Monday 2 April 2012

బాధించే జ్ఞాపకాలు మరచిపోవటం ఎలా?3


            ఇక చివరగా మనసంటే ఏమిటి?మనమేగా !రెండు ఒకటేగా !అంటే   తనకు తాను ఓదార్చుకొని తనకు కలిగిన జ్ఞాపకాన్ని తనే మరచిపోవాలి.దానికి మన మనసు తో కొన్ని ప్రక్రియలు నిర్వహించాలి .జ్ఞాపకాన్ని వదలటానికి దాన్ని పట్టుకునేదేది?బాధఅదిఎక్కడ కలిగింది మన మనుకుకుంటాము. హృదయానికి గాయం అయింది !మన స్పందనలు,మన సున్నితత్వం హృదయానికి  సంబంధించిన వే, కాని విచక్షణ బుద్ధికి సంబందించినది హృదయపు  బాధకూడా మనసు బాధకూడా మనసు  సరిచేయాల్సిందే! అంతవరకు o.k కదా!ఇది అంతా ఆలోచించండి బాగా.నాకు లానే మీరు ఆలోచించాలని లేదు.నేను ఒక కోణాన్ని మీకు పరిచయం చేస్తున్నాను.మీకు మరిన్ని కొత్త ఆలోచనలు రావచ్చు.
                   పరిష్కారం  దిశగా అడుగులు  వేద్దాం.ప్రతి   మనిషి తనకు తాను పూర్తిగా విభిన్నం  మన ఆలోచనలుఅభిప్రాయాలు   అభిరుచులు ప్రవర్తన మనకే సొంతం.తల్లి,తండ్రి ,భార్య ,భర్త పిల్లలు ,స్నేహితులు బంధువులు ఎవ్వరు నీవు కాదు..ఇంకా   కఠినంగా  చెప్పాలంటే నీవు ప్రేమించినవిఇష్టపడ్డవి, పెంచుకున్నవిపంచుకున్నవి ప్రతిది  కూడా   నీలాగే    వేరేవారికి వుండాలని  లేదు కాలం వాటినన్నిటిని  తుంచి వేస్తూ ముందుకు  పోతుంటుంది .నీవు  పెంచుకున్నంత మమకారం  వారికి నీ  ఫై  వుండదు . ప్రేమికులు  వైవాహిక   జీవితం  లో  పెళ్లికి  ముందు సాంద్రతను  అనుభవించ గలుగు తున్నారా  !మనం పొందిన అనుబంధాల్లోని గాఢతలు  ప్రస్థుతం    సంబంధాల్లో లేవు .కాని గతం  మన ఊహల్లో వుంటుంది   .గతం  మన జీవితం  లో  నిజం గా వర్తమానం  అయ్యుంటె  ఖచ్చితంగా   వర్తమానానికి  మరో  గతం  తోడవుతుంది    ..కఠినంగా  చెప్పినా వాస్తవ  మిదే  !ఇకపోతే మన హ్రుదయ సమ్మతి  లేకుండా   ఒక్కరు, ఒక్క విషయం మనల్ని బాధించలేవు  గాయం కలిగించిన వ్యక్తులు  పశ్చాత్తాపపడి   వుండవచ్చు .కొంతమంది  మీకు విచారం వ్యక్తం  చేసి వుండవచ్చు . మరి కొంత  మంది మీకు తెలియకుండానే   మిమ్మల్ని తమ  మనసులోనే  క్షమాపణలు  కోరివుండ   వచ్చు.అంటే  వారు మారి ఉండవచ్చు .సన్నిహితులు  ఎలాంటి  మార్పుకు లోనైతే  మనం  గాయాలను మరచి పోవటానికి   కొద్దిగా క్షమ వుంటె  చాలు.స్నేహితులు   అలా దూరమైతే    మరల కలవక పోయినా  మనసులోనే  వారిని క్షమించేసుకొని  బాధనుండి విముక్తి  చెందవచ్చు.ప్రతి  జ్ఞాపకాన్ని మన మనసు పొరల పై  నుండి  శుభ్రం  చేసుకునేందుకు   క్షమ ఒక ఆయుధం.
           ఇంకొకటి  కలవ లేనంతగా   దెబ్బతిన్న  సంబంధాలు పునరుధ్ధరించ లేక  పోయినా   దెబ్బ మనసు నుండి  తుడిచి    వేయటానికి  మరో  ఆయుధం వుంది గమనించండి .మన జీవన ప్రయాణం  లో  అందరు మనకు పరిచయం అయిన వారే !(బంధువులతో   సహా).కాని చివరివరకు  మనకు మనమే  తోడుగా   వుంటాము .ఇది రైలు  ప్రయాణం  ఎక్కుతుంటారు ,.దిగుతుంటారు .మరణం  వరకు మనకు తోడు   మన మనసు మాత్రమే  వుంటుంది .ఇతరులకోసం ,వేరెవరికోసమో ,ఏవో సంఘటనల  నుంచో   దాన్ని మనం వారి ఆలోచనలతో  ,బాధలతో   నింపి మన మనసును వారికి, బాధలకు అప్పజెప్పేబదులు మన మనసును మన స్వాధీనం లో  వుంచుకుందాము .దాన్ని శుభ్రం  చేసుకుంటే    అద్దం పై  మనకు మనం మరింత  కొత్తగా   కని పిస్తాము .మన ముఖం లో  మరింత  వెలుగు వస్తుంది .ఇది ఎవరికోసమో  కాదు,పూర్తిగా  మన కోసమే  .అప్పుడు   మనస్సు చిత్రం పై  వర్తమానం లో   ని ప్రతిక్షణం    ఆనంద  గీతాన్ని  లిఖించుకుందాము.మన విషాదాలకు మరొకరు కారణం  కాకూడదు .అలాగే   మనం మరొకరి విషాదాలకు మూలం  కాకూడదు .మన ఆనందం మన చేతుల్లోనే   వుంది.అప్పుడు మాత్రమే   మనం  ఇతరులకి  ఆనందాన్ని ఇవ్వగలం.అప్పుడు  చూడండి !మన  జీవితాల్లో   ప్రతిక్షనం    సజీవ నిత్య  చైతన్యం  తాండవిస్తుంది .అది అవతలి వారికి కూదా   అధ్భుతం  లా తోస్తుంది .వారిలో  మార్పు వస్తుంది .వెంటనే  రాకున్న క్రమేపి  వస్తుంది .కాని మనం మాత్రం  వర్తమానాన్ని  క్షణక్షణం  మనకోసం  ఆనందంగా   గడపవచ్చు .ఆలోచించండి .

Saturday 31 March 2012

బాధించే జ్ఞాపకాలు మరచి పోవటం ఎలా? 2



ప్రేమలో వైఫల్యం
,స్నేహితుల మధ్య మనస్పర్థలు,office లలో సహచరులతో వాగ్వాదం,బంధువులతో మాట తేడాలు,భార్యా భర్తల ఎడబాటు,మాట జారటం ,ఆస్తి పంపకాలు,సంసారం లో సమస్యలు,సంతానం సరిగా చూడకపోవటం,ఇక మన చదువులలో ,మన వృత్తులలోమరిన్ని  ఓటములు,అనుకున్నది సాధించుకోలేక పోవటం,సరి అయిన సమయానికి సరి అయిన నిర్ణయాలు తీసుకోలేక అవకాశాలు కోల్పోవటం,కలగన్నవి పొందలేకపోవటం,,బంధువుల,సన్నిహితుల  మరణం ఇలా మన జీవితం లో ఎక్కడో ఒకచోట లేదా పలు సందర్భాలలో ,మనసుకు ఎంతో బాధ కలిగించే సంఘటనలు మనకు తటస్తించి వుంటాయి.అవన్నీ మన మనస్సులో జ్ఞాపకాలుగా స్థిరపడి పోయుంటాయి.
               ఇక వర్తమానం లో  జ్ఞాపకాల ఆధారం గా మన  ఆలోచనలు,నిర్ణయాలు,మాటలుప్రవర్తనఅభిప్రాయాలు అన్నీ రూపుదిద్దుకుంటాయి.ఇవి ఆజ్ఞాపకాలలోని బాధలను దూరం చేసేవైతే ఫర్లేదు.
గుణపాటాల్లాగా తీసుకుని మరల చేసిన ఆ తప్పులు దొర్లకుండా  అనుభవాలని పునాది చేసుకుని జీవితాన్ని మరింత ఉన్నతంగా దిద్దుకోవడానికి ఉపయోగించుకున్నంత వరకు  మంచిదే.
                  సంఘటనల్లోని  బాధను,ఓటముల్ని,అవమానాల్ని,గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటే  మనసు నూతనత్వాన్ని కోల్పోతుంది.వర్తమానం లోని ఆనందాన్ని అనుభవించలేదు.మన జీవితం లోని ప్రతిది నూతనం గా క్రొత్తగా వుంటుంది.ప్రకృతి అలాగే వుంటుంది.ప్రతి క్షణం గతించిన క్షణానికి భిన్నం గా వుంటుంది.భూమితో సహా సూర్య చంద్రాదులు  ప్రతిక్షణం వేగంగా ప్రయాణిస్తూ వుంటాయి .వాటి కనుగునంగా భూమి ఫై  మార్పులు కూడా చలి,ఎండా ,వాన,రుతువుల్లో మార్పులు ఇవన్నీ అంతే!మరి మనలో కూడా కాలం నూతనత్వాన్ని మోసుకొస్తూ వుంటుంది.మనం అందులో ఉండకుండా గతం     బాధలోనో ,భవిష్యత్తు పట్ల భయంతోనో వర్తమానం లో వుండలేకపోతున్నాము. క్షణం ఒక సజీవ దృశ్యం.t.v లలో ప్రత్యక్ష ప్రసారం ఎంత కుతూహలం గా చూస్తాము.రికార్డు అయిన ప్రోగ్రాం లో అంత మజా ఉంటుందా !
                   ఇక వాటిని మరవటం ఎలా?మన శరీరం చిన్న గాయాల్ని జబ్బుల్ని తనకు తానే బాగుచేసుకుంటుంది.కొద్దిగా పెద్దవి వైద్యసహాయం తో సరిచేసుకుంటుంది.కొన్ని సందర్భాలలో ఆయా భాగాలను తీసివేసి  సమస్యకు పరిష్కారం చేస్తారు.అంతేకాని వచ్చిన రుగ్మతను సరిచేసుకోకుండా అలాగే వుంటే క్రమేపి శరీరం మొత్తం దెబ్బతింటుంది.మరిమనసు అంతేగదా గతం లో సమస్య ప్రస్తుతం బాధిస్తుంది .పరిష్కారమేమిటి?వాస్తవానికి మన చిన్నప్పటి సంఘటనలన్నీ మనకు గుర్తువున్నయాలేదుకదా అలా గుర్తుండి వుంటే మన బుర్ర వేడి ఎక్కి పిచ్చెక్కి వుండేది.చాలా విషయా లు మనం మరచి పోతు ఉంటాము .అంటే తనకు తాను మనసు శుభ్రం చేసుకుంటుంది.కాని పయిన చెప్పిన జ్ఞాపకాలు అంత త్వరగా మనసు తీసివేసు కోలేదు.మరి ఎట్లా !
            చూడండి.రోజు వార్తా పత్రికలలో t.v లలో ఎన్నో ఘోరాలు,నేరాలు జరుగుతుంటాయి.అయ్యో అనుకుంటాము.మరచిపోతు ఉంటాము.అలాగే మన కష్టాల కంటే ,బాధలకంటే ,ఓటముల కంటే నష్టాలకంటే మరింత పెద్దవి ,ఇతరుల జీవితాల్లోనివి తెలుసుకొని పాపం అనుకోని వదిలివేస్తుంటాము అంతకంటే మనవి చాలా చిన్నవి అయినా మనం మరచిపోలేము.అలాగే మన దగ్గరివారు ఇబ్బందుల్లో వుంటే వారిని ఓదార్చుతుంటాము .మరచిపోవాలండి!పోయిన వారితో మనం పోతామా అంటూ!అంటే మనకు మరచిపోవటం చాలా బాగా తెలుసు.
   చాలా ఎక్కువయింది కదా !అందుకే  ముగింపు తరువాత!   



Friday 30 March 2012

కవితారవి... ఒద్దుల రవిశేఖర్

                 అక్షరాలను అస్త్రశస్త్రాలుగా మలచినవాడు                      
                       నిశ్శబ్దం లోని శబ్దాన్ని వినేవాడు
                 అభావం లోని భావాన్నిచూసేవాడు
                        ప్రకృతి లోని కృతిని పాడేవాడు
                 అంతరంగ లోతుల్నిస్ప్రుశించేవాడు
                         ఆనందపు అంచుల్ని తాకేవాడు
                 పూలపరిమళాన్నిపుటలఫై చల్లేవాడు
                         పండు వెన్నెలను పగలే చూపించేవాడు
                 ఇంద్రధనుస్సు లోని రంగుల మర్మం తెలిసినవాడు
                         చెరకు విల్లును వంచి చెక్కర రసాన్ని గ్రోలేవాడు
                 చెలి చెక్కిలి ఫై చక్కిలిగింతలు పెట్టేవాడు
                         ప్రణయం  లో ప్రణవరాగం వినిపించేవాడు
                  కవితా కాంతులతో వెన్నెల కావ్యాలు రచించినవాడు
                         సౌందర్యం లోని సౌరభాన్ని వెదజల్లే వాడు
                  శృంగారం లోని రహస్యాలను శోధించేవాడు
                         ఒక్క పిలుపుతో లక్ష అక్షౌహినులయ్యేవాడు
                   ఒక్కపలుకుతో సహస్ర శతఘ్నలు  పేల్చేవాడు
                         మనిషి వేదనను  ఉచ్చ్వాశించేవాడు
                  కవితాక్షరాలతో    నిశ్వాశించేవాడు
                         సమస్యల ఫై పర్జన్య శంఖం పూరించేవాడు
                  అన్నార్తుల పాలిట  ఆపన్నహస్తం అయ్యేవాడు
                         కష్ట జీవుల స్వేదం లో నిర్వేదం తెలిసిన వాడు
                  కర్షకుల కష్టాన్ని కన్నీటితో పలికించినవాడు
                         కార్మికుని కడుపాకలిని పసిగట్టేవాడు
                  కాలం చెక్కే చరిత్రను క్రమబద్ధం చేసే వాడు
                          ప్రతి ఎద లోని వ్యధలను  వినేవాడు
                  అవినీతిని కవిత్వం తో ఖడ్గ  ప్రహారం  చేశేవాడు
                          అంధకారాన్ని  చీల్చుతూ వెలుగురేకలు నింపేవాడు
                 నిజాల నిప్పులు చిమ్ముకుంటూ నింగి    కెగరేవాడు
                          ఇజాల తుప్పు  వదిలిస్తూ డప్పు మ్రోగించేవాడు   
                  నిత్యం సత్యాలను ఆవిష్కరించేవాడు
                          తిమిరం ఫై జ్ఞానఖడ్గం తో సమరం   చేశేవాడు

Sunday 25 March 2012

గత కాలపు జ్ఞాపకాలను మరచిపోవటం ఎలా?


            విద్యార్థి దశలోవిద్యకు సంబంధించి ప్రతి విషయం విద్యార్థులు బాగా గుర్తుపెట్టుకుంటారు.ఎవరు ఎంత బాగా గుర్తు పెట్టుకుంటే అంత ఉత్తమ విద్యార్థి క్రింద లెక్క ఇది సబ్జెక్టులకు సంబంధించి మరి మిగతా విషయాల పరిస్థితి ఏంటి?అన్నీఅలా గుర్తు పెట్టుకుంటే మరింత మంచి విద్యార్థి అవుతాడా? ఉదాహరణకి ఒకచిన్నపరీక్షలో విఫలమయ్యాడు .అది అలాగే గుర్తుంచుకొని బాధపడుతుంటే సరిపోతుందా.ఆ ఓటమి నుంచి పాటం నేర్చుకొని మరింత ఉత్తేజంతోముందు కెల్లాలి కదా! నాకు ఈ సబ్జెక్టు రాదు అని కుమిలిపోతే ఎలా? అలాగే ఆటల్లోఓటమి చెందితే ఆ ఓటమిని స్పూర్తిగా తీసుకుని మరింత బాగా ఆడాలి కదా !సహజంగా ఆ వయసులో మనసు స్వచ్చంగా వుంటుంది.కాబట్టి చాలావరకు తేలిగ్గా ఓటములు, అవమానాలు,శిక్షలు మరచిపోతుంటారు.గమనించారా!మనం పిల్లల్నిఎప్పుడన్నాకసురుకున్నా మరికొద్దిసేపటికి అది మరచిపోయి మరల మన దగ్గరకొస్తారు.కానీ పెరిగి పెద్దయి జీవితాల్లో స్థిరపడ్డ తరువాత పరిస్థితి ఏమిటి?మనకు ఈ మరచిపోవటం, గుర్తువుంచుకోవటాన్నిఅన్వయిద్దాము .మన వృత్తి కవసరమయిన విషయాలు,సాంకేతిక జ్ఞానాన్నిఅన్వయించి పనిచేయటానికి అవసరమయినదంతా గుర్తుంచుకోవాల్సిందే.
     మరి మనజీవితంలో మరపుకు జ్ఞాపకం కు గల పాత్ర ఏమిటి. మనజీవితంలో ఎన్నో ఓటములు విజయాలు లభిస్తుంటాయి.ఎన్నోకష్టాలు,సుఖాలు అనుభవిస్తుఉంటాము .మరెన్నోఅవమానాలు నిందలు  మరికొన్నిప్రశంసలు లభిస్తుంటాయి.సంసారం లోమరెన్నోఅనుభవాలు ఇలా జీవితం,కొన్నిసార్లు ముళ్ళబాట,పూలబాట లాగా అనిపిస్తూవుంటుంది.మరి ఈ జ్ఞాపకాలు మనల్ని ఏమిచేస్తుంటాయి వాటినంత తేలిగ్గామరచి పోగలమా ఇందులోమధుర మయినవి బాధించేవి వుంటాయి మధురమయిన వాటితో ఓ.కే అవి తలచుకోగానే మనసు ఆనందంలోతేలియాడుతుంది.మరి భాదించే వాటి పరిస్థితిఏమిటి? వాటిని పూర్తిగా మరచి పోగలమా లేదా అవి జీవితమంతా గుర్తుంచు కొంటామా తరచి తరచి ప్రశ్నించుకోండి.
                  ఇలా బాధలను,కష్టాలను,అవమానాలను,మనసును గాయం చేసిన సంఘటనలను అలా ప్రోగు చేసుకుంటూ గుర్తుపెట్టుకొని తలచుకొని బాధపడుతుంటే ఆ మనసు వర్తమానాన్నిఎలా ఆస్వాదింపగలదు బాగా ఆలోచించండి ఒక ఓటమి,ఒక  కటువయిన మాట, ఓ బాధాకరమయిన సంఘటన ఓ జారిపోయిన అద్రుష్టం  ఎందుకు మనసును పదేపదే తొలుస్తుంటాయి.చూడండీ! ఇవి ఎంత గుర్తొస్తుంటే అంతగావర్తమానాన్నిమనం కోల్పో తున్నట్లు లెక్క ఎంత త్వరగా అటువంటి వాటిని మనం మరచి పోతే మన వర్తమానానికి ,భవిష్యత్తుకు అంత మంచిది.మానసిక ప్రయోగాలలోని మరో అంశం గత కాలపు జ్ఞాపకాలు మరచిపోవటం ఎలా?మరో వ్యాసంలో దీనిని వివరిస్తాను..
     మరి మనజీవితంలో మరపుకు జ్ఞాపకం కు గల పాత్ర ఏమిటి. మనజీవితంలో ఎన్నో ఓటములు విజయాలు లభిస్తుంటాయి.ఎన్నోకష్టాలు,సుఖాలు అనుభవిస్తుఉంటాము .మరెన్నోఅవమానాలు నిందలు  మరికొన్నిప్రశంసలు లభిస్తుంటాయి.సంసారం లోమరెన్నోఅనుభవాలు ఇలా జీవితం,కొన్నిసార్లు ముళ్ళబాట,పూలబాట లాగా అనిపిస్తూవుంటుంది.మరి ఈ జ్ఞాపకాలు మనల్ని ఏమిచేస్తుంటాయి వాటినంత తేలిగ్గామరచి పోగలమా ఇందులోమధుర మయినవి బాధించేవి వుంటాయి మధురమయిన వాటితో ఓ.కే అవి తలచుకోగానే మనసు ఆనందంలోతేలియాడుతుంది.మరి భాదించే వాటి పరిస్థితిఏమిటి? వాటిని పూర్తిగా మరచి పోగలమా లేదా అవి జీవితమంతా గుర్తుంచు కొంటామా తరచి తరచి ప్రశ్నించుకోండి.
                  ఇలా బాధలను,కష్టాలను,అవమానాలను,మనసును గాయం చేసిన సంఘటనలను అలా ప్రోగు చేసుకుంటూ గుర్తుపెట్టుకొని తలచుకొని బాధపడుతుంటే ఆ మనసు వర్తమానాన్నిఎలా ఆస్వాదింపగలదు బాగా ఆలోచించండి ఒక ఓటమి,ఒక  కటువయిన మాట, ఓ బాధాకరమయిన సంఘటన ఓ జారిపోయిన అద్రుష్టం  ఎందుకు మనసును పదేపదే తొలుస్తుంటాయి.చూడండీ! ఇవి ఎంత గుర్తొస్తుంటే అంతగావర్తమానాన్నిమనం కోల్పో తున్నట్లు లెక్క ఎంత త్వరగా అటువంటి వాటిని మనం మరచి పోతే మన వర్తమానానికి ,భవిష్యత్తుకు అంత మంచిది.మానసిక ప్రయోగాలలోని మరో అంశం గత కాలపు జ్ఞాపకాలను మరచిపోవటం ఎలా? మరో వ్యాసంలో దీనిని వివరిస్తాను.

Friday 23 March 2012

ఇవన్నీ మీ అనుభవం లోకి వచ్చాయా


పూల పరిమళాన్ని కళ్ళు మూసుకుని మనస్సంతా సువాసన ఫై నే  కేంద్రీకరించి ఎప్పుడయినా ఆఘ్రానిం చారా !
ఉషోదయాన కన్నులు నిలువెల్లా తెరిచి ఆకసపు అరుణ కాంతిని  ఆస్వాదించారా
సంధ్యా సమయాన పడమర కొండల సోయగాన్ని చూశారా
పున్నమివెన్నెల తనువెల్లా స్పృశిస్తుంటే అందులోని చల్లదనాన్ని అనుభవించారా
సుప్రభాతం వీనులకు విందు చేస్తుంటే గోవులమెడలోని మువ్వల శబ్దాన్ని విన్నారా
మావి చిగురుతిని కుహుకుహు రాగాలు పలికే కోయిల  స్వరాలను ఆలకించారా
సెలయేటిలో పాదాలు వుంచి కాళ్ళ క్రింద నీళ్ళు జారిపోతుంటే వంటిపయికి ప్రాకే తిమ్మిరి తెలిసిందా
సముద్రపు ఒడ్డున అలలు కాళ్ళను తగులుతూ ఇసుకను లాగేస్తుంటే వెన్నుపూసలోకి ప్రాకే జలదరింపు ను గుర్తించారా
పూల పుప్పొడి రేణువులు చేతివేళ్ళకు తగిలే స్పర్శ నెప్పుడన్నా   అనుభవించారా 
భూమి విచ్చుకొని పొడుచుకువచ్చే మొక్కను తడిమి తన్మయత్వం చెందారా 
పిల్లి పిల్లల్ని లేగదూడలని ,కుక్కపిల్లల్ని పెంచిన అనుభవమున్నదా  
చెరువుల్లో,బావుల్లో,కాలువల్లో చేపపిల్లల్లా  ఈదిన జ్ఞాపకాలేమయినా ఉన్నాయా
మంచుతెరలు కమ్ముకున్న శీతాకాలం ఉదయాల్లోని చలిమంటల్లోని వెచ్చదనం గుర్తుందా
ప్రక్రుతి పరవశించి పోయాలా  ఆకుపచ్చ చీరకట్టుకొని నర్తించే అడవుల సౌందర్యాన్ని ఎప్పుడన్నా గ్రోలారా
వర్షం వెలిసిన తరువాత గగనాంగన కప్పుకున్న ఇంద్రధనుస్సుపయిటను మయిమరచి చూశారా 
పొద్దుతిరుగుడు పూల తోటలో తిరుగుతూ వాటి అందాల్ని  చూశారా 
చిరుజల్లుల వానలో తడుస్తూ ఎప్పుడన్నా నాట్యం చేశారా 
ఆరుబయట పక్కేసుకొని ఆకాశం లోని నక్షత్రాలను లెక్క పెట్టారా    
హరిప్రసాద్ చౌరాసియా వేణుగానాన్ని వింటూ అడవుల్లో రైలు   మార్గం గుండా ప్రయానించారా  
వేణువును ఊదుతూ,కీ బోర్డ్   లోని మీటలను నొక్కుతూ సరిగమ లెప్పుడన్నా పలికించారా 
వెండి మేఘాలు కొండల మీద ప్రయాణిస్తుంటే వాటినెప్పుడన్నా   పట్టుకున్నారా 
ఒంటరిగా నీలో నీవు గడుపుతూ నీ హృదయాంతరంగం లోని మౌనభాష నెప్పుడన్నా తెలుసుకున్నారా    
ఇవన్నీ మీ అనుభవం లోకి వచ్చాయా