క్రితం టపాలో మనం చర్చ వాదన లోకి దిగకుండా ఎలా మనసును గమనించాలో తెలుసుకున్నాము.కాని ఇక్కడో విషయం!ఈ సందేహం మీకు వచ్చే వుంటుంది .అవతలివారు తప్పుడు సమాచారం చెబుతుంటే ఎలా?ఇక్కడ మనమో సంగతి అర్థం చేసుకోవాలి.కావాలని అలా మాటలాడుతున్నడా లేక నిజం గా తెలీక మాట్లాడుతున్నాడా అనే విషయం గ్రహిస్తే మనం సత్యం చెప్పినా వారు తమ అభిప్రాయాలు మార్చుకోరు.తెలీక పోతే తెలుసుకోవాలనే వారికి చెబుతాము కాని నటిస్తున్న వారికేమి చెబుతాము.
సహజంగా వాస్తవం తెలిసివారు చెప్పకుండా ఊరుకోరు .కాని అవతలి వ్యక్తులను బట్టి మనం వ్యవహరించ కలిగితే సమస్యలు రావు.సాధ్యమైనంత వరకు చర్చ ఎలా సాగుతుందో మనం గమనిస్తుంటే మన స్పందన లో లోపాలు లేకుండా సవరించుకోవచ్చు.కీలక విషయాలఫై అర్ధ వంతమయిన చర్చ ఆహ్వానించ దగిందే!కాని వ్యక్తిగత విషయాలపయికి చర్చను మళ్ళించ కూడదు.విద్యార్థులు,యువకులు ఎక్కువగా సినిమా,క్రికెట్ ల గురించి మాట లాడుతుంటారు.ఏదో సినిమా బాగుందా లేదా అన్నంత వరకు మంచిదేకాని ఎవరుగొప్ప అన్నంతవరకు వెళ్ళకపోతే మంచిది.ఇక అభిమానం పేరుతో చేసేవన్నీ వృధానే!అలాగే క్రికెట్ ఫై చర్చ కూడా !
మన మనసు నిరంతరం తను చేసేపనిని తనే గమనించేలాగా చేయగలిగితే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.