పుట్టినరోజు ఎవరికయినా మధురమైన రోజు. పుట్టిన రోజులు ఎంతో వైభవంగా,ఘనంగా ఆడంబరంగా జరపటం చూస్తున్నాము.అలాగే సంపన్నులు,రాజకీయ నాయకులు, వ్యాపారులు ఎంతోడబ్బు ఖర్చు చేస్తున్నారు.పిల్లల పుట్టిన రోజులు మరింత వేడుకగా చేస్తుంటారు. పుట్టిన తరువాత మొదటి,రెండు సంవత్సరాలు పర్లేదు కానీ తరువాత నిరాడంబరంగా జరుపుకుంటే బాగుంటుందేమో!
ఇక పోతే పుట్టిన రోజు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు.వాటి అమలులో విఫలం అవుతుంటారు.ఇది అంతా మామూలే!కానీ ఆ రోజు మొక్కలు నాటితే ఎలా ఉంటుంది,కానీ ఎక్కడ నాటాలి ? నాటగానే సరిపోదు వాటిని సంరక్షించాలి, పెంచాలి. అప్పుడే కదా ఫలితం.నేను పనిచేసే చెన్నారెడ్డి పల్లి ఉన్నత పాఠశాల లో పిల్లలందరికీ వారి పుట్టిన రోజు నాడు మొక్కలు నాటమని చెప్పాము. వారి పుట్టినరోజు లు ఒక నోట్స్ లో వ్రాసుకొని ముందుగానే వారికి గుర్తు చేసి వారి పుట్టినరోజు మొక్కలు తెచ్చేలా ఏర్పాటు చేసి మొక్కలను ప్రార్ధనా సమావేశంలో ప్రధానోపాధ్యాయులకు ఇస్తూ పిల్లలకు photos తీయడం,పిల్లలందరితో జన్మదిన శుభాకాంక్షలు చెప్పించడం మొక్కలు నాటేటప్పుడు వారి తరగతి మిత్రులతో శుభాకాంక్షలు చెప్పిస్తూ photos, వీడియో తీసి వారి తల్లి దండ్రులకు పంపడం చేయడం వలన విద్యార్థులందరు మొక్కలు పాఠశాల కు బహుకరిస్తున్నారు. తరువాత వాటి సంరక్షణ, పెంపకం బాధ్యత లు తరగతుల వారీగా సిమెంట్ తో కట్టిన పెట్టెల్లో విద్యార్థులే చూసుకుంటూ ఉంటారు. ఇంతకు ముందు chacolates, sweets పంచే విధానం అందరు మానుకున్నారు.ఈ కార్యక్రమం HM Y. శ్రీనివాస రావు గారు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో సాగుతోంది.
ఇలా మనం ప్రతి పుట్టిన రోజు ఒక మొక్క నాటినా ఈ ప్రపంచానికి ఎంతో మేలు చేసిన వారిమవుతాము.ఓ కల కంటే తప్పు లేదనుకుంటా! ప్రపంచంలో ప్రతి ఏటా ఇలా ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటినా ఏటా 800 కోట్ల మొక్కలు నాటవచ్చు.అప్పుడు ఈ భూమి మీద నీటి కరువు ,గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉండవేమో!
మీరు కూడా మీ గుర్తుగా ఈ భూమికి బహుమతిగా ఒక మొక్క నాటుతారు కదూ !భూమికి మనం చూపించాల్సిన కృతజ్ఞత మొక్కలు నాటి పెంచడం కన్నా మరేముంటుంది!........ఒద్దుల రవిశేఖర్