Thursday, 11 January 2024

45. పాటల పూదోట

 ఘంటాడి కృష్ణ తక్కువ instruments వాడి చక్కని melody పలికించాడు.యాదగిరి చిక్కని తెలుగు పదాలు ఉన్నికృష్ణన్ స్వరంలో కొత్త సొబగులు అద్దుకున్నాయి.పాట వింటున్నంత సేపు మనసు హాయిగా, హృదయం దూది పింజలా తేలిపోతుంటుంది. (https://youtu.be/gVwsAZlHE8M?si=7eTJqJ_rvLasYbmp)

Wednesday, 10 January 2024

నరసింహుడు -ఇప్పటి భారత దేశ నిర్మాత కథ


రచయత :వినయ్ సీతాపతి

అనువాదం :జి.వళ్ళీశ్వర్, టంకశాలఅశోక్,కె.బి గోపాలం 

పుస్తకపరిచయం :ఒద్దుల రవిశేఖర్

భారత దేశానికి స్వాతంత్ర్యo వచ్చిన తరువాత 44 ఏండ్ల వరకు ఒక దశగా తరువాత ఒక దశగా దేశ ఆర్ధిక విధానాన్ని విభజించి చూడాలి. మొదటి దశలో సోషలిస్ట్ దృక్పధంతో సాగిన ఆర్ధిక వ్యవస్థ 1991 నుండి సరళీకరించిన ఆర్ధిక వ్యవస్థగా మార్పు చెందింది. ఈ మార్పుకు కారణం అప్పటి ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు. ఆయన జీవితం, రాజకీయ ప్రస్థానం గురించి సవివరంగా వివరించారిందులో.మొట్ట మొదటి పార్లమెంట్ ఎన్నికల్లోనే నరసింహా రావు రాజకీయ రంగప్రవేశం చేశారు.రాజకీయాలు,పరిపాలన,ఆర్ధిక వ్యవస్థ లు నడిచే తీరు తెన్నులు తెలుసు కోవాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగ పడుతుంది.అధికారం లో ఉన్నవారు నిర్ణయాలు తీసుకోవడం లో ఎదురయ్యే ఆటంకాలను వ్యక్తిగత వ్యవహార శైలితో ఎలా అధిగమించవచ్చో ఇందులో గమనించవచ్చు. నరసింహారావు తీసుకు వచ్చిన సంస్కరణలు భారతదేశ రూపు రేఖలను చాలా వరకు మార్చి వేసాయి.ఆర్ధిక సంస్కరణ వల్ల రహదారులు, విమానయానం,టెలిఫోన్,T. V రంగం లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.భారత దేశం కత్తి అంచుపై నడవ వలసి ఉంటుందని ఆయన అంటుండేవారు.ఈ పుస్తకాన్ని రచయిత ఆసక్తికరంగా మలిచారు.ఈ పుస్తకం లో ని కొన్ని అంశాలు

• నరసింహా రావు బహుభాషా కోవిదుడు.10 భాషలు వచ్చు. గ్రంథ రచయిత కూడా.

• • నర్సింహా రావు రచనలు " The insider ", The other half 

• Analysis until paralysis (కొంప మునిగే దాకా మీనమేషాలు లెక్కించడం )

• కొన్ని సందర్భాలలో నోరు తెరిచి తీవ్రంగా స్పందించడం కన్నా నోరు మూసుకుని కూర్చోవటమే అత్యుత్తమ స్పందన

• రాఘవ పాండవీయం.... ఒకే పదాలు ఒక అర్థం లో రామాయణం మరో అర్థం లో భారతం చెబుతాయి.

• ఈయన హయాం లో మానవ వనరుల శాఖ సృష్టి జరిగింది.

• మార్పు ఒక్కటే శాశ్వతం

• సంస్కరణలు క్రమంగా చోటు చేసుకోవాలి. గతం లోని ఉత్తమ లక్షణాలు స్వీకరించి వాటిని మెరుగు పరచాలి.

• మనకు నిర్వచనమనే ఒక గొప్ప సంప్రదాయం ఉంది.దానిని భాష్యకార అంటారు.

• అసమ్మతి అన్నది సంప్రదాయం లో భాగం. ప్రధాన సంస్కృతులను అంతర్గతంగా సంస్కరించటం భారతదేశపు సంప్రదాయం.

• హామ్లెట్ ఆలోచనలు గల నిష్క్రియాపరుడు.క్విక్సోట్ ఆలోచించని విప్లవకారుడు

Sunday, 7 January 2024

యాదగిరి గుట్ట (తెలంగాణ ) సందర్శన

 ఎప్పటినుండో చూడాలి అనుకున్న యాదగిరి గుట్ట ను అభివృద్ధి చేసాక చూడడం ఆనందం కలిగించింది. MGBS(Hyderabad , busstand) 10 గంటల కల్లా చేరు కోగానే కుప్పలు తెప్పలుగా జనం ఉన్నారు. ఎక్కడికి వీరంతా అనుకుని కొందరిని అడిగితే వారంతా గుట్ట కే అని చెప్పారు.3 భాగాలు మహిళలే కనిపించారు.తెలంగాణ లో కొత్త గా వచ్చిన ప్రభుత్వం RTC బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది.ticket ధరలు తగ్గించి ఉంటే బాగుండు అని మహిళలే అన్నారు. అత్యవసర ప్రయాణీకులకు సమస్య గా మారింది.6 వ bus అతి కష్టం మీద seat దొరికించుకుని బయలు దేరాం. City దాటేసరికి గంట పట్టింది.65 km ప్రయాణానికి రెండున్నర గంట పట్టింది. దారిలో భువనగిరి కోట కొండపై కనిపించింది. ఆ కొండంతా ఒకటే బండ లాగా ఉంది.ఇహ గుట్ట bus stand దిగాక కొండపైకి వెళ్లే దేవస్థానం ఉచిత bus ఎక్కే సరికి యుద్ధం చేసినంత పని అయింది. కొండ చుట్టూ మొక్కలు, పచ్చిక తో పచ్చగా ఉంది. Bus stand చుట్టూ shoping complex కట్టారు. యాత్రికుల కోసం ఎదురుగా కొండపైన విల్లాస్ కట్టారు. కొండపైకి నూతన రహదారి కోసం flyover గా కట్టారు. Car పైకి వెళ్లాలంటే ₹500 ticket పెట్టారు కొండ పై స్థలాభావం వల్ల.ఒకటే private canteen ఉంది భోజనానికి. Tiffin తిన్నాం.కొండ చుట్టూ కోట లాగా గోడ పునర్ నిర్మించారు. ఉన్న స్థలం లోనే వందల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించారు.ఇంకా కొండ క్రింద పూర్తి చేయవలసిన పనులు ఉన్నాయి. Shopping complex లు మొదలు కాలేదు.సెలవు రోజుల్లో కాకుండా వారం మధ్యలో వెళ్లడం మంచిది.

Monday, 1 January 2024

కాలం నుంచి నేర్చుకుందాం


మంచు కరుగుతుంది.... అది ఉష్ణ ధర్మం.కాలం కరుగుతుంది.... అది విశ్వ ధర్మం.కాల చక్రం గిరగిరా తిరుగుతుంది. అసలు కాల భావనను ప్రకృతిలో వచ్చే మార్పులను బట్టి జీవ రాశి తెలుసుకుంది. పక్షులు జంతువులు ప్రకృతికి అనుగుణంగా, కాలానుగుణంగా జీవిస్తుంటాయి. మొదట్లో మనుషులు అలానే జీవించారు.ప్రస్తుతం మనుషులు పకృతికి విరుద్ధంగా కొండొకచో ప్రకృతిని ధ్వంసం చేస్తూ జీవిస్తున్నారు.

ఇక విషయానికి వస్తే మరో సంవత్సరం కాల గర్భం లో కలిసిపోయింది. గతం నుండి పాఠాలు నేర్చుకుని వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్ కు ప్రణాళికలు రచించాలి.

మరి కాలం నుండి ఏం నేర్చుకోవాలి. కాల గమనం మన ఆలోచనా తీరుపై ఏదయినా ప్రభావం చూపిస్తుందా అన్న విషయాలు ఆలోచిద్దాం.కాలం నిత్య నూతనం. మనం మాత్రం వయసు పెరిగే కొద్ది ఎన్నో శారీరక,మానసిక మార్పులకు లోనవుతుంటాం. మన అనుభవాలు మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంటాయి. యువత నూతన అనుభవాల కోసం ఉవ్విళ్లూరుతుంటారు. పెద్దలు తమ అనుభవాలను వారికి పాఠాలుగా చెప్పాలను కుంటారు. పిల్లలు,విద్యార్థులు, యువత తాము చేసి చూసి తెలుసుకోవాలను కుం టారు. రెండింటి మధ్య సమతుల్యత అవసరం. కాలం నిత్యం మనకు ఎన్నో పరీక్షలు పెడుతుంది.పరీక్షలను తట్టుకోవాలి మరెన్నో సవాళ్లు విసురుతుంది. సవాళ్ళను ఎదుర్కోవాలి.వాటిని తట్టుకుని ముందుకు వెళితే అందమైన ఆనందమైన భవిష్యత్ ఉంటుంది. ఎన్నో సాధించాలి అనుకుంటాం,ప్రణాళికలు వేసుకుంటాం. కొంతమంది విజయం సాధిస్తుంటారు.ఎక్కువమంది వైఫల్యం చెందుతుంటారు.గెలుపైనా ఓటమైనా తాత్కాలికం. వాటిని అర్ధం చేసుకుని అందుకనుగుణంగా మన వ్యవహరించాలి. గెలిచామని విర్ర వీగ కూడదు. ఓటమికి క్రుంగి పోకూడదు. ఉదయిస్తూ సూర్యుడు ఉత్తే జాన్నిస్తాడు.సాయంత్రం అస్తమిస్తూ కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంటాడు. తనలోని దశలన్నీ మానవ జీవితం లో ఉంటాయని అన్నింటిని దాటుకుని నాలాగా పూర్ణ బింబంలా జీవించమని, నిండు పున్నమి మీ జీవితాల్లో ప్రసరిస్తుందని జాబిల్లి మనకు నేర్పిస్తుంటాడు. సృష్టి లో ప్రతిదీ చలనం లో ఉంది. చంద్రుడు భూమి చుట్టూ, భూమి సూర్యుని చుట్టూ, సూర్యుడు పాలపుంత కేంద్రం చుట్టూ తిరుగుతుంటాయి. మనం కూడా విభిన్న ప్రాంతాలను చూస్తూ ప్రకృతి సౌందర్యాన్ని ఆ స్వాదిస్తూ,వైవిధ్యమైన సంస్కృతులను తెలుసుకుంటూ ఉంటే మనసు,హృదయం విశాలం అవుతుంది.ఇలా కాలం మనకెన్నో నేర్పుతుంది. నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉంటే..... ఒద్దుల రవిశేఖర్ 

Sunday, 31 December 2023

44. పాటల పూదోట

 Harris jayaraj music వింటుంటారా. ఇది చాలా heart touching song. మధ్యలో వచ్చే వేణుగానం,మిగతా instruments వింటుంటే మనసు మబ్బుల్లో తేలిపోతుంది.Parth Dodiya mashup చాలా సున్నితంగా హృదయాన్ని స్పృశిస్తుంది.(https://youtu.be/cDLL8FHhLc8?si=nPWjiHf-qBZ89xqo)

43. పాటల పూదోట

 G.V.Prakashkumar మంచి talent ఉన్న music director.ఈ పాట ఒక మంచి ప్రయోగం. రూప్ కుమార్ రాథోడ్ స్వరం విభిన్నంగా గమకాలు పలికిస్తుంటే హరిణి వినసొంపుగా పాడిన ఈ గీతం వినండి.(https://youtu.be/no4pZ4EwE_o?si=Iev-cloanjU20xM-)

42. పాటల పూదోట

 సంగీతం, సాహిత్యం, గానం, అభినయం,ఫోటోగ్రఫీ దర్శకత్వం శిఖరాగ్ర స్థాయికి చేరితే ఈ పాటవుతుంది. ఆకాశం కాన్వాసుపై,కడలి అలలపై,చిక్కని భావోద్వేగాలతో చిత్రీకరించిన గీతమిది. బాలు గళం అజరామరం వాణి జయరాం అరుదైన గాయని.ఇళయరాజా సంగీతం మన హృదయాలను రంజింప జేస్తుంది.భారతీ రాజా అత్యున్నత దర్శకత్వ ప్రతిభ కనిపిస్తుందీ పాటలో.(https://youtu.be/PX-X8SbYbFE?si=HHPvSea7jGCr1xnt)

Sunday, 10 December 2023

41.పాటల పూదోట

అనురాగ్ కులకర్ణి స్వరం ఎన్ని హొయలు పోయిందో ఈ గీతంలో. చరణాలతో ఆడుకున్నాడు. సితార స్వరం వినసొంపుగా, విలక్షణంగా ఉంది.మలయాళం లోని హృదయం సినిమాతో సంచలనం సృష్టించిన Hesham compose చేసిన పాట ఇది.(https://youtu.be/bzMqVi-Z2Us?si=FETQ_Yh600k_NOKp 

Tuesday, 21 November 2023

కోటప్పకొండ సందర్శన

 కొండలపై ఉన్న గుడుల పరిసరాలన్నీ ప్రకృతి రమణీయతతో శోభిళ్లుతుంటాయి. అందులో కోటప్పకొండ ఒకటి. ఇది శివాలయం. నరసరావుపేట కు దగ్గరలో 20 కి.మీ దూరం లో ఉంటుంది. బస్టాండ్ నుండి కార్తీక మాసం ఆదివారం,శనివారం లలో ₹50 ticket తో కొండపైకి RTC బస్సులు నడుస్తుంటాయి. కొండ క్రింద అన్ని వర్గాల వారికి సత్రాలున్నాయి. కొండ ఎక్కటానికి, దిగటానికి రెండు మార్గాలున్నాయి. ఎక్కే మార్గానికి ఇరువైపులా పూలు పూసి స్వాగతిస్తున్నాయి. మధ్యలో ఒక park ఏర్పాటు చేశారు. కొండ పైన గుడి ముందర భాగం విశాలంగా ఉంటుంది.దక్షిణామూర్తి గుడి, విగ్రహం,నంది విగ్రహం మనోహరంగా ఉంటాయి. శివుడి విగ్రహం 4 దిక్కులు కనపడే విధంగా గుడికి ఎదురుగా అమర్చారు.నిత్య అన్నదానం ఉంటుంది.చాలా రుచిగా ఉంది. మనకు తోచిన విరాళం ఇవ్వవచ్చు. ఇహ గుడి చాలా ఎత్తులో ఉంటుంది. గుడి లోపలికి మెట్లు చాలా ఎక్కాలి. గుడి బయటకు వచ్చాక ఎడం వైపు కొండ పైన నాగుల పుట్ట చాలా ఎత్తులో ఉంటుంది.అక్కడే ఒక శివుడి విగ్రహం చాలా ఆకర్షణీయం గా ఉంటుంది. అక్కడ నుండి దిగువకు, ప్రక్కలకు చూస్తే view point చా లా అద్భుతం గా ఉంటుంది. ప్రక్క కొండ మీద పాత కోటేశ్వర స్వామి ఉంటారు. అక్కడ mike లో పాటలు కొండ అంతా ప్రతి ధ్వనిస్తున్నాయి. శివరాత్రి కి కట్టే ప్రభలు ఆ ఉత్సవాలు, జనాల్ని చూడటానికి రెండు కళ్ళు చాలవట. చిన్నపురెడ్డిని బ్రిటిష్ వారు ఉరి తీసింది ఈ కొండపైనే.దేవుళ్ళందరూ కొండలపై ఎందుకు కొలువుంటారో తెలుసా, తమతో పాటు ప్రకృతిని ఆరాధించమని.కొండల నిండా ఇంకా చెట్లు బాగా పెంచితే గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం అవుతుంది. ... ఒద్దుల రవిశేఖర్

Monday, 20 November 2023

ఉద్యానవనాల్లో మొక్కలు నాటడం

 ఉద్యానవనాల్లో మొక్కలు నాటుదాం

రోజూ "నడక " సాగించే muncipal park లో 5km నడక పూర్తయి ఇంటికి వెళ్లే క్రమంలో అక్కడ పనిచేసే తోటమాలి సురేష్ మొక్కలు నాటడం గమనించాను.ఇంతకు ముందు మొక్కలు ఇస్తానని చెప్పాను. ఇప్పుడు మొక్క తెస్తే నాటుతావా అని అడగ్గానే తప్పకుండా అన్నాడు. పండ్ల మొక్కలు తీసుకురానా అంటే ok అన్నాడు. నర్సరీ దగ్గర దిగి లోపలికి వెడుతుంటే మిత్రులు సజీవరాజు, ప్రదీప్ కనిపించి పలకరించి అడిగారు ఏం చేస్తున్నారుఅని.విషయం చెప్పగానే మేము మొక్కలు ఇస్తామన్నారు. సపోటా, నేరేడు, సీతాఫలం మొక్కలు తీసుకెళ్లగానే కొంత మంది పిల్లలతో కలిసి సురేష్,మేము park లో పాదులుతీసి మొక్కలు నాటాము. మేము ముగ్గురం APNGC లో సభ్యులం.ఇలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలలోని NGC సభ్యులు, మొక్కల ప్రేమికులు వారి దగ్గర లో ఉన్న స్థానిక park లలో పండ్ల మొక్కలు,నీడ నిచ్చే మొక్కలు, పూల మొక్కలు నాటితే park లలో మంచి వాతావరణం ఏర్పడుతుంది.

Sunday, 12 November 2023

40.పాటల పూదోట

 వర్మ "రంగీలా " చూసారా. ఇండియాను ఊపేసింది. ఇందులో రెహమాన్ music వింటుంటే పాట మధ్యలో instruments ఇంత అత్య ద్భుతంగా ఉపయోగించవచ్చా అనిపిస్తుంది.హరిహరన్, స్వర్ణలతల స్వరాల్లో పాట ఇంత మధురంగా ఉంటుందా అని ఆశ్చర్యపోతాం. Ear phones పెట్టుకుని కళ్ళుమూసుకుని విని తరించండి.(https://youtu.be/KQUS-phhM0Y?si=3aJ0uYULkLJTO9pR)

39. పాటల పూదోట

 శ్రీమణి చక్కని సాహిత్యం అందించగా, సుదర్శన్ రూపంలో కొత్త స్వరాన్ని పరిచయం చేస్తూ DSP(దేవిశ్రీ ప్రసాద్) అందించిన హాయిగా వినాలనిపించే మంచి మెలోడీ ఇది.వినండి మరి.(https://youtu.be/tpvNtKjlf5E?si=PkF8-2JZrvvyaBi4)

38.పాటల పూదోట

 రెహమాన్ సృష్టించిన శాస్త్రీయ సంగీతపు అలలపై నరేష్ అయ్యర్ పలికిన సరిగమపదనిసల గమకాల పై మహతి సైంధవి స్వరం మీ మనసును మలయసమీరంలా తాకుతూ మీ హృదయాన్ని పరవశింపజేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ear phone పెట్టుకుని కళ్ళు మూసుకుని ఆస్వాదించండి. (https://youtu.be/WjdAM6aLO5I?si=lLd6fZrE0Rw0l05e)

37. పాటల పూదోట

 రెహమాన్ సృష్టించిన శాస్త్రీయ సంగీతపు అలలపై నరేష్ అయ్యర్ పలికిన సరిగమపదనిసల గమకాల పై మహతి సైంధవి స్వరం మీ మనసును మలయసమీరంలా తాకుతూ మీ హృదయాన్ని పరవశింపజేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ear phone పెట్టుకుని కళ్ళు మూసుకుని ఆస్వాదించండి. (https://youtu.be/WjdAM6aLO5I?si=lLd6fZrE0Rw0l05e)

Monday, 6 November 2023

బుద్ధ వనం

 బుద్ధవనం

నాగార్జున సాగర్ మీదుగా హైదరాబాద్ వె డుతునప్పుడల్లా సాగర్ దాటాక ఎడమ వైపు బుద్ధవనం board చూస్తుంటాం. కాని 2014 నుండి నిర్మాణం లో ఉండి 2023 వేసవిలో ప్రారంభించబడిందట.దీనికోసం 274 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతం 70 ఎకరాల్లోనే కొన్ని విభాగాలు పూర్తయ్యాయి.మాచర్ల నుండి నల్లగొండ, హైదరాబాద్ వెళ్లే బస్సులన్నీ అక్కడ ఆపుతాయి. Ordinary bus, auto ల్లో ₹50 తీసుకున్నారు. అక్కడే cottages ఉన్నాయి. భోజనం మాత్రం బయట ఉన్న hotels లో చేయాలి. ఒక రోజు ఉదయం వెళ్లి మధ్యాహ్నం వరకు గడపవచ్చు. సొంత వాహనాలు ఉంటే సాయంత్రం వెళ్లి ఆ వాతావరణాన్ని enjoy చేయవచ్చు.ఉదయం 10 గంటల కల్లా వెళ్ళాం. అప్పుడప్పుడే యాత్రికుల రాక మొదలయింది. Ticket ₹50. రాజప్రసాదం లోపలికి వె డుతున్నామా అన్న అనుభూతి కలిగింది.

1) అర్థ చంద్రాకారంలా ఉన్న మహా స్థూపం,అందులోని నాలుగు వైపులా 4 బుద్ధ విగ్రహాలు బంగారు రంగులో మెరిసిపోతుంటే,పై భాగంలో ఆకాశం ప్రతిబింబిస్తుంటే ధ్యాన మందిరంలో యాత్రికులు ధ్యానం చేసుకునే విధంగా ఓ ప్రశాంత వాతావరణం అక్కడ విలసిల్లుతుంది.అక్కడ ధ్యానం చేయడం చక్కని అనుభూతి కలిగిస్తుంది. మహా స్థూపం క్రింద museum ఏర్పాటు చేశారు.క్రీ. శ 1 వ శతాబ్దం నాటి బుద్ధ విగ్రహాలను చూడవచ్చు.

2)మహా స్థూపానికి ముందు బుద్ధచరితవనంలో ఆయన జీవిత విశేషాలను పొందుపరిచారు.

3) జాతక వనంలో జాతక కథల్లోని చిత్రాలను శిల్పాలుగా మలిచారు.

4)ధ్యాన వనంలో శ్రీలంక ప్రభుత్వం donate చేసిన 27 అడుగుల బుద్ధ విగ్రహాన్ని చరిత వనం లో ధర్మ ఘంటను చూడవచ్చు.

5)స్థూప వనం లో విభిన్న దేశాలు ప్రాంతాల్లో ఉన్న బౌద్ధ స్థూపాల models చూడవచ్చు.

బుద్ధవనం లో ఇంకా చాలా విభాగాలు అభివృద్ధి చేయవలసి ఉంది. పూర్తి రూపం సంతరించుకుంటే ఇది అంతర్జాతీయ పర్యాటక కేంద్రం అవుతుంది.బుద్దవనం ప్రతి ఒక్కరు తప్పని సరిగా చూడదగ్గ సందర్శనీయ ప్రాంతం.... ఒద్దుల రవిశేఖర్

Monday, 23 October 2023

36. పాటల పూదోట

 అభినందన సినిమా చూసారా.ఇందులో అన్ని పాటలు బాగుంటాయి.సంగీత సాహిత్యాలు పోటీ పడిన గీతమిది.ఆత్రేయ సాహిత్యం, ఇళయరాజా సంగీతం అందించగా బాలు జానకి ల స్వరాల్లో సుమధురంగా సాగిన ఈ వీనుల కు ఇంపైన గీతం ఈ వారం మీ కోసం. (https://youtu.be/RMoUYGnu02w?si=H-SCgSiTMdK2aLl-)

35. పాటల పూదోట

  ఉన్ని కృష్ణన్ పాటలెప్పుడైనా విన్నారా, విలక్షణ స్వరం.రెహమాన్ compose చేసిన ఈ పాటలో చరణాల మధ్య మంద్రంగా సాగే beat వింటూ అప్పుడప్పుడు మధ్య లో వచ్చే music వింటూ ఉంటే మనసు గాల్లో తేలిపోతుంది.కవితా కృష్ణ మూర్తి గొంతు హృదయాన్ని తాకుతుంది. కళ్ళు మూసుకుని earphone పెట్టుకుని పాట వినడం మరిచిపోకండి.(https://youtu.be/Wzj5vJgAtBk?si=E3Kddi92qEGTWkmS)

34.పాటల పూదోట

 Classical songs వింటూ ఉంటారా!వినలేం బాబూ అంటారా!wait wait కాస్త western beat add చేస్తాం లెండి.విజయ్ సంగీతంలో ఆర్యా దయాల్ baby సినిమా కోసం ఎంత విభిన్నంగా పాడిందో! వింటే మీకే అర్థం అవుతుంది. ఈ weekend మీకోసం"దేవరాజ........".(https://youtu.be/W2qp0A58PTA?si=TKYH5iL6zgZaxTOY)

33.పాటల పూదోట

 వేటూరి కలం నుండి జాలువారగా రాజన్ నాగేంద్ర స్వర కల్పనలో బాలు జానకి పాడిన మధురగీతం ఇది. " వీణ వేణువైన సరిగమ" పాటలోని వీణ ఫణి నారాయణ, వేణువు రామ చంద్ర మూర్తి పలికించిన instrumental music వినండి.మనసును హాయిగా మైమరిపించే చక్కని ప్రయోగం.(https://youtu.be/j0_86ZfGnE4?si=i8kpa5coSAi5LcoL)

Saturday, 14 October 2023

ప్రపంచ ప్రసిద్ధ ఉపన్యాసాలు

 పుస్తకం:ప్రపంచ ప్రసిద్ధ ఉపన్యాసాలు

పరిచయం :ఒద్దుల రవిశేఖర్

కళల్లో ఉపన్యాస కళ క్లిష్ట మైనది మరియు విశిష్ట మైనది. ప్రపంచ గతిని మార్చిన గొప్ప నాయకులు తమ ఉపన్యాసాల ద్వారానే ప్రపంచాన్ని విశేషంగా ప్రభావితం చేశారు.అందుకనే విద్యార్థి దశ నుండే వేదికలపై మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. అందుకనే పాఠశాల స్థాయిలో వక్ తృత్వ పోటీలు చర్చలు జరుపుతుంటారు. వాటి వల్ల విద్యార్థుల్లో సభా కంపం పోయి ధైర్యం వస్తుంది. ఎలా ఉపన్యసించాలో ఈ పుస్తకం తొలి పలుకు లో అనువాద రచయిత సి. వి. యస్. రాజు గారు వివరిస్తారు.ఉపన్యాసాల్లో విభిన్న శైలులు ఉంటాయి. చర్చిల్ హాస్యచతురత, సర్వేపల్లి వాక్చాతుర్యం(నిముషానికి 120 పదాలు ) ఇలా ఒక్కొక్కరు ఒక్కో విశేషమైన నైపుణ్యం కలిగి ఉంటారు.

ఈ పుస్తకం లో 1)సోక్రటీస్ :ప్రశ్నించడాన్ని ప్రపంచానికి నేర్పిన తాత్వికుడు. ఏథెన్స్ రాజ్యం లో జన్మించాడు సత్యాన్వేషణకు నూతన పద్ధతి కని పెట్టాడు. జ్ఞానమే దేవుడన్నారు.

2)సిసెరో :రోమ్ రాజ్యం లో సెనేటర్  ఇలా

గొప్ప వాక్ చాతుర్యం కలిగిన వ్యక్తి.సీజర్ ను పొగుడుతూ "నీ యుద్దాలు కాల మున్నంత వరకు ప్రతి భూమి పెదవులతో చెప్పుకోబడతాయి."

3) మార్క్ ఆంటోనీ :రోమన్ రాజకీయ నాయకుడు. జూలియస్ సీజర్ మిత్రుడు.తన ఉపన్యాసం లో " దేశ ద్రోహుల చేతుల కంటే కృతఘ్నత చాలా బలీయమైనది. "

4) జీసస్ :జీసస్ మొదటి శతాబ్దానికి చెందిన యూదు బోధకుడు. ఆయన బోధనలే క్రైస్తవ మతం గా మారింది."అసలు ప్రమాణాలు చేయవద్దు. భూమి మీద, భగవంతుని మీద, తలమీద ప్రమాణాలు చేయవద్దు ". 

5) క్వీన్ ఎలిజబెత్ :ఇంగ్లాండ్ రాణి

6) ఆలివర్ క్రాంవెల్ :ఇంగ్లాండ్, లెఫ్టినెంట్ జనరల్ గా పని చేశారు

7) పాట్రిక్ హెన్రీ :అమెరికా లోని వర్జీనియా కు గవర్నర్ గా పని చేశారు."స్వాతంత్ర్యమైనా ఇవ్వండి లేదా మరణాన్నైనా ఇవ్వండి ".

8) జార్జి వాషింగ్టన్:అమెరికా మొదటి అధ్యక్షులు. "నిజమైన స్వాతంత్ర్యమనే భవనానికి ఐక్యతే మూల స్థంభం ". 

9) థామస్ జెఫర్సన్ :అమెరికా మూడవ అధ్యక్షులు.

10) నెపొలియన్ బోనపార్టి:ఫ్రాన్స్ దేశ అధ్యక్షులు గా పని చేశారు

11) అబ్రహాం లింకన్ :అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు."మనం ఇప్పుడు చెప్పిన మాటల్ని ప్రపంచం గుర్తించదు, జ్ఞాపకం ఉంచుకోదు కాని ఇక్కడ వారు చేసిన పనిని మాత్రం మరచి పోదు ఇలా సుసాన్ బి అంథోని,ఎమిలిన్ ప్యాంక్ హార్ట్స్, మేరీ క్యూరీ, గాంధీ, లెనిన్, చర్చిల్, స్టాలిన్, రూజ్ వెల్ట్, హిట్లర్, నెహ్రూ,కెనడీ, ఇందిరా గాంధీ, మదర్ థెరిసా, రీగన్ నెల్సన్ మండేలా మార్టిన్ లూథర్ కింగ్, చేగువేరా, గోర్బ చోవ్, బుష్ వంటి 30 మంది ప్రసిద్ధ ఉపన్యాసాలు ఇందులో ఇచ్చారు.వీటిని చదవడం వలన చక్కని ఉపన్యాస మెలకువలు తెలుస్తాయి. విద్యార్థులు ఉపాధ్యాయులు చదవ తగ్గ పుస్తకం.