పుస్తకం:ప్రపంచ ప్రసిద్ధ ఉపన్యాసాలు
పరిచయం :ఒద్దుల రవిశేఖర్
కళల్లో ఉపన్యాస కళ క్లిష్ట మైనది మరియు విశిష్ట మైనది. ప్రపంచ గతిని మార్చిన గొప్ప నాయకులు తమ ఉపన్యాసాల ద్వారానే ప్రపంచాన్ని విశేషంగా ప్రభావితం చేశారు.అందుకనే విద్యార్థి దశ నుండే వేదికలపై మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. అందుకనే పాఠశాల స్థాయిలో వక్ తృత్వ పోటీలు చర్చలు జరుపుతుంటారు. వాటి వల్ల విద్యార్థుల్లో సభా కంపం పోయి ధైర్యం వస్తుంది. ఎలా ఉపన్యసించాలో ఈ పుస్తకం తొలి పలుకు లో అనువాద రచయిత సి. వి. యస్. రాజు గారు వివరిస్తారు.ఉపన్యాసాల్లో విభిన్న శైలులు ఉంటాయి. చర్చిల్ హాస్యచతురత, సర్వేపల్లి వాక్చాతుర్యం(నిముషానికి 120 పదాలు ) ఇలా ఒక్కొక్కరు ఒక్కో విశేషమైన నైపుణ్యం కలిగి ఉంటారు.
ఈ పుస్తకం లో 1)సోక్రటీస్ :ప్రశ్నించడాన్ని ప్రపంచానికి నేర్పిన తాత్వికుడు. ఏథెన్స్ రాజ్యం లో జన్మించాడు సత్యాన్వేషణకు నూతన పద్ధతి కని పెట్టాడు. జ్ఞానమే దేవుడన్నారు.
2)సిసెరో :రోమ్ రాజ్యం లో సెనేటర్ ఇలా
గొప్ప వాక్ చాతుర్యం కలిగిన వ్యక్తి.సీజర్ ను పొగుడుతూ "నీ యుద్దాలు కాల మున్నంత వరకు ప్రతి భూమి పెదవులతో చెప్పుకోబడతాయి."
3) మార్క్ ఆంటోనీ :రోమన్ రాజకీయ నాయకుడు. జూలియస్ సీజర్ మిత్రుడు.తన ఉపన్యాసం లో " దేశ ద్రోహుల చేతుల కంటే కృతఘ్నత చాలా బలీయమైనది. "
4) జీసస్ :జీసస్ మొదటి శతాబ్దానికి చెందిన యూదు బోధకుడు. ఆయన బోధనలే క్రైస్తవ మతం గా మారింది."అసలు ప్రమాణాలు చేయవద్దు. భూమి మీద, భగవంతుని మీద, తలమీద ప్రమాణాలు చేయవద్దు ".
5) క్వీన్ ఎలిజబెత్ :ఇంగ్లాండ్ రాణి
6) ఆలివర్ క్రాంవెల్ :ఇంగ్లాండ్, లెఫ్టినెంట్ జనరల్ గా పని చేశారు
7) పాట్రిక్ హెన్రీ :అమెరికా లోని వర్జీనియా కు గవర్నర్ గా పని చేశారు."స్వాతంత్ర్యమైనా ఇవ్వండి లేదా మరణాన్నైనా ఇవ్వండి ".
8) జార్జి వాషింగ్టన్:అమెరికా మొదటి అధ్యక్షులు. "నిజమైన స్వాతంత్ర్యమనే భవనానికి ఐక్యతే మూల స్థంభం ".
9) థామస్ జెఫర్సన్ :అమెరికా మూడవ అధ్యక్షులు.
10) నెపొలియన్ బోనపార్టి:ఫ్రాన్స్ దేశ అధ్యక్షులు గా పని చేశారు
11) అబ్రహాం లింకన్ :అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు."మనం ఇప్పుడు చెప్పిన మాటల్ని ప్రపంచం గుర్తించదు, జ్ఞాపకం ఉంచుకోదు కాని ఇక్కడ వారు చేసిన పనిని మాత్రం మరచి పోదు ఇలా సుసాన్ బి అంథోని,ఎమిలిన్ ప్యాంక్ హార్ట్స్, మేరీ క్యూరీ, గాంధీ, లెనిన్, చర్చిల్, స్టాలిన్, రూజ్ వెల్ట్, హిట్లర్, నెహ్రూ,కెనడీ, ఇందిరా గాంధీ, మదర్ థెరిసా, రీగన్ నెల్సన్ మండేలా మార్టిన్ లూథర్ కింగ్, చేగువేరా, గోర్బ చోవ్, బుష్ వంటి 30 మంది ప్రసిద్ధ ఉపన్యాసాలు ఇందులో ఇచ్చారు.వీటిని చదవడం వలన చక్కని ఉపన్యాస మెలకువలు తెలుస్తాయి. విద్యార్థులు ఉపాధ్యాయులు చదవ తగ్గ పుస్తకం.