మూడడుగుల్లో విశ్వం:రచయిత డా. వి. శ్రీనివాస చక్రవర్తి పుస్తక పరిచయం :ఒద్దుల రవిశేఖర్ భూమి మీద దూరాలను కొలవడం సులభంగానే మానవుడు నేర్చుకున్నాడు. కాని ఖగోళ దూ రాలను కొలవడానికి మానవునికి కొన్ని వందల సం.రాలు పట్టింది. రచయిత అందుకు జరిగిన ప్రయత్నాలను సవివరంగా ఇందులో వివరించారు. ఆసక్తికరమైన కొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తాను. మొదటి మెట్టు :మొదటగా క్రీ. పూ ఎరటోస్తనీస్, పోసిడోనియస్ విశ్వం స్థాయిలో శాస్త్రీయ పద్దతిలో దూరాలు కొలిచారు.భూమి వ్యాసాన్ని, చుట్టుకొలతను అంచనా వేసారు.అరిస్టార్కస్, హిప్పార్కస్ భూమి వ్యాసాన్ని ఆధారం చేసుకొని చంద్రుడి దూరాన్ని అంచనా వేసారు.భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంది అని,భూమి నుండి సూర్యుని దూరం కొలవటానికి ప్రయత్నించిన వారు అరిస్టార్కస్.1543 లో నికోలాస్ కోపర్నికస్ సూర్య కేంద్రక సిద్దాంతాన్ని ప్రత్తిపాదించారు. గ్రహాల దూరాలను అంచనా వేయడానికి కొత్త సూత్రాన్ని అందించిన వాడు కెప్లర్.1609 లో గె లీలియో ఒక దూరదర్శినిని తయారు చేసి ఆకాశం కేసి గురిపెట్టాడు.1673 లో గియోవానీ సూర్యునికి భూమికి మధ్య దూరం సగటున 9,29,65,000 మైళ్ళని అంచనా వేశారు. దీన్ని ఖగోళ ఏకాంకం (AU) అంటారు.1830 లో విల్ హెల్మ్ బెసెల్ హీలియో మీటర్ ను వాడటం మొదలు పెట్టాడు. 61 సిగ్మస్ అనే తార దూరం 64 ట్రిలియన్ మైళ్ళు అని కనుగొన్నారు కాంతి వేగం సెకనుకు 1,86,282 మైళ్ళు.ఒక ఏడాదిలో (6 లక్షల కోట్ల (ట్రిలియన్ ) మైళ్లు ) కాంతి ప్రయాణించిన దురాన్ని కాంతి సంవత్సరం అంటారు ఆల్ఫా సెంటారీ తార దూరం 4.3 కాంతి సం వత్సరాలని థామస్ హేండర్సన్ కనుగొన్నారు.1900 సం.రానికి విక్షేప పద్ధతిని ఉపయోగించి 70 తారల దూరాలను కనుగొన్నారు 1950 కల్లా 6000 తారల దూరాలు కనుగొన్నారు. మన కంటితో 6000 తారలను చూడగలం.1609 లోనే గేలీలియో పాల పుంత గెలాక్సీ ని గమనించాడు. విలియం హెర్షల్ 1785 లో రోదసిలో తారలన్ని ఒక కటకం ఆకారం లో అమరి ఉన్నాయని ప్రతిపా దించాడు. రెండవ మెట్టు :1921 లో 25 సెఫెయిడ్ తారలను హేన్రి యేట్టా లీవిట్ కనుగొన్నారు. షాప్లీ గోళాకార రాసులను కనుగొన్నాడు. గేలాక్సీ పరిమాణం కొలవాలని ప్రయత్నించాడు. సూర్యుడు గెలాక్సీ కేంద్రం చుట్టూ సెకనుకి 150 మైళ్ళ వేగంతో కదులుతూ 200 మిలియన్ ఏండ్లకు ఒకసారి గేలాక్సీ చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. గెలాక్సీ వ్యాసం లక్ష కాంతి సం వత్సరాలు అని తెలిసింది. తారా నీహారికలను(నెబ్యూలా )మెసియర్ కనుగొన్నాడు. ఓరియన్ నెబ్యూలాను క్రిస్టియన్ హైగెన్స్ కనుగొన్నాడు.విలియం పార్సన్స్, సైమన్ మారియస్ నెబ్యూలాలను అధ్యయనం చేశారు.100 అంగుళాల దూరదర్శిని తో హబుల్ ఆండ్రోమెడా ను గమనించి ఇది ఒక గేలాక్సీ అని తేల్చారు. ఇది మన గెలక్సీ కి 2.5 మిలియన్ కాంతి సం.రాల దూరంలో ఉన్నట్లు తేలింది. గేలాక్సీ లు కూడా రాసులుగా ఉంటాయి. కోమా బెరెనేసిస్ అనే తారా రాశిలో 11,000 గెలా క్సీ లు ఉన్నాయి. మన గేలాక్సీఉన్న తారా రాశి లో 19 గేలాక్సీ లు ఉన్నాయి. 3 వ మెట్టు :100 మిలియన్ కాంతి సం. రాలకి మించిన దూరాలను కొలవడానికి ఎడ్విన్ హబుల్ మరో పద్ధతి కనుగొన్నాడు.హబుల్ నోవాలపై అధ్యయనం చేశారు. వెస్టో స్లిఫర్ తారల నుండి వచ్చే కాంతిని బట్టి వాటి వయసులు తెలుసుకున్నాడు. అన్ని గేలాక్సీ లు మనకు దూరంగా వెడుతుంటే ఆండ్రో మెడా గేలాక్సీ మన గేలాక్సీ కి దగ్గరగా వస్తుంది. హబుల్ గేలాక్సీ ల దూరం కనుగొనడానికి V=HD అనే సూత్రాన్ని ప్రతి పాదించాడు. H=హబుల్ స్థిరాంకం. ఇలా గేలాక్సీ లన్నీ పరస్పరం దూరంగా జరుగుతుంటే విశ్వం వ్యా కోచిస్తుందా అన్న సందేహం కలిగింది. మహా విస్పోటనం విశ్వానికి నాంది అని జార్జి లమేత్ర్ మొట్ట మొదట ఊహించారు. విశ్వం లోని అంతరి క్షమే వ్యాకోచిస్తుంది. అలా పరిమాణం పెరిగి తిరిగి సంకోచిస్తుంది. దీన్నే మహా సంకో చం అంటారు. మన పాల పుంత గేలాక్సీ లో 20,000 కోట్ల తారలున్నాయి అందులో మన సూర్యుడొకడు.గేలాక్సీ కేంద్రం నుండి మన సూర్యుడు 26,000 కాంతి సం. రాల దూరం లో ఉన్నాడు. ప్రస్తుత అంచనాల ప్రకారం దృశ్య విశ్వం 93 బిలియన్ కాంతి సం వత్సరాలు.ఇలాంటి అద్భుతమైన, ఊహించటానికే వీలు కాని దూరాలను గురించి ఎంతో ఆసక్తికరంగా వివరించారు రచయిత. వారికి అభినందనలు.విశ్వం అనంతత ముందు సౌరకుటుంబం, భూమి, మానవ జాతి చాలా అల్పంలా అనిపిస్తాయి. సౌరమండలం చివరినుండి మన భూమి చిన్న చుక్కలా కనిపిస్తుంది. కానీ మన భవిష్యత్తు ఈ భూమే దానిని రక్షించుకోవాలి అన్న గొప్ప సందేశం తో ముగిస్తారు. విశ్వాన్ని అధ్యయనం చేయాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా సైన్స్ విద్యార్థులు,ఉపాధ్యాయులు అధ్యాపకులు చదివి తీరవలసిన పుస్తకమిది.
No comments:
Post a Comment