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. కవి హృదయాన్ని కవే పసిగట్టగలడని మిమ్మల్ని చూస్తే అనిపిస్తుందండీ.మీకు అంతలా నచ్చినందుకు మీకు ధన్యవాదాలు.

      Delete
  7. మీ "ఓ స్వరం" లోని
    ప్రతి పదం...
    మధురమైన భావమై...
    తాకింది హృదయం!

    ReplyDelete
    Replies
    1. ఇటువంటి కవితలు మీరు ఇంతకంటే చాలా బాగా వ్రాస్తారు.ఈ కవితకు మీ ప్రశంస దక్కిందంటే చాలా ఆనందం .మీ స్పందనకు మరిన్ని ధన్యవాదాలు.

      Delete
  8. ముందు ఆ గాత్రం, స్వరం ఎవరిదో చెప్పండి.సుశీలదా, జానకిదా, శ్రేయా ఘూషాల్ దా, లేక లత మంగేష్కర్ దా చెప్పండి ముందు..లేక మీకోసం మాత్రమే పాట పాడిన మీ ప్రియ నెచ్చెలిదా? (తిట్టుకోకండే, ఇలా అడిగానని)
    కవిత మాత్రం simply very sweet!!!

    ReplyDelete
    Replies
    1. సినిమా సంగీతం ఎంత విన్నా కవితలో వున్నంతలా ఉంటుందంటారా!ఉండొచ్చేమో .కాని ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి స్వరం వినిపించి ఉండదా!ఆ స్వరం కోసం ఎంతలా ఎదురుచూసి ఉంటారో కదా!అది గుండెను తట్టి మనసును మైమరిపించి ఉంటుంది కదా!అందరి జీవితాల్లో ఇది జరిగి ఉంటుంది కదా!కవి హృదయం కదండీ అలా పలికింది.మీరు అడిగిన విధానం చాలా నచ్చింది.మీకు బోలెడు ధన్యవాదాలు.

      Delete
  9. ఆ గాత్రం ఆ స్వరం ఎక్కడో విన్నట్టు గుర్తు
    ఎక్కడివి ఈ రాగాలు అరుణ రాగాలు !
    రవి .. వింటున్నాను కొత్తగా సరికొత్తగా
    మళ్లి మళ్లి వినిపించు

    ReplyDelete
    Replies
    1. ఎక్కడికి వెళ్లారు సర్.ఈ మధ్య మీ కవితా మందారాలు లేక బ్లాగులోకం చిన్నబోయింది.ఆ స్వరం అలా ప్రతి ఒక్కరికి ఏదో సమయం లో వినిపించి ఉంటుంది.అందుకు ఎవరు అతీతం కాదేమో!మీ స్పందనకు ధన్యవాదాలండి.

      Delete
  10. స్వరం పలికింది
    సర్వం పులకించింది :)

    ReplyDelete
  11. మీ పదాల పొందిక చాలా బాగుంది.ధన్యవాదాలు మీకు.

    ReplyDelete