Sunday 25 March 2012

గత కాలపు జ్ఞాపకాలను మరచిపోవటం ఎలా?


            విద్యార్థి దశలోవిద్యకు సంబంధించి ప్రతి విషయం విద్యార్థులు బాగా గుర్తుపెట్టుకుంటారు.ఎవరు ఎంత బాగా గుర్తు పెట్టుకుంటే అంత ఉత్తమ విద్యార్థి క్రింద లెక్క ఇది సబ్జెక్టులకు సంబంధించి మరి మిగతా విషయాల పరిస్థితి ఏంటి?అన్నీఅలా గుర్తు పెట్టుకుంటే మరింత మంచి విద్యార్థి అవుతాడా? ఉదాహరణకి ఒకచిన్నపరీక్షలో విఫలమయ్యాడు .అది అలాగే గుర్తుంచుకొని బాధపడుతుంటే సరిపోతుందా.ఆ ఓటమి నుంచి పాటం నేర్చుకొని మరింత ఉత్తేజంతోముందు కెల్లాలి కదా! నాకు ఈ సబ్జెక్టు రాదు అని కుమిలిపోతే ఎలా? అలాగే ఆటల్లోఓటమి చెందితే ఆ ఓటమిని స్పూర్తిగా తీసుకుని మరింత బాగా ఆడాలి కదా !సహజంగా ఆ వయసులో మనసు స్వచ్చంగా వుంటుంది.కాబట్టి చాలావరకు తేలిగ్గా ఓటములు, అవమానాలు,శిక్షలు మరచిపోతుంటారు.గమనించారా!మనం పిల్లల్నిఎప్పుడన్నాకసురుకున్నా మరికొద్దిసేపటికి అది మరచిపోయి మరల మన దగ్గరకొస్తారు.కానీ పెరిగి పెద్దయి జీవితాల్లో స్థిరపడ్డ తరువాత పరిస్థితి ఏమిటి?మనకు ఈ మరచిపోవటం, గుర్తువుంచుకోవటాన్నిఅన్వయిద్దాము .మన వృత్తి కవసరమయిన విషయాలు,సాంకేతిక జ్ఞానాన్నిఅన్వయించి పనిచేయటానికి అవసరమయినదంతా గుర్తుంచుకోవాల్సిందే.
     మరి మనజీవితంలో మరపుకు జ్ఞాపకం కు గల పాత్ర ఏమిటి. మనజీవితంలో ఎన్నో ఓటములు విజయాలు లభిస్తుంటాయి.ఎన్నోకష్టాలు,సుఖాలు అనుభవిస్తుఉంటాము .మరెన్నోఅవమానాలు నిందలు  మరికొన్నిప్రశంసలు లభిస్తుంటాయి.సంసారం లోమరెన్నోఅనుభవాలు ఇలా జీవితం,కొన్నిసార్లు ముళ్ళబాట,పూలబాట లాగా అనిపిస్తూవుంటుంది.మరి ఈ జ్ఞాపకాలు మనల్ని ఏమిచేస్తుంటాయి వాటినంత తేలిగ్గామరచి పోగలమా ఇందులోమధుర మయినవి బాధించేవి వుంటాయి మధురమయిన వాటితో ఓ.కే అవి తలచుకోగానే మనసు ఆనందంలోతేలియాడుతుంది.మరి భాదించే వాటి పరిస్థితిఏమిటి? వాటిని పూర్తిగా మరచి పోగలమా లేదా అవి జీవితమంతా గుర్తుంచు కొంటామా తరచి తరచి ప్రశ్నించుకోండి.
                  ఇలా బాధలను,కష్టాలను,అవమానాలను,మనసును గాయం చేసిన సంఘటనలను అలా ప్రోగు చేసుకుంటూ గుర్తుపెట్టుకొని తలచుకొని బాధపడుతుంటే ఆ మనసు వర్తమానాన్నిఎలా ఆస్వాదింపగలదు బాగా ఆలోచించండి ఒక ఓటమి,ఒక  కటువయిన మాట, ఓ బాధాకరమయిన సంఘటన ఓ జారిపోయిన అద్రుష్టం  ఎందుకు మనసును పదేపదే తొలుస్తుంటాయి.చూడండీ! ఇవి ఎంత గుర్తొస్తుంటే అంతగావర్తమానాన్నిమనం కోల్పో తున్నట్లు లెక్క ఎంత త్వరగా అటువంటి వాటిని మనం మరచి పోతే మన వర్తమానానికి ,భవిష్యత్తుకు అంత మంచిది.మానసిక ప్రయోగాలలోని మరో అంశం గత కాలపు జ్ఞాపకాలు మరచిపోవటం ఎలా?మరో వ్యాసంలో దీనిని వివరిస్తాను..
     మరి మనజీవితంలో మరపుకు జ్ఞాపకం కు గల పాత్ర ఏమిటి. మనజీవితంలో ఎన్నో ఓటములు విజయాలు లభిస్తుంటాయి.ఎన్నోకష్టాలు,సుఖాలు అనుభవిస్తుఉంటాము .మరెన్నోఅవమానాలు నిందలు  మరికొన్నిప్రశంసలు లభిస్తుంటాయి.సంసారం లోమరెన్నోఅనుభవాలు ఇలా జీవితం,కొన్నిసార్లు ముళ్ళబాట,పూలబాట లాగా అనిపిస్తూవుంటుంది.మరి ఈ జ్ఞాపకాలు మనల్ని ఏమిచేస్తుంటాయి వాటినంత తేలిగ్గామరచి పోగలమా ఇందులోమధుర మయినవి బాధించేవి వుంటాయి మధురమయిన వాటితో ఓ.కే అవి తలచుకోగానే మనసు ఆనందంలోతేలియాడుతుంది.మరి భాదించే వాటి పరిస్థితిఏమిటి? వాటిని పూర్తిగా మరచి పోగలమా లేదా అవి జీవితమంతా గుర్తుంచు కొంటామా తరచి తరచి ప్రశ్నించుకోండి.
                  ఇలా బాధలను,కష్టాలను,అవమానాలను,మనసును గాయం చేసిన సంఘటనలను అలా ప్రోగు చేసుకుంటూ గుర్తుపెట్టుకొని తలచుకొని బాధపడుతుంటే ఆ మనసు వర్తమానాన్నిఎలా ఆస్వాదింపగలదు బాగా ఆలోచించండి ఒక ఓటమి,ఒక  కటువయిన మాట, ఓ బాధాకరమయిన సంఘటన ఓ జారిపోయిన అద్రుష్టం  ఎందుకు మనసును పదేపదే తొలుస్తుంటాయి.చూడండీ! ఇవి ఎంత గుర్తొస్తుంటే అంతగావర్తమానాన్నిమనం కోల్పో తున్నట్లు లెక్క ఎంత త్వరగా అటువంటి వాటిని మనం మరచి పోతే మన వర్తమానానికి ,భవిష్యత్తుకు అంత మంచిది.మానసిక ప్రయోగాలలోని మరో అంశం గత కాలపు జ్ఞాపకాలను మరచిపోవటం ఎలా? మరో వ్యాసంలో దీనిని వివరిస్తాను.

9 comments:

  1. Replies
    1. ధన్యవాదాలండి వనజ గారు మీ బ్లాగంతా చూశాను.మీ ఆవేదన నాకు బాగా అర్థమయింది.మీ బ్లాగు ల ఫై వ్యాసం కూడా చూశాను .మీరు మరింతగా బాగా వ్రాయండి.స్పందించే హృదయాలు చాలా వున్నాయి. .సమస్యల ఫై మీ దృక్పథం స్పష్టం గా వుంది keep it up.

      Delete
    2. మీ బ్లాగు లో వ్యాఖ్య వ్రాద్దామంటే బృంద సభ్యులకు మాత్రమే అని వస్తుంది.కొద్దిగావివరిచండి.అందుకని ఈ రోజు మీ టపాకు ఇక్కడే వ్యాఖ్య ఇస్తున్నాను.
      " అయినా ఇంత గా ఎలా వ్రాస్తారండి.ప్రవాహం లా! మీ తెలుబాషా వైదుష్యం అమోఘం. నిజమే! "

      Delete
    3. రవి శేఖర్ .. గారు..నా బ్లాగ్ నచ్చినందుకు ధన్యవాదములు.

      నా బ్లాగ్ లో కామెంట్ ఆప్షన్ కొన్ని కారణాల వల్ల నిలుపు వేసాను.

      ఇక్కడ మీ కామెంట్ చూసి సంతోషించాను. మరి మరీ ధన్యవాదములు.

      సరాగా లో నా కథ చదివి ఉంటారు కదా! అక్కడ మీ స్పందన తెలియజేయవచ్చును.

      ధన్యవాదములు.

      Delete
  2. నిదురలో ...
    నిదురలోన గతమునంతా నిమిషమైనా మరచి పోవచ్చు అని ఒక పాత పాట ఉందనుకుంటా...

    ReplyDelete
  3. వెన్నెల గారు ధన్యవాదాలు.మెలకువ లో ఎలా మరచిపోవాలనేది సమస్య .తరువాతి టపాలో దీనికి సమాధానం ఇస్తాను.

    ReplyDelete
  4. రవిశేఖర్ గారూ ఈ తెలిసినా విషయమే అయినా అర్ధం అవడానికి ఆచరించడానికి ఏళ్ళు పట్టింది. మీలాంటి వాళ్ళు రాస్తూ ఉంటే నన్నా తరచుగా చదువుతూ గుర్తుంచుకుంటామేమో..

    ReplyDelete
  5. జీవితం లోని విషయాలన్నీ తెలిసినట్లే ఉంటాయండి చాలా చిన్న విషయాల్లాగానే కనిపిస్తాయి.కాని ఆచరించటం చాలా కష్టం గా వుంటుంది .ఎక్కడో ఓ చోట మొదలెట్టాలి.ధన్యవాదాలండి ఇలా వచ్చి పలకరించటం ,మీలాంటి వారి ప్రోత్సాహం వుంటే జీవితాన్ని గురించి సమగ్రంగా వ్రాయాలని వుంది.

    ReplyDelete