Friday, 11 May 2012

ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి జయంతి నేడే






  with anniebesent


       ప్రపంచంలోని తత్వవేత్తలలో  జిడ్డు కృష్ణమూర్తి ని అగ్రగణ్యుడుగా చెప్పవచ్చు .ఈయన ఆంధ్రప్రదేశ్ లోని మదన పల్లె లో నారాయణయ్య,సంజీవమ్మ లకు 1895 మే 11 న 8 వ బిడ్డగా జన్మించారు.ఆరోజుల్లో Annie Besent తియో సాఫికాల్  సొసైటీకి ప్రెసిడెంట్ గావున్నారు .వారు మానవ రూపం లో దేవుడు అవతరించి ప్రజలను రక్షిస్తాడు ,తనే ప్రపంచగురువు పాత్ర పోషిస్తాడు అని నమ్ముతూ వుండేవారు.ఆయన రాక కోసం ప్రపంచాన్ని సిద్ధం చేయటం కోసం order of the star అనే సంస్థను స్థాపించారు.1911 లో అనీబీసెంట్ ఆయనను,తమ్ముడు నిత్యానందను గమనించిం ది. ఆమెకుకృష్ణమూర్తిలో కాబోయే జగద్గురువు కనిపించాడు.వారిద్దరిని  శిక్షణకై   England,France పంపించారు.ఆ శిక్షణ సమయంలో  ఆయనలో పూర్తిగా పరివర్తన వచ్చి  మహా ప్రజ్ఞతో ,అపర బుద్ధుడిగా గోచరిం చాడు.తరువాత నిత్యానంద మరణంతో భయంకరమైన దుఖం  అనుభవించి తనకు తాను దుఃఖ విముక్తుడై య్యాడు.ఆయన ఇలా ప్రకటించారు.
  "నా ప్రధాన లక్ష్యం ఒక్కటే_వ్యక్తి స్వేచ్చ .అన్ని భయాలనుండి,బంధాలనుండి మనిషిని  విముక్తి చెయ్యాలి."
      1929 లో  order of the star సమావేశంలో దానిని రద్దు చేసి నేను ఎవరికీ గురువును కాను నాకెవరు అనుచ రులు లేరు అని ఆ సంస్థ ఆస్తుల్ని సంపదలని వారికి పంచిపెట్టాడు.అప్పటినుండి  1986లో చనిపోయేంత వరకు ప్రపంచ మంతా పర్యటిస్తూ,ప్రజలను కలుస్తూ, చర్చిస్తూ గురువు లాగా కాకుండా,ఒక స్నేహితుడి లాగా వ్యవహ రించాడు.ఆయన పుస్తకాల జ్ఞానంతో కాక మానవుడు ఎదుర్కొనే పరిస్థుతులపై  తన అంతరదృష్టి తో,పవిత్రమైన మనస్సు తో,ఒక ప్రత్యేకమైన తత్వం చెప్పకుండా జీవిత సమస్యలను ప్రస్తావిస్తూ వెళ్ళారు.
           ఆయన ఏ మతానికి,ప్రాంతానికి,దేశానికి చెందకుండా ,ఏ సంస్థను స్థాపించకుండా ,ఏ తత్వాన్ని ప్రచారం చేయకుండా ప్రపంచమంతా తిరుగుతూ తూర్పు,పశ్చిమ దేశాల్లో ,అన్ని కాలాల్లోని తత్వవే త్తల్లో  గొప్ప స్థానం సంపాదించుకున్నారు.
*ప్రకృతి సృష్టించిన ఈ అందమైన భూమిని,పర్యావరణాన్ని ,ఇందులో నివసిస్తున్న మానవులను రక్షించుకోవాలని పిలుపిచ్చారు.
ఆయన బోధనల్లోని ముఖ్యాంశాలు.
*సత్యానికి మార్గం ,పథం అంటూ ఏమీ లేదు.
* అన్ని జీవనకళల్లోకి  ధ్యానం ఉన్నతమైనది.
*అసలైన విప్లవం పేరు ప్రేమ.మనిషిలోను,సమాజం లోను మార్పు తీసుకు రాగలిగింది ప్రేమ.
*మనలో మానసిక విప్లవం రావాలి.గతాన్నిపూర్తిగా నాశనం చేయగల విప్లవం.
*జ్ఞానం వలన మనిషి సమస్యలు పరిష్కారం కావు.సమస్య పరిష్కారానికి వివేకం కావాలి.
*ప్రేమ నిండిన మనస్సులోనే సత్య దర్శనం అవుతుంది.
*హృదయం చెప్పింది వినండి.హృదయం చెప్పినట్లు చేయండి.వెలుగు మీలోనే వుంది.
*నిన్నునీవు  గమనించు.అదే ధ్యానం.ధ్యానం అన్నది పరిపూర్ణ స్వేచ్చ.
*జీవించి ఉండగానే బంధాలన్నీ వదిలి మనసు శూన్యం అయితే ....మృత్యువు తర్వాత అదేకదా స్థితి.జీవిస్తూనే అలా మృత్యువును అనుభూతించడం  గొప్ప అనుభవం.అదే సిసలైన ధ్యానం.
*ప్రేమ,అనురాగాలతో మనిషిలో మార్పు వస్తుంది.మనలో ద్వేషం వుంటే ఇవి ఏర్పడవు.
*మరో జన్మ లేదు.భూమి మీద పుట్టిన ప్రతి జీవి నశిస్తుంది.ఆ రహస్యం తెలుసుకోవడమే జ్ఞానం.
జీవించడం అంటే ప్రతిరోజు పెంచుకున్న అనుబంధాల్ని ఒక్కొక్కటిగా తెంచుకోవడం.
*వివేచనతో,విచక్షణతో,అవగాహనతో.చైతన్యంగా ,స్వేచ్చగా,వర్తమానం లో వినడం అనేది జీవితంలో అన్నింటి కన్నా ముఖ్యం.మనం ఏ  పని చేసినా దానిని ప్రేమతో చేయాలి.
*సత్యం మీ నిత్య జీవితం లోని ప్రతి కదలిక లోను వున్నది.
*సత్యాన్వేషణమే నిజమైన విద్య.
*విద్య యొక్క  కర్తవ్యం ప్రజ్ఞావంతులైన సమగ్ర మానవులను,పూర్ణ పురుషులను సృష్టించడం.
కృష్ణ మూర్తి  సంభాషణలే తర్వాత పుస్తకాలుగా వెలువడ్డాయి.వాటిలో ముఖ్యమైనవి .
1)Education and the significance of life
2)commentaries on living (written by krishna murti)
3)The First and the last Freedom
4)note book
4)freedom fro the known
5)beyond violence
6)The awakaning of inelligence
7)A World in a crisis
8)ఈ విషయమై ఆలోచించండి.
9)గరుడ యానం
10)నీవే ప్రపంచం
11)విద్య:అందు జీవితమునకు గల ప్రాధాన్యం
జీవితాన్ని  గురించి  క్షుణ్ణంగా  తెలుసుకోవాలనుకునే  వారు ఆయన రచనలు,బోధనలను పరిశీలించాలి.
ఆయన విద్యకు జీవితం లో చాలా ప్రాముఖ్యత ఇచ్చారు.అందుకై అమెరికా,ఇంగ్లాండ్ ,ఇండియా లలో
స్కూల్స్ ఏర్పాటు చేసాడు.
ఈ దిగువ వెబ్ సైట్  లలో ఆయన గురించి మరింతగా తెలుసుకోవచ్చు.

*     www.kfionline.org
*     www.jkrishnamurti.org

The official Krishnamurti Schools are:

కృష్ణ మూర్తి చే స్థాపించబడ్డ స్కూల్స్ .

1)USA - Oak Grove School
220 W. Lomita Ave., Ojai, California 93024-1560 USA
Tel: (805) 646-8236 Fax: (805) 646-6509
Email: office@oakgroveschool.com
Admissions: enroll@oakgroveschool.com
Web: www.oakgroveschool.com

2)UK - Brockwood Park School
Bramdean, Hampshire, SO24 OLQ, England
Tel: 011-44 (0)1962 771744 Fax: 011-44 (0)1962 771875
Email: info@brockwood.org.uk
Web: www.brockwood.org.uk

3)India - Rishi Valley Education Center
Rishi Valley - 517 352, Chittoor District, Andhra Pradesh, India
Tel: 011 91 8571 62037
Fax: 011 91 8571 68622
Web: www.rishivalley.org
India - Rajghat Education Center

4)Rajghat Besant School, Rajghat Fort, Varanasi
Tel: 91-542-2430336, 2440717, 2441536
Emails: rbskfi@gmail.com, kfirajghat@gmail.com
Webs: www.j-krishnamurti.org, www.rajghatbesantschool.org

5)India - The School "Damodar Gardens"
Besant Avenue, Chennai - 600 020 India
Tel:011 91 44 491 5845
Web: www.theschoolkfi.org

6)India - Bal Anand, Mumbai
Akash Deep, 28 Dongersey
Road Malabar Hill, Mumbai--400 006

7)India - The Valley School Bangalore Education Center
"Haridvanam", 17th K.M. Kanakapura Road,
Thatguni Post, Bangalore - 560 062 India
Tel: 011-91-80-843-5240
Fax: 011-91-80-843 5242
Email: kfiblr@blr.vsnl.net.in
Web: www.jkstudy.org

8)India - Sahyadri School
Sahyadri School, Post Tiwai Hill, Tal. Rajgurunagar, Dist. Pune 410 513
Thatguni Post, Bangalore - 560 062 India
Tel: 011 91 2135 84270/84271/84272
Fax: 011 91 2135 84269
Email: sahyadrischool@freeyellow.com
Web: www.sahyadrischool.org:    

Sunday, 6 May 2012

నేడే గౌతమ బుద్ధ జయంతి


                                  ఈ రోజు గౌతమ బుద్ధ జయంతి .మానవాళికి తెలిసిన అతి ప్రాచీన తాత్వికులలో ఆయన ఒకరు.సంక్షిప్తం గా బుద్ధుని గురించి ఆయన బోధనల గురించి తెలుసుకుందాము.ఈయ న అసలు పేరు గౌతముడు..తండ్రి శుద్దోధనుడు,తల్లి మాయాదేవి.క్రీ .పూ 565_485 మధ్య కాలం లో జీవించాడు.తల్లి మరణం తో పినతల్లి మహాప్రజపతి పెంచింది.యుక్తవయస్సు లో యశోధర తో వివాహం అయింది.వారికి ఒక కుమారుడు.పేరు రాహులుడు.నేడే 
       దారుణమైన ,నివారణా సాధ్యమైన మానవాళి కష్టాలు ఆయన అనుభవం లోకి వచ్చాయి ఆకలి అంటురోగాలు,ఆహార కొరత వీటిని ఆపేందుకు మార్గం లేదా అని ఆలోచించాడు.ఇవన్నీ చూస్తూ రాజ భోగాలు అనుభవిస్తూ ఉండటమా!లేక గొప్ప లక్ష్య సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేయడమా!నాటి ప్రజాబాహుల్యం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు ఒక పరిష్కారమార్గాన్ని కనుగొనుటకు అవసరమైన జ్ఞానాన్ని సంపాదించడానికి రాచరిక జీవితాన్ని వదిలి వేశాడు.ఏడు సం:సుదీర్గమైన తపస్సు అంటే పరిశోధన చేసాడు.బుద్ధగయ వద్ద జ్ఞానోదయం అయింది.కఠినమైన శిక్షణ,ఏకాగ్రత అలవరచుకున్నాడు.ఒక ప్రత్యేకమైన జీవన విధానాన్ని,ఆలోచనా విధానాన్ని సాధన చేసేందుకు అనుగుణంగా తన శరీరాన్ని మన సును పదును పెట్టుకున్నాడు.బుద్ధుడు అనే బిరుదు ప్రజలు, శిష్యులు ఆయనికి ఇచ్చారు.గౌతముడు ఈ జ్ఞానాన్ని ,మానసిక పరిపక్వతను అద్యయనం,బోధన అనే నిరంతర ప్రక్రియల ద్వారా సంపాదించు కున్నాడు .
       ఆయన బోధనల్లోని ముఖ్యాంశాలు.
*"నా లోపలినుంచి జ్ఞానం ఉదయించిన తర్వాత కోరికల మత్తునుంచి,పునర్జన్మ మత్తునుంచి అజ్ఞానమనే మత్తు నుంచి నా హృదయం ,నామనసు విముక్తి చెందాయి.జ్ఞానం,స్వాతంత్ర్యం నాకు స్వేచ్చను ప్రసాదిం చాయి.పునర్జన్మ లేదని నాకు తెలిసింది.నేను నా లక్ష్యాన్ని చేరుకునాను."
     స్వీయ జ్ఞాన సముపార్జన కోసం దుర్భరమైన కష్టాలు అనుభవించిన అనంతరం గౌతముడు జ్ఞానిగా మారాడు.అప్పటినుండి బుద్ధునిగా పిలవ బడ్డాడు.
*"భావోద్రేకాల ఉచ్చును చేదించడం తెలిసిన వాడిని,జనాన్ని కష్టాల సుడిగుండం నుంచి కాపాడగలిగిన వాడిని,ఐహికవాంఛలకు స్వస్తి పలికి వాటి కాటుకి బలికాకుండా చేయగలిగిన వాడిని.సత్యమనే వెలుగు ద్వారా అజ్ఞానపు చీకటిని చెల్లా చెదురు చేయగలిగిన వాడిని తద్వారా మనిషికి అసలైన నిబ్బాన(నిర్వాన)దశను అందించగల వాడిని నేనే!"
    తాను ప్రవచించింది ఆచరించి చూపిన  మనీషి బుద్ధుడు .ధనం కోసం గాని కీర్తి గాని ఆశించకుండా ఏ వ్యక్తి అయినా వ్యవహరిస్తే అతనే బుద్ధుడు.తనకు తాను ఏ దివ్యత్వాన్ని ఆపాదించుకోలేదు.
   హృదయ బంధనాలు విచ్చిన్నమయ్యాయి.సందేహాలన్నీ  పటాపంచలై,భవబంధాలను ప్రేరేపించే కర్మలన్నీ  నివ్రుత్త మయ్యాయి.పరమ సత్యం తేట తెల్లమయింది.బుద్ధుని హృదయం కరుణతో నిండి పోయింది.
 ఆయన ప్రవచించిన అష్టాంగ మార్గం.
1)సమ్యక్ దృష్టి (మంచి ఉద్దేశాలు)RightViews
2)సమ్యక్ సంకల్పం (మంచి  ఆశలు)Right Aspirations
3)సమ్యక్ వచనం (మంచి  మాటలు)Right Speech
4)సమ్యక్ కర్మ (మంచి ప్రవర్తన)Right Conduct
5)సమ్యక్ జీవనం(మంచి బ్రతుకు దెరువు)Right Livelyhood
6)సమ్యక్ ప్రయత్నం(మంచి వ్యాయామం) Right Effort
7)సమ్యక్ స్మృతి(మంచి మనస్సు,ఆలోచనలు) Right Mindfulness
8)సమ్యక్  సమాధి(మంచి ఉల్లాసం స్వీయ నియంత్రణ)Right Contemplation
               ఇవి బుద్ధుడి తత్వ శాస్త్ర మూలాలు.
    ఈ విశ్వానికి ఒక క్రమబద్దత వున్నదని ,దాని తీరుకు ఒక ఆధారం వున్నదని ప్రకటించాడు.జ్ఞాన శాస్త్రం మీద ఈ ప్రకటన ప్రభావం అపారంగా వుంది.
బుద్ధుడు బౌతిక ఆధ్యాత్మిక వాదాన్ని మేలవించాడు.తన జీవితమంతా ఆత్మ చైతన్యం ,ఆత్మ నియంత్రణ కోసం కృషి చేసాడు.
*కోరికలు,లోభం దుఖానికి కారణం.బాధ,బాధకు మూలం ,బాధా విముక్తి,బాధా విముక్తికి మార్గం--ఈ మహాసత్యాలు సంపూర్ణం గా అవగాహన అయిన తర్వాత జీవన ప్రక్రియ పట్ల మొహం నశిస్తుంది.
*సంపూర్ణంగా మనసా,శారీరకంగా సత్యాన్వేషనే లక్ష్యం.
*అనిత్యమైన అహాన్ని వదిలి నిత్యమైన సత్యాన్ని గుర్తించాలి.
పౌర సమాజానికి ప్రవర్తనా నియమావళిని రూపొందించిన గొప్ప ప్రాచీన తాత్వికుడు బుద్ధుడు.
ఒక కారణం నుంచి మొదలయ్యే వాటన్నింటికి బుద్ధుడు కారణాన్ని వివరించాడు.ప్రతి కారణం ఎలా అంతమవుతుందో కూడా చెప్పాడు.ఇదే మహా జ్ఞాని ప్రవచనం.
 ప్రతి దానికి ఒక కారణం వుంటుంది.ప్రతి కారణానికి తనదైన ప్రభావం వుంటుంది.అనే సత్యాన్ని కనుగొనడం ద్వారా సమకాలీన పాశ్చాత్య తత్వవేత్తల నందరినీ అధిగమించాడు.
*కారణం _ప్రభావం.
   క్రీ.పూ ఆరవ శతాబ్దిలో బుద్ధుడు ఇంతటి సమున్నత శిఖరాలు అందుకోవడం చాల గొప్ప విషయం.
     బుద్ధుడు  తన  80 వ  ఏట క్రీ.పూ 480_485 ప్రాంతం లో చనిపోయాడు.
(కంచ ఐలయ్య గారు ,స్వామి రంగనాదానంద గార్ల  రచనలనుండి సేకరించిన సమాచారాన్ని ఇచ్చాను.వారికి సదా కృతజ్ఞతలు.)
           


Friday, 4 May 2012

చెలీ!


                                     విశాల విశ్వంలో నీవు వినిపించని
                                     గీతికలా వున్నావెందుకు
                                     ఆ గీతాన్ని నాకిస్తే శ్రుతి చేసి
                                     మధురంగా పలికించనా
                                సముద్రంలో చిన్న అలవై
                                మిగిలిపోయావెందుకు
                                కెరటంలా ఒడ్డుకు రావా
                                నన్ను నీలో కలుపుకునేందుకు 
                                     వెన్నెల ఆకాశంలో చిన్న
                                     నక్షత్రమై వెలుగుతావెందుకు
                                     పున్నమి వెన్నెలవు నీవైతే
                                     పులకరించే కలువను నేను కానా
                               వాన వెలసిన వేళలో
                               ఒంటరిగా వున్నావెందుకో
                               ఇంద్ర ధనుస్సువు నీవైతే
                               ఆ వింటినారిని నేను కానా
                                    తెలవారిన తర్వాత
                                    ఏటి ఒడ్డున నీటి కోస్తావెందుకు
                                    కొద్దిగా ముందొస్తే  సుప్రభాత సంగీతాన్నై
                                    నీ వీనుల విందు చేయనా
                              చెలీ నా భావాల వీణ లోని
                              ప్రతి తీగను మీటాను
                              ఏ రాగం నిన్ను కదిలించినా
                              ఆ తొలకరి మేఘాని కందించవా  

Thursday, 3 May 2012

జాతీయ ఆనంద సూచిక

          ఇంతకు ముందు పోస్ట్ లో  మానవ  జీవిత లక్ష్యమేమిటి? అంటే ఆనందం అని తెలుసు కున్నాము. మరి ఒక దేశం దాన్ని తన జాతి జీవన విధానం గా మలిస్తే ఎలా వుంటుంది.భూటాన్ లా వుంటుంది.అన్ని దేశాలు Gross National Product(GDP)  ను లెక్కిస్తుంటే భూటాన్  మాత్రం Gross National Happieness(GNH) ను లెక్కిస్తుంది.అంటే స్థూల జాతీయ ఆనందం .ఎంత బాగుందో కదా!
                        వారిని పర్యావరణ మైత్రి,సంస్కృతి పరిరక్షణ,సుపరిపాలన,ఆర్ధిక వృద్ది  నిత్య సంతోషం గా వుంచుతు న్నవి.వాళ్ళు ప్రకృతిని విపరీతం గా ప్రేమిస్తారు.అక్కడ 72% అడవులు వున్నాయి .జంతువు లను వేటాడరు ,నదుల్లో చేపలను కూడా పట్టరు .బౌద్ధం వారి జీవన విధానం .ప్రకృతి మా ప్రాణం అంటారు వారు.టి.వి. వారి దేశం లో 1999 లో ప్రవేశించింది.తమకు అంగీకారం కాని చానళ్ళకు అడ్డుకట్ట వేసింది.
               ప్లాస్టిక్ మీద అక్కడ పోరాటం జరుగుతోంది.ఇక్కడ  అన్ని రకాల పొగాకు అమ్మకాలు నిషిద్దమే!ఇక్కడ నీరు,గాలి అత్యంత స్వచ్చంగా వుంటాయి.పర్యావరణాన్ని  పారిశ్రామీకరణ  దెబ్బతీస్తుందని ప్రోత్సాహించటం లేదు.పర్యాటకుల వల్ల కూడా పర్యావరణం దెబ్బ తింటుందని  వారిని నియంత్రిస్తారు.
         ఇంతలా పర్యావరణాన్ని ప్రేమిస్తూ ప్రకృతి లో ఆనందం గా బ్రతుకుతున్న దేశాన్ని,ప్రజలను ఎక్కడా చూడలేమేమో!జీవితాన్ని సంతృప్తిగా ,మనః శాంతిగా గడపడానికి అక్కడి ప్రభుత్వం పనిచేస్తుంటే ప్రజలంతా దానికి మద్దతు పలుకుతున్నారు.ఓ సారి ఆ దేశాన్ని చూసొద్దామా!
     (మూలం :ఈనాడు ఆదివారం పుస్తకం .వారికి కృతజ్ఞతలు.)

Monday, 30 April 2012

నేడే!మేడే!

హలాలతో పొలాలదున్నీ
జాతికి జవసత్తువనిచ్చే 
కర్షకవీరుల త్యాగం.
గనిలో,పనిలో,ఖార్ఖానాలో  
విరామమెరుగక,విశ్రమించక
జగతికి జవజీవాలిచ్చే 
కార్మికధీరుల కష్టం.
మెలి తిరిగే నరాలతో 
పట్టువీడని కరాలతో
జనుల అవసరాలు తీరుస్తున్న 
శ్రామిక లోకపు స్వేదం.
కండర కష్టం నమ్ముకొని 
ఎండను,వానను,చలినీ 
లెక్కచేయని తత్వం.
చక్రం,రంపం
పగ్గం ,మగ్గం
కొడవలి,నాగలి
సమస్త వృత్తులు
శ్రమైక జీవన సౌందర్యానికి 
అచ్చమైన ప్రతీకలు.
మీ కల్యాణానికి 
మీ సౌభాగ్యానికి 
మీ పోరాటానికి 
నేడే!మేడే!
                   ఈ కవితకు స్పూర్తి  శ్రీశ్రీ మహాప్రస్థానం లోని ప్రతిజ్ఞ అనే కవిత    
                                 శ్రామిక లోకానికి మేడే శుభాకాంక్షలు.

Saturday, 28 April 2012

మానవ జీవన లక్ష్యమేమిటి?3


             మానవ జీవన లక్ష్యమేమిటి? ఈ  ప్రశ్నతో ఇంతకు ముందు వ్యాసం ముగించాను కదా! వ్యాసంలో  మనకు నష్టం చేసే సంస్కారాలను పేర్కొన్నాను.వాటిలో కొన్ని జన్యుపరంగా వచ్చే అవకాశం కూడా వుంది .ఉదాకోపము అలాగే మంచి సంస్కారాలు కూడా ఏర్పడతాయి. పరిసరాలద్వారా, ఎదురయ్యే సంఘటనల ద్వారా ఎదు ర్కొన్న సమస్యల ద్వారా, తల్లిదండ్రులు నేర్పిన విలు వల ద్వారా ఇవి ఏర్పడుతుంటాయి.
             అవి ప్రేమ,కరుణ,దయ,సహనం ,శాంతి,అహింస,సేవాగుణం ,సర్దుకుపోయే తత్వం,అర్థంచేసుకోవటంఅణకువ ,విచక్షణ కలిగివుండటం,వినయం,వివేకం,త్రుప్తి,ప్రశాంతత నిరహంకారం ,ఆశావాదదృక్పథం, గెలుపు, ఓటములను సమంగా తీసుకోవటం, కుతూహలం ,ఆసక్తి ,పెద్దలను గౌరవించటం ,నిజా యితి,స్వచ్చత,పవిత్రత, స్నేహతత్వం,ఆనందం,మానవత్వం,నైతికత,సత్యమునే పలకటం,క్రమశిక్షణ, జిజ్ఞా,బాధ్యత,అన్వేషణా దృక్పథం   విధేయత,నమ్మకం,సమయపాలన,నిస్వార్థం,మర్యాద ,ప్రశంసించటం,అంకితభావం,పట్టుదల,కృషి,ప్రశాంతచిత్తం మార్పును ఆహ్వానించటం ,ఓపిక,జాగ్రత్త,సున్నితత్వం సోదరభావం,క్షమాగుణం సానుభూతి,జాలి,ప్రోత్సాహంకృత జ్ఞత,అవగాహన,దేశ,వర్ణ,కుల,మత,ప్రాంతాలకతీతమైన మనస్తత్వం (విశ్వమానవ సౌబ్రాత్రుత్వం) వంటివి.వీటిలో కూడా కొన్నిజన్యుపరంగా,జీవితంతో పాటు నేర్చుకునేవి కొన్నివుంటాయి.కానీ ప్రస్తుతం సంస్కారాలు మనుష్యు లలోతగ్గి పోతున్నాయి.
           మనం చేసే చర్యలను బుద్ది ఇది తప్పు,ఇది ఒప్పుఅని చెబుతూవుంటుంది.కానీ దాని మాటను మనసు లెక్కచెయ్యదు.మనిషి వ్యతిరేక సంస్కారాలు ప్రదర్శించటం,అనుభవించటం అలవాటు చేసుకున్నాడు.పై చెప్పిన అనుకూల సంస్కారాలపై నిలబడాలంటే ఎంతో నిబద్ధత కావాలి.బ్రతుకు పోరాటంలో పడి ఇవన్నీ వదిలేసి నష్ట పరచే సంస్కారాలను పెంచుకుంటూ పోతున్నాడు.కాని మనకు తెలియకుండా ఇవన్నీ మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపి రకరకాలైన మానసిక వ్యాధుల రూపంలో దీర్ఘకాలికంగా వస్తున్నాయి.మంచి సంస్కారాలు మనిషికి అద్భుత మైన  ఆరోగ్యాన్నిస్తాయి.చూడండి! పల్లెటూరి వారికి రక్తపోటు,షుగర్,గుండె జబ్బులు,అధిక బరువులాంటి సమస్య  లు చాలా తక్కువగా వుంటాయి .కోరికలు తక్కువ .ఉన్నదానితో సంతృప్తి చెందుతారు.
                         ఇక మనిషి జీవిత లక్ష్యమేమిటి? పాటికే మీకు అర్థమయ్యే వుంటుంది.
            క్షణక్షణం ఆనందంతో జీవించటం.సుఖ,సంతోషాలు బాహ్యమైనవి.ఆనందం అంతర్గత మైనది .అది లోపలి నుండి పెల్లుబుకుతుంది.హృదయము నుండి మనసులోకి వస్తుంది.మంచి సంస్కారాలతో ఆనందం వస్తుంది మనస్సంతా ప్రేమను నింపుకొని వుంటే మనమంతా అన్వేషించే అద్భుతం ప్రత్యక్షమవుతుంది అదే సత్యం.  

Friday, 27 April 2012

నా హృ(మ)ది లో ...



మానస వీణకు తీగెలు సరిచేసి
స్వరాలు కూరుద్దామని కూర్చున్నా
సంధ్యా సాగరపు ఒడ్డున
అప్పుడప్పుడు పాదాలు స్పృశించే
అలల చిరుతాకిడి  చెంతన
మనసు నా వశం కావటం లేదు
సరిగమలు పలికిస్తున్నంతలో
ఉవ్వెత్తున సవ్వడి చేస్తూ కెరటాలు
ఎక్కడికో వెళ్లాలని
సముద్రుని విడిచి ఎగరాలని
అంతలోనే మళ్ళీ వెనక్కి
నా ఆలోచనలు అంతే
ఓ వరుసలో కూర్చి పాటగా పలికిద్దామన్నా 
పల్లవులను కూర్చి గొంతెత్తి పాడుదామన్నా
ఏవో సంక్లిష్ట సంకేతాలు
మరేవో అస్పష్ట సంగీతాలు
నా మనో సాగరాన ఒక్కోసారి నెమ్మదిగా
ఇంకోసారి ఉధృతంగా విరుచుకుపడే స్థాయిలో
ఏవేవో ఒత్తిడులు
మరేవో బంధాలు
ఒత్తిడులనుండి కొన్ని దృశ్యాలు
బంధాలనుండి మరిన్ని చిత్రాలు
కాని కెరటాల్లా కాకూడదు నావి
నిగ్రహంతో లక్ష్యాన్ని ఢీకొనాలి
తీగెలు సరిచేస్తూ కాలం గడిపేయకూడదు.
గుర్రపు గిట్టల బలంతో విచారపు
గతాన్ని వెనక్కి తన్ని
వర్తమానపు సంకేతాలను మోసుకుంటూ
భవిష్యత్ ఛాయాపథం లోకి దూసుకెళ్ళాలి.
తేనె లొలుకు తెనుగుకు మాలలు కట్టి
తీయనైన పాటలతో హారతి పట్టి
ముందుకు మున్ముందుకు వెళతాను
కష్ట జీవి స్వేదంతో నేను కలిసిపోతాను
కార్మికుడి కన్నీటిలో లీనమౌతాను
అనాధ నేత్రాలకు వెలుగౌతాను
ఇదంతా కేవలం భావోద్వేగం కాదు
నా హృదిలోని  స్పందనలు
నా మదిలోని   భావనలు

Thursday, 26 April 2012

"విజ్ఞానశాస్త్రము"అనే నూతన బ్లాగు

                సైన్సు పై తెలుగులో "విజ్ఞానశాస్త్రము"అనే నూతన బ్లాగును ప్రారంభిస్తున్నాను.ఇంతవరకు ఏ అగ్రిగేటర్ లో చేర్చలేదు. కారణం మొదట దానిని ఇంగ్లీష్ బ్లాగు గా ప్రారంభించటమే!ప్రస్తుతం దీన్ని తెలుగు లోకి మార్చి అన్ని agregators తో  లింక్ చేయటం జరిగింది.
              సైన్సు ద్వారా సత్యాన్వేషణ మరియు శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ది చేయటం దీని ప్రధాన ఉద్దేశం .విద్య అంతా ఇంజనీరింగ్,మెడిసిన్ ల వైపు వెడుతుంది.సైన్సు గురించి తెలియజేయటమే కాకుండా అందులో కుతూహ లాన్ని,జిజ్ఞాసను రేకెత్తించే విధంగా ఇందులో వ్యాసాలూ వుంటాయి.మీ పిల్లలచేత చదివించి మీరు అర్థము చేసుకొని వారికి వివరించగలరు.
              ప్రస్తుతం ఈ విశ్వం 18  సూత్రాలు పై నడుస్తుందని శాస్త్రవేత్తలు తీర్మానించారు.వాటి గురించి వ్యాసాలూ వస్తు న్నాయి. విద్యార్థులు,ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు .సైన్సు పట్ల ఆసక్తి వున్నవారు  దీనిని ఉపయోగిం చు కోగలరు 
ఈ   బ్లాగు  పై దీని url వున్నది . ఈ బ్లాగు   url   http://cvramanscience.blogspot.in  

Tuesday, 24 April 2012

మన మనసులో సంస్కారాలు ఎలా ఏర్పడతాయి ?2


                వ్యాసం లోని మొదటి భాగం లో చెప్పిన దశ లోపే చిన్నప్పటి స్వచ్చత,సున్నితత్వం ,స్వేచ్చ,ఆనందం సగం కోల్పోతాము.ఇక వివాహ జీవితం,తల్లిదండ్రుల పోషణ ,పిల్లలు, ఆర్థిక పరిస్థితులు ఎన్నో వస్తాయి.ఇద్దరు ఉద్యో గం చేస్తే వచ్చేవి ,చేయకపోతే వచ్చేవి,ఆఫీసులలో,పొరుగువారితో స్నేహితులతో ,బంధువులతో  వచ్చే సమస్య లు ఇలా మొత్తం జీవితంలో బాధ్యతలు,బంధాలు.సమస్యల సుడిగుండంలోమనిషి పూర్తిగా కూరుకుపోతాడు .పెళ్ళయి న కొత్తలో సరదాగా వున్నా పిల్లలు,వారి ఆరోగ్యాలు ,వారి పెంపకం పెద్ద సమస్య.వారు బడికి పొయ్యే  దశ కు వచ్చే సరికి ఫీజులు,వారి చదువు సమస్య . లోపు సంసార జీవితంలోని మధురిమలు తగ్గి సమస్యల బరువు పెరిగి రకరకాలైన మానసిక లక్షణాలు మనిషిలో స్థిరపడి పోతాయి
         అవి భయం ,ఆందోళన,ఒత్తిడి,అనుమానం అసహనం,విసుగు,బద్ధకం,అలసట, ఆరోగ్యం గురించి చింత అరిష డ్వర్గాలయిన  కామ,క్రోధ,లోభ,మోహ,మద మాత్సర్యాలు,ఈర్ష్య,అసూయ కోపం,ద్వేషం పోటీతత్వం, అసంతృప్తి అశాంతి ,ఘర్షణ,పెనుగులాట,ఒంటరితనం,నైరాశ్యం,ప్రేమరాహిత్యం ,బ్రతుకు పోరాటం,గందరగోళం,వైషమ్యాలు ఆగ్రహం, నేను అనే అహంకారం,ఆధిక్యతా భావన ,న్యూనతా భావన, కపటం,మోసం చేయటం,కోర్కెలు, సుఖాసక్తి భీతి,అభద్రతా ,వేదన, నటన,అబద్దాలాడటం,చాడీలు చెప్పటం,ఇతరులను విమర్శించటం(ప్రత్యక్షంగా పరోక్షంగా) ఇతరుల వినాశనాన్ని కోరటం,ఇతరులకు హాని చేయటం,అవినీతి,ఆశ్రిత పక్షపాతం,లంచం తీసుకోటం,ఇవ్వటం హింస ,క్రౌర్యం ,రాగ భావోద్వేగాలు, వంటి అనేక రకాలైన మానసిక లక్షణాలు మనలో స్థిర పడి పోతాయి.మరి    చిన్నప్పటి కల్మషం లేని స్వచ్చమైన ,స్వేచ్చ కలిగిన పై చెప్పిన లక్షణాలు ఏవీ లేని మనసును పొందటం ఎలా?మనసు వాటన్నింటిని వదిలి ఉండ లేదా?
          అటువంటి మార్పు మనసు కోరుకుంటుందా!జీవితపు పరుగు పందాన్ని ప్రతి మనిషి ఎన్నోకోరికలు ఆశ లు ,ఆకాంక్షలతో మొదలు పెడతాడు.కొంత మంది తమ లక్ష్యాలను చేరుకుంటారు.కాని లక్ష్యం చేరుకున్న వారైనా ,చేరని  వారయినా ఎక్కువ శాతం జీవితాన్ని మాత్రం మధ్యలో కోల్పోతారు.ఎందుకిలా జరుగు తోంది తన జీవి తం తనకు కాకుండా పోయినతర్వాత మనిషి ఎందు కోసం ఇన్ని సమస్యలతో ఇంత బాధతో దిగులుతో జీవితా న్ని గడుపుతున్నాడు?మరణం వరకు ఇదే స్థితిని అనుభవించాలా ?మరి మనకి ఏ  స్థితి కావాలి?
            మానవ జీవిత లక్ష్య మేమిటి?దాని కంటే పెద్ద ప్రశ్న?మన(నీ,నా)జీవిత లక్ష్యమేమిటి ?తరువాతి  వ్యాసం లో ఈ  విషయాలు చర్చిద్దాము.

Sunday, 22 April 2012

మన మనసులో విభిన్న సంస్కారాలు(ముద్రలు)ఎలా ఏర్పడతాయి?1



ఒక సారి అందరం బాల్యం లోకి వెళ్లి వద్దామా!ఒక సారి ఆలోచించండి .అప్పుడు మన మనస్సులు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా వున్నాయి? కదా!ఎంత తేడా ! అసలు ఎటువంటి కల్మషాలు లేకుండా స్వచ్చంగా ,స్వేచ్చగా , బాధలు,భయాలు కష్టాలు లేకుండా రోజు పనులు ఆరోజు చేసుకుంటూ వర్తమానాన్ని ఆనందంగా అనుభవిస్తూ ఆడుకుంటూ, స్నేహితులతో నవ్వుతు ,త్రుళ్ళుతూ ,కబుర్లు చెబుతూ ,సాయంత్రం చదివినంత చదివి ప్రశాంతం గా గాఢ నిద్ర పోయి ఉదయాన్నేఆనందంగా నిద్ర లేస్తాము.ఎక్కడా ఇప్పుడు మనకున్న రకరకాలయిన లక్షణాలు అప్పుడు ఏమీ లేవు.మన జీవితం లో చదువు ఒక భాగం మాత్రమే! అన్ని విషయాలు మన బాల్యం లో ప్రధాన పాత్ర పోషించేవి.ఉమ్మడి కుటుంబాలు,పంటచేలు,పిల్లకాలువలు, ఊరి రచ్చబండ, హరి కథలు,బుర్రకథలు,తెర సినిమాలు,తోలుబొమ్మలాటలు,పండుగలు ఇలా ఊరంతా సందడిగా వుండేది.పట్టణాల్లో కూడా పదిహేను ఇరవై సంవత్సరాల క్రిందట  క్రిందట ఇంత వేగవంతమైన జీవితం లేదు.
          విషయమేమంటే మన బాల్యం లో మన మనసు పరిస్థితి ఏమిటి !ప్రస్తుతం మనం ఎలా వున్నాం.మధ్యలో మన మనసుకే మయింది.పదవ తరగతి వరకు పల్లెల్లో వున్నాం ఇంటర్ కు పట్టణాల్లోకి వచ్చాం.ఇంటర్లో కూడా చదువు,సినిమాలు,ఆటలు అన్ని కలిసి ఉండేవి రోజుల్లో కాలేజీ లలో ప్రేమలు అంతగా లేవు.అమ్మాయిలతో మాట్లాడాలంటే నే సిగ్గు.ఇక ప్రేమలు కూడానా!అసలు ఇంటర్ పూర్తి అయ్యేలోపు ఒకటి రెండు మాటలు మాట్లాడితే గొప్ప.అలాగే డిగ్రీ లో అప్పుడప్పుడే చిరు ప్రేమలు అక్కడా ఇక్కడా కనిపిస్తుండేవి .ఎక్కువ స్నేహితులతో గడపటం సరదాగా సినిమాలు అలా అలా గడిచిపోయింది.కాని ఇక్కడే ఎవరికయినా కొన్ని అనుభవాలు నమోదవుతాయి. .స్నేహితులతో మన ప్రవర్తన,ఒకోసారి స్నేహితుల దూరం ,అమ్మాయిలతో సరదాగా మాట్లాడటం స్నేహం అనుకోవ టం,తరువాత ప్రేమ అనుకోవటం, ఒకవైపునుండే ఆరాధించడం ,చెప్పలేకపోవటం ,డిగ్రీ అయిపోవటం చివరికి ఏమి కాకుండా పోవటం . ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని అనుభవాలు.ఇక డిగ్రీ తరువా ఉద్యోగ ప్రయత్నాల్లో కష్టా లు మొదలవుతాయి.అప్పటి దాకా వున్న ప్రపంచం వేరు ఇక పోటీ వాతావరణం లోని ప్రపంచం వేరు.ఇక్కడి నుండి ఉద్యోగం సంపాదించుకోవటం  వరకు ఒక దశ ! .  దశలో  మనకెన్నో  సమస్యలు ,ఆర్ధిక  పరమైనవి మానసిక పర మైనవి స్నేహం ,ప్రేమలు మనల్ని వెంటాడుతుంటాయి.సరే అందరు ఏవో ఒక తిప్పలు పడి ఉద్యోగంసాధించు కుంటారు  .
          ఆకష్టాలు,ఇబ్బందులు,ఎదురయ్యే చెడు పరిస్థితులు ఇవన్నీ కలిపి మనలో రకరకాలైన అనుభవాల ముద్ర లు, మనకు విభిన్న వైఖరులు ఏర్పడే విధంగా చేస్తాయి ఉద్యోగం వస్తుందో రాదో అని భయం, ఆందోళన, భవిష్యత్తు తలచుకొని దిగులు,మానసిక ఒత్తిడి అందులో డబ్బు కోల్పోయేవారు,లంచం ఇచ్చి మోస పోయే వాళ్ళు కోచింగ్ లకి ఎంతో డబ్బు ఖర్చు కావటం ఇలా ఎన్నో సమస్యలు వేధించి వుంటాయి.ఇక విదేశాలకు పోయేవారి కష్టాలు,వీసాల కోసం తిప్పలు ఇవన్నీ ఒక జీవితానికి సరిపడా అనుభవం వచ్చేస్తుందిఉద్యోగం దొరికితే ఓకే .దొరక్కపోతే మరింత ఇబ్బంది.ఏదో ఒక వ్యాపారం,వ్యవసాయం లాంటి స్వయం ఉపాధి పనుల వైపు మళ్లుతారు.
         ఇక అసలు సమస్య మొదలు.వివాహం. ముందుగా ప్రేమించుకున్న వారు ఉద్యోగం రాకుండానే పెళ్లి చేసు కుంటారు,కొందరు ఉద్యోగం వచ్చాక చేసుకుంటారు.ఇక పెద్దలు ఒప్పుకోకపోతే ఇంటినుండి వెళ్లి పోయే వారు మరో రకం!పెద్దలు కుదిర్చిన సంభంధాలు చేసుకునేవారు, ప్రేమించుకొని పెద్దల అంగీకారం తో చేసుకునేవారు , ప్రేమ విఫలమై వేరేవారిని వివాహం చేసుకునేవారు ,జీవితాలను అంతం చేసుకునే వారు .జీవితంలో వివాహం  అసలు చేసు కోని వారు ఇలా రకరకాలుగా వుంటారు . ఎక్కువభాగం  వివాహం చేసుకొనే వారే !ఇంత  వరకు   ఏర్పడే అనుభవాల ముద్రలు ఒకరకం ,ఇక జీవితం లో ఏర్పడే అనుభవాల ఆధారం గా ఏర్పడే సంస్కారాలు ఒకరకం .
  అవి వచ్చే వ్యాసం లో వివరిస్తాను. 

Wednesday, 18 April 2012

అభిసారికనై!

                                   నా పదమంజీరాలు అల్లరి
                                   సవ్వడులు చేస్తున్నాయి ప్రభూ!
                                   నీ హ్రుదయాంచలాన మెరిసే
                                   ఊహా ప్రపంచపు గీతికల్ని 
                                   మకరందాన్నిఅద్ది పలికించమంటున్నాయి 
                                                    నీ హృదయస్పందన అంది
                                                    నెలలు గడిచిపోతున్నాయి  స్వామీ!
                                                    అభిసారికనై నీ పరిష్వంగాల స్మృతులను
                                                    క్రుతులుగా కూర్చి పాడుకుంటూ 
                                                    ప్రతి నిమిషము ఓ యుగంలా గడిపేస్తున్నా! 
                                   నా నిమీలిత నేత్రాలు సంధ్యారుణ 
                                   కిరణాల్ని చూడలేక పోతున్నాయి 
                                   ఈ సంధ్యలోనే కదా మనం 
                                   పాడిన ప్రేమ పల్లవులు 
                                   ప్రతి కెరటం విని పులకించి పోయింది 
                                   ఆ జ్ఞాపకాలు గుర్తువచ్చి నా మనసు
                                   నా వశం తప్పి పోతుంది 
                                                  ఆకసములోని ప్రతి మబ్బు తునక
                                                  మన ప్రేమ రాగాన్నేఆలపించలేదా!
                                                  సముద్ర తీరాన ప్రతి ఇసుక రేణువు 
                                                  మన దోసిళ్ళనుండి జాలువారి
                                                  త్రుప్తి పడినదే కదా!
                                  ప్రతి అలను అడుగుతున్నాను 
                                  నా వర్తమానం నీ కందించమని 
                                  ఏమిటో ప్రియతమా !నా మదిలో
                                  నీ ఫై నా ప్రేమ ప్రవాహమై ,
                                  ప్రమోదమై! ప్రణవ నాదాన్ని
                                  నిరంతరంగా పలికిస్తూనే వుంది
                                  నీ సందేశం అందే వరకు ఈ విరహం
                                  ఇలా పలుకుతూనే వుంటుంది.

Monday, 16 April 2012

అమ్మ ప్రేమ గుర్తు వుంటే జన్మభూమి మీవెంటే !


ఆకాశంలో చందమామ ను చూపిస్తూ
బిడ్డకు గోరుముద్దలు తినిపించే ఆమెను చూస్తే 
అమ్మను చూడాలనిపిస్తుంది!
పరుగెత్తుకెళ్ళి అమ్మ కాళ్ళఫై వాలాలనిపిస్తుంది
తడబడు అడుగులతో నడుస్తున్న బాబును
ఎంతో ప్రేమ తో పట్టుకొని నడిపిస్తున్న ఆమెను చూస్తే
మరొక్క సారి అమ్మ చిటికెన వ్రేలు పట్టుకొని నడవాలని పిస్తుంది
అమ్మ ఒడిలో ఆనందంగా ఆడాలనిపిస్తుంది.
చలికి మునగ తీసుకొని పడుకొని వున్నబాబుకి 
సవ్వడి లేకుండా దుప్పటి కప్పుతున్న ఆమెను చూస్తే
అమ్మ కడుపులో వెచ్చగా నిదుర పోవాలనిపిస్తుంది 
పరుగెత్తుతూ  గెంతులేస్తున్న పిల్లాన్ని బెదిరిస్తూ
దారిలోకి తెచ్చుకొంటున్న ఆమెను చూస్తే
అమ్మ చేత మెత్తని దెబ్బలు తినాలనిపిస్తుంది
అమ్మ అంటే కమ్మనైపాట 
అమ్మ అంటే అమృతపు ఊట 
నా సందేశం తన కందిందేమో ఆకాశం లో 
అమ్మ రూపం చేతులు చాచి ఆహ్వానిస్తున్నట్లుంది
ఇంత ప్రేమ నామీద చూపించి అక్కడున్నావమ్మా !
నా మది నదిలో నీ ప్రేమ రాగం పలుకుతోంది
నీ ప్రేమ నన్నెంత వాణ్ని చేసిందో తెలుసామ్మా
నీ కొడుకు కుబేరుడయ్యాడమ్మా!
నీ ప్రేమను నా జన్మభూమి ఫై చూపిస్తూ
ఆకలి కేకలు లేకుండా చేస్తున్నాను.
వ్యాధులు లేని సమాజానికి అంకురార్పణ చేస్తున్నాను
మహోన్నతమైన  నైతిక విద్య నందిస్తున్నాను.
జన్మ భూమి సేవతో  నీ ఋణం  తీర్చుకుంటున్నాను
నా జన్మభూమిలో నా పేరెంత మార్మోగినా
నా జన్మభూమంతా నా వెంటే ఉన్నదన్నా
అది నువ్వు చూపించిన ప్రేమ వల్లనే నమ్మా 
         PMKM Fine arts ,Ongole వారు   రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన "అమ్మ ప్రేమ గుర్తు వుంటే జన్మభూమి మీవెంటే !"అనే కవితా పోటిలో రెండవ బహుమతి పొందిన కవిత .