Sunday 17 June 2012

నేనే మీకు సజీవ సాక్ష్యాన్ని!


అస్పష్ట చిత్రాలు
సంక్లిష్ట దృశ్యాలు
స్పష్టత లేని చూపు
భవిష్యత్ ప్రమాదాన్ని సూచించలేదేవ్వరు?
నాకు కూడా అనిపించలేదు
కత్తుల వంతెన పై కాలం సాగుతుందని
బోర్డు కనపడదు మరి
విన్న దాన్నివిశ్లేషించుకోవడం
మిత్రులతో చదివించుకోవడం
వారికి తిరిగి వినిపించడం
జీవితమంతా సంఘర్షణల రణం
లక్ష్యం ఘనం గా ప్రతిష్ఠించుకున్నా
ప్రతి పరీక్షలో విజయం సాధించా
కీలకమైన జీవన గమనానికి
అనర్హుడివని తీర్మానించారు
నాలుగు రోడ్ల కూడలిలో జీవితం
ఆటంకాల మధ్య ప్రయాణం
అవకాశాలకై వెతుకులాట
నన్ను నడిపించింది ఆశావాదం
అంతులేని ఏకాగ్రత నాకు వరం
గణితాన్ని అవపోసన పట్టా
ఉద్యోగం సాదించా
ఇది నా పోరాటం
ఇది గొప్ప విషయమేం కాదు
కానీ నాలాంటి పిల్లలను గుర్తించండి
బాల్యంలోనే వారికి సహాయపడండి
ఇంత కష్టం! ఇంత నష్టం!
కలగకూడదు ఎవ్వరికి
అర్థం కావటం లేదు అన్న
 నా  విద్యార్థులకు చెబుతుంటా
నేనే మీకు సజీవ సాక్ష్యాన్నని
ఎవరు ఏమైనా సాధించగలరని
దేన్నైనా నేర్చుకోగలరని
నిరాశతో ఉన్నవారికి చెబుతుంటా
"నన్ను చూసి మీ జీవితాన్ని ప్రేమించండి
 ఆశావాదాన్ని మనసు నిండా నింపండి"  

     ఇది ఒక  అంధ ఉపాధ్యాయుని అంతరంగ ఆవిష్కరణ.ఆయన పేరు ఆంజనేయులు.ప్రకాశం జిల్లా మార్కాపూర్ దగ్గర సానికవరం ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తుంటారు.ఆయనకు చిన్నతనంలోనే వచ్చిన అరుదైన రెటీనా జబ్బు వలన చూపు క్రమేపి కోల్పోవటం, ఆయన ఎదుర్కొన్నకష్టాలు ఉపాధ్యాయ శిక్షణ కార్య క్ర మంలో చెబుతుండగా ఈ కవిత వ్రాసి అందరి ఎదుట దానిని చదివి ఆయనకు అందించటం ఎంతో త్రుప్తి నిచ్చింది ఆయనను చూసి మనిషెంత ఆశావాదిగా ఉండాలో నేర్చుకోవచ్చు.  

20 comments:

  1. chaalaa chakkaga avishkarinchaavvu sekhar,
    athani antharanganni,
    it is one of your best, i think..
    keep writing, koncham gap thisukunnatlunnav.

    ReplyDelete
  2. కవిత ఆయన అంతర్మధనానికి అద్దం పట్టేలా వుంది. వారిని చూసి ఆశావాదం మనషికి ఎంతటి ఆత్మబాలాన్నిస్తుందో తెలుసుకోవచ్చు.

    ReplyDelete
    Replies
    1. కవితలోని,ఆయనలోని అంతర్మధనాన్ని బాగా అర్థం చేసుకున్నారు.మీకు ధన్యవాదాలు.

      Delete
  3. రవిశేఖర్ గారు.. చాలా చక్కగా రాసారు అండీ...

    ReplyDelete
  4. lopali manishi gurinchi chaalaa baagaa chepparu chaalaa baavundi

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మరియు మీకు స్వాగతం.

      Delete
  5. రవీ
    గొప్ప సత్యాన్ని ఆవిష్కరించావు
    కాని జీవితాన్ని ప్రేమించని వాళ్ళు సంచరించే యుగమిది
    నిరాశావాదం నెత్తి కెత్తుకొని ఘూర్నిల్లె అనామకుల లోకమిది
    ''లేక పోవడం లో లేదు బాధ ---లేదని యాడవడం లోనే వుంది బాధంతా'' అంటారు చలం . ఎంతమంది ఈ సత్యాన్ని గ్రహించారు
    అయినా కవిగా రచయితగా సమాజాన్ని ప్రభావితం చెయ్యడం మన బాద్యత
    అభినందనలు

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ప్రశంస కు ధన్యవాదాలు సర్.కవి బాధ్యతను చక్కగా చెప్పారు.

      Delete
  6. రవి శేఖర్ గారు ,
    చాలా చాలా చాలా బాగా వ్రాసారండి.....!!చక్క గా వ్రాసారు.........:)
    ఆశావాదమే జీవితం..!

    -సీత.....

    ReplyDelete
    Replies
    1. చాలా చాలా చాలా ధన్యవాదాలండి మీకు.

      Delete
  7. చాలా బాగుంది రవి శేఖర్ గారూ!
    happy father's day to you.
    @శ్రీ

    ReplyDelete
  8. చాలా ఉన్నత భావాలు మీవి. కవిత చాలా బాగుంది. మీకు ఆభినందనలు

    ReplyDelete
    Replies
    1. కవితలోని భావాలన్నీ ఆయనవి.దాన్లో చివరి రెండు వాక్యాలు నావి కూడా!మీ అభినందనలకు వందనం .

      Delete