Sunday 22 July 2012

మనిషిలో అహంకారం ఎలా మొదలయింది? 1


                   సమూహంలో ఉంటూ అందరు కలిసి ఆహారాన్ని సేకరిం చుకుంటూ ,దానిని కలిసి పంచుకుని తింటూ ఉన్నంత కాలం మనిషికి వ్యక్తిగతమంటూ ఏదీలేదు.ఎప్పుడయితే కుటుంబం ఏర్పడిందో అప్పుడు ఆహార సంపాద నలో స్వార్థం బయలుదేరి నా కుటుంబం,నా పిల్లలు,నా ఇల్లు అన్న వ్యక్తిగతమైన భావనలు బలపడ్డాయి. ఆహారా న్ని  తన కుటుంబానికి దాచి పెట్టుకోవటం,వస్తువులను సేకరించుకోవటం సంసారానికి కావలసిన  అన్ని రకాల పదార్థాల సేకరణలో మనుషుల మధ్య పోటీ ఏర్పడటం,ఆ పోటీలో మనిషి తత్వం లో మార్పులు చోటు చేసుకున్నా యి .అందులోంచి పుట్టినదే నా అన్న భావన.అప్పుడు ఈ భావన కేవలం బాహ్య పరిస్థితులకు మాత్రమే అన్వయిం చుకుని మనుష్యులు ప్రవర్తించే వారు.ఇది బాగా పూర్వ కాలానికి సంబంధించినది.
         సమూహాలనుండి,ఉమ్మడి కుటుంబాల నుండి  నేడు చిన్న కుటుంబాలు ఏర్పడ్డ తర్వాత వ్యక్తిగత వాదం పెరి గింది.ప్రతి సమస్యను తనే అధిగమించటానికి దాని గురించి ఆలోచించటం ప్రారంబించాడు.బాహ్య అవసరాలకోసం ప్రా రంభమైన ఈ తత్వం పూర్తిగా వ్యక్తి తన మనస్సును దానితో నింపి మధనం చేయటం ప్రారంభం కావటంతో మన సం తా నేను నాకు,నా వలన,నన్ను ,నాయొక్క నావారు,నాతోనే, నేను లేకపోతే ఇలాంటి ఎన్నో భావాలు మనిషి లో స్థిరపడిపోయాయి.మరల ఇవన్నీ మనిషి ప్రాధమిక అవసరాలు తీర్చుకోవటం వరకు బాగానే ఉంది.ఈ తత్వం ఇతరు లకు నష్టం కలిగించే విధంగా ,ఇతరుల హక్కులు కాలరాసే విధంగా తయారయినప్పటి నుండి దీని పై చర్చ ఈ అంశానికి ప్రాధాన్యం పెరిగింది.
          మరో వైపు మానవ పరిణామ క్రమంలో అభివృద్ది నా అన్న భావన వలన కూడా జరిగింది.కాని ఇది వ్యక్తి అభి వృద్దిని దెబ్బ తేసే విధంగా ఇతరుల హక్కులకు భంగం కలిగించే దశగా ప్రస్తుత దశను భావించవచ్చు.దీనినే మనం ప్రస్తుతం అహం అని అహంకారం అని నేను అనే భావన అని అంటున్నాము.ప్రస్తుత దశ  గురించి చర్చిద్దాము.       .          
          మానవ  జీవనం 20 వ శతాబ్దం నుండి విభిన్న మార్పులకు లోనవుతూ వస్తుంది.ప్రతి రంగం లో ఆధునిక మైన శాస్త్ర సాంకేతికత ప్రభావం తో అనూహ్యమైన అభివృద్ధి చోటుచేసుకుంటుంది.అదే సమయంలో మనిషి జీవన విధానం,ఆలోచనా విధానం మారిపోతూ వస్తుంది.ప్రపంచ మంతా వ్యక్తి వాదం ప్రబలి తన కుటుంబం,తన పిల్లలు కేంద్రం గా మనిషి ఆలోచన కేంద్రీకృత మయింది.తను అభివృద్ధి అయ్యే క్రమంలో ఎన్నో అడ్డంకులను అధిగమించాల్సి వస్తుంది.ఇతరులతో  పోటీ పడటం తన ఆధిక్యతను చూపించటానికి ప్రయత్నించటం,ఇతరులతో పోల్చుకుంటూ తను వారికంటే తక్కువ,లేదా ఎక్కువ అనే భావనలకు లోనవుతూ సంఘర్షణ లో ఉన్నాడు.
       ఈ క్రమంలో తన అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచిస్తూ స్వార్థాన్ని,సంకుచితత్వాన్ని పెంచుకుంటూ ఎవరు ఏమైనా ఫర్లేదు, నేను అందరినీ అధిగమించాలి.అంతా నాకు కావాలి,ఇది నాది,నేను ఫలానా అనే భావనలు మనిషికి అహంకారం సృష్టించాయి.
(మిగతా భాగం తరువాతి వ్యాసం లో )

12 comments:

  1. ఆసక్తికరంగా ఉంది. రాబోయే భాగాలకై వేచి చూసి తెలుసుకుంటాను.

    ReplyDelete
  2. sir, baagundi aasaktidaayakamgaa. eduruchoostuntaanu. thanks.

    ReplyDelete
  3. అహంకారం, స్వార్థం అనే రెండు వేరు వేరు అంశాలను కలపేసినట్లున్నావ్, శేఖర్. ఆదిమ మానవుడి కాలం నుంచి కూడా మనిషి కి ఆకలి,అహంకారం వుండటం వల్లే బలహీనమైన ప్రతిదానిపైన ఆధిపత్యం చెలాయించాడు,తోటి మనిషి పై కూడా. వ్యాసంలో కొన్ని అంశాలు మరింతగా వివరంగా వుంటే, బాగుండేదేమో అనిపించింది, మంచి అంశంతో చక్కగా రాస్తున్నందుకు అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. తరువాతి వ్యాసం లో విపులంగా వివరిస్తాను .మీ స్పందనకు ధన్యవాదాలు .

      Delete
  4. చక్కగా రాసారండి.

    ReplyDelete
  5. లేట్ గా స్పందిస్తున్నందుకు క్షమాపణలు. బాగుందండి మీ వ్యాసం. ఎప్పటిలాగే చక్కగా , క్లుప్తం గా చెప్పాలనుకున్నదంతా చెప్పారు.

    ReplyDelete
  6. అయ్యో!క్షమాపణ లెందుకండి.కాకపోతే కొంత rest తీసుకున్నారేమో net నుండి అనుకున్నా!మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
  7. బాగుంది. నేను - నాది అనేది వ్యక్తిగత ఆస్తి ఏర్పడిననాటినుండే ఏర్పాటయ్యాయి.

    అవి పోవాలంటే వ్యక్తిగత ఆస్తి లేని సమాజం ఏర్పడాల్సిందే. సమాజాన్ని బట్టే మనిషి ప్రవర్తన ఉంటుంది.

    నేను అనేది ఉంటేనే అభివృద్ధి ఉంటుంది.కానీ అది మనములో ఒదిగి ఉండాలి. అప్పుడే ఆ అభివృద్ధి అసమానతలు లేని సమాజాన్ని ఏర్పరుస్తుంది.

    సమాజం లో అసమానతలున్నంతవరకూ పౌరులకు సమస్యలు తప్పవు.

    రవి గారూ చిన్న సూచన . వీలైతే పాటించండి. మీ పోస్ట్ వ్రాశాక అంతా సెలెక్ట్ చేసి జస్టిఫికేషన్ ఇవ్వండి. నీట్ గా ఉంటుంది.

    ReplyDelete
  8. నమస్తే సర్.మీకు స్వాగతం.మీ విశ్లేషణ చాలా బాగుంది.మీరన్న కోణం కూడా నిజమే!అలాగే మీరు అహంకారం పై నేను వ్రాసిన ఇతర పోస్ట్ లు కూడా చదివి మీ అభిప్రాయం తెలియ జేయగలరు.3,4,5 లలో మీరన్నట్లు చివరలో justification వ్రాసాను .మీ సూచనకు ,మరియు మీ స్పందనకు ధన్యవాదాలు.

    ReplyDelete