Monday, 18 September 2023

చదువులు.. కొత్త దారులు

 చదువులు కొత్త దారులు                                           మనము  కలవాలి ,అనుభవాలు పంచుకోవడానికి అని C.A  ప్రసాద్ గారు చెప్పడంతో 16 /9 /2018 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసాం.9:30 కే  రమ్మన్నారు. నేను జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ రెడ్డి గారు 9:40 కల్లా వెళ్ళాము. అక్కడకు వెళ్లగానే ప్రసాద్ గారు కుర్చీలు వేస్తూ సర్దుతూ కనిపించారు ఇంకా ఎవరూ రాలేదు. అంత సామాన్యంగా ఉంటారు ఆయన. సార్ మాకు ఏమైనా పని చెప్పమంటే నవ్వి ఊరుకున్నారు ఇక పని మనమే వెతుక్కోవాలని చూసా . క్రింద అప్పుడేే పుస్తకాలు వచ్చాయి వాటిని మొదటి అంతస్తుకు తీసుకువచ్చి  బల్ల పై సర్దాము.  ఒక్కొక్కరే ఉపాధ్యాయులు రావటం మొదలైంది ఆనంద్, నాగమూర్తి వచ్చారు. పదకొండు గంటలకల్లా దాదాపు 80 మంది ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు వచ్చారు.                                                                                                                                                                          కార్యక్రమానికి వచ్చిన ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు గారిని,వాడ్రేవు చినవీరభద్రుడు గారిని విజయ భాను గారిని SSA అధికారిని వేదికపైకి ఆహ్వానించారు.ప్రసాద్ గారుమాత్రం వెనక కూర్చొని వింటూ కార్యక్రమాన్ని సంధాన  పరుస్తున్నారు స్టేజీపై కూర్చోవాలనే ఆలోచన కూడా ఆయనకు లేదు. మొదటగా హీల్ పారడైస్ స్కూల్(http://healcharity.org)ప్రిన్సిపాల్ శోభారాణి గారిని  ప్రసంగించమని ఆహ్వానించారు. ఈ పాఠశాలను లండన్ లో ఉండ కోనేరు సత్యప్రసాద్ గారు స్థాపించారట.తన ఆస్తిలో చాలా భాగం దానికి ఆయన ఖర్చు చేశారట 27 ఎకరాలలో ఉన్న ఈ పాఠశాలలోపిల్లలే పరిశుభ్రత ,వంట,తోటపని చేసుకుంటారట. ఇందులో అనాధ పిల్లలకే ప్రవేశం. చాలాకాలానికి నేను అనుకున్న కార్య క్షేత్రం నాకు దొరికినట్లయింది త్వరలో ఈ పాఠశాలకు వెళ్లాలని 550 మంది అనాధ పిల్లలకు ఏదైనా చేయాలన్న సంకల్పం కలిగింది. శోభారాణి గారితో తర్వాత వివరంగా మాట్లాడాను ఆమె తప్పకుండా రండి సార్ అని ఆహ్వానించింది ఆనంద్, నేను వెళ్లాలని నిర్ణయించుకున్నాము. తర్వాత మార్తాండ రెడ్డి అని కడప లో రిటైర్ అయిన డాక్టర్ గారు మాట్లాడారు పిల్లలకు నేర్పాల్సిన కొన్ని కార్యక్రమాలు  చేస్తున్నారట. Ten commandments for teachers  అనే పుస్తకాన్ని ముద్రించారట. కొమరోలు ఉన్నత పాఠశాల ప్రభుత్వ కాలేజీ చాలా బాగుందని ప్రశంసించారు. తర్వాత ప్రాథమిక విద్యారంగంలో సంచలనాలు సృష్టిస్తున్న విజయ భాను కోటే గారు మాట్లాడుతూ చిన్నప్పుడు రామకృష్ణ మఠం వెళ్ళేదాన్నని వివేకానందుని సూక్తులు  నాపై ప్రభావం చూపాయి అని చెప్పారు. తర్వాత ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి విద్యార్థులకు తను చేసిన ప్రయోగాలు వివరించారు.ఈ విధానాన్ని ఆస్ట్రేలియాలోని స్టీవార్ట్ అనే professor  ప్రవేశపెట్టారు. దీనిని 1 నుండి 10 వ తరగతి వరకు అమలు చేయవచ్చు. 1 + 4 +6  విధానంలో జూన్ నెల అంతా పిల్లలను పాఠశాలకు అలవాటు చేయడం, మిగతా నాలుగు నెలలు  లేతఆకాశం అనే కార్యక్రమం ద్వారా బోధన, తర్వాత ఆరు నెలలు పిల్లలు స్వయంగా   చే

నేర్చుకుంటారు.TLM కూడా పిల్లలే చేస్తారు.Cleanliness is not cleaning,it is not littering. విజయ భాను గారు ఏపీ ప్రభుత్వ సహకారంతో ఫిన్లాండ్ విద్యా విధానాన్ని పరిశీలించడానికి వెళ్లారు. ఆహారము పోషక విలువలతో కూడిన టువంటి ఆయుర్వేద మందులను తయారు చేయడంపై పిల్లలకు అవగాహన కార్యక్రమాలు పోషకాహారం పిండిని పిల్లలతో తయారు చేయించడం చేస్తారు. మునగాకు పొడి పచ్చడిని తయారు చేశారు పిల్లలు చేసిన కార్యక్రమాలన్నీ రికార్డు చేస్తారు.Shine India comes from teacher. జీతములో 10% పాఠశాలకు ఇస్తారట. వీటన్నిటికీ కారణం పాఠశాల పట్ల పిల్లల పట్ల నాకున్న passion.                                                          ...............తర్వాత వాడ్రేేవు చినవీరభద్రుడు గారిని ప్రసంగించమని ఆహ్వానించారు.ఈయన centre for innovations in publicsystem లో assistant director గా పని చేస్తున్నారు. ఈ సంస్థ విద్య వైద్యం ఈ గవర్నెన్స్ లో దేశవ్యాప్తంగా జరుగుతున్న నూతన ప్రయోగాలు పరిశీలించడం ప్రభుత్వానికి సలహా ఇవ్వటం చేస్తుంది దేశంలోని చాలా ప్రాంతాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి. కొన్ని వినూత్న కార్యక్రమాలు1) అరబిందో సొసైటీ వారు ఉత్తరప్రదేశ్ లోని పాఠశాలల్లో పైసా ఖర్చు లేకుండా అమలయ్యే విధానాలు  తెలియజేయమని అక్కడి ఉపాధ్యాయులను కోరితే లక్ష మంది స్పందించారు వాటిలో 33 రకరకాల అత్యుత్తమ పద్ధతులను ఎన్నుకున్నారు. 1నుండి  5వ  తరగతి వరకు 11 రకాల పద్ధతులు తయారు చేశారు. 2)BALA: Building as learning aid.గదే బోధనోపకరణం.మెట్లకు సంవత్సరాలు రాసి వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తారు.3). విజయనగరం జిల్లా చీపురుపల్లి లో శోధన అనే బాలబడి ఉంది దీనికి జీఎంఆర్ ఫౌండేషన్ సహాయం చేస్తుంది. పాఠాలను చిన్నచిన్న నాటికల రూపంలోకి మారుస్తారు. పిల్లల్లో గొప్ప ఉత్సాహం కనిపిస్తుంది 1 నుండి 9వ తరగతి వరకు పాఠశాలల్లో సిలబస్ అక్కడ స్థానిక సమాజం నిర్ణయించాలి. పాఠశాల విద్యా చరిత్ర కేవలం 156 సంవత్సరాలు మాత్రమే.అంతకు ముందు అంతా జ్ఞాన ప్రసారము చుట్టుపక్క సమాజం ద్వారానే జరిగింది వ్యవసాయం పాఠం సెప్టెంబర్ లో ఉంటే దానిని సందర్శించి నేర్చుకోవచ్చు.4) జిడ్డు కృష్ణమూర్తి గారి ప్రభావంతో ప్రేమ గంగాచారి అనేవారు  తమిళనాడులోని కోయంబత్తూరు దగ్గర anaikatti లో విద్యావనం(http://www.vidyavanam.org/home.html) అనే పాఠశాలను స్థానిక గిరిజన తెగ పిల్లల కోసం స్థాపించారు.వారి కుటుంబంలో వీరే మొట్టమొదట బడికొచ్చిన పిల్లలు. ఇక్కడ స్థిరమైన తరగతి గదులు ఉండవు తమిళం, ఇంగ్లీషు, లెక్కలు, సైన్సు వంటి zones ఉంటాయి.5) అలాగే ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ లో డాక్టర్ అచ్యుత్ సమంత అనే ఆయన కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ను స్థాపించారు. ఇక్కడ 25 వేల మంది పిల్లలు చదువుకుంటున్నారు అందులో 13 వేల మంది అక్కడ ఉన్న హాస్టల్లో ఉంటున్నారు. ఇక్కడ పాఠశాలల్లో  ఒకేషనల్ విద్యా విధానం పటిష్టంగా ఉంది పిల్లలే బట్టలు కుట్టుకుంటారు పచ్చళ్లు తయారు చేసుకుంటారు. ఆ పిల్లల వార్షికాదాయముఒకటిన్నర  కోట్లు. ఇలాంటి 130 అత్యున్నతమైన విధానాలు మేము సేకరించాము.వీటిని దేశం లోని అన్ని రాష్ట్రాలకు పంపించాము, విచారకరమైన విషయమేమంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీటినింతవరకు అమలుచేయలేదు,మిగతా రాష్ట్రాలు అన్ని ఈ విధానాలను అమల్లో పెట్టాయి. చివర్లో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు గారు మాట్లాడుతూ విద్యాలయాల్లోకి నేను ప్రవేశించడానికి ముందు నాలో ఉన్న రాజకీయ నాయకుడిని చెడు అలవాట్లను చంపుకున్నాను. ఉపాధ్యాయులారా మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి. పాఠశాలలు జాతి నిర్మాణ కేంద్రాలు.ఉపాధ్యాయులు,విద్యార్థులు దేశ సంపద. చివరగా డాక్టర్ కొర్ర పాటి  సుధాకర్ గారు మాట్లాడుతూ పిల్లల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు వారికి కోపం రాదు ఆనందంగా ఉండటం ఎలాగో వారి నుండి నేర్చుకోవచ్చు.ఒక ఎకరంలో అడవిని పెంచుతున్నా అంటూ ముగించారు.తరువాత మధ్యాహ్నం,ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులు ఒక గ్రూపు సృజన ఆధ్వర్యం లో,ఉన్నత పాఠశాల ల ఉపాధ్యాయులు నా ఆధ్వర్యం లో మరో గ్రూపులో కూర్చొని తమ అనుభవాలు,అభిప్రాయాలు కలబోసుకున్నాము.ఇంతటి మహత్తర కార్యక్రమం రూపొందించిన C.A.ప్రసాద్ గారు చివర్లో మాట్లాడుతూ ఇవన్నీ ఒక పుస్తకం రూపం లో తీసుకు వస్తాము.అందరికీ ధన్యవాదాలు,మళ్లీ కలుద్దాం అని ముగించారు....... ఒద్దుల రవిశేఖర్ 

No comments:

Post a Comment