రచయిత :డా. వి. శ్రీనివాస చక్రవర్తి పుస్తక పరిచయం :ఒద్దుల రవిశేఖర్ మనం ఆలోచిస్తున్నామన్నా, మన శరీరం లోని అన్ని వ్యవస్థలు క్రమబద్ధంగా నడుస్తున్నాయన్నా దానికి కేంద్రం మెదడే. మెదడు గురించి ఆలోచించి పరిశోధించిన వారి వివరాలు తెలియజేస్తూ మనకు మెదడు గురించి అర్ధమయ్యేలా సరళంగా వ్రాయడానికి ప్రయత్నించిన పుస్తకమిది. ఇది science కు సంబంధించిన పుస్తకం కనుక చదివి పూర్తి వివరాలు తెలుసు కోండి. ఇక్కడ విశేష కృషి చేసిన శాస్త్రవేత్తల గురించి మాత్రమే ప్రస్తావిస్తాను. క్రీ.శ 2వ శతాబ్దంలోనే వైద్యుడ యినా కాడ్ గాలెన్ మెదడు నిర్మాణాన్ని వివరించాడు.1500 సం రాల తర్వాత లియో నార్దో డావిన్సీ అండ్రియాస్ వేసేలియాస్ మెదడు గురించి గొప్ప అధ్యయనాలు చేశారు. తరువాత రెనడే కార్త్, ఫ్రాన్స్ గాల్ మెదడును యంత్రం లా భావించారు.రాబర్ట్ హుక్ సూక్ష్మ దర్శిని సహాయం తో జీవకణాలను మొదటి సారి చూసాడు.ఆంటాన్ వాన్ రీవెన్ హాక్ సూక్ష్మ దర్శిని సహాయంతో నాడీ కణాలను పరిశీలించాడు. లూయిగీ గాల్వాని విద్యుత్ జీవక్రియా శాస్త్రం నకు ప్రాణం పోశారు. జోహాన్నస్ ముల్లర్ ఇంద్రియ సంవేదనలపై శో ధించారు. ఎమిల్ దుబ్వా రేమండ్ హెల్మ్ హోల్జ్ "విద్యుత్ ఈల్" మీద పరిశోధనలు గావించారు. హోల్జ్ నాడీ మండల క్రియలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు.20 వ శతాబ్దం ఆరంభానికి మెదడు ఒక విస్త్రతమైన సంక్లిష్టమైన విద్యుత్ యంత్రం అని అర్ధమయ్యింది. ఔషద శాస్త్రంపై పెన్ ఫీల్డ్,పాల్ బ్రోకా, కార్ల్ వెర్న్ కీ పరిశోధించారు. వెర్న్ కీ పరిశోధన ల నుండి కనెక్షనిజం అనే నాడీ శాస్త్రం ఆవిర్భవించింది. దాన్నుండి neural networks అనే కొత్త గణిత సిద్ధాంతం జన్మించింది. మనస్తత్వ శాస్త్రం పై ఇవాన్ పావ్లోవ్ జరిపిన పరిశోధనలు ప్రేరణ, స్పందన, నియంత్రణ లకు దారితీశాయి. B. F. Skinner,Tharandike, jhon watson ప్రవర్తనా వాదాన్ని ప్రవేశ పెట్టారు. మెదడు ఒక జాలం (Net work ) 10,000 కోట్ల న్యూరానులను కలిగి ఉంది. ఇన్ని విశేషాలను మనకు వివరించిన రచయిత శ్రీనివాస చక్రవర్తి గారికి ధన్యవాదాలు చెప్పాలి. మెదడు గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారు పాఠశాల, కళాశాలలో సైన్స్ విద్యార్థులు ఉపాధ్యాయులు, అధ్యాపకులు తప్పక చదవాల్సిన పుస్తకం...... ఒద్దుల రవిశేఖర్.
No comments:
Post a Comment