Wednesday, 29 April 2026

జీవిత లక్ష్యం

జీవితంలో ఏదో సాధించాలని ఎన్నో లక్ష్యాలు పెట్టుకొని ఎంతో శ్రమిస్తూ ఉంటాము.

కొన్ని సాధిస్తుంటాం,ఎన్నో సాధించలేకపోతాం. సాధించిన వాటితో సంతృప్తి లేక సాధించలేకపోయిన వాటి గురించి ప్రయత్నిస్తూ ఉంటాం. మరి కాలం ఆగుతుందా! ముందుకు సాగుతూ మనల్ని తనతో పాటు లాక్కెడుతుంది. వయసు పెరుగుతున్నకొద్ది శారీరకంగా ఎన్నో మార్పులు.ఆ మార్పులు గమనించిన వారు ముందుగానే జాగ్రత్త పడతారు. గమనించినా నిర్లక్ష్యం చేసిన వారు ఫలితం అనుభవిస్తారు. ఇక గుర్తించని వారు ఆకస్మికంగా సంభవించే ఆ టుపోట్లకు గురవుతుంటారు.

ఇదంతా గమనిస్తే మనకేం అర్థం కావాలి.

మనం పెట్టుకున్న లక్ష్యాల సాధనకు తెలిసో తెలియకో మన శరీరాన్ని శిక్షలకు గురిచేస్తూ ఇబ్బంది పడుతుంటాం. బాహ్య లక్ష్యాల సాధనలో అంతర్గత అవయవాల్లో వచ్చే మార్పులను గమనించం. మన ఆరోగ్యాన్ని పట్టించుకోం. నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం.

విపరీతమైన ఆహారపుటలవాట్లు,ఆహార పదార్ధాల కల్తీ, విషరసాయనాల ప్రభావం,పొగాకు, మద్యం, మత్తు పదార్ధాల సేవనం, fast&junk food culture,అనారోగ్య కర మైన జీవన శైలి బాహ్య ప్రపంచపు ఒత్తిళ్లు ఇలా ఎన్నో కారణాలతో మనిషి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ జీవితాన్ని ఆనందం గా గడప లేక పోతున్నారు.

లక్ష్యాలన్నింటిలో మంచి ఆరోగ్య లక్ష్యం గొప్పదన్న నిజాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.... ఒద్దుల రవిశేఖర్ 

               



No comments:

Post a Comment